
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Hazelo Laboratories | భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 22 : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని హేజో లేబొరేటరీస్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ భారీ శబ్దంతో పేలింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఒక్కసారిగా భారీ పేలుడు.. పరుగులు తీసిన కార్మికులు కంపెనీలోని సి-బ్లాక్‌లో నైట్ షిఫ్ట్‌లో 18 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. రియాక్టర్ వద్ద పనులు జరుగుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. పేలుడు ధాటికి పెద్దవూర మండలానికి చెందిన చిన్న నాగిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన నాగన్న బోయిన నరేష్కుమార్ మృతి చెందారు. రియాక్టర్ సమీపంలో పనిచేస్తున్న మరో పది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రియాక్టర్ పేలిన శబ్దం భారీగా వినిపించడంతో పరిసర గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో కంపెనీ వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే చౌటుప్పల్ రూరల్ సీఐ సతీష్‌రెడ్డి, ఎస్సై జగన్ పోలీసు సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. చౌటుప్పల్, హయత్‌నగర్ నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. హేజో లేబొరేటరీస్‌లో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత జూలై 16న రసాయన వాయువులు పీల్చడంతో అనంతపురం జిల్లా సింగనమల మండలం ఉలికల్లు గ్రామానికి చెందిన ఆలుమూరు కృష్ణారెడ్డి (42) అనే కార్మికుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆ ఘటన జరిగి నెల రోజులు కూడా