
Shubman Gill: 27వ ఏట అడుగుపెట్టిన గిల్.. వరల్డ్ రికార్డులు, డబుల్ సెంచరీల రారాజు గురించి ఈ నిజాలు తెలుసా?
Shubman Gill: 27వ ఏట అడుగుపెట్టిన గిల్.. వరల్డ్ రికార్డులు, డబుల్ సెంచరీల రారాజు గురించి ఈ నిజాలు తెలుసా?
© 2026 nimisham.in

Shubman Gill: 27వ ఏట అడుగుపెట్టిన గిల్.. వరల్డ్ రికార్డులు, డబుల్ సెంచరీల రారాజు గురించి ఈ నిజాలు తెలుసా?

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఇటీవల జరిగిన శ్రీలంక పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. మరోవైపు, యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాన్ని సాధించాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక్క అర్ధశతకం సాధించిన శుభ్‌మన్ గిల్.. తాజాగా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయి.. తొమ్మిదో స్థానంలో నిలిచాడు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఏడో స్థానంతో భారత్ తరఫున బ్యాటర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ 11వ స్థానంలో నిలిచాడు. శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల్లో కలిపి రెండు శతకాలతో బాదిన దేవదత్ పడిక్కల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 54వ స్థానానికి చేరుకున్నాడు. లంక గడ్డపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పడిక్కల్ నిలిచాడు. బౌలింగ్ విభాగంలోనూ భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానాన్ని కోల్పోయి.. మూడో స్థానానికి పడిపోయాడు. మోకాలి గాయం కారణంగా బుమ్రా జూలై మధ్య నుంచి ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తొలి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ రెండో స్థానంలో నిలిచాడు. సెప్టెంబర్ మధ్యలో అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బుమ్రా ఎంపికైనప్పటికీ, అతడి ఫిట్నెస్ ఆధారంగానే తుది జట్టులో ఆడటం ఆధారపడి ఉంటుంది. ఇది భవిష్యత్ లో రిలీజ్ అయ్యే అతడి ఐసీసీ

ICC Test Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాలు దిగజారడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అదే సమయంలో ఇంగ్లాండ్ బౌలర్ ఆలీ రాబిన్సన్ అనూహ్యంగా టాప్-5లోకి దూసుకొచ్చాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వరుసగా రెండో వారం కూడా ఒక స్థానాన్ని కోల్పోయాడు. గత మూడు టెస్టు మ్యాచ్‌లకు దూరంగా ఉండటంతో ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా మూడో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ.. బుమ్రాను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు. మైదానంలోకి దిగకపోవడం వల్ల పాయింట్లు కోల్పోయి బుమ్రా ఈ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ర్యాంకింగ్స్‌లో ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కొన్నాడు. సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 74 పరుగులు మాత్రమే సాధించడంతో గిల్ రెండు స్థానాలు దిగజారి తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. ప్రస్తుతం టెస్టు బ్యాటింగ్ విభాగంలో ఏడో స్థానంలో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రమే భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ ఆలీ రాబిన్సన్ సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సుదీర్ఘ దూకుడు ప్రదర్శిస్తూ ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నేరుగా ఐదో స్థానానికి చేరుకున్నాడు. భారత్‌పై టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీలంక ఆటగాడు సోనాల్ దినుషా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 29 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. భారత్‌పై 140 సగటుతో 420 పరుగులు చేసి అతడు ఈ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. IND vs SL 2nd Test Predicted Playing 11: శ్రీలంకపై టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా రెడీ అవుతోంది. తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్.. ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కొలంబోలోని ఎస్ఎస్సీ స్టేడియం వేదికగా రేపటి (ఆగస్టు 23) నుంచి రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు మరింత మెరుగుపరుచుకోవాలని గిల్ సేన చూస్తోంది. మరోవైపు సిరీస్ సమం చేయాలంటే ఆతిథ్య శ్రీలంక తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి టెస్టులో దేవదత్ పడిక్కల్ (167), కేఎల్ రాహుల్ (82) అద్భుతంగా రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకే కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో లంక స్పిన్నర్లు ప్రభాత్ జయసూర్య, కేశర నువాంత రాణించి భారత్ 193 పరుగులకు పరిమితమైంది. 445 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 206 రన్స్‌కు ఆలౌట్ అయింది. రెండో టెస్టులో భారత బౌలింగ్ విభాగంలో ఒక మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ స్పిన్ మాయాజాలంతో లంకను దెబ్బకొట్టగా.. కుల్దీప్ యాదవ్ మాత్రం లయ అందుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం ఒకే వికెట్ తీశాడు. కుల్దీప్ను గిల్ కేవలం మూడో స్పిన్నర్‌గా చూస్తున్నట్లు అర్థమవుతోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుల్దీప్కు సపోర్ట్‌గా ఉన్నా.. ఇప్పటికే సిరీస్‌లో ఆధిక్యం ఉండటంతో అతనికి విశ్రాంతినిచ్చి ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌ను

ప్రస్తుతం చర్చంతా టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించే! శ్రీలంకతో తొలి టెస్టులో అతడికి అవకాశాలు ఇవ్వలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చర్చంతా టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించే! శ్రీలంకతో తొలి టెస్టులో అతడికి అవకాశాలు ఇవ్వలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. కుల్దీప్ యాదవ్‌ను పూర్తిగా నమ్మడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపాడు. ప్రస్తుతం అశ్విన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. తొలి టెస్టులో కుల్దీప్ 25 ఓవర్లు బౌలింగ్ చేసి 103 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న గాలే పిచ్‌పై కూడా అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే కుల్దీప్కు తగినంత బౌలింగ్ అవకాశాలు ఇవ్వకపోవడమే అతడి వైఫల్యానికి కారణమని అశ్విన్ పేర్కొన్నాడు. ‘జడేజా ఒక వైపు, సుతార్ మరోవైపు వికెట్లు తీస్తున్నారని అందరూ ప్రశ్నిస్తారు. కానీ కుల్దీప్ మూడో స్పిన్నర్. నేను, జడేజా ఆడుతున్నప్పుడు కూడా అతడు మూడో స్పిన్నర్‌గానే ఉండేవాడు. ఇప్పుడు కూడా పరిస్థితి మారలేదు. 11 మంది ఉన్న జట్టులో మూడో లేదా నాలుగో స్పిన్నర్‌గా ఉండటం అంత సులభం కాదు’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ‘కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు కుల్దీప్ యాదవ్ ప్రాధాన్యత కలిగిన బౌలర్ కాకపోవచ్చు. కుల్దీప్ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అతడు తన నైపుణ్యాన్ని కోల్పోయాడా? అంటే అస్సలు కాదు. చాలా కాలం తర్వాత మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో కూడా అతడిని సరిగ్గా ఉపయోగించలేదు. ఇది ఆటగాడి తప్పు కాదు. ఇది ప్లేయర్‌పై మేనేజ్మెంట్కు నమ్మకం లేదనడానికి ఒక సంకేతం. అతడికి

శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిల్.. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అదే అంశంపై సుదీర్ఘంగా సాధన చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిల్.. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అదే అంశంపై సుదీర్ఘంగా సాధన చేశాడు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో గిల్ రెండుసార్లు ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో ప్రారంభం కానుంది. ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కొనే సమయంలో బంతి లైన్‌ను పూర్తిగా కవర్ చేయడంలో గిల్ ఇబ్బంది పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు 42 మ్యాచ్‌లు ఆడిన గిల్‌ను లెఫ్టార్మ్ స్పిన్నర్లు ఏకంగా 11 సార్లు ఔట్ చేశారు. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ నెట్స్‌లో గిల్ ప్రత్యేకంగా లెఫ్టార్మ్ స్పిన్‌ను ఎదుర్కొన్నాడు. మానవ్ సుతార్, రవీంద్ర జడేజాతో పాటు స్థానిక బౌలర్ల బంతులను కూడా చాలాసేపు ఆడాడు. గిల్ సాధనపై టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే స్పందిస్తూ.. పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకునేందుకు గిల్ ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. ‘అతని ఆటలో సహజంగానే పరుగుల ప్రవాహం ఉంటుంది. పిచ్ పరిస్థితులు, బంతి వేగం, ఎలాంటి షాట్లు ఆడాలి, ఎలా డిఫెన్స్ చేయాలనే విషయాలను గమనిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా మారుతున్నాడు. ప్రతి ఇన్నింగ్స్‌లోనూ తన సహజ ఆటతీరునే

ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్ ఫైనల్ రేస్ ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. మొత్తం 27 టెస్ట్ సిరీస్‌లలో ఇంకా 15 సిరీస్‌లు మిగిలి ఉన్నాయి. 2027 జూన్ 9 నుంచి 13 వరకు లండన్‌లోని 'ద ఓవల్' లో జరగనున్న టైటిల్ పోరుపైనే అన్ని జట్లు కన్నేశాయి. గత రెండు సైకిళ్ల లెక్కలు చూస్తే, ఏ జట్టు అయినా ఫైనల్ చేరాలంటే కనీసం 60% నుంచి 65% పాయింట్ల శాతం సాధించాల్సి ఉంటుంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. గాలేలో జరిగిన మొదటి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ పాయింట్ల శాతంలో కాస్త మెరుగైంది. గత ఏడాది సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో సిరీస్ ఓడిపోవడంతో భారత్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి భారత్ దాదాపు అవుట్ అయినట్లే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు టీమిండియాకు మళ్లీ అవకాశం దక్కింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత జట్టు ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంకపై విజయం సాధించిన తర్వాత భారత్ పీసీటీలు పెగిగింది. ఇప్పటివరకు భారత్ మొత్తం 10 టెస్టులు ఆడింది. అందులో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 4 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా చేతిలో రెండు, ఇంగ్లాండ్ చేతిలో రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్‌కు ప్రస్తుతం శ్రీలంకతో ఆడాల్సిన రెండో టెస్టుతో కలిపి మొత్తం 8 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో భారత్ 2 టెస్టులు ఆడుతుంది. అనంతరం ఆస్ట్రేలియాతో స్వదేశంలో 5 టెస్టుల భారీ సిరీస్ ఆడాల్సి ఉంది. భారత్‌కు ఇప్పుడు ప్రతి మ్యాచ్ చాలా కీలకం. ఫైనల్ చేరేందుకు కావాల్సిన 60% PCT

Shubman Gill Comments on India Test Victory: తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 462 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు బిగించింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుత సెంచరీ నమోదు చేశాడు. అనంతరం బౌలింగ్‌లో స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని 284 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో లభించిన 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత్, రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైనా శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో లంక జట్టు 206 పరుగులకే కుప్పకూలడంతో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. పడిక్కల్ క్లాస్.. మానవ్ సుతార్ స్పిన్ మ్యాజిక్.. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ గిల్ మాట్లాడుతూ జట్టు ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్ మానవ్ సుతార్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అసాధారణ బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బతీశాడని, అతనికి భారత జట్టులో గొప్ప భవిష్యత్తు ఉందని కొనియాడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రత్యర్థి స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించిన పడిక్కల్ ఆటతీరు అమోఘమని గిల్ పేర్కొన్నాడు. పడిక్కల్ ఇలాంటి స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తే జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవడం సులువవుతుందని వివరించాడు. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? రెండో ఇన్నింగ్స్ వికెట్ల పతనంపై క్లారిటీ.. 600వ టెస్టు సంబరం.. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడంపై గిల్ వ్యూహాత్మక వివరణ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని కారణంగా ప్రత్యర్థి ముందు వీలైనంత వేగంగా 400 పైచిలుకు లక్ష్యం ఉంచాలనే ఆలోచనతోనే బ్యాటర్లు దూకుడుగా ఆడారని స్పష్టం చేశాడు. అప్పటికే మ్యాచ్ భారత్ నియంత్రణలోనే

SL vs IND 2nd Test: కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. గాలే టెస్టులో భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించి విజయాన్ని అందించడంతో టీమ్ మేనేజ్మెంట్ విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు మరో అవకాశం దక్కనుంది. అలాగే మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ తమ స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉంది. మ్యాచ్ డ్రా అయినా సిరీస్ భారత్ సొంతమవుతుంది కాబట్టి అదే జట్టుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బెంచ్‌కే పరిమితం కానున్న నలుగురు ఆటగాళ్లు.. విన్నింగ్ టీమ్‌ను యథాతథంగా కొనసాగిస్తే జట్టులోని నలుగురు కీలక ఆటగాళ్లు రెండో టెస్టులోనూ రిజర్వ్‌గా మిగిలిపోనున్నారు. బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్, పేసర్లు ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ మరోసారి బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. జట్టులోని ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో వీరికి తుది జట్టులో అవకాశం దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? తొలి టెస్టులో అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తమ స్పిన్ మ్యాజిక్‌తో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు. పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్ తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ వేగంతో రాణించనున్నారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

వన్డే వరల్డ్‌కప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి భారత జట్టు కూర్పుపై ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యయి. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం సీఎస్కే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించాడు. ఉతప్ప అందరిని ఆశ్చర్యపరుస్తూ తన వరల్డ్ కప్ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటిచ్చాడు. ప్రస్తుత వన్డే జట్టులో రోహిత్ శర్మకు బ్యాకప్‌గా ఉన్న యశస్వి జైశ్వాల్‌ను కాదని వైభవ్‌కు రాబిన్ ఛాన్స్ ఇచ్చాడు. 15 ఏళ్ల వైభవ్ ఇటీవల భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సిరీస్‌లో విఫలమైనప్పటికి తర్వాత జింబాబ్వే పర్యనటలో మాత్రం వైభవ్ ఇరగదీశాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు వచ్చే నెలలో జరగనున్న ఏషియన్ క్రీడలకు సన్నదమవుతున్నాడు. అయితే సూర్యవంశీ ఇప్పుడే వన్డే జట్టులోకి సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ కోసం ఇప్పటికే జైశ్వాల్, రుతురాజ్ వంటి యువ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వీరిలో ఎవరో ఒకరు ఆ స్దానాన్ని భర్తీ చేయనున్నారు. ఇక రాబిన్ ఉతప్ప తను ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లగా కేఎల్ రాహుల్‌తో పాటు సంజూ శాంసన్‌లకు అవకాశమిచ్చాడు. ఇషాన్ కిషన్‌కు బదలుగా సంజూను ఉతప్ప ఎంపిక చేశాడు. సంజూ చివరగా భారత్ తరపున మూడేళ్ల కిందట వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ జట్టులో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఉతప్ప ఎంపిక చేశాడు. అదేవిధంగా అందరి మాజీ క్రికెటర్లలానే రాబిన్ కూడా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో భువనేశ్వర్ అద్భుతంగా

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. అయితే, ఈ గెలుపు ఉత్సాహంలో ఉన్నప్పటికీ, జట్టు కూర్పుపై యాజమాన్యం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై అసంతృప్తితో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్.. కొలంబోలో జరగబోయే రెండో టెస్టుకు జట్టులో ఒక మార్పు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో కుల్దీప్ యాదవ్ తేలిపోయాడు. 25 ఓవర్లు బౌలింగ్ చేసి 103 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇదే మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ వంటి ఇతర లెఫ్టార్మ్ స్పిన్నర్లు అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో, కుల్దీప్ను పక్కనపెట్టి, అతడి స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సరాన్ష్ జైన్‌కు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం.తొలి టెస్టులో భారత్ ముగ్గురు లెఫ్టార్మ్ స్పిన్నర్లతో (జడేజా, సుతార్, కుల్దీప్) బరిలోకి దిగింది. అయితే శ్రీలంక జట్టులో ఉన్న ఎడమచేతి వాటం బ్యాటర్లను ఎదుర్కోవడానికి ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ఉంటే జట్టుకు వైవిధ్యం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే సరాన్ష్ జైన్‌ను సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇప్పుడు అతడిని తుది జట్టులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.అయితే, ఈ మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ దీనిపై స్పందిస్తూ

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అయినప్పటికీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకోలేకపోయింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో పట్టికలో భారత్ పరిస్థితి ఏమిటంటే... స్పోర్ట్స్ డెస్క్: గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 165 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక చివరి రోజు ఆటలో 206 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6/55తో చెలరేగిన సుతార్, మ్యాచ్ మొత్తంలో 10/131 వికెట్లు పడగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ భారీ విజయం సాధించినప్పటికీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరచుకోలేకపోయింది. గత వారం డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో, వారు నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుత డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇంకా 8 టెస్టులు మిగిలి ఉన్నాయి. ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా జరిగే రెండో టెస్టుతో పాటు, నవంబర్‌లో న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, తదుపరి స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆడిన 10 టెస్టుల్లో నాలుగింటిలో ఓటమి చవిచూసిన టీమిండియాకు ఇకపై ప్రతి మ్యాచ్ నాకౌట్ లాంటిదే. ఎలాంటి పెనాల్టీ పాయింట్లు లేకుంటే, భారత్ తన మిగిలిన 8 టెస్టుల్లో 7 గెలిస్తే 68.52 శాతంతో (PCT) మెరుగవుతుంది. ఒకవేళ 6 విజయాలు, 2 ఓటములు నమోదైతే ఆ శాతం 62.96కి పడిపోతుంది. ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూకట్పల్లి రైతుబజార్లో నేటి ధరల వివరాలివే.. ఇరాన్‌కి సహాయం చేస్తే.. ఆర్థిక మూల్యం తప్పదు: ట్రంప్


India vs Sri Lanka: భారత్ గాలే టెస్టులో 372 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. చివరి రోజు ఆతిథ్య జట్టు బ్యాటర్లు వికెట్లు కాపాడుకుంటూ భారత బౌలర్లకు గట్టి పరీక్ష పెట్టారు. దినుషా 84, ధనంజయ డి సిల్వా 59 పరుగులతో పోరాడారు. వీరిద్దరి మధ్య 95 పరుగుల భాగస్వామ్యం శ్రీలంకకు ఆశలు రేపింది. మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో గాలే పిచ్‌పై బ్యాటింగ్ అంత సులువు కాకపోవడంతో ప్రతి వికెట్ కోసం భారత్ శ్రమించాల్సి వచ్చింది. చివరికి భారత బౌలింగ్ లోతు ఫలించింది. మానవ్ సుతార్ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. సుతార్ ప్రదర్శన ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్ తరఫున శ్రీలంకపై టెస్టులో 10 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతడు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాల సరసన చేరాడు. శ్రీలంకలో భారత బౌలర్ అత్యుత్తమ మ్యాచ్ బౌలింగ్ గణాంకాల్లో సుతార్ 10/131తో అగ్రస్థానంలో నిలిచాడు. శుభ్‌మన్ గిల్ ఈ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, భారత్ తరఫున చాలా కాలం ఆడగల సామర్థ్యం అతడిలో కనిపిస్తోందని గిల్ పేర్కొన్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. దేవదత్ పాదిక్కల్ 167 పరుగులు చేయడం ఆ స్కోరుకు ప్రధాన బలంగా నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులకే పరిమితమైనా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా శ్రీలంక ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్‌లో పిచ్ ఐదో రోజు వరకు ఆటకు అనుకూలంగానే ఉన్నా, మూడో రోజు నుంచి స్పిన్‌కు ఎక్కువగా సహకరించింది. పాదిక్కల్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఎడమచేతి వాటం బ్యాటర్లకు ఎడమచేతి స్పిన్నర్లను ఎదుర్కోవడం కొంత సులభంగా అనిపించిందని చెప్పాడు. ఈ విజయంతో భారత్
గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 165 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు కుప్పకూలింది. మానవ్ సుతార్ ఐదు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. దీంతో రెండు మ్యాచుల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత బౌలర్లు మొదటి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే పరిమితం చేశారు. దీంతో 178 పరుగుల కీలకమైన ఆధిక్యాన్ని భారత్ సొంతం చేసుకుంది. తొలి రోజు నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. చివరి వరకూ అదే జోరు కొనసాగించింది.రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 193 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్‌తో కలిసి శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య శ్రీలంక.. 206 పరుగులకు కుప్పకూలింది. నాలుగో రోజే కీలక వికెట్లు కోల్పోయి భారీ ఓటమి దిశగా పయనించిన శ్రీలంక, ఆఖరి రోజున మిగిలిన వికెట్లను కూడా చకచకా సమర్పించుకుంది. దీంతో 165 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా స్పిన్నర్ మానవ్ సుతార్.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచులో అతడు 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.తన 600వ టెస్ట్ మ్యాచులో భారత్ ఘన విజయం సాధించి.. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్‌కు కీలకమైన 12 పాయింట్లు దక్కాయి. ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది
శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ రికార్డుల వేట కొనసాగించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఇదే సమయంలో ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 69 బంతుల్లో 66 పరుగులు సాధించి సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా అవతరించాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను పంత్ దాటేశాడు.మొదటి ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసిన పంత్, రెండో ఇన్నింగ్స్ 66 పరుగులతో కలిపి డబ్ల్యూటీసీలో తన మొత్తం పరుగుల సంఖ్యను 2,885కి చేర్చుకున్నాడు. గిల్ (2,867 పరుగులు) కంటే పంత్ ప్రస్తుతం 18 పరుగులు ముందంజలో ఉన్నాడు. గాలే టెస్టులో గిల్ కేవలం 16, 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇద్దరూ 41 డబ్ల్యూటీసీ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, పంత్ 73 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డు సాధించాడు. గిల్ మాత్రం ఇందుకు 75 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (2,716), రవీంద్ర జడేజా (2,632), విరాట్ కోహ్లీ (2,617) తదుపరి స్థానాల్లో ఉన్నారు.ఈ మ్యాచ్‌లోనే పంత్ మరొక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించాడు. రెండో ఇన్నింగ్స్‌లో లహిరు కుమార బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదడం ద్వారా టెస్ట్ క్రికెట్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన కేవలం నాలుగో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.డబ్ల్యూటీసీలో పంత్ ఇప్పటివరకు 6 సెంచరీలు, 17 అర్ధసెంచరీలు బాదాడు. ఇందులో అతడు అత్యుత్తమ స్కోరు 146 పరుగులు కాగా, సగటు 41.81గా ఉంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూటీసీ అత్యధిక పరుగుల రికార్డు ఇంగ్లాండ్ స్టార్ జో రూట్ (77 మ్యాచ్‌ల్లో 6,651 పరుగులు) పేరిట ఉంది. దీంతో ఎవరికీ అందనంత

IND VS SL: గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్ట్ ఐదో రోజు ఆటపై మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యే ఉదయం సమయంలోనే భారీ వర్షం కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరి రెండు సెషన్లలో వర్షం తీవ్రత కాస్త తగ్గినప్పటికీ, ఆకాశం నల్లటి మబ్బులతో నిండి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒకవేళ వర్షం తీవ్రమై మైదానం మైదాన సిబ్బంది నియంత్రణలోకి రాకపోతే, ఐదో రోజు ఆట మొత్తం నీటిపాలు కాక తప్పదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. టెస్ట్ క్రికెట్ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఐదో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా లేదా ఆట పూర్తి కాకుండా ఆగిపోతే, ఆ మ్యాచ్‌ను డ్రాగా ప్రకటిస్తారు. భారత్ గెలుపునకు ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ, లేదా తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల భారీ ఆధిక్యం సాధించినప్పటికీ అది పరిగణనలోకి తీసుకోరు. వికెట్లు లేదా పరుగులు మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఆట పూర్తవ్వకపోతే విజేతను ప్రకటించే అవకాశం ఐసీసీ నిబంధనల్లో లేదు. ఫలితంగా టీమిండియా విజయం సాధించే అవకాశాలు పూర్తిగా నీరుగారిపోతాయి. ఇది కూడా చదవండి: Watch: గాలే టెస్ట్‌లో తీవ్ర వివాదం.. ధ్రువ్ జురెల్ క్యాచ్‌పై సోషల్ మీడియాలో రచ్చ.. అసలు నిజమేంటి? చరిత్రలో లేని రికార్డును శ్రీలంక అందుకుంటుందా? గాలే మైదానంలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా 342 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేజ్ చేయలేదు. ఆ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉంది. సొంత మైదానంలో శ్రీలంక ఇప్పటివరకు 300 పరుగుల మార్కును కూడా విజయవంతంగా ఛేజ్ చేయలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో భారత్ నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం లంకకు అసాధ్యమనే చెప్పాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంక, గెలువడానికి ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది. ఇది

Manav Suthar Pitch Complaint: గాలే టెస్టులో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన భారీ ఆధిక్యం కారణంగా టీమిండియా ఇప్పుడు మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ క్రమంలో భారత రెండో ఇన్నింగ్స్ 193 పరుగులకే ముగిసింది. శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండటంతో పిచ్ పరిస్థితులు ఆ జట్టుకు కీలకంగా మారాయి. ఇలాంటి సమయంలో భారత ఆటగాడు మానవ్ సుతార్ చేసిన ఓ చర్యపై శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా అభ్యంతరం వ్యక్తం చేశాడు. సుతార్ ఒక పరుగు కోసం పరిగెత్తే సమయంలో పిచ్ మధ్య భాగంలో అడుగులు వేశాడని ధనంజయ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గాలే టెస్టులో కొత్త చర్చకు దారితీసింది. క్రికెట్లో బ్యాటర్లు సాధారణంగా హాఫ్ స్పైక్స్ ధరిస్తారు. పిచ్ మధ్యలో పరుగెత్తడం వల్ల వారి బూట్ల ముద్రలతో ఆ ప్రాంతం దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాంతో తర్వాత బ్యాటింగ్ చేసే ఆటగాళ్లకు పరిస్థితులు మరింత కఠినంగా మారవచ్చు. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..! శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్ ఆడాల్సి ఉండటంతోనే ధనంజయ ఈ విషయంపై అంపైర్ వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. మ్యాచ్‌లో పిచ్‌ను కావాలనే దెబ్బతీసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని అంపైర్లు పరిశీలిస్తారు. పిచ్‌ను దెబ్బతీసేలా బ్యాటర్ ప్రవర్తిస్తే అంపైర్ తొలుత హెచ్చరిక ఇస్తాడు. ఆ హెచ్చరిక మొత్తం ఇన్నింగ్స్‌కు వర్తిస్తుంది. ఆ తర్వాత అదే చర్య మళ్లీ జరిగితే, ఆ బంతికి వచ్చిన పరుగులను రద్దు చేసి ఫీల్డింగ్ జట్టుకు 5 అదనపు పరుగులు ఇచ్చే నిబంధన కూడా ఉంది. మ్యాచ్ పరిస్థితులు మాత్రం భారత్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. గాలేలో శ్రీలంక ఇప్పటివరకు నాలుగో ఇన్నింగ్స్‌లో 300 పరుగులు కూడా చేయలేదు

Shubman Gill:భారత టెస్ట్ జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శుభ్‌మన్ గిల్ ఆటగాడిగా నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. అయితే కెప్టెన్‌గా మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం తరచుగా విఫలమవుతున్నాడు. ప్రధానంగా డీఆర్ఎస్ (డిసిషన్ రివ్యూ సిస్టమ్) కోరే విషయంలో గిల్ నిర్ణయాలు జట్టును తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. మైదానంలో ఆవేశానికి లోనై లేదా బౌలర్ల ఒత్తిడికి తలొగ్గి రివ్యూలు కోరడం వల్ల విలువైన అవకాశాలు చేజారిపోతున్నాయి. గిల్ తన నాయకత్వ ప్రస్థానంలో ఇప్పటివరకు మొత్తం 41 సార్లు డీఆర్ఎస్ తీసుకున్నాడు. అందులో కేవలం 5 రివ్యూలు మాత్రమే అనుకూలంగా రావడం గమనార్హం. మిగిలిన 36 రివ్యూలు పూర్తిగా వ్యర్థమయ్యాయి. అంటే అతని డీఆర్ఎస్ సక్సెస్ రేటు అత్యంత ఘోరంగా ఉంది. శ్రీలంకతో జరుగుతున్న గాల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా 30వ ఓవర్, 35వ ఓవర్లలో గిల్ తీసుకున్న నిర్ణయాలు నిరాశనే మిగిల్చాయి. చెరొక సమీక్షను వృథా చేయడంతో మూడింట్లో రెండు రివ్యూలు చేజారాయి. బౌలర్లు, కీపర్ సలహాలు రివర్స్ అవుతున్నాయా? డీఆర్ఎస్ కోరే సమయంలో గిల్ ఒక్కడే నిర్ణయం తీసుకోడు. బౌలర్, వికెట్ కీపర్, స్లిప్ ఫీల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాడు. అయినా సరే ఫలితం మాత్రం ప్రతికూలంగానే వస్తోంది. మైదానంలో బౌలర్ల ఆత్రుతను అదుపు చేసి, కీపర్ ఇచ్చే స్పష్టమైన సమాచారాన్ని విశ్లేషించడంలో కెప్టెన్‌గా గిల్ విఫలమవుతున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఆవేశంతో కాకుండా స్పష్టత ఉన్నప్పుడు మాత్రమే రివ్యూలు కోరడం అలవాటు చేసుకోవాలి. మాజీ కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోని, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు డీఆర్ఎస్ కోరడంలో సిద్దహస్తులుగా పేరుగాంచారు. ధోని రివ్యూ తీసుకుంటే వికెట్ ఖాయం అనే నమ్మకం ఉండేది. ఇప్పుడు గిల్ కూడా వారి నుంచి ఆ వ్యూహాత్మక ఆలోచనలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కీలక సమయాల్లో రివ్యూలు మిగిలి ఉంటేనే మ్యాచ్ మలుపు తిరిగే అవకాశం ఉంటుంది. రాబోయే మ్యాచ్‌ల్లో గిల్ ఈ

Cheteshwar Pujara Test Batters: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు టెస్టు క్రికెట్ సీజన్ ఉత్సాహంగా సాగుతోంది. ఒకపక్క శ్రీలంక పర్యటనలో భారత జట్టు తమ సత్తా చాటుతుండగా.. మరో ఎండ్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు నడుస్తోంది. త్వరలో ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ తమ సిరీస్‌ను ప్రారంభించనుంది. సరిగ్గా ఇలాంటి బిజీ షెడ్యూల్ సమయంలో ప్రముఖ క్రీడా వెబ్సైట్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో క్రికెట్ పండితుడిగా మారిన ఛెతేశ్వర్ పుజారా పాల్గొన్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుత క్రికెట్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న టాప్-6 టెస్టు బ్యాటర్లకు బ్లైండ్ ర్యాంకింగ్ పద్ధతిలో ర్యాంకులు ఇవ్వాలని పుజారాను కోరారు. టీమిండియా తరపున వందకుపైగా టెస్టు మ్యాచ్‌లు ఆడిన పుజారాకు టెస్టు క్రికెట్ పట్ల ఉన్న అవగాహన అపారం. బ్లైండ్ ర్యాంకింగ్ విధానంలో ముందుగా ఆటగాళ్ల పేర్లు పూర్తిగా చెప్పరు. ఒక పేరు వచ్చినప్పుడు ఆరు స్థానాల్లో ఏదో ఒక ర్యాంక్ కేటాయించాలి. అలా తన వద్దకు వచ్చిన ఆరుగురు బ్యాటర్ల జాబితాలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ దేశాల నుంచి ఒక్కో ఆటగాడిని ఎంచుకున్నాడు. సొంత దేశం నుంచి కేవలం ఇద్దరికే తన జాబితాలో అవకాశం కల్పించాడు. స్టార్ ఆటగాళ్లకు షాక్.. రాహుల్, స్మిత్ ఔట్ పుజారా ముందుకు వచ్చిన ఆరుగురు ఆటగాళ్ల పేర్లు చూస్తే ఎవరికైనా కాస్త ఆశ్చర్యం కలగక మానదు. విదేశీ పిచ్‌లపై సైతం ఎంతో టెక్నికల్‌గా ఆడుతూ శతకాలు సాధించిన భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌కు ఈ జాబితాలో స్థానం లభించలేదు. సుదీర్ఘ ఫార్మాట్లో 4153 పరుగులు సాధించిన రాహుల్ పేరును పుజారా పరిగణనలోకి తీసుకోకపోవడం అభిమానులకు మింగుడుపడటం లేదు. అదే విధంగా ఆధునిక క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌కు కూడా తీవ్ర నిరాశే ఎదురైంది. యాక్టివ్ క్రికెటర్లలో జో రూట్ తర్వాత అత్యధిక పరుగుల (10878 పరుగులు) రికార్డు స్మిత్ పేరిటే ఉన్నప్పటికీ అతనికి జాబితాలో చోటు

Shubman Gill stunning catch : టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో అతడు తన అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. మ్యాచ్ మూడో రోజు ఆటలో భాగంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 17వ ఓవర్లో గిల్ సూపర్ ఫీల్డింగ్ చేశాడు. ఈ ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ వేయాడు. తొలి బంతిని లంక బ్యాటర్ కమిందు మెండీస్ షాట్ ఆడాడు. షార్ట్ ఎక్స్ట్రా కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో చక్కని క్యాచ్ అందుకున్నాడు. Left hand, full stretch, absolute stunner from Shubman Gill! 🥵 Watch #SLvIND, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket — Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026 గిల్ స్టన్నింగ్ క్యాచ్ చూసి తోటి ప్లేయర్లు, అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా.. కెప్టెనా.. మజాకానా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా.. గిల్ క్యాచ్ అందుకోవడంతో మెండీస్ 14 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో లంక జట్టు 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బ్యాటర్లలో దేవ్‌దత్ పడిక్కల్ (167) భారీ శతకంతో చెలరేగాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) హాఫ్ సెంచరీలు చేశారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య నాలుగు వికెట్లు తీశాడు. కేశర నువాంత మూడు వికెట్లు సాధించాడు. అసిథ ఫెర్నాండో రెండు వికెట్లు పడగొట్టాడు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Devdutt Padikkal Century: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీనియర్ ఆటగాడు దేవ్‌దత్త్ పడిక్కల్ శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అదరగొట్టాడు. తొలి రోజు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 288/2తో ఆటను ముగించింది. రీఎంట్రీతో పడిక్కల్ అద్భుతంగా ఆడి 131 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్ భారీగా దంచికొట్టినా రిటైర్డ్ ఔటవగా.. కెప్టెన్ శుభమన్ గిల్ తక్కువ స్కోర్ ఔటయి నిరాశపర్చాడు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రత్యర్థి గడ్డపై ఆడిన భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. 73 ఓవర్లు ఆడిన భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమవగా.. వర్షం అడ్డంకిగా నిలిచింది. పలుసార్లు వర్షం అంతరాయంతో మ్యాచ్‌కు బ్రేక్ ఇచ్చి మళ్లీ కొనసాగించారు. టాస్ గెలిచి భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుని తొలి రోజు ఆటను రెండు వికెట్లకు 288 పరుగులతో ముగించింది. రెండేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన దేవదత్ పడిక్కల్ అద్భుతంగా ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ 134 బంతుల్లో అద్భుత సెంచరీతో తన మొదటి అంతర్జాతీయ శతకాన్ని నమోదు చేశాడు. మొత్తం 178 బంతులు ఆడిన దేవదత్ 131 పరుగులు చేయగా.. 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అదరగొట్టాడు. సాయిసుదర్శన్ గాయం కారణంగా లంకతో సిరీస్‌కు పడిక్కల్‌కు జట్టులో స్థానం లభించింది. చాలాకాలం తర్వాత తనకు లభించిన అవకాశాన్ని పడిక్కల్ సద్వినియోగం చేసుకున్నాడు. ఓపెనర్‌గా దిగిన యశస్వి జైస్వాల్ 37 బంతుల్లో 32 పరుగులు చేయగా.. వాటిలో ఐదు ఫోర్లు ఉన్నాయి. స్టార్


శ్రీలంక పర్యటనలో భాగంగా గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం ప్రారంభమైన ఈ పోరు భారత క్రికెట్ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. భారత జట్టు ఆడుతున్న 600వ టెస్టు మ్యాచ్ కావడంతో పాటు గాలే వేదికగా ఇది 50వ మ్యాచ్ కావడం విశేషం. భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభసమయంలో ఈ చారిత్రాత్మక మైలురాయి మ్యాచ్ ప్రారంభం కావడంతో అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. భారత జట్టు వ్యూహాత్మకంగా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగింది. తుది జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కకపోగా, మేనేజ్మెంట్ ధ్రువ్ జురెల్‌ను బ్యాటర్‌గా ఎంపిక చేసింది. రిషభ్ పంత్ వికెట్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, గాయపడిన సాయి సుధర్శన్ స్థానంలో స్క్వాడ్‌లోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. అఫ్గానిస్థాన్‌తో ఆడిన మ్యాచ్ కాంబినేషన్‌ను దాదాపుగా కొనసాగిస్తూ కెప్టెన్ గిల్ నిర్ణయం తీసుకున్నాడు. టాస్ గెలిచిన అనంతరం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, వాతావరణం కూడా బాగుండటంతో స్పష్టమైన ప్రణాళికతో బరిలోకి దిగుతున్నట్లు గిల్ వెల్లడించాడు. ఇదిలా ఉండగా గాలే పిచ్‌పై ప్రారంభంలో పేసర్లకు కొంత సీమ్ దక్కే అవకాశం ఉన్నప్పటికీ, సమయం గడిచేకొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలించి ఆ తర్వాత స్పిన్‌కు సహకరిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్‌లతో కూడిన భారత స్పిన్ విభాగానికి మ్యాచ్ పురోగమించే కొద్దీ కీలక బాధ్యతలు పడనున్నాయి. మరోవైపు శ్రీలంక జట్టు 25 ఏళ్ల ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ కేశర నువాంతకు అరంగేట్రం చేసే అవకాశం కల్పించింది. ఫలితంగా వార్మప్ మ్యాచ్‌లో చూపించిన ప్రతిభ ఆధారంగా అతడు తుది జట్టులోకి రాగా, నిరోషన్ డిక్వెల్లా 3 ఏళ్ల తర్వాత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. గాయపడిన పథుమ్

భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గాలే వేదికగా నేడు తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ పలు చారిత్రక మైలురాళ్లకు వేదికగా నిలవడం విశేషం. భారత క్రికెట్ జట్టుకు ఇది 600వ టెస్ట్ మ్యాచ్ కాగా, ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. అదే సమయంలో ఆసియా ఖండంలో 50 టెస్ట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన తొలి స్టేడియంగా గాలే అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ రికార్డులకెక్కింది.ఈ సిరీస్ ఇరు జట్లకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో నిలిచేందుకు అత్యంత కీలకం. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 4 విజయాలు, 4 పరాజయాలు, ఒక డ్రాతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫైనల్స్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఇరు జట్లు 2-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.టాస్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. "మేం ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం" అని తెలిపాడు. శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా మాట్లాడుతూ.. "టాస్ గెలిస్తే మేం కూడా బ్యాటింగే ఎంచుకునేవాళ్లం. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు

IND vs SL : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమైంది. గాలె వేదికగా నేడు (శనివారం) తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 'మేము ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాము. పిచ్, వాతావరణం రెండూ బాగున్నట్లు కనిపిస్తున్నాయి. కాబట్టి మాకు ఇది ఒక మంచి క్రికెట్ రోజు అవుతుందని ఆశిస్తున్నాము. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే మేము బరిలోకి దిగుతున్నాము. ఐదుగురు బౌలర్లు.. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం. దేశానికి నాయకత్వం వహించే అవకాశం లభించడం ఎప్పుడూ గొప్ప గౌరవమే, కానీ ఈ సందర్భం మరింత ప్రత్యేకమైనది. ఇది మా స్వాతంత్వ దినోత్సవం, మా 600వ టెస్ట్ మ్యాచ్ కూడా.. కాబట్టి దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.' అని టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. IND vs SL : శనివారం నుంచే భారత్ వర్సెస్ శ్రీలంక టెస్టు మ్యాచ్.. జియో హాట్‌స్టార్, స్టార్స్పోర్ట్స్లలో రానే రాదు.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే? 'టాస్ గెలిచి ఉంటే మేము కూడా బ్యాటింగ్ చేసేవాళ్లం. పిచ్ చాలా పొడిగా కూడా ఉంది. పాతుమ్ నిస్సాంక స్థానంలో నిషాన్ మదుష్క జట్టులోకి వచ్చాడు, నిరోషన్ డిక్వెల్లా వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతాడు, అలాగే కేశర ఈ రోజు అరంగేట్రం చేయబోతున్నాడు. జట్టులో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లు, నాతో పాటు సోనాల్ దినూషతో కలిపి ఇద్దరు ఆల్-రౌండర్లు ఉన్నారు. గాలేలో ఇది మాకు 50వ టెస్ట్ మ్యాచ్. ఈ టెస్ట్ మ్యాచ్‌లో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది.' అని శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా అన్నాడు. శ్రీలంక తుది జట్టు.. లహిరు ఉదరా, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి

IND vs SL : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమైంది. గాలె వేదికగా నేడు (శనివారం) తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 'మేము ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాము. పిచ్, వాతావరణం రెండూ బాగున్నట్లు కనిపిస్తున్నాయి. కాబట్టి మాకు ఇది ఒక మంచి క్రికెట్ రోజు అవుతుందని ఆశిస్తున్నాము. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే మేము బరిలోకి దిగుతున్నాము. ఐదుగురు బౌలర్లు.. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం. దేశానికి నాయకత్వం వహించే అవకాశం లభించడం ఎప్పుడూ గొప్ప గౌరవమే, కానీ ఈ సందర్భం మరింత ప్రత్యేకమైనది. ఇది మా స్వాతంత్వ దినోత్సవం, మా 600వ టెస్ట్ మ్యాచ్ కూడా.. కాబట్టి దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.' అని టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. IND vs SL : శనివారం నుంచే భారత్ వర్సెస్ శ్రీలంక టెస్టు మ్యాచ్.. జియో హాట్‌స్టార్, స్టార్స్పోర్ట్స్లలో రానే రాదు.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే? 'టాస్ గెలిచి ఉంటే మేము కూడా బ్యాటింగ్ చేసేవాళ్లం. పిచ్ చాలా పొడిగా కూడా ఉంది. పాతుమ్ నిస్సాంక స్థానంలో నిషాన్ మదుష్క జట్టులోకి వచ్చాడు, నిరోషన్ డిక్వెల్లా వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతాడు, అలాగే కేశర ఈ రోజు అరంగేట్రం చేయబోతున్నాడు. జట్టులో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లు, నాతో పాటు సోనాల్ దినూషతో కలిపి ఇద్దరు ఆల్-రౌండర్లు ఉన్నారు. గాలేలో ఇది మాకు 50వ టెస్ట్ మ్యాచ్. ఈ టెస్ట్ మ్యాచ్‌లో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది.' అని శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా అన్నాడు. శ్రీలంక తుది జట్టు.. లహిరు ఉదరా, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి

భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టులో అతను పలు అరుదైన రికార్డుల ముంగిట నిలిచాడు. ముఖ్యంగా ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్‌కూ సాధ్యం కాని ఒక చారిత్రక ఘనతను అందుకునేందుకు కేవలం 50 పరుగుల దూరంలో ఉన్నాడు.శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో గిల్ 50 పరుగులు చేస్తే, ఒకే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో గిల్ ఖాతాలో 950 పరుగులు ఉన్నాయి. గతంలో 2019-21 సైకిల్లో విరాట్ కోహ్లీ 944 పరుగులతో ఈ ఘనతకు అత్యంత చేరువగా వచ్చాడు. యశస్వి జైస్వాల్, అజింక్య రహానే, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు గతంలో ఒకే డబ్ల్యూటీసీ సైకిల్లో 1000కి పైగా పరుగులు చేసినప్పటికీ, వారు ఆ సమయంలో పూర్తిస్థాయి కెప్టెన్లుగా లేరు.ఇవే కాకుండా గిల్ మరో రెండు మైలురాళ్లపై కన్నేశాడు. టెస్ట్ క్రికెట్లో 3,000 పరుగుల క్లబ్లో చేరడానికి అతనికి కేవలం 31 పరుగులు అవసరం. అలాగే, డబ్ల్యూటీసీ చరిత్రలో మొత్తంగా 3,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచేందుకు 157 పరుగులు చేయాల్సి ఉంది.ఈ చారిత్రక మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో గిల్ మాట్లాడాడు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు, భారత్ ఆడుతున్న 600వ టెస్టుకు నాయకత్వం వహించడం ఎంతో ప్రత్యేకమని అన్నాడు. "దేశం తరఫున ఏ టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినా

India Playing XI: ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లు.. తొలి టెస్టుకు భారత్ తుది జట్టు ఇదే! ఈ వార్తకు సంబంధించిన

శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య శనివారం నుంచి గాలెలో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, యంగ్‌స్టర్స్‌తో కూడిన టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో గాలె టెస్ట్ కోసం భారత్ అంచనా తుది జట్టు ఎలా ఉండబోతుందో వివరంగా చూద్దాం. టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ టెస్ట్ ఫార్మాట్లో ఓపెనర్‌గా కొనసాగనున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రాహుల్ సెంచరీ సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతనికి జోడీగా రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. యశస్వికి ఇది తొలి శ్రీలంక పర్యటన కావడం విశేషం. గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దేవదత్ పడిక్కల్ నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. కొలంబోలో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో పడిక్కల్ 142 పరుగులు చేసి అద్భుత ఫామ్‌ను ప్రదర్శించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కూడా ఇది తొలి శ్రీలంక టూర్. గిల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో తన 3000 పరుగులను పూర్తి చేసుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు వైస్ కెప్టెన్సీ కోల్పోయిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, తన బ్యాటింగ్‌పైనే పూర్తి దృష్టి పెట్టి ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను పక్కనబెట్టి రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్‌ను నంబర్ 6 స్థానంలో కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ముల్లాన్‌పూర్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కి విశ్రాంతి తీసుకున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి తుది జట్టులోకి వస్తున్నాడు. అతనికి తోడుగా గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ రెండో స్పిన్-బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఆడనున్నాడు. సుతార్ అఫ్గానిస్తాన్‌పై తన అరంగేట్రం మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. లక్నో సూపర్‌జెయింట్స్ చైనామన్ బౌలర్ కుల్దీప్

Dhananjaya De Silva Warning to Team India: ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా భారత జట్టుతో జరగనున్న మొదటి టెస్టుకు ముందే శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వ సంచలన వ్యాఖ్యలతో టీమిండియా ప్లేయర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. స్వదేశంలో సిరీస్‌లు కోల్పోయి గాయపడ్డ సింహాల్లా ఉన్న భారత్‌ను స్పిన్ పిచ్‌లపై ఎదుర్కోవడం తమకు మరింత సులువవుతుందని, గాలే మైదానంలో ప్రత్యర్థి బ్యాటర్ల పనిపట్టేందుకు తమ వద్ద పవర్ ఫుల్ స్పిన్ ఆయుధం ఉందంటూ సవాల్ విసిరారు. ఆగస్టు 15 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్ ప్రారంభం కాబోతోంది. గత కొంతకాలంగా రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న శ్రేయాస్, శుభ్‌మన్ గిల్ సేనకు ఈ పర్యటన నిజంగానే పెద్ద పరీక్ష కానుంది. ఈ క్రమంలో శ్రీలంక సారథి ధనంజయ డి సిల్వ మ్యాచ్ ప్రారంభానికి రెండే రోజుల ముందు భారత జట్టును మానసికంగా దెబ్బతీసేందుకు మైండ్ గేమ్స్ మొదలుపెట్టారు. స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌లు ఓడిపోయిన టీమిండియా ఇప్పుడు పగ తీర్చుకోవాలనే ఆరాటంలో ఉంటుందని, అయితే గాలే వేదికగా తమకున్న ఘనమైన రికార్డులే తమను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎక్కువమంది చదివింది: Video: ట్రావిస్ హెడ్‌కి అసలైన మొగుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా.. సొంతగడ్డపై దిమ్మతిరిగే షాక్..! ఈ పోరులో భారత బ్యాటర్లను కట్టడి చేయడానికి తమ వద్ద ఉన్న అతిపెద్ద ఆయుధం ప్రభాత్ జయసూర్య అని డి సిల్వ స్పష్టం చేశారు. గాలే పిచ్ పై ప్రభాత్‌కు ఉన్న అనుభవం, లెక్కల పరంగా ఉన్న గణాంకాలు లంకకు కొండంత బలాన్ని ఇస్తున్నాయని చెప్పారు. ఇక్కడ అనేక విదేశీ జట్లను ప్రభాత్ తన గిరగిరా తిరిగే స్పిన్ బంతులతో తిప్పలు పెట్టాడని, భారత జట్టుకు కూడా ఇది మినహాయింపు కాదని హెచ్చరించారు. అంతేకాకుండా టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా

Head Coach Gautam Gambhir: వరుస పరాజయాలతో భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలపాలవుతున్నారు. విదేశీ పర్యటనల్లో ఘోర వైఫల్యాలు, టెస్టుల్లో పేలవమైన ప్రదర్శనతో ఆయనను తొలగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రస్తుతానికి ఆయనకు ఊరటనిచ్చేలా ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది. టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ ప్రయాణం అసలు ముళ్లబాటలా సాగుతోంది. ఇటీవలి ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో జట్టు ఘోరంగా విఫలం కావడం ఆయన రికార్డుపై పెద్ద మచ్చగా మిగిలిపోయింది. దీనికి తోడు స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర టెస్టు పరాజయాలు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. సోషల్ మీడియాలో గంభీర్‌ను వెంటనే కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరుకోవడమే ఇప్పుడు భారత జట్టుకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి గంభీర్ కోచ్ కుర్చీకి ఎలాంటి ముప్పు లేదని కథనాలు వెలువడుతున్నాయి. గంభీర్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, భారత రెడ్ బాల్ క్రికెట్ ప్రస్తుతం ఒక పెద్ద మార్పుల దశ గుండా వెళ్తోందనే నిజాన్ని బీసీసీఐ గుర్తించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి దిగ్గజాలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత జట్టు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఒక కొత్త తరం జట్టు రూపుదిద్దుకుంటోంది. ఈ మార్పుల సమయంలో ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండవని, కొత్త ఆటగాళ్లకు కొంత సమయం ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఈ పరాజయాలకు కేవలం కోచ్‌ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదనే అభిప్రాయం బోర్డులో వ్యక్తమవుతోంది. రెండో ముఖ్యమైన అంశం ఆటగాళ్లను వేధిస్తున్న

శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆగస్టు 5న లంక గడ్డపై అడుగుపెట్టింది. ఆగస్టు 7 నుంచి మూడు రోజుల పాటు కొలంబో వేదికగా లంక ఎలెవెన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడిన టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. వార్మప్ మ్యాచ్ ఇచ్చిన విజయం జోష్‌తో టీమిండియా తొలి టెస్టు ఆడేందుకు గాలేలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గాలే ఎయిర్‌పోర్టు నుంచి టీమిండియా ఆటగాళ్లు బయటికి వస్తున్న ఫొటోలను బీసీసీఐ బుధవారం ఎక్స్ వేదికగా పంచుకుంది. జడేజా, పంత్, జైస్వాల్, సిరాజ్, సర్ఫరాజ్ ఖాన్ సహా ఇతర ఆటగాళ్లు, కోచ్ గంభీర్ కనిపించారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో గాలే స్టేడియం సమీపంలోని హోటల్‌కు చేరుకున్నారు. బుధవారం విశ్రాంతి తీసుకోనున్న గిల్ సేన గురువారం ప్రాక్టీస్ చేయనుంది. శనివారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. దంచికొట్టిన వాన.. అయితే గాలేలో వాతావరణం రెండు రోజుల నుంచి చల్లగానే ఉంది. సోమవారం నుంచి మేఘావృతమై ఉన్న గాలేలో మంగళవారం వాన దంచికొట్టింది. రాబోయే రెండు, మూడు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉండడంతో తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ టెస్టు సిరీస్ రెండు జట్లకు కీలకమే. 2027లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్‌లో విజయం తప్పనిసరి. ఒక్క మ్యాచ్ రద్దయినా అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక ఆరో స్థానంలో కొనసాగుతోంది. కోహ్లి కెప్టెన్సీలో ఘన విజయం గాలేలో గతంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. 2017లో కోహ్లి కెప్టెన్సీలో గాలే వేదికగా శ్రీలంకతో ఆడిన టెస్టులో ఇన్నింగ్స్ 304 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 600 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ (190), పుజారా (153) సెంచరీలతో చెలరేగారు. లంక తమ తొలి

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై నెలకొన్న ఉత్కంఠకు మరో కొత్త మలుపు తోడైంది. ముంబై ఇండియన్స్‌ను వీడాలని నిర్ణయించుకున్న అతడు, 2027 సీజన్‌కు ముందు తన పాత ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే, కెప్టెన్సీ పగ్గాలు తనకే ఇవ్వాలనే షరతు పెట్టడంతో ఈ డీల్ ముందుకు సాగలేదని తెలుస్తోంది. దీంతో అతని భవిష్యత్తు మరింత సంక్లిష్టంగా మారింది.'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రకారం.. పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు గుజరాత్ ఫ్రాంచైజీ తొలుత సుముఖంగానే ఉంది. ఈ విషయాన్ని ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో చర్చించగా, అతడు కూడా తన అంగీకరించాడు. కానీ, జట్టులోకి రావాలంటే కెప్టెన్సీ తనకే ఇవ్వాలని హార్దిక్ షరతు విధించడంతో నిర్ణయాధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి 'నో' చెప్పినట్లు సమాచారం."అతడు తిరిగి రావడానికి ఫ్రాంచైజీకి ఎలాంటి అభ్యంతరం లేదు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తోనూ చర్చించాం, అతను కూడా సరే అన్నాడు. కానీ, కెప్టెన్సీ షరతు పెట్టడంతో అందరూ వద్దన్నారు" అని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపినట్లు సదరు పత్రిక పేర్కొంది.అయితే, ఈ విషయంపై హార్దిక్ పాండ్యా ప్రతినిధిని సంప్రదించగా, అతడు భిన్నమైన వాదన వినిపించాడు. హార్దిక్ ఏ ఫ్రాంచైజీతోనూ నేరుగా బదిలీ లేదా ట్రేడ్ గురించి చర్చలు జరపలేదని స్పష్టం చేశాడు. ఏవైనా సంప్రదింపులు జరిగితే, అవి ముంబై ఇండియన్స్ ద్వారానే జరుగుతాయని తెలిపాడు. ప్రస్తుతం హార్దిక్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కూడా ట్రేడింగ్ కోసం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.హార్దిక్

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ టెస్టు పోరు మొదలుకాబోతోంది. ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా, టీమిండియా దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఒక టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్తోంది. గత తొమ్మిదేళ్లలో భారత జట్టు స్వరూపమే మారిపోయినప్పటికీ, 2017లో జరిగిన టెస్టు సిరీస్ మాత్రం భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది. ఆ సిరీస్‌లో విరాట్ కోహ్లీ సాధించిన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. 2017-18లో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్‌తో విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 5 ఇన్నింగ్స్‌ల్లోనే ఏకంగా 610 రన్స్ సాధించి రికార్డు సృష్టించాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాధించి పరుగుల వరద పారించాడు. ఆ సమయంలో కోహ్లీ 1997 సిరీస్‌లో 571 రన్స్ చేసి రికార్డు నెలకొల్పిన లంక దిగ్గజం సనత్ జయసూర్య 20 ఏళ్ల నాటి రికార్డును తుడిచిపెట్టేశాడు. అంతేకాకుండా ఒకే సిరీస్‌లో అత్యధికంగా 3 సెంచరీలు చేసిన అరవింద డిసిల్వా రికార్డును కూడా కోహ్లీ సమం చేశాడు. రాబోయే భారత్-శ్రీలంక టెస్టు సిరీస్‌లో కేవలం 2 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే జరగనున్నాయి. అంటే ఒక బ్యాటర్‌కు గరిష్టంగా లభించేది 4 ఇన్నింగ్స్‌లు మాత్రమే. అంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ సాధించిన 610 పరుగుల భారీ లక్ష్యాన్ని అధిగమించడం ఏ ఆటగాడికీ సులభమైన విషయం కాదు. అయితే టీమిండియా యువ సంచలనాలు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఫామ్‌లో ఉన్నందున వారిపై అందరి దృష్టి నెలకొంది. భారత్-శ్రీలంక సిరీస్‌లో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో కోహ్లీ (610) అగ్రస్థానంలో ఉండగా, జయసూర్య (571), సెహ్వాగ్ (491), సంగక్కర (467), రాహుల్ ద్రవిడ్ (433) తరువాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆడుతున్న

Sri Lanka vs India: భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆగస్టు 15, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్ మ్యాచ్ గాల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక పరంగా ఈ సిరీస్ రెండు జట్లకు చాలా కీలకమైనది. ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే జట్టు టాప్-4 లోకి ప్రవేశించే అవకాశం ఉంది. పేపర్ పైన టీమిండియా బలంగా కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుత జట్టులో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. భారత టెస్ట్ స్క్వాడ్‌లోని 15 మంది ఆటగాళ్లలో ఏకంగా 12 మందికి శ్రీలంకలో ఎప్పుడూ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడిన అనుభవం లేదు. కొంతమంది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కూడా శ్రీలంక గడ్డపై టెస్ట్ ఆడిన అనుభవం లేదు. 50 టెస్టులు పూర్తి చేసుకున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా ఇప్పటివరకు శ్రీలంకలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. పంత్ తన కెరీర్లో భారత్ తర్వాత అత్యధికంగా ఇంగ్లాండ్ (13), ఆస్ట్రేలియా (12)లలో టెస్టులు ఆడారు. లంకలో టెస్టులు ఆడిన ఆ ముగ్గురు ఆటగాళ్లు వీరే ప్రస్తుత భారత స్క్వాడ్‌లో కేవలం ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే శ్రీలంకలో టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మాత్రమే గతంలో లంకలో టెస్టులు ఆడారు. కేఎల్ రాహుల్: శ్రీలంకలో 5 టెస్టులు ఆడి, 8 ఇన్నింగ్స్‌లలో 268 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రవీంద్ర జడేజా: 2 టెస్టుల్లో 2 ఇన్నింగ్స్‌లు ఆడి 85 పరుగులు (ఒక నాటౌట్ 70) చేశాడు. అలాగే 4 ఇన్నింగ్స్‌లలో 13 వికెట్లు తీశాడు (ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన సహా)

భారత క్రికెట్ చరిత్రలో మరో అరుదైన అధ్యాయం ఆవిష్కృతం కానుంది. 2026 ఆగస్టు 15న, దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ టీమిండియా చారిత్రక 600వ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకతో గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌తో భారత టెస్ట్ క్రికెట్లో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత్ ఈ చారిత్రక టెస్ట్ బరిలో దిగనుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తర్వాత భారత్ 600 టెస్టులు ఆడిన జట్ల జాబితాలో ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ ప్రత్యేక జాబితాలో చేరనుంది. అలాగే 600 టెస్టుల మైలురాయిని తాకిన తొలి ఆసియా దేశంగానూ భారత్ చరిత్ర సృష్టించనుంది. టెస్ట్ క్రికెట్లో భారత ప్రస్థానం 1932లో ప్రారంభమైంది. అప్పటి నుంచి 94 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత క్రికెట్ ఎన్నో మలుపులు, మరపురాని విజయాలు, దిగ్గజ ఆటగాళ్లను చూసింది. 1932లో మొదలైన ప్రయాణం భారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌ను 1932 జూన్ 25న ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో ఆడింది. సీకే నాయుడు నాయకత్వంలో ప్రారంభమైన ఆ ప్రయాణం ఇప్పుడు 600వ మ్యాచ్‌కు చేరుకుంది. భారత్ టెస్ట్ ప్రస్థానంలోని ముఖ్యమైన మైలురాళ్లు ఇవే: 1వ టెస్ట్: 1932, ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో కెప్టెన్: సీకే నాయుడు 100వ టెస్ట్: 1967, ఆస్ట్రేలియాతో కెప్టెన్: మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 200వ టెస్ట్: 1982, పాకిస్థాన్‌తో కెప్టెన్: సునీల్ గవాస్కర్ 500వ టెస్ట్: 2016, న్యూజిలాండ్‌తో కెప్టెన్: విరాట్ కోహ్లీ 600వ టెస్ట్: 2026, శ్రీలంకతో కెప్టెన్: శుభ్‌మన్ గిల్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున చారిత్రక ఘట్టం ఆగస్టు 15.. భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. అదే రోజున టీమిండియా తన 600వ టెస్ట్ మ్యాచ్ ఆడటం ఈ ఘట్టానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తోంది. 1932లో సీకే నాయుడు నాయకత్వంలో మొదలైన భారత టెస్ట్ ప్రయాణం.. పటౌడీ, గవాస్కర్, కపిల్ దేవ్

IND vs SL: శ్రీలంకతో జరగనున్న ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు మేనేజ్మెంట్కు పెద్ద చిక్కు వచ్చి పడింది. గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో ముంబై డాషింగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అనూహ్యంగా జట్టులోకి తిరిగొచ్చాడు. అతడి రాకతో తుది జట్టులో ఎవరిని ఆడించాలో తెలియక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర గందరగోళంలో పడిపోయారు. సాయి సుదర్శన్ గాయం.. సర్ఫరాజ్‌కు అనూహ్య పిలుపు! శ్రీలంక పర్యటన ప్రారంభానికి ముందే టీమిండియాను గాయాల సమస్య వేధించడం మొదలైంది. భారత్ 'ఏ' పర్యటనలో బొటనవేలికి తగిలిన తీవ్ర గాయం నుంచి యంగ్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఇంకా కోలుకోలేదు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం అతడికి మరికొంత కాలం విశ్రాంతి అవసరమని స్పష్టం చేసింది. దీంతో సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ సారథ్యంలోని బృందం అనుభవజ్ఞుడైన సర్ఫరాజ్ ఖాన్‌ను సాయి సుదర్శన్ స్థానంలో ఎంపిక చేసింది. కొన్నాళ్లుగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సర్ఫరాజ్, ఈ అనూహ్య పిలుపుతో కొలంబో చేరుకుని జట్టుతో కలవనున్నాడు. కొలంబో నుంచి మొదటి టెస్టు వేదిక అయిన గాలేకు భారత ఆటగాళ్లు చేరుకుంటారు. ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే? సర్ఫరాజ్ ఖాన్ రీఎంట్రీ జట్టుకు కొండంత బలాన్ని ఇచ్చినప్పటికీ, తుది పదకొండు మందిని ఖరారు చేసే విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో లభించిన పరిమిత అవకాశాల్లోనే సర్ఫరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్‌పై సాధించిన శతకం సహా టెస్టుల్లో ముప్పై ఏడుకి పైగా సగటుతో ఆకట్టుకున్నాడు. మధ్య వరుసలో స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల నైపుణ్యం అతడి సొంతం. అయితే ప్రస్తుతం జట్టులో నాలుగు, ఐదు స్థానాల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా

టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ షేర్- ఈ- పంజాబ్ టీ20 కప్ 2026 టోర్నీలో భాగం కానున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టీ20 లీగ్‌కు సంబంధించి ఆదివారం ఆటగాళ్ల వేలం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా అభిషేక్ శర్మ ఇందులో టీమిండియా టీ20 సూపర్‌స్టార్ అభిషేక్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అమృత్సర్ సుర్మాస్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఆ ఫ్రాంఛైజీ అధికారులతో కలిసి వేలంలో పాల్గొన్నాడు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆరు ఫ్రాంఛైజీలు కాగా ఈ లీగ్‌లో ఆరు ఫ్రాంఛైజీలు ఫజిల్క ఫాల్కన్స్, అమృత్సర్ సుర్మాస్, లుథియానా లయన్స్, భటిండా రాయల్స్, జలంధర్ వారియర్స్, మొహాలీ కింగ్స్ టైటిల్ కోసం రంగంలోకి దిగనున్నాయి. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడే ఇదిలా ఉంటే.. షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ లీగ్ 2026 సీజన్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా సన్వీర్ సింగ్ నిలిచాడు. ఫజిల్క ఫాల్కన్స్ రూ. 13.02 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ గతంలో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (2023, 2024)కు ఆడాడు. ఐపీఎల్లో మొత్తంగా ఆరు మ్యాచ్‌లు ఆడిన 29 ఏళ్ల సన్వీర్ 25 పరుగులు చేశాడు. టీమిండియా ప్లేయర్ల ధర ఎంతంటే? టీమిండియా స్టార్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఫజిల్క ఫాల్కన్స్, అభిషేక్ శర్మను అమృత్సర్ సుర్మాస్, అర్ష్‌దీప్ సింగ్‌ను లుథియానా లయన్స్, గుర్నూర్ బ్రార్‌ను భటిండా రాయల్స్ సొంతం చేసుకున్నాయి.ఇక ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను జలంధర్ వారియర్స్, రమణ్‌దీప్ సింగ్‌ను మొహాలీ కింగ్స్ కొనుక్కున్నాయి. వీరందరిని ఆయా ఫ్రాంఛైజీలు రూ. 10 లక్షల ధరకు రిజర్వు చేసుకున్నాయి. షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ వేలం-2026లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే 1. సన్వీర్ సింగ్ (ఫజిల్క ఫాల్కన్స్)- రూ. 13.02 లక్షలు 2

Mohammed Siraj Consecutive Sixes Video: శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన ఆల్‌రౌండ్ విన్యాసాలతో అదరగొట్టాడు. చివరి ఓవర్లో గెలవడానికి 16 పరుగులు కావాల్సిన దశలో వరుసగా మూడు భారీ సిక్సర్లు బాది భారత్‌కు ఊహించని విజయాన్ని అందించాడు. కేవలం 15 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 1 ఫోర్‌తో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మైదానంలో బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టే మహమ్మద్ సిరాజ్, ఈసారి బ్యాట్‌తో ప్రతి ప్రత్యర్థి బౌలర్‌కు చుక్కలు చూపించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఆఖరి ఘట్టానికి చేరుకునేసరికి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆఖరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరమైన సమయంలో సిరాజ్ క్రీజులో ఉన్నాడు. కెషార నువంత వేసిన ఆ ఓవర్లో మొదటి బంతి నుంచి తన పవర్ హిట్టింగ్ రుచి చూపించాడు. వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు. ఎక్కువమంది చదివింది: టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే మొనగాళ్లు.. ఒక్క ఓవర్లోనే బీభత్సం.. మనోడి రికార్డ్ బద్దలవ్వడం కష్టమే సిరాజ్ ఆడిన ధనాధన్ ఇన్నింగ్స్ చూసి శ్రీలంక ప్లేయర్లు ఆశ్చర్యపోయారు. అసలు ఒక ఫాస్ట్ బౌలర్ ఇంతటి క్లీన్ హిట్టింగ్ ఎలా చేయగలిగాడో అర్థం కాక మ్యాచ్ పూర్తయ్యాక అతని బ్యాట్‌ను దగ్గరుండి పరిశీలించారు. సిరాజ్ వాడిన బ్యాట్‌లో ఏమైనా ప్రత్యేకత ఉందా అని సరదాగా చెక్ చేయడం అక్కడ నవ్వులు పూయించింది. సిరాజ్ సాధించిన ఈ ఫినిషింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్.. Mohd Siraj and Sri Lanka love realation never ending 😭🤣🫣 #INDvsSL #CricketIndia #TestCricket #MohammedSiraj #TeamIndia ఈ మ్యాచ్‌లో కేవలం సిరాజ్ మెరుపులే కాదు, ఆరంభంలో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ కూడా జట్టు విజయానికి గట్టి పునాది వేశారు

India vs Sri Lanka 1st Test Playing XI: ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే కీలకమైన తొలి టెస్టు కోసం భారత అత్యుత్తమ తుది జట్టు సిద్ధమైంది. సన్నాహక మ్యాచ్ ఫలితాలు, ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టు కూర్పును విశ్లేషకులు సిద్ధం చేశారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవడానికి శ్రీలంకను ఓడించడం భారత్‌కు ఎంతో ముఖ్యం. శ్రీలంకతో జరగబోయే తొలి టెస్టు మ్యాచ్ లో రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. సన్నాహక మ్యాచ్‌లో వీరిద్దరూ మంచి పరుగులతో మెరిశారు. యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడటానికి ఇష్టపడితే, రాహుల్ లంక బౌలర్ల ధాటిని తట్టుకుని సుదీర్ఘ సమయం క్రీజులో నిలబడగలడు. సాయి సుదర్శన్ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకోవడంతో మూడో స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్ అవకాశం దక్కించుకున్నాడు. సన్నాహక మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ సూపర్ సెంచరీతో మెరిసి తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే? మిడిల్ ఆర్డర్ బాధ్యత కెప్టెన్ గిల్ చేతుల్లో.. చిన్నపాటి గాయం నుంచి కోలుకున్న భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఐదో స్థానంలో తుఫాన్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ రానున్నాడు. సన్నాహక పోరులో విఫలమైనప్పటికీ పంత్ ఎల్లప్పుడూ లంక బౌలర్లకు పెద్ద ముప్పుగా మారగలడు. ఆరో స్థానంలో ధ్రువ్ జురెల్ మ్యాచ్ ఫినిషర్‌గా నిలవనున్నాడు. ఆల్‌రౌండర్ల బలం.. జడేజా నుంచి సుథార్ వరకు.. గామింగ్ కండిషన్స్ దృష్ట్యా లోయర్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ లోతు ఉండాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా ఏడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. గడిచిన కాలంలో జడేజా బ్యాటింగ్‌లో స్థిరమైన ప్రదర్శన ఇస్తూ జట్టుకు వెన్నుముకగా మారాడు. ఎనిమిదో

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) ఆధ్వర్యంలో తొలిసారిగా జరగనున్న షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌కు స్టార్ క్రికెటర్లు సిద్ధమయ్యారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యువ సంచలనం అభిషేక్ శర్మలను అధికారులు మార్కీ ప్లేయర్లుగా ప్రకటించారు. దీంతో తొలి సీజన్లోనే ఈ లీగ్‌కు భారీ క్రేజ్ లభించింది. గిల్ ఫజిల్కా ఫాల్కన్స్ తరఫున బరిలోకి దిగనుండగా.. అభిషేక్ శర్మ అమృత్సర్ సూర్మాస్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. వీరితో పాటు స్టార్ ప్లేయర్లు అర్ష్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్‌లు కూడా మార్కీ ప్లేయర్లుగా వివిధ జట్లకు ఎంపికయ్యారు. మార్కీ ప్లేయర్లు.. జట్లు ఇవే శుభ్‌మన్ గిల్ – ఫజిల్కా ఫాల్కన్స్ అభిషేక్ శర్మ – అమృత్సర్ సూర్మాస్ అర్ష్‌దీప్ సింగ్ – లూధియానా లయన్స్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ – జలంధర్ వారియర్స్ రమణ్‌దీప్ సింగ్ – మొహాలీ కింగ్స్ గుర్నూర్ బ్రార్ – భటిండా రాయల్స్ ఆరు జట్లతో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 27 మ్యాచ్‌లు ఉంటాయి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. న్యూ చండీగఢ్‌లోని పీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో లీగ్‌ను అధికారికంగా ప్రారంభించారు. పంజాబ్ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడమే ఈ లీగ్ ప్రధాన లక్ష్యమని పీసీఏ పేర్కొంది. తన స్వస్థలం ఫజిల్కాకు చెందిన గిల్ కూడా ఈ టోర్నీపై ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘పంజాబ్ ఎప్పటినుంచో గొప్ప క్రికెటర్లను భారత జట్టుకు అందిస్తోంది. ఈ లీగ్ ద్వారా మరింత మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని నమ్ముతున్నా’ అని గిల్ తెలిపాడు. అదే లక్ష్యం.. షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో రౌండ్ రాబిన్ విధానంలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో ఫ్రాంచైజీకి ఒక మార్కీ ప్లేయర్‌తో పాటు కనీసం ఇద్దరు ఐకాన్ ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి జట్టుకు రూ.45 లక్షల బడ్జెట్ కేటాయించగా.. గరిష్ఠంగా

Shubman Gill: శ్రీలంకతో జరగబోయే ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా యాజమాన్యానికి, అభిమానులకు బిగ్ రిలీఫ్ లభించింది. శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ చివరి రోజున భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అనూహ్యంగా బ్యాటింగ్‌కు దిగాడు. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా కుడిచేతి ఉంగరం వేలికి గాయం కావడంతో గిల్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే గాయం నుంచి త్వరగా కోలుకున్న గిల్, కొలంబోలోని నాన్‌డెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ మైదానంలో నెట్స్ ప్రాక్టీస్ పూర్తి చేసుకుని, రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టుకు ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగాడు. సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లలో టాస్ సమయంలో ప్రకటించిన తుది జట్టు మాత్రమే ఆడేందుకు అర్హత కలిగి ఉంటుంది. కానీ వార్మప్ లేదా ప్రాక్టీస్ మ్యాచ్‌లకు ఈ అధికారిక నిబంధన వర్తించదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లలో రెండు జట్లు తమ స్క్వాడ్‌లోని ఆటగాళ్లందరినీ మైదానంలోకి దించే సౌలభ్యం ఉంటుంది. ఏ ఆటగాడైనా ఏ సమయంలోనైనా బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయడానికి దిగవచ్చు. తొలి రెండు రోజులు గిల్‌ను ఆడించకూడదని బీసీసీఐ భావించినప్పటికీ, మెడికల్ టీమ్ అతని ఫిట్నెస్ను ధృవీకరించడంతో, గాళ్ వేదికగా జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్‌కు ముందు అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు టీమ్ మేనేజ్మెంట్ గిల్‌ను రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దింపింది. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒకసారి, ఆ తర్వాత స్లిప్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మరోసారి బంతి గిల్ కుడిచేతి వేలికి బలంగా తాకింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా బీసీసీఐ మెడికల్ టీమ్ అతనికి విశ్రాంతినిచ్చింది. ఈ క్రమంలో ప్రాక్టీస్ మ్యాచ్ టాస్ సమయంలో కేఎల్ రాహుల్ టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వచ్చి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే చివరి రోజు గిల్ తిరిగి

శ్రీలంక ఎలెవన్‌తో కొలంబో వేదికగా జరిగిన మూడు రోజుల వార్మప్ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక ఎలెవన్‌తో కొలంబో వేదికగా జరిగిన మూడు రోజుల వార్మప్ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్(61*) హాఫ్ సెంచరీ చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. గాయం బారిన పడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్(44) నేడు బ్యాట్ పట్టాడు. స్టార్ బౌలర్ సిరాజ్(32*) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరిలో హ్యాట్రిక్ సిక్సర్లు బాది ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఎలెవన్ బౌలర్లలో కేషారా 2 విశ్వా ఫెర్నాండో, రమేశ్ మెండీస్ తలొక వికెట్ పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్‌లో కీలక మార్పులు?.. కోచింగ్ బృందంలో గంగూలీ, యువరాజ్ సింగ్! ఎవరినీ బలిపశువుగా చూపించడం సరికాదు.. ప్లేయర్ల గాయాలపై స్పందించిన లక్ష్మణ్

శ్రీలంక క్రికెట్ ఎలెవెన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ భారత బ్యాటింగ్ విభాగానికి బాగా ఉపయోగపడింది. ప్రతి బ్యాటర్ ఏదో ఒక ఇన్నింగ్స్‌లో మంచి ప్రాక్టీస్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్), రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్), కేఎల్ రాహుల్ (40).. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (61 రిటైర్డ్ హర్ట్), శుభ్‌మన్ గిల్ (44) పరుగులు రాబట్టారు. ఆగస్ట్ 15 నుంచి శ్రీలంకతో జరుగబోయే తొలి టెస్ట్‌కు ముందు ఇది శుభపరిణామం. ఇదే జోరును బ్యాటర్లు తొలి టెస్ట్‌లోనూ కొనసాగిస్తే టీమిండియా గెలుపు తథ్యం. టచ్‌లోకి వచ్చిన జైస్వాల్, గిల్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై నిరాశపర్చిన యశస్వి జైస్వాల్, రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకొని మెరుపు అర్ద సెంచరీతో చెలరేగాడు. గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో గాయాన్ని అధిగమించడంతో పాటు ఫామ్‌ను కూడా చాటుకున్నాడు. జైస్వాల్, గిల్ టచ్‌లోకి రావడం టీమిండియాకు శుభసూచకం. వీరికి పడిక్కల్, రాహుల్ కూడా తోడైతే తొలి టెస్ట్‌లో టీమిండియా గెలుపును లంక బౌలర్లు అడ్డుకోలేరు. విజయం దిశగా భారత్ 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ గెలుపు దిశగా సాగుతోంది. ఆట చివరి రోజు కావడం, అందులోనూ సమయం కూడా కొద్దిగానే ఉండటంతో భారత బ్యాటర్లు వేగంగా ఆడుతున్నారు. ముఖ్యంగా జైస్వాల్ పరిమిత ఓవర్ల తరహాలో బ్యాటింగ్ చేసి భారత గెలుపుకు పునాది వేశాడు. 30 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 152-2గా ఉంది. పంత్ (28), జడేజా (0) క్రీజ్‌లో ఉన్నారు. మరో 55 పరుగులు చేస్తే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన పంత్ ఈ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే భారత్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. జురెల్ (17) ఒక్కడే కాస్త నిరుత్సాహపరిచాడు. టార్గెట్ 207 లంక ఎలెవెన్ జట్టు రెండో

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సాయి సుదర్శన్ స్థానంలో మరో స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సిరీస్ సమయానికి అతడు ఫిట్నెస్ సాధించే అవకాశాలు లేనట్లు సమాచారం. దీంతో సాయి సుదర్శన్ స్థానంలో మరో స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సాయి సుదర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ సాధనలోనూ పాల్గొంటున్నప్పటికీ.. ఆగస్టు 15న గాలే వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టు నాటికి పూర్తి ఫిట్నెస్ సాధించడం కష్టమేనని తెలుస్తోంది. దీంతో అతడి స్థానంలో సర్ఫరాజ్‌ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీలంకకు భారత జట్టు బయలుదేరిన సమయంలో సాయి సుదర్శన్ ప్రయాణించలేదు. దీంతో కొలంబోలో శ్రీలంక క్రికెట్ XIతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌కు కూడా అతడు దూరమయ్యాడు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. గురువారం ప్రాక్టీస్ సమయంలో కుడి చేతి ఉంగరపు వేలికి గాయం కావడంతో వార్మప్ మ్యాచ్ తొలి రోజు అతడు ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కాగా మూడో రోజు వార్మప్ మ్యాచ్‌లో గిల్ బరిలోకి దిగాడు. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా శ్రీలంక సిరీస్‌కు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఎడమ మోకాలికి అయిన గాయం నుంచి అతడు పూర్తిగా

శ్రీలంకతో జరగబోయే కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు భారత్ ఆశాకిరణం యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో వైఫల్యం చెందినా, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 43 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ బాది అభిమానులను అలరించాడు. ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరగడం అభిమానుల్లో కాస్త కలవరాన్ని రేపింది. తొలి ఇన్నింగ్స్ నిరాశను చెరిపేసిన జైస్వాల్.. శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ తనదైన మార్కు విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొదటి ఇన్నింగ్స్‌లో త్వరగానే వికెట్ పారేసుకుని నిరాశపరిచిన ఈ యంగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆ తప్పును పునరావృతం చేయలేదు. మైదానం నలుమూలలా క్లాసిక్ షాట్లతో హోరెత్తిస్తూ ఎదుర్కొన్న 43వ బంతికి స్లాగ్ స్వీప్‌తో బౌండరీ బాది తన అర్ధశతకాన్ని నమోదు చేసుకున్నాడు. దంచికొట్టిన ఓపెనర్లు.. వంద పరుగుల భాగస్వామ్యం.. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ కలసి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ కలిసి ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెడుతూ బౌండరీల వర్షం కురిపించారు. కేవలం 15 ఓవర్లలోనే స్కోరు బోర్డును 100 పరుగులకు చేర్చారు. జైస్వాల్ 46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేయగా, మరోవైపు శుభ్‌మన్ గిల్ కూడా 44 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేసి క్రీజులో నాటౌట్‌గా నిలిచాడు. హాఫ్ సెంచరీ తర్వాత మైదానాన్ని వీడిన జైస్వాల్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 61 పరుగుల వద్ద ఉన్న సమయంలో యశస్వి జైస్వాల్ హఠాత్తుగా 'రిటైర్డ్ హర్ట్'గా మైదానాన్ని వీడటం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. అయితే మిగతా ఆటగాళ్లకు ప్రాక్టీస్ అవకాశం ఇచ్చేందుకు వ్యూహాత్మకంగా మైదానాన్ని వీడాడా లేక ఏమైనా స్వల్ప గాయంతో వెనక్కి తగ్గాడా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అతని స్థానంలో వికెట్

IND vs SL: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. గాళ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పరంగా ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం. అదే సమయంలో భారత ఆటగాళ్లకు వ్యక్తిగతంగా కూడా ఇది ప్రత్యేకమైన సిరీస్‌గా మారనుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు పలు కీలక మైలురాళ్లకు చేరువలో ఉన్నారు. గిల్ టార్గెట్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌లో రెండు కీలక రికార్డులపై కన్నేశాడు. ప్రస్తుత WTC సైకిల్లో గిల్ ఇప్పటికే ఐదు సెంచరీలు చేశాడు. శ్రీలంకపై మరో సెంచరీ సాధిస్తే ఈ WTC సైకిల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా జో రూట్‌ను అధిగమించే అవకాశం ఉంది. అదే సమయంలో కెప్టెన్‌గా మరో రెండు సెంచరీలు సాధిస్తే టెస్టుల్లో భారత కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును గిల్ అధిగమించే అవకాశం ఉంది. సచిన్ కెప్టెన్‌గా ఏడు టెస్టు సెంచరీలు సాధించగా, గిల్ ఇప్పటికే ఆరు సెంచరీలతో ఉన్నాడు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఈ సిరీస్‌లో చారిత్రాత్మక మైలురాయికి చేరువలో ఉన్నాడు. శ్రీలంకతో జరిగే టెస్టుల్లో మరో రెండు వికెట్లు తీస్తే జడేజా టెస్టు క్రికెట్లో 350 వికెట్ల మార్క్‌ను అందుకుంటాడు. ఈ ఘనత సాధిస్తే 350 లేదా అంతకంటే ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాల సరసన జడేజా నిలుస్తాడు. శ్రీలంకపై ఇషాంత్ శర్మ రికార్డుపై కూడా జడేజా కన్ను శ్రీలంకపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో జడేజా

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందు భారత్ జట్టుకు గుడ్ న్యూస్. ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అందుబాటులో ఉంటాడా? లేదా? ఆందోళన అందరిలోనూ నెలకొంది. అయితే.. స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంక, భారత్ మధ్య రెండు మ్యాచుల టెస్టుల సిరీస్ మరో ఆరు రోజుల్లో ప్రారంభ కానుంది. ఇప్పటికే గాయాల బెడదతో టీమిండియా ఆందోళనలో ఉంది. ఈ క్రమంలోనే సిరీస్ ఆరంభానికి ముందు భారత్ క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ప్రాక్టీస్ సెషన్లో కుడి చేతి వేలికి గాయం కావడంతో తొలి టెస్టులో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఆడటంపై సందేహాలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కొన్ని ఫొటోలు అభిమానులను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ప్రస్తుతం గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అతడు తిరిగి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే కొలంబో వేదికగా శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చేతి వేలి గాయం కారణంగానే తొలి రెండు రోజుల ఆటకు గిల్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మూడో రోజు ఫీల్డింగ్ రానప్పటికీ బ్యాటింగ్ మాత్రం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. గిల్ గైర్హాజరీలో భారత కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యహరిస్తున్నాడు. ఇప్పటికే శ్రీలంకతో సిరీస్‌కు ఇన్ఫామ్ ప్లేయర్లుగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, సాయిసుదర్శన్‌లు గాయం కారణంగా దూరమయ్యారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా మొదటి టెస్ట్‌లో ఆడకపోవచ్చని తెలుస్తోంది. ప్రపంచకప్2027లో రోహిత్ ఆడాల్సిందే.. అజింక్య రహానే కీలక సూచన! తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ నెగ్గిన భారత యువ షట్లర్ అస్మిత

Virender Sehwag comments on Indian Bowlers: శ్రీలంక ఎలెవెన్‌తో జరిగిన తొలి రోజు ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బౌలర్లు దారుణంగా నిరాశపరిచారు. ప్రత్యర్థి ఏకంగా 363 పరుగులు సాధించడంతో మన బౌలింగ్ ప్రదర్శనపై దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీమిండియాను హెచ్చరించారు. కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంక ఎలెవెన్‌తో ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ పోరులో భారత జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. పిచ్ బౌలర్లకు ఏమాత్రం సహకరించకపోవడం, లంక బ్యాటర్లు సమిష్టిగా చెలరేగడంతో తొలి రోజు భారత బౌలింగ్ విభాగానికి తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక ఎలెవెన్ 8 వికెట్ల నష్టానికి ఏకంగా 363 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ పడగొట్టడానికి మన బౌలర్లు మైదానంలో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎక్కువమంది చదివినది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే? తేలిపోయిన ప్రధాన పేసర్లు.. కాపాడిన స్పిన్ త్రయం.. ఈ మ్యాచ్‌లో భారత ప్రధాన పేస్ బౌలర్లు తీవ్రంగా విఫలమయ్యారు. ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక పరుగులు ధారాళంగా సమర్పించుకున్నారు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండేసి వికెట్లు తీసి కాస్తో కూస్తో పర్వాలేదనిపించారు. అయితే, ఆతిథ్య జట్టు దిగువ వరుస బ్యాటర్లు కూడా స్వేచ్ఛగా పరుగులు సాధించడం భారత క్యాంప్‌లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు.. మారకపోతే సిరీస్ గెలవడం కష్టమే.. భారత బౌలర్ల పేలవ ప్రదర్శనపై డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఘాటుగా స్పందించారు. ఈ తరహా బౌలింగ్ ధోరణి కొనసాగితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సంగతి దేవుడెరుగు, శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ గెలవడం కూడా పెద్ద సవాలుగా మారుతుందని హెచ్చరించారు. గతంలో