
Aug 12 2026 1:18 PM | Updated on Aug 12 2026 1:42 PM
శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆగస్టు 5న లంక గడ్డపై అడుగుపెట్టింది. ఆగస్టు 7 నుంచి మూడు రోజుల పాటు కొలంబో వేదికగా లంక ఎలెవెన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడిన టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. వార్మప్ మ్యాచ్ ఇచ్చిన విజయం జోష్‌తో టీమిండియా తొలి టెస్టు ఆడేందుకు గాలేలో అడుగుపెట్టింది.
ఈ సందర్భంగా గాలే ఎయిర్‌పోర్టు నుంచి టీమిండియా ఆటగాళ్లు బయటికి వస్తున్న ఫొటోలను బీసీసీఐ బుధవారం ఎక్స్ వేదికగా పంచుకుంది. జడేజా, పంత్, జైస్వాల్, సిరాజ్, సర్ఫరాజ్ ఖాన్ సహా ఇతర ఆటగాళ్లు, కోచ్ గంభీర్ కనిపించారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో గాలే స్టేడియం సమీపంలోని హోటల్‌కు చేరుకున్నారు. బుధవారం విశ్రాంతి తీసుకోనున్న గిల్ సేన గురువారం ప్రాక్టీస్ చేయనుంది. శనివారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.
దంచికొట్టిన వాన.. అయితే గాలేలో వాతావరణం రెండు రోజుల నుంచి చల్లగానే ఉంది. సోమవారం నుంచి మేఘావృతమై ఉన్న గాలేలో మంగళవారం వాన దంచికొట్టింది. రాబోయే రెండు, మూడు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉండడంతో తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు లేకపోలేదు.
ఇక ఈ టెస్టు సిరీస్ రెండు జట్లకు కీలకమే. 2027లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్‌లో విజయం తప్పనిసరి. ఒక్క మ్యాచ్ రద్దయినా అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక ఆరో స్థానంలో కొనసాగుతోంది.
కోహ్లి కెప్టెన్సీలో ఘన విజయం గాలేలో గతంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. 2017లో కోహ్లి కెప్టెన్సీలో గాలే వేదికగా శ్రీలంకతో ఆడిన టెస్టులో ఇన్నింగ్స్ 304 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 600 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ (190), పుజారా (153) సెంచరీలతో చెలరేగారు.
లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి సెంచరీ, అభినవ్ ముకుంద్ 81 పరుగులు చేయడంతో టీమిండియా 241 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో లంక ముంగిట 550 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచగా, భారత బౌలర్ల ధాటికి లంక 245 పరుగులకే కుప్పకూలింది. దీంతో గాలే టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
జడేజా ఒక్కడే.. కాగా అప్పటి జట్టులో సభ్యుడిగా ఉన్న జడేజాకు మాత్రమే గాలేలో ఆడిన అనుభవముంది. పడిక్కల్, గుర్నూర్ బ్రార్, సారాంశ్ జైన్, అకిబ్ నబీలు ఇటీవలే ఇదే గాలే వేదికగా లంక-ఏ జట్టుతో అనధికారిక టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్టు శనివారం నుంచి జరగనుండగా, రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు జరగనుంది.
Read: బంగ్లాను తేలిగ్గా తీసుకోం.. బలమైన జట్టుతోనే బరిలోకి!
రష్యన్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ (ఫొటోలు)
ప్రకృతి ఒడిలో టాలీవుడ్ హీరోయిన్ యోగా (ఫొటోలు)
హైదరాబాద్‌లో ఎయిడ్స్‌పై అవగాహన భారీ ర్యాలీ (ఫోటోలు)
ఐదేళ్ల తర్వాత కనిపించిన తెలుగు హీరోయిన్ (ఫొటోలు)
బోనాలు స్పెషల్.. ఫ్యామిలీతో 'బేబి' వైష్ణవి చైతన్య (ఫొటోలు)
ఇమ్రాన్ ఖాన్‌కు ఏమైంది? మృతి వార్తలతో కలకలం
తెలంగాణలో ఆచూకీ లేని 73 లక్షల ఓట్లు.. సీఎం రేవంత్ సోదరులను టార్గెట్ చేసిన కేటీఆర్
చంద్రబాబు పీపీపీ స్కామ్ లు బయటపెట్టిన కన్నబాబు
మంత్రి సహకారంతో పంచదర్లలో అక్రమ మైనింగ్.. ఆ మంత్రి పేరు...
మహిళా రిజర్వేషన్ కు జై.. డీలిమిటేషన్ కు నో! విజయ్ సర్కార్ కీలక తీర్మానం





