
© 2026 nimisham.in


Ap Govt Asha Worker Vacancies : ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలు వెల్లడించారు. 913 పోస్టుల్లో 673 గ్రామీణ, 64 గిరిజన, 176 పట్టణ ప్రాంతాల్లో భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
Also Read : weather report : తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. వచ్చే మూడ్రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ..
జిల్లా కలెక్టర్ చైర్మన్గా డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. పోస్టులకు దరఖాస్తు చేసుకొనే మహిళలు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక మహిళలకు ప్రాధాన్యం ఇవ్వంటం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకొనేవారి వయస్సు 25 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. ఒక్కో ఆశా కార్యకర్తకు నెలకు రూ.10వేల వేతనాన్ని ప్రభుత్వం అందించనుంది. నిబంధనలకు అనుగుణంగా ఈనెల 30వ తేదీ నాటికి నియామకాల జాబితాను పంపించాలని జిల్లా యంత్రాంగాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు ఇలా..
కర్నూలు జిల్లాలో 65, ప్రకాశం జిల్లాలో 38, వైఎస్సార్ కడప జిల్లాల్లో 38, అన్నమయ్య జిల్లాలో 41, చిత్తూరు జిల్లాలో 32, శ్రీ సత్యసాయి జిల్లాలో 22, నంద్యాల జిల్లాలో 21, తిరుపతి జిల్లాల్లో 21 ఆశా కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో 44, పశ్చిమగోదావరి జిల్లాలో 42, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 43, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 43, అనకాపల్లి జిల్లాలో 77, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 32, పోలవరం జిల్లాలో 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా.. కృష్ణా జిల్లాలో 37, గుంటూరు జిల్లాలో 21, ఎన్టీఆర్ జిల్లాలో 15, బాపట్లలో 7, విశాఖపట్నం జిల్లాలో 33, పల్నాడు, జిల్లాలో 31, విజయనగరం జిల్లాల్లో 31, కాకినాడ జిల్లాలో 29, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో 29, ఏలూరు జిల్లాలో 27, అనంతపురం జిల్లాలో 26, మార్కాపురం జిల్లాలో 25, శ్రీకాకుళం జిల్లాల్లో 22 చొప్పున ఖాళీలు భర్తీ చేయనున్నారు.
Senior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.






