
© 2026 nimisham.in

చిరు లీక్స్‌లో 2.0 వర్షన్ వచ్చిందా..? చిరంజీవి కావాలనే కొన్ని విషయాలు లీక్ చేస్తున్నారా..? ఒకప్పుడు అనుకోకుండా లీక్ చేసే చిరు.. ఇప్పుడన్ని లెక్కలేసుకున్న తర్వాతే నోటి నుంచి ఓ మాట బయటికి వదిలేస్తున్నారా..? బాబీ సినిమా టైటిల్ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారా..? ప్రమోషన్ విషయంలో మెగాస్టార్ కూడా స్టైల్ మార్చేసారా..? అసలు మెగా 158 టైటిల్ ఏంటి..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా..! చిరంజీవి కూడా అప్డేట్ అవుతున్నారు.. సరికొత్త ప్రమోషనల్ ట్రెండ్‌కు ఆయన కూడా అలవాటు పడుతున్నారు.. సినిమా చేయడం కాదు దాన్ని ట్రెండింగ్‌లో ఉంచడమూ ముఖ్యమే అని మెగాస్టార్‌కు బాగా అర్థమైనట్లుంది. అందుకే బాబీ సినిమా ప్రమోషన్స్‌ను తన చిరు లీక్స్తోనే షురూ చేసారు చిరు. కొరియన్ కనకరాజు సక్సెస్ వేడుకలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వింటున్నారుగా.. బాబీ సినిమా టైటిల్‌ను అలా చెప్పబోయి ఆపేసారు చిరంజీవి. ఇక్కడే చిరు లీక్స్ 2.0 వర్షన్ కనిపిస్తుంది. ఒకవేళ టైటిల్ చెప్పాలనుకుంటే మొత్తం చెప్పేవారే.. కావాలనే కదిరి అని ఆపేసారేమో అనే డౌట్స్ వస్తున్నాయిప్పుడు. అలా చేయడం వల్ల సినిమాపై ట్రెండింగ్ మొదలైంది.. టైటిల్ ఏమై ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఆగస్ట్ 22న మెగా 158 సినిమా టీజర్ రానుంది.. ఇప్పటికే టీజర్ కట్ కూడా రెడీ అయిపోయింది. టైటిల్‌తోనే గ్లింప్స్ బయటికి రానుంది. దానికింకా 10 రోజులుంది కాబట్టి కదిరి అని లీక్ చేసి టైటిల్‌పై క్యూరియాసిటీ పెంచారు మెగాస్టార్. గతంలో రంగస్థలం, ఆచార్య టైమ్‌లో ఫుల్ లీక్స్ ఇచ్చారు చిరు. కానీ ఈసారి మాత్రం ప్లాన్ వేసుకునే సగం టైటిల్ లీక్ చేసారేమో అనిపిస్తుంది. ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే చిరు లీక్స్నే మెగా 158 ప్రమోషనల్ ఆయుధంగా వాడుకుంటున్నారు చిరంజీవి. ఓవైపు థమన్ ఆపుతున్నా.. కావాలనే స్టేజీ ఎక్కిన తర్వాత కూడా చిరు టైటిల్ గురించి పదేపదే చెప్పడం చూస్తే ఇదేదో మెగా ప్రమోషనల్ స్టంట్ అనిపించక మానదు. మ్యాటర్ ఏదైనా.. కదిరి అనే ఒక్క మాటతో మెగా 158 టైటిల్ మీద జోరుగా చర్చ మొదలైందిప్పుడు.
భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం
పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్
ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై ఎన్ఈసీసీ సంచలన నివేదిక!
10వ తరగతి అర్హతతో రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








