
యాంకర్ సుమ హీరోయిన్ గా ఎందుకు సినిమాలు మానేసిందో తెలుసా? ఇది అస్సలు ఊహించరు
సుమ కనకాల యాంకర్‌గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ స్టార్ యాంకర్‌గా రాణిస్తోంది. ఫుల్ బిజీగా ఉంటుంది. ఒకప్పుడు బుల్లితెరని శాసించింది. ఈ మధ్యనే చాలా వరకు తగ్గించింది. సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్లు చేస్తుంది. మరోవైపు తన సొంత యూట్యూబ్ ఛానెల్‌పై ఫోకప్ పెట్టింది. దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే యాంకర్ సుమ.. ఒకప్పుడు నటి. ఆమె హీరోయిన్గా చేసింది. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ గానే ఆమె కెరీర్ ప్రారంభం కావడం విశేషం. యాంకర్ సుమ తెలుగులో ఒక సినిమాలో హీరోయిన్గా చేసింది. అదే `కళ్యాణ ప్రాప్తిరస్తు`. దీనికి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. ఇందులో ప్రముఖ రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ హీరోగా నటించాడు. ఆయనకు జోడీగా సుమ చేసింది. ఇందులో చేసిన వక్కంతం వంశీ, సుమ, కావ్య, మధులకు కూడా ఇదే ఫస్ట్ మూవీ. కానీ బాక్సాఫీసు వద్ద డిజాప్పాయింట్ చేసింది. అదే సమయంలో మలయాళంలోనూ హీరోయిన్గా ఆఫర్లు అందుకుంది సుమ. అక్కడ మూడు సినిమాలు చేసింది. అవి బాగానే ఆడాయి. కానీ ఉన్నట్టుండి హీరోయిన్ గా సినిమాలు మానేసింది. క్యారెక్టర్స్ వైపు, బుల్లితెర టర్న్ తీసుకుంది. మరి హీరోయిన్గా పేరు రాకపోవడమా? తాను హీరోయిన్గా సెట్ కాకపోవడమా? కారణం ఏంటనేది చూస్తే. తాను ఎందుకు సినిమాలు మానేసిందో యాంకర్ సుమ రివీల్ చేసింది. `తెలుగులో దాసరి గారితో `కళ్యాణ ప్రాప్తిరస్తు` చేశాను, ఆ తర్వాత రెండు మూడు మలయాళ చిత్రాల్లో హీరోయిన్గా నటించాను` అని చెప్పింది. అయితే హీరోయిన్గా చేయడం వల్ల తాను కంఫర్ట్ గా లేదట. ఏదో అసౌకర్యమైన ఫీలింగ్ కలిగేదట. సినిమా లోకేషన్లో గానీ, ఆ డిపార్ట్ మెంట్లో గానీ తనకు ఆ ఈజ్ వచ్చేది కాదట. అలాంటి పరిస్థితుల్లో నటించినప్పుడు తన యాక్టింగ్ బిగుసుకుపోతుందని, సరిగ్గా చేయలేకపోతున్నానని, ఫ్రీడమ్ లేదు, ఫీయర్గా అనిపించేదని తెలిపింది. తమది ఆర్థడాక్స్ ఫ్యామిలీ కావడంతో