
© 2026 nimisham.in


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకమైన శైలిలో చూపించగా, ఈ సినిమా ఆయన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓజీ యూనివర్స్‌ను మరింత విస్తరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుజీత్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ వీడియోలో దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి పవన్ కళ్యాణ్‌తో ఓజీ యూనివర్స్‌కు సంబంధించిన క్రియేటివ్ చర్చ జరుపుతున్నట్లు చూపించారు. ఓజీ సినిమాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే అంశంపై ఈ ముగ్గురు చర్చించిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఓజీ సీక్వెల్‌కు సంబంధించిన ఆలోచనలపై తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీ సీక్వెల్ కథ భారతదేశంలో సాగుతుందని, అయితే ఆగ్నేయాసియా భావోద్వేగాలు, పాశ్చాత్య తరహా ప్రదర్శనతో ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉందని తమన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా ఓజీ యూనివర్స్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సుభాష్ చంద్రబోస్ అంశాన్ని ఇందులో చేర్చితే కథకు ఎంతో అవకాశాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఆలోచనకు సంబంధించిన అవకాశాలపై చర్చించిన అనంతరం మనం మన బెస్ట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వీడియోలో కనిపించింది. దీంతో ఓజీ యూనివర్స్‌లో భవిష్యత్తులో ఎలాంటి కథలు, పాత్రలు ఉండబోతున్నాయనే అంశంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. వీడియో చివర్లో రాబోయే ఓజీ సినిమాలకు సంబంధించిన కొన్ని యానిమేటెడ్ విజువల్స్‌ను కూడా చూపించారు. ముఖ్యంగా సమురాయ్ కోణానికి సంబంధించిన విజువల్స్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓజీ యూనివర్స్‌లో సమురాయ్ అంశం కూడా భాగం కానుందనే సంకేతాలను ఈ విజువల్స్ ద్వారా ఇచ్చారు. మరోసారి పవర్ స్టార్‌పై తన అభిమానాన్ని తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ద్వారా ప్రదర్శించారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉదయం నుంచి సోషల్ మీడియాలో పవన్ కు బర్త్ డే విషెస్ వెల్లువలా కురుస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు వేడుకలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉదయం నుంచి సోషల్ మీడియాలో పవన్ కు బర్త్ డే విషెస్ వెల్లువలా కురుస్తున్నాయి. అభిమనులతో పాటు.. సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఆయన బర్త్ డే రోజున సందర్భంగా అభిమానులకు, సినీ ప్రియులకు ఒక అద్భుతమైన బిగ్ సర్ప్రైజ్ లభించింది. ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ నుంచి ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ సినిమా విజన్ గురించి ప్రత్యేకంగా వివరిస్తూ.. సౌత్ ఈస్ట్ ఎమోషన్స్, ఇండియన్ బ్యాక్‌డ్రాప్‌ను వెస్ట్రన్ శైలిలో ప్రజెంట్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్ రోజుల నుంచి నేటి 1970ల కాలం దాకా సాగే ఈ కథాంశంలో అద్భుతమైన పొటెన్షియల్ ఉందని, ప్రతి ఒక్కరం మన లైఫ్‌టైమ్‌లో ది బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్లకు పవన్ కళ్యాణ్ సూచించారు.ఈ చిత్రంలో జపనీస్ సంస్కృతికి చెందిన సమురాయ్ ఎలిమెంట్స్, జపాన్ యాకుజా నేపథ్యం కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక వీడియోలో పవన్ సమురాయ్ కత్తి పట్టుకొని ఓజస్ గంభీర ఎంతో గాంభీర్యంగా కనిపించారు. 'సమురాయ్ రేమై.. యాకుజా మేకై' అనే పవర్ ఫుల్ క్యాప్షన్‌తో ఈ ఓజీ విశ్వం యొక్క విస్తృతిని పరిచయం చేశారు. ఓజీ యూనివర్స్ గురించి పవన్, తమన్, సుజీత్ మాట్లాడుతూ.. 'మన కొత్త బ్లడ్ గ్రూప్ ఓజీ సార్ అని తమన్ అనగా ఇది యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అని సుజీత్ అనడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. తమన్ అందించిన నేపధ్య సంగీతం, యానిమేషన్

ఈ రోజు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు. ఈ రోజు “OG 2” సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్తాం అని ఆ మధ్య తమన్ ఊదరగొట్టారు. తమన్ పాటలు కంపోజ్ చెయ్యడం కన్నా హీరోలకు భజన చెయ్యడం, అభిమానులకు ట్విట్టర్ లో అప్డేట్స్ ఇవ్వడం గురించి ఎక్కువ టైం కేటాయిస్తుంటాడు అని అందరికీ తెలుసు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్ ని కలిసి “OG 2” చేస్తున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఐతే “OG 2” ఉంటుంది అని చెప్పారు కానీ ఎప్పుడు మొదలవుతుంది, నిర్మాత ఎవరు వంటి విషయాలను వెల్లడించలేదు. అలా పవన్ కళ్యాణ్ అలా అన్నారో లేదో, తమన్ (Thaman) ఆ సినిమా గురించి అప్పుడే ఎంతో హడావిడి చేశారు. సెప్టెంబర్ 2న ఉంటుంది చూస్కోండి, కాస్కోండి అంటూ రెచ్చిపోయారు తమన్. ఐతే, అసలు విషయం ఏంటంటే ఈ సినిమాని వచ్చే ఏడాది మొదలుపెట్టాలని పవన్ కల్యాణ్ ఫిక్స్ అయ్యారు. ఈ గ్యాప్ లో సుజీత్ ని నాని హీరోగా మొదలుపెట్టిన “బ్లడీ రోమియో”ని పూర్తి చేసుకోమని చెప్పారు. సుజీత్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ భుజానికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడు కేరళలో ఆయన ఆయుర్వేద చికిత్స చేయించుకుంటున్నారు

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు చిత్ర యూనిట్ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వర్కింగ్ టైటిల్ NBK111 సినిమాకి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమా అధికారిక టైటిల్ తో పాటు థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ వార్త బయటకు రావడంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ భారీ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా గ్లింప్స్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఆ గ్లింప్స్ కు లభించిన అనూహ్య స్పందనతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలోనే మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా అనౌన్స్మెంట్కు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ విషయమై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం దాదా లేదా గాడ్ అనే రెండు శక్తివంతమైన పేర్లలో ఒకదాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో సెప్టెంబర్ 6న ఏ టైటిల్ ప్రకటిస్తారో అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఫలితంగా ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల వివరాలు కూడా సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ ఒక అత్యంత కీలకమైన మరియు శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ గాయం కారణంగా కొద్దిరోజుల పాటు షూటింగ్‌కు విరామం లభించిన సంగతి

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ ప్రాజెక్ట్ ‘OG 2’ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ‘OG 2’ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ పవన్-సుజీత్ కలయికలో ‘OG యూనివర్స్’ను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా గతంలో పలు సందర్భాల్లో బర్త్‌డే రోజు ‘OG 2’ సర్ ప్రైజ్ ఉంటుందని హింట్ ఇచ్చారు. సుజీత్ ఒక పవర్ఫుల్ యానిమేటెడ్ వీడియో రెడీ చేస్తున్నారనే టాక్ కూడా ఫిలింనగర్ వర్గాల్లో నడిచింది. అయితే ప్రస్తుతానికి మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక శబ్దం లేకపోవడం విశేషం. అటు పవర్ స్టార్ కూడా భుజం గాయం కారణంగా ఆయుర్వేదం చికిత్స నిమిత్తం కేరళలో ఉన్నారు. సో బర్త్‌డే సందర్బంగా పెద్ద వీడియో కాకుండా కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా చిన్న ప్రమోషనల్ గ్లింప్స్ మాత్రమే విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేకపోవడంతో ఈ పుట్టినరోజుకి పోస్టర్ లేదా గ్లింప్స్ ఇచ్చినా షూటింగ్ మాత్రం ఇప్పుడే ఆశించలేమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పవర్ స్టార్ నుంచి ఎలాంటి బర్త్‌డే సర్ ప్రైజ్ రానుందో చూడాలి

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ NBK111. ‘వీరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ కు వెళ్లాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా అధికారిక టైటిల్‌తో పాటు థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 6న అధికారికంగా వెల్లడించనున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ చిత్రానికి మేకర్స్ ‘GOD’ మరియు ‘DADA’ (దాదా) అనే రెండు మాస్ క్యాచీ టైటిల్స్ చిత్ర బృందం పరిశీలనలో ఉన్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. బాలయ్య ఇమేజ్‌కి, గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్ డ్రామాకి ఈ రెండు పేర్లు పర్ఫెక్ట్గా సరిపోతాయని భావిస్తున్నారు. అయితే దాదాపు ‘దాదా’ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ముంబై నేపథ్యంలో జరిగే గ్యాంగ్ స్టార్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ లో బాలయ్య గాయపడడంతో షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు మేకర్స్. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. సెప్టెంబర్ 6న వచ్చే అధికారిక ప్రకటనతో ఈ సినిమా టైటిల్ మరియు విడుదల తేదీపై పూర్తి స్పష్టత రానుంది

‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #Mega158 (#ChiruBobby2) టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు. పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ చిత్రానికి ‘కాకా’ (Kaaka) అనే టైటిల్ ఖరారు చేశారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లింప్స్ ఎలా ఉందంటే? తాజాగా విడుదలైన వీడియో గ్లింప్స్ అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. ఆక్వా రంగంలో ‘కె. సత్యం’ అనే సూపర్ వైజర్‌గా చిరంజీవి ఎంట్రీ ఇచ్చే సన్నివేశంతో వీడియో ప్రారంభమవుతుంది. చెన్నై టీమ్‌తో ఫోన్ మాట్లాడుతూ లోడ్ సకాలంలో చేరుతుందని భరోసా ఇవ్వడం, పండుగ టార్గెట్ పేరుతో సునీల్ అడిగిన లీవ్ తిరస్కరించడం లాంటి సహజమైన సన్నివేశాలతో కథనం మొదలవుతుంది. గెటప్ శ్రీను స్కూటర్ కీస్ విసిరే క్రమంలో అవి అనుకోకుండా నీటిలో పడిపోగా, ఓ కుక్క రిమోట్‌ను తీసుకురావడం.. ఆ రిమోట్ మాగ్నెట్ సాయంతో కీస్‌ను బయటకు తీసే క్రమంలో తుపాకులు బయటకు రావడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అద్దాలు ధరించిన మధ్యవయస్కుడైన ‘కె. సత్యం’ రూపంలో మెగాస్టార్ హుందాగా కనిపిస్తూనే, ఆ వెంటనే ‘కాకా’ టైటిల్ రివీల్ కావడం గూస్బంప్స్ తెప్పిస్తుంది. అనంతరం వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో గన్స్ పేలుస్తూ చిరంజీవి ఇచ్చిన మాస్ పోజ్ మెగా ఫ్యాన్స్‌కు వింటేజ్ వైబ్స్‌ను గుర్తుచేస్తోంది. బాబీ మరోసారి చిరంజీవిలోని మాస్ అండ్ క్లాస్ వేరియేషన్లను పర్ఫెక్ట్గా ఒడిసిపట్టారు. విజయ్ కార్తీక్ కన్నన్ అందించిన సినిమాటోగ్రఫీ ఆద్యంతం రిచ్‌గా ఉంది. ముఖ్యంగా ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అందులో ‘గ్యాంగ్ లీడర్’ నాటి ఐకానిక్ “గ్యాంగ్ గ్యాంగ్” రీమిక్స్ బీట్ జోడించడం గ్లింప్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది lఈ చిత్రంలో అనస్వర రాజన్

మెగాస్టార్ చిరంజీవి నేడు ఆగష్టు 22న తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. చిరంజీవి పుట్టినరోజు అంటే ఆయన కోట్లాదిమంది అభిమానులకు పండగే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశవిదేశాల్లో ఉన్న చిరు అభిమానులంతా పుట్టినరోజు సెలెబ్రేషన్స్ లో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ బర్త్ డే ని మరింత స్పెషల్ గా మార్చేలా గిఫ్ట్ వచ్చేసింది. చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.వ్ వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి కాంబోలో ఇది రెండో చిత్రం. తాజాగా ఈ చిత్ర టైటిల్ రివీల్ చేస్తూ, సినిమా థీమ్ ని తెలియజేసేలా డీటెయిల్స్ ఇస్తూ గ్లింప్స్ వదిలారు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న కాకా అనే టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ అయింది. టైటిల్ చాలా కూల్ గా ఉంది. గ్లింప్స్ లో కంటెంట్ కూడా కూల్ గా చూపించారు కానీ.. సినిమా చాలా వయలెంట్ గా ఉండబోతున్నట్లు హింట్స్ ఉన్నాయి. గ్లింప్స్ కి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళదాం. అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీ కంపెనీలో కె. సత్యం అనే పేరుతో చిరంజీవి సూపర్ వైజర్ గా పనిచేస్తున్నారు. చిరంజీవి లుక్ చాలా సింపుల్ గా ఉంది. కానీ ఆ కంపెనీలో అన్నీ మిస్టీరియస్ గా అనిపిస్తున్నాయి. పెద్ద స్థాయిలో డీలింగ్స్ జరుగుతున్నాయి. సినిమా థీమ్ ని తెలియజేయాలి అంటే ఇందులో ఒక్క డైలాగ్ ఉంది. వణక్కం సత్యన్న చెప్పిన టైంకి చెన్నై పోర్ట్ కి సరుకు వచ్చి పూడుస్తది కదా అని తమిళ వ్యక్తి ఫోన్ లో అడుగుతారు. దీనికి చిరంజీవి బదులిస్తూ.. ఎన్నాడా తంబీ.. ఇది సత్యం మాట.. ఇంకా డౌటా అంటూ తన స్టైల్ లో మెగాస్టార్ డైలాగ్ చెప్పారు. అంటే సత్యం మాట ఇస్తే అది జరిగి తీరాల్సిందే. ఆ ఆక్వా కంపెనీలో అంతా సత్యంకి రెస్పెక్ట్ ఇచ్చేలానే ఉంటారు. సత్యం అసలు కాకాగా ఎలా

టాలీవుడ్లో ‘ఇట్లు అర్జున’ ఇప్పుడు ఆసక్తి పెంచుతున్న కొత్త చిత్రంగా నిలుస్తోంది. ముఖ్యంగా తొలి సినిమాతోనే మాటలు మాట్లాడలేని అర్జున పాత్రను ఎంచుకున్న అనీష్ రెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నెల్లూరు నేపథ్యానికి చెందిన అనీష్, పారిశ్రామికవేత్త అల్తూరు మహేష్ రెడ్డి కుమారుడిగా వ్యాపార కుటుంబం నుంచి సినిమాల్లోకి వస్తున్నారు. అయితే సాధారణ ప్రేమకథ లేదా యాక్షన్ పాత్రతో పరిచయం కాకుండా, భావోద్వేగాలను ముఖకవళికలు, కళ్లతోనే వ్యక్తం చేసే పాత్రను ఎంచుకోవడం ప్రత్యేకతగా మారింది. ‘ఇట్లు అర్జున’ కోసం నాగార్జున వాయిస్ ఓవర్, తమన్ సంగీతం, అనస్వర రాజన్‌తో పాటు అనుభవజ్ఞులైన సాంకేతిక బృందాన్ని తీసుకోవడం ఈ ప్రయత్నం స్థాయిని చూపిస్తోంది. అనీష్ రెడ్డి ఎంపిక కూడా నేరుగా హీరోగా పరిచయం చేయాలనే నిర్ణయంతో మాత్రమే జరగలేదని చిత్రబృందం చెబుతోంది. ఆడిషన్ సమయంలోనే దర్శకుడు, నిర్మాత వెంకీ కుడుములను అనీష్ ఆకట్టుకున్నట్లు ‘ఫైండింగ్ అర్జున’ మేకింగ్ వీడియోలో వెల్లడించారు. పాత్రకు అవసరమైన బాడీ లాంగ్వేజ్, భావోద్వేగ వ్యక్తీకరణ, యాక్షన్ ప్రిపరేషన్‌పై ఆయన ప్రత్యేకంగా పని చేశారు. ‘ఇట్లు అర్జున’లో అర్జున మాట్లాడలేడు కానీ ధైర్యం, సున్నితత్వం, యాక్షన్ నైపుణ్యాలు కలిగిన యువకుడిగా కనిపించనున్నాడు. మాటలు లేకుండా ప్రేమను ఎలా వ్యక్తం చేస్తాడన్న అంశమే కథలో కీలక భావోద్వేగంగా ఉండనుంది. అర్జున జీవితంలో కీర్తి ప్రవేశించిన తర్వాత ప్రేమకథ ఎలా ముందుకెళ్తుందనే అంశాన్ని ప్రోమోలు ప్రధానంగా చూపిస్తున్నాయి. అనస్వర రాజన్ ఈ సినిమాలో కీర్తిగా నటిస్తుండగా, అనీష్‌తో ఆమె కెమిస్ట్రీకి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో స్కూటర్ ప్రయాణాలు, మెట్రో దృశ్యాలు, రూఫ్‌టాప్ క్షణాలు, సహజమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు యువతను ఆకట్టుకునేలా రూపొందించారు. ఇదిలా ఉండగా ఇది పూర్తిగా కళాత్మక చిత్రంగా కాకుండా ప్రేమ, యాక్షన్, కామెడీ అంశాలతో రూపొందిస్తున్న వాణిజ్య చిత్రమని వెంకీ కుడుముల స్పష్టం చేశారు. కొన్ని రిపోర్టుల్లో సూపర్‌హీరో అంశం ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ, అర్జున నిశ్శబ్దమే కథలో ప్రధాన బలంగా కనిపిస్తోంది

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా.. ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ‘మెగా158’ చిత్ర బృందం సిద్ధమైంది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ‘మెగా158’ చిత్ర బృందం సిద్ధమైంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రమిది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ టీజర్‌ను చిరంజీవి జన్మదిన కానుకగా (Chiranjeevi Birthday Special) ఆగస్ట్ 22న అధికారికంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు బాబీ కొల్లి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గ్లింప్స్ విడుదల తేదీని ప్రకటిస్తూ దర్శకుడు బాబీ ఓ పవర్ఫుల్ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో చిరంజీవి సరికొత్త యాటిట్యూడ్, ఇంటెన్స్ స్వాగ్తో కూడిన సిల్హౌట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘‘మెగాస్టార్‌కు ప్రత్యేకమైన రోజున ఇన్నాళ్లుగా వెయిట్ చేస్తున్న వెయిటింగ్‌కు ఫుల్స్టాప్ పడనుంది. ఆగస్టు 22న Mega158 టైటిల్ గ్లింప్స్ వచ్చేస్తోంది. ఇదొక న్యూ చాప్టర్.. న్యూ ఫోర్స్.. సరికొత్త మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. మునుపెన్నడూ చూడని రీతిలో సాగే మెగా బ్లాస్ట్‌కు సిద్ధంగా ఉండండి’’ అంటూ బాబీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌తో కలిసి టీజర్ అవుట్‌పుట్ చూస్తున్న వర్కింగ్ స్టిల్‌ను, చిరంజీవి ఇంటెన్స్ సిల్హౌట్ పోస్టర్‌ను విడుదల చేయడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సందడి మొదలైంది. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’లో చిరును వింటేజ్ మాస్ లుక్‌లో

దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి ‘వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సరికొత్త చిత్రం ‘ఇట్లు అర్జున’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ‘ఛలో’, ‘భీష్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) నిర్మాతగా మారి ‘వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సరికొత్త చిత్రం ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna). ఈ సినిమా ద్వారా అనీష్ (Aniesh) కథానాయకుడిగా పరిచయం అవుతుండగా, నూతన దర్శకుడు మహేష్ ఉప్పల (Mahesh Uppala) మెగాఫోన్ పడుతున్నారు. మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, రెండు మెలోడీ పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తిని, క్యూరియాసిటీని పెంచేశాయనే విషయం తెలియంది కాదు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఇట్లు అర్జున’ చిత్రాన్ని దసరా పండుగ సీజన్ సందర్భంగా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ సందర్భంగా విడుదల చేసిన సరికొత్త పోస్టర్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో అనీష్ స్టైలిష్ లుక్‌లో ఓ భారీ భవనం పైకప్పు నుంచి కిందకు దూకుతూ ఏదో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించగా, హీరోయిన్ అనస్వర రాజన్ చేతులు కట్టేసి ఉండి తీవ్రమైన భావోద్వేగంతో కనిపిస్తూ కథలోని థ్రిల్‌ను సూచిస్తోంది. లీడ్ పెయిర్ మధ్య ఉన్న ఫ్రెష్ కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాలో హీరో అనీష్ వినికిడి, మాటల లోపం ఉన్న (చెవిటి, మూగ) యువకుడి పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ఈ సరికొత్త పాత్ర నేపథ్యం కథకు ప్రధాన బలంగా మారనుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రాజా మహాదేవ్ సినిమాటోగ్రఫీ, కోటి కే

తమన్.. సాంగ్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొడితే ప్రేక్షకుడు తనకి తెలియకుండానే సీట్ లో నుంచి లేచి పూనకంతో డాన్స్ చేస్తాడు. హీరోకి గాని, ప్రతినాయకుడుకి గాని ఇచ్చే ఎలివేషన్ అయితే నభూతో నభవిష్యత్. కథ, కథనంకి తగ్గ మూడ్ తో బిజిఎమ్ ఇవ్వడంలో కూడా స్పెషలిస్ట్. తమన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'సమాజంలో ఆదరణ కరువై అనాథలుగా మారుతున్న వృద్ధుల కోసం ఒక అత్యాధునిక ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం 12 కోట్లు. ఇప్పటికే 4 కోట్లు ఖర్చు చేశాను. సినిమాల ద్వారా వచ్చే రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా విదేశీ, స్వదేశీ మ్యూజిక్ కాన్సర్ట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సంపూర్ణంగా ఈ వృద్ధాశ్రమ నిర్మాణానికే కేటాయిస్తున్నానని చెప్పుకొచ్చాడు. చాలా మంది ఈ మంచి కార్యక్రమానికి విరాళాలు ఇస్తామని ముందుకు వచ్చినప్పటికీ, తమన్ ప్రేమగా తిరస్కరించడం విశేషం. సొంత కష్టార్జితంతోనే ఈ కలల ప్రాజెక్టును పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. కేవలం వృద్ధాశ్రమమే కాకుండా, పేద విద్యార్థుల చదువులకు సహాయం చేయడం, అత్యవసర వైద్య శస్త్రచికిత్సలకు ఆర్థిక సాయం అందించడం వంటి ఎన్నో గుప్తదానాలను తమన్ ఏళ్ల తరబడి చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక టీమ్‌ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. రీల్ హీరోగానే కాకుండా రియల్ లైఫ్‌లోనూ తోటివారికి సహాయపడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్న తమన్ మానవత్వానికి సినీ ప్రముఖులు మరియు అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం తన అద్భుతమైన మ్యూజిక్‌తోనే కాకుండా, తన ఉదార స్వభావంతో కూడా లక్షలాది మంది అభిమానుల హృదయాలని గెలుచుకుంటున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఎన్నో కష్టనష్టాల నడుమ గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగిన ఆయన జీవిత ప్రయాణం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. అయితే సమాజం నుంచి తాను

నందమూరి బాలకృష్ణ తన 111వ సినిమా షూటింగ్లో తీవ్రంగా గాయపడి మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ, నిర్మాతలకు నష్టం కలగకుండా త్వరలోనే సెట్స్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. వైద్యులు రెండు నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోమని స్పష్టంగా సలహా ఇచ్చినప్పటికీ, ఆయన సెప్టెంబర్‌లోనే షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. తండ్రి సీనియర్ ఎన్టీఆర్ చూపించిన వృత్తిపరమైన నిబద్ధతను కొనసాగిస్తూ బాలకృష్ణ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జూలై నెలలో కాకినాడ మరియు రాజమండ్రి పరిసర ప్రాంతాలలో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ ఎడమ మోకాలికి తీవ్ర గాయమైంది. ఆయన క్వాడ్రిసెప్స్ టెండన్ చీలిపోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కూడా దెబ్బతినడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్‌కు తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యుల బృందం దాదాపు 3 గంటల పాటు క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి దెబ్బతిన్న టెండన్‌ను విజయవంతంగా అతికించి సపోర్టింగ్ టిష్యూలను రిపేర్ చేశారు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత కనీసం రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో షూటింగ్ ఆలస్యమైతే నిర్మాతులపై భారీగా ఆర్థిక భారం పడుతుందని భావించిన బాలకృష్ణ, సెప్టెంబర్ నెలలోనే సెట్స్‌కు వస్తానని చిత్రబృందానికి భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా, పల్లెటూరి పిల్ల మరియు సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాల సమయంలో ఎన్టీఆర్ కూడా గాయాలను లెక్కచేయకుండా షూటింగ్‌లు పూర్తి చేసిన సంఘటనలను ఈ సందర్భంగా సినీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న బాలకృష్ణ సైతం అదే బాటలో నడుస్తూ తన వల్ల నిర్మాతలు ఆర్థికంగా నష్టపోకూడదనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఫలితంగా సెప్టెంబర్ నెలలోనే తన టాకీ పార్ట్ పూర్తి చేసి, అక్టోబర్‌లో ప్యాచ్ వర్క్ అలాగే నవంబర్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ మాసంలోనే సినిమాను భారీ స్థాయిలో విడుదల

చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం షూటింగ్ 40 రోజులు పూర్తైంది. ఫస్ట్ హాఫ్ దాదాపు లాక్ కాగా, ఇంటర్వెల్ ఫైట్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. చిరంజీవి సపోర్ట్‌తో టీమ్ అంతా ఒకే స్పీడ్‌తో పని చేస్తుండడంతో 40 రోజుల షూటింగ్ పూర్తయిందని చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణ చెప్పారు. ఇప్పటివరకూ ఫస్ట్ హాఫ్ దాదాపు లాక్ అయిందని, చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని, ఇటీవల చిత్రీకరించిన ఇంటర్వెల్ ఫైట్ సినిమాలో ప్రధాన హైలైట్‌గా ఉంటుందని చిత్ర దర్శకుడు బాబీ చెప్పారు. ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అనస్వర రాజన్ (Anaswara Rajan), నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. భాను-నందు మాటలు రాస్తున్నారు

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘#Mega158’ (#ChiruBobby2) చిత్రీకరణ వేగంగా సాగుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో, కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై పరిశ్రమలో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఇప్పటికే 40 రోజుల కీలక చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అదే సమయంలో మొదటి భాగానికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ పూర్తయి లాక్ అయింది. ఇప్పటివరకు చిత్రీకరించిన సన్నివేశాలలో భావోద్వేగాలు, వినోదం, యాక్షన్ సమపాళ్లలో కుదిరాయని చిత్ర బృందం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఇటీవల తెరకెక్కించిన ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, భాను-నందు సంభాషణలు రాస్తున్నారు

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ హీస్ట్ డ్రామా ‘సిగ్మా’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ అనౌన్స్‌మెంట్‌తో పాటు సందీప్ కిషన్ సరికొత్త ఇంటెన్స్ పోస్టర్‌ను కూడా మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సిగ్మా సినిమాలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో చిత్ర బృందం త్వరలోనే టీజర్ మరియు ఇతర ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయనుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని యూనిట్ నమ్ముతోంది. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్‌ను పర్యవేక్షించారు. అన్బు దాసన్, యోగ్ జేపీ, షీలా రాజ్‌కుమార్, కిరణ్ కొండ వంటి నటీనటులు కూడా ఇందులో భాగమయ్యారు. కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు జేసన్ సంజయ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దసరా సెలవులను పురస్కరించుకుని అక్టోబర్ 2న థియేటర్లలో సందడి చేసేందుకు సిగ్మా సిద్ధమైంది. యాక్షన్ సన్నివేశాలు మరియు హీస్ట్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సిగ్మా’. ఈ సినిమాతో జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా అధికారిక విడుదల తేదీని ప్రకటిస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. యాక్షన్ హీస్ట్ డ్రామాగా రూపొందుతున్న ‘సిగ్మా’ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. విడుదల చేసిన పోస్టర్లో సందీప్ కిషన్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా.. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు దాసన్, యోగ్ జాపీ, షీలా రాజ్‌కుమార్, కిరణ్ కొండ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం, త్వరలోనే టీజర్, పాటలతో పాటు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది

చిరు లీక్స్‌లో 2.0 వర్షన్ వచ్చిందా..? చిరంజీవి కావాలనే కొన్ని విషయాలు లీక్ చేస్తున్నారా..? ఒకప్పుడు అనుకోకుండా లీక్ చేసే చిరు.. ఇప్పుడన్ని లెక్కలేసుకున్న తర్వాతే నోటి నుంచి ఓ మాట బయటికి వదిలేస్తున్నారా..? బాబీ సినిమా టైటిల్ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారా..? ప్రమోషన్ విషయంలో మెగాస్టార్ కూడా స్టైల్ మార్చేసారా..? అసలు మెగా 158 టైటిల్ ఏంటి..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా..! చిరంజీవి కూడా అప్డేట్ అవుతున్నారు.. సరికొత్త ప్రమోషనల్ ట్రెండ్‌కు ఆయన కూడా అలవాటు పడుతున్నారు.. సినిమా చేయడం కాదు దాన్ని ట్రెండింగ్‌లో ఉంచడమూ ముఖ్యమే అని మెగాస్టార్‌కు బాగా అర్థమైనట్లుంది. అందుకే బాబీ సినిమా ప్రమోషన్స్‌ను తన చిరు లీక్స్తోనే షురూ చేసారు చిరు. కొరియన్ కనకరాజు సక్సెస్ వేడుకలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వింటున్నారుగా.. బాబీ సినిమా టైటిల్‌ను అలా చెప్పబోయి ఆపేసారు చిరంజీవి. ఇక్కడే చిరు లీక్స్ 2.0 వర్షన్ కనిపిస్తుంది. ఒకవేళ టైటిల్ చెప్పాలనుకుంటే మొత్తం చెప్పేవారే.. కావాలనే కదిరి అని ఆపేసారేమో అనే డౌట్స్ వస్తున్నాయిప్పుడు. అలా చేయడం వల్ల సినిమాపై ట్రెండింగ్ మొదలైంది.. టైటిల్ ఏమై ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఆగస్ట్ 22న మెగా 158 సినిమా టీజర్ రానుంది.. ఇప్పటికే టీజర్ కట్ కూడా రెడీ అయిపోయింది. టైటిల్‌తోనే గ్లింప్స్ బయటికి రానుంది. దానికింకా 10 రోజులుంది కాబట్టి కదిరి అని లీక్ చేసి టైటిల్‌పై క్యూరియాసిటీ పెంచారు మెగాస్టార్. గతంలో రంగస్థలం, ఆచార్య టైమ్‌లో ఫుల్ లీక్స్ ఇచ్చారు చిరు. కానీ ఈసారి మాత్రం ప్లాన్ వేసుకునే సగం టైటిల్ లీక్ చేసారేమో అనిపిస్తుంది. ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే చిరు లీక్స్నే మెగా 158 ప్రమోషనల్ ఆయుధంగా వాడుకుంటున్నారు చిరంజీవి. ఓవైపు థమన్ ఆపుతున్నా.. కావాలనే స్టేజీ ఎక్కిన తర్వాత కూడా చిరు టైటిల్ గురించి పదేపదే చెప్పడం చూస్తే ఇదేదో మెగా ప్రమోషనల్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158వ చిత్రంపై తాజాగా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టులో యువ నటి మీనాక్షి చౌదరి భాగం కానున్నట్లు సమాచారం. ఆమె ప్రధాన కథానాయికగా కాకుండా, కీలకమైన అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా, డిసెంబర్ 2026లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. అయితే మీనాక్షి చౌదరి పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కేవలం సెకండ్ హాఫ్‌లో వచ్చే కీలక సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తారని తెలుస్తోంది. దీంతో ఆమె పాత్ర సినిమా కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవరనే అంశంపై చిత్ర బృందం స్పష్టత ఇవ్వలేదు. కేవలం అతిథి పాత్రలకే పరిమితం కాకుండా, పూర్తిస్థాయి కథానాయిక పాత్ర ఉంటుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ప్రధాన హీరోయిన్ ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతుండటంతో, మీనాక్షి చౌదరి ఎంట్రీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గెస్ట్ రోల్ అయినప్పటికీ చిరంజీవి సరసన నటించడం మీనాక్షి కెరీర్‌కు పెద్ద ప్లస్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పాత్ర నిడివి ఎంత ఉంటుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రాన్ని కమర్షియల్ హంగులతో పక్కా ప్లాన్‌తో తెరకెక్కిస్తున్నారు. కథలో భాగంగానే మీనాక్షి పాత్రను డిజైన్ చేశారని, ఇది కథకు అత్యంత కీలకమని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం

మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే సినిమాకు సంబంధించిన కీలకమైన విషయాన్ని అనుకోకుండా బయటపెట్టారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సక్సెస్ మీట్లో తన 158వ సినిమా టైటిల్‌ను ఆయనే స్వయంగా లీక్ చేశారు. దీంతో #ChiruLeaks అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది.వివరాల్లోకి వెళితే.. కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో చిరంజీవి తన 158వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'కదిరి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిరంజీవి సరదాగా వేదికపై వెల్లడించారు. ఈవెంట్లో లీక్‌ల గురించి ప్రస్తావన రాగా, సంగీత దర్శకుడు తమన్ వద్దని వారిస్తున్నా, "టీజర్ మ్యూజిక్ అయ్యిందా? చివర్లో 'కదిరి' అని టైటిల్ పెట్టారా?" అని చిరంజీవి అడగడంతో అసలు విషయం బయటపడింది. అంతేకాదు తన పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు.'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తుండగా, కన్నడ నటి రచితా రామ్, నివేదా పేతురాజ్, అనశ్వర రాజన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కే నారాయణ, లోకేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు

అధర్వ హీరోగా రూపొందిన సినిమానే 'ఇదయం మురళి' (హృదయం మురళి). అధర్వ తండ్రి మురళి హీరోగా 1991లో 'ఇదయం' (హృదయం) సినిమా చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా మ్యూజికల్ హిట్ గా యూత్ ను ఒక ఊపు ఊపేసింది. ఆ సినిమా పేరును .. తండ్రి పేరును కలుపుతూ, ఆయనను గుర్తుచేస్తూ అధర్వ ఈ సినిమా చేశాడనుకోవాలి. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, జులై 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 7వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది.'హృదయ' (అధర్వ) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. అప్పటి నుంచి మేనమామ (నట్టి సుబ్రమణ్యం) అతని ఆలనాపాలన చూస్తూ వస్తాడు. అయితే తల్లిదండ్రులు లేని కారణంగా ఒక రకమైన బెరుకు 'హృదయ'లో ఉండిపోతుంది. ఆ కారణంగా అతను తన మనసులోని మాటను బయటికి చెప్పలేకపోతుంటాడు. కాలేజ్ లో చదువుకునే రోజులలో అతను 'సమంత' (ప్రీతి ముకుందన్)ను ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమను మనసులోనే దాచుకుంటాడు. ఆ తరువాత చదువు పూర్తి చేసి చెన్నైలో జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే అతనికి 'అముద' (కయాదు లోహార్) పరిచయమవుతుంది. డాక్టర్ గా ఉన్న ఆమెను అతను ఆరాధించడం మొదలుపెడతాడు. ఆమె పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేయమని స్నేహితులు ఎంతగా చెప్పినా, హృదయ ధైర్యం చేయలేకపోతాడు. ఆమె తన ఊరికి వెళ్లిపోవడంతో దిగాలు పడిపోతాడు. సమంతకుగానీ .. అముదకుగాని తన మనసులోని ప్రేమను చెబితే బాగుండునని అనుకుంటాడు. 'అదితి'తో హృదయ ఎంగేజ్ మెంట్ జరిగిన తరువాత వాళ్లిద్దరూ తారసపడతారు. అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేదే కథ.టీనేజ్ లో అడుగుపెట్టిన తరువాత ప్రేమలో పడటం సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అయితే అబ్బాయిలే ముందుగా తమ ప్రేమను వ్యక్తం చేయాలని అమ్మాయిలు కోరుకుంటారు. కొంతమంది అబ్బాయిలు మౌనంగా ఆరాధిస్తారే తప్ప ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి జంకుతారు

సినిమా విడుదలకు నెల రోజుల ముందే కాపీ చేతిలో ఉంటే చాలా బాగుంటుందని, ఆ పద్ధతి రావాలని పిలుపునిచ్చారు నాగార్జున (Nagarjuna). తను నటించిన ‘అన్నమయ్య’, ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాల కాపీల్ని రిలీజ్ కు నెల రోజుల ముందే చూసుకున్నామని, తిరిగి ఆ పద్ధతి రావాలని అన్నారు. ఈ ప్రతిపాదనను తాజాగా వరుణ్ తేజ్ రిజెక్ట్ చేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి సంప్రదాయం మళ్లీ రాదని తేల్చిచెప్పేశాడు. ఇప్పుడు మ్యూజిక్ డైరక్టర్ తమన్ (Thaman) కూడా అదే మాట చెబుతున్నాడు. “నాగార్జున చెప్పింది వంద శాతం కరెక్ట్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా జరగదు. అన్నీ ఆఖరి నిమిషంలో జరుగుతున్నాయి. నాగార్జున చెప్పినట్టు నెల రోజుల ముందే ఫస్ట్ కాపీ రెడీ చేయాలంటే, నాకు ఎడిట్ వెర్షన్ కనీసం 2 నెలల ముందు ఇవ్వాలి. అది జరిగే పని కాదు కదా. నిజంగా నాగార్జున చెప్పినట్టు ముందే నాకు ఎడిట్ వెర్షన్ ఇస్తే, నేను నెల ముందే కాపీ ఇచ్చేస్తాను.” ఇలా నాగార్జున ప్రతిపాదనతో తమన్ కూడా విభేదించాడు. ప్రస్తుతం మార్కెట్ లెక్కలు, వర్కింగ్ స్టయిల్స్ మారిపోయాయని, నాగార్జున చెప్పిన పద్ధతిలోకి పరిశ్రమ మారాలంటే, 24 క్రాఫ్ట్స్ ఒక మాట మీదకు రావాలని అన్నాడు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ మూవీ రాబట్టిన రెండు రోజుల కలెక్షన్ల వివరాలను మేకర్స్ తెలిపారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), రితికా నాయక్ (Ritika Nayak) జంటగా మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju). ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్, మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. సినిమా విడుదలకు ముందు వేసిన ప్రీమియర్స్‌తోనే సినిమా హిట్ టాక్ని సొంతం చేసుకున్న విషయం తెలియంది కాదు. కామెడీతో పాటు సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ఊహించని రేంజ్లో రెస్పాన్స్ లభిస్తోంది. తాజాగా ఈ మూవీ రెండు రోజలకు ఎంత రాబట్టిందో తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే భారీ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 23.6 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్లో తెలిపారు. శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. దీంతో వరుణ్ తేజ్ కెరీర్లోనే ఇది సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలుస్తోంది. ఆదివారం కూడా ఈ సినిమాకు భారీగా బుకింగ్స్ జరుగుతుండటంతో ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమా లాభాల బాట పట్టే అవకాశం ఉందని ట్రేడ్ రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ టైమింగ్, నటనతో పాటు కమెడియన్ సత్య కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. థమన్ సంగీతం సినిమాకి అదనపు