
మెట్‌పల్లి పట్టణం: ప్లాస్టిక్‌ను నివారించి పర్యావరణాన్ని కాపాడాలని 16వ వార్డు కౌన్సిలర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పురపాలక పరిధిలోని 16వ వార్డు కౌన్సిలర్ దంపతులు అరిసే వనజ- మురళిలు.. వార్డులో ఎలాంటి శుభకార్యాలు జరిగినా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు వినియోగించవద్దని సూచించారు. అందుకుగానూ స్టీల్ బ్యాంక్ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నూతన కార్యక్రమానికి స్వీకారం చుట్టిన కౌన్సిలర్‌ను వార్డు ప్రజలు అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






