
నాగార్జునసాగర్ లో రేవంత్ రెడ్డి-గీతారెడ్డి దంపతులు
Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌లో రేవంత్ రెడ్డి-గీతారెడ్డి దంపతులు! ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌లో రేవంత్ రెడ్డి-గీతారెడ్డి దంపతులు! ఈ వార్తకు సంబంధించిన
నాగార్జునసాగర్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులకు మరోసారి ప్రత్యేక జ్ఞాపకాలను గుర్తుచేసిన ప్రదేశం. విజయపురిలో సోమవారం నిర్వహించిన మహా వరుణయాగం ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తన సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయ పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ యాగంలో మధ్యాహ్నం 3.24 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వరుణయాగాన్ని నిర్వహించారు. అనంతరం యాగ ప్రదక్షిణం, పుణ్యాహవాచనం, అంకురార్పణ, రుష్యశృంగ పూజ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతితో మహా వరుణయాగం సంపూర్ణమైంది. యాగం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి సతీసమేతంగా నాగార్జునసాగర్ జలాశయాన్ని పరిశీలించారు.రేవంత్ రెడ్డి, గీత దంపతులకు నాగార్జున సాగర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. వారి ప్రేమకథ నాగార్జునసాగర్ నుంచే మొదలైంది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో సీఎం రేవంత్, సతీమణి గీత వెల్లడించారు. ఇంటర్ చదువుతున్న సమయంలో నాగార్జునసాగర్‌కు వెళ్లిన రేవంత్‌రెడ్డికి గీతతో అక్కడే తొలి పరిచయం ఏర్పడింది. గీత కజిన్‌కు రేవంత్ ఫ్రెండ్ కాగా.. ఆ సమయంలో టూర్ కోసం వీరు నాగార్జున సాగర్ వెళ్లారు. అక్కడ ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది.ముందు వీరి పెళ్లికి గీత తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా.. చివరకు అందర్నీ ఒప్పించి 1992లో పెద్దల అంగీకారంతో రేవంత్ రెడ్డి, గీత వివాహం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం నాగార్జునసాగర్ వద్ద రేవంత్‌రెడ్డి, గీత కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రేవంత్ అభిమానులు గతంలో దిగిన ఫోటోను, ప్రస్తుత ఫొటోను షేర్ చేస్తూ.. '34 ఏళ్ల తర్వాత అదే చోట, అదే ప్రేమ. కొన్ని పరిచయాలు అనుకోకుండా జరుగుతాయి.. కానీ కొన్ని పరిచయాలు మాత్రం జీవితాంతం మనతోనే నడుస్తాయి. 34 ఏళ్ల క్రితం నాగార్జునసాగర్ వద్ద అనుకోకుండా మొదలైన ఒక పరిచయం.. కాలంతో పాటు బంధంగా మారి, ప్రేమగా మారి, జీవిత

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Varuna Yagam in Nagarjuna Sagar: తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు నిండాలని, వానాకాలం పంటలు సమృద్ధిగా పండి రైతాంగం సుఖసంతోషాలతో ఉండాలన్న ఆకాంక్షతో నాగార్జునసాగర్ పవిత్ర కృష్ణానది తీరంలో మహా వరుణ యాగం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ వానాకాలంలో రాష్ట్రంలో వర్షాల తీరు, వాటి పంపిణీ ఆశించినంత స్థిరంగా లేదన్నారు. వ్యవసాయానికి ఒకటి రెండు సందర్భాల్లో కురిసే భారీ వర్షాల కంటే పంట కాలమంతా అవసరమైన సమయంలో, అవసరమైన ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవడం అత్యంత ముఖ్యమన్నారు. వర్షాల మధ్య సుదీర్ఘ విరామాలు ఏర్పడితే పంటల ఎదుగుదలతో పాటు సాగునీటి అవసరాలపైనా ప్రభావం పడుతుందని చెప్పారు. ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్న ఎల్‌నినో (El Niño) పరిస్థితులను ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా గమనిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గత రెండు నెలలుగా తెలంగాణలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైందని, రాబోయే నెలల్లోనూ సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితి వానాకాలం పంటలకు, సాగునీటి లభ్యతకు సవాలుగా మారే అవకాశం ఉన్నందున ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ సాగునీటి భద్రత రాష్ట్రంలో కురిసే వర్షాలపైనే ఆధారపడి ఉండదని, రాష్ట్ర జీవనాడులైన కృష్ణా, గోదావరి నదుల ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలు కూడా

నాగార్జునసాగర్‌లో నిర్వహించే వరుణ యాగంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో యాగం నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌లో నిర్వహించే వరుణ యాగంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) పాల్గొననున్నారు. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో ఈ యాగం నిర్వహించనున్నారు. రేపు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సీఎం బయలుదేరనున్నారు. రేపు 2.45 గంటలకు నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు సీఎం చేరుకోనున్నారు. అక్కడి నుంచి విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో జరిగే యాగం వద్దకు రేవంత్‌రెడ్డి చేరుకోనున్నారు. యాగం ముగిసిన అనంతరం 4 గంటలకు హైదరాబాద్‌కు ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. 108 మంది రుత్వికులతో, 11 హోమగుండాలతో విజయ్ విహార్‌లో వరుణ యాగం నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో వరుణయాగం జరిపిస్తారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పించనున్నారు. అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్స్‌తో జాగ్రత్త: సీపీ సజ్జనార్ సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు: ఉత్తమ్