
Home » Andhra Pradesh » Minister Janardhan Reddy announced financial assistance Twenty five thousand rupees provided under Nethanna Seva
ఏపీలో నేతన్న సేవ పథకం కింద ఒక్కో చేనేత కార్మికుడికి సంవత్సరానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందిచనున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రంలో మొత్తం 51,952 మంది నేతన్నలకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేతన్న సేవ పథకం కింద ఒక్కో చేనేత కార్మికుడికి సంవత్సరానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రంలో మొత్తం 51,952 మంది నేతన్నలకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నంద్యాలలో జరిగిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 85,678 మంది 50 ఏళ్లు పైబడిన నేతన్నలకు ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ కింద నెలకు రూ.4 వేలు అందిస్తామని చెప్పారు.
అలాగే 51,952 మంది నేతన్నలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. మగ్గానికి 200, మర మగ్గానికి 500 యూనిట్ల కరెంటు అందిస్తామని వివరించారు. చేనేత కార్మికుల సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమని వెల్లడించారు. కాగా.. శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బలిజ సంఘం నాయకులు, స్థానికులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు జగన్: హోంమంత్రి అనిత..
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరగలేదు: ఏపీ జూడో అసోసియేషన్
