
Rashmika Mandanna : పాతక్యూట్ ఫోటోలను షేర్ చేసిన రష్మిక.. మా టీమ్ తీసిన ఫొటోలు అంటూ..
తాజాగా రష్మిక మందన్న తన టీమ్ గతంలో తీసిన పలు పాత క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
© 2026 nimisham.in

తాజాగా రష్మిక మందన్న తన టీమ్ గతంలో తీసిన పలు పాత క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! సౌత్ బిగ్‌బాస్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషల కొత్త సీజన్లు సెప్టెంబర్ 6న రాత్రి 7 గంటలకు ఒకేసారి ప్రారంభం కానున్నాయి. భాష ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఒకటే అనే సందేశంతో నలుగురు సూపర్స్టార్లు ఉన్న ప్రోమో ఆకట్టుకుంటోంది. రవితేజ, హసిత్ గోలి కాంబినేషన్లో రానున్న ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా ఐశ్వర్య రాజేశ్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో శ్రీవిష్ణుకి జోడీగా మాళవికా మోహనన్ నటిస్తున్నట్లు వినికిడి. రశ్మిక లీడ్ రోల్లో నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నవంబర్ 27న విడుదల కానుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత నేషనల్ క్రష్ రశ్మిక.. త్వరలోనే సెట్స్‌లో అడుగుపెట్టనుంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాలను తెలుసుకునేందుకు పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. 200 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్ ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటేనే పండగ.. ఈసారి మునుపటి కంటే మిన్నగా

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త యాక్షన్ థ్రిల్లర్ సినిమా మైసా నుంచి ఇటీవల ఒక శక్తివంతమైన పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్లో రష్మిక చేతిలో భారీ ఈటె పట్టుకుని ముఖంపై తీవ్రమైన యుద్ధ గాయాలతో కనిపించారు. మంటలు మరియు జనం గుంపు నేపథ్యంతో ఆమె ఒక వీర యోధురాలిగా కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రత్యేకమైన లుక్‌పై నటుడు విజయ్ దేవరకొండ స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రష్మిక లుక్ చిత్రంతో పాటు ఆమెను వైలెంట్ పిల్లా అని సంబోధిస్తూ పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తుండగా అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. రష్మిక కెరీర్లో ఇప్పటివరకు చేయని పూర్తి స్థాయి రఫ్ మరియు ఇంటెన్స్ వారియర్ అవతార్‌గా ఈ పాత్రను రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ దేవతల ఆశీస్సులు నీకు ఉండాలని రాసుకొచ్చారు. ఈ సినిమా ద్వారా రష్మిక తన అభిమానులు అందరూ గర్వపడేలా మరొక గొప్ప నటనను అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఈ కామెంట్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని చిత్ర బృందం తెలిపింది. మరో 12 రోజుల పాటు చిత్రీకరణ పూర్తి చేస్తే మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుందని సమాచారం అందుతోంది. ఇటీవల ఒక భారీ పోరాట సన్నివేశంలో నటిస్తున్న సమయంలో రష్మిక ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆ కారణంగా ఆమె కొన్ని రోజుల పాటు షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం కోలుకుంటున్న రష్మిక త్వరలోనే మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టి మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ఫలితంగా నవంబర్ 27న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ

రష్మిక సినిమా మైసా పోస్టర్ గురించి విజయ్ దేవరకొండ చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘వయ్‌లెంట్ పిల్లా..! ఈ చిత్రంతో నీ అభిమానులు గర్వపడేలా చేస్తావు’ అంటూ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఇంతకీ ఈ కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేశారంటే.. రష్మిక (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’లో ఆమె గెటపు చూసి. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ‘అన్‌ఫార్ములా ఫిల్మ్స్’ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. నవంబరు 27న థియేటర్లలోకి ‘మైసా’ వస్తోందంటూ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్లో ఒక పెద్ద ఈటె పట్టుకుని నిలబడి ఉన్న రష్మిక ముఖంపై యుద్ధ గాయాలున్నాయి. ఆమె వెనుక భారీ జన సమూహం, మండుతున్న పరిసరాలు ఇంటెన్స్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా స్టోరీలో ఈ పోస్టర్ని పోస్టు చేస్తూ పై విధంగా సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి 12 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఇటీవలే సెట్స్‌లో ఓ పోరాట సన్నివేశ చిత్రీకరణ సందర్భంగా రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. రష్మిక త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొని చివరి దశ చిత్రీకరణను పూర్తి చేస్తారని చిత్రబృందం పేర్కొంది
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ఎంతో ప్రాధాన్యమున్న వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ భారీ యాక్షన్ డ్రామాను 2026 నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఆఫీషియల్‌గా ప్రకటించారు. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ పోస్టర్లో రష్మిక రక్తమోడుతున్న ముఖంతో, చేతిలో ఈటె పట్టుకుని అత్యంత రౌద్రంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తన కెరీర్లో నవంబర్ నెలకు ఒక ప్రత్యేక సెంటిమెంట్ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో ఆమె నటించిన భారీ ప్రాజెక్టులు, ముఖ్యంగా బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచిన కొన్ని చిత్రాలు ఇదే సమయంలో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు 'మైసా' చిత్రాన్ని కూడా నవంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే హిప్ గాయం నుంచి కోలుకున్న రష్మిక మందన్న, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించినట్లు తెలిపారు. తన కెరీర్లోనే అత్యంత అగ్రెసివ్ మరియు ఎమోషనల్ యాక్షన్ రోల్ ఇది అని ఆమె పేర్కొన్నారు. గిరిజన నేపథ్యంలో సాగే కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక ఒక వీరనారి తరహా పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'మైసా' రిలీజ్ పోస్టర్ తీవ్రంగా ట్రెండ్ అవుతోంది. రష్మిక మేకోవర్ చూసి నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ పాన్-ఇండియా మూవీకి ఈ స్థాయిలో వైలెంట్ మరియు ఇంటెన్స్ పోస్టర్ రావడం

'రౌడీ బాయ్' విజయ్ దేవరకొండ పేరు చెప్తే చాలు, అమ్మాయిల గుండెలు జారిపోతాయ్. 'అర్జున్ రెడ్డి'గా తెరపై ఫుల్లుగా తాగుతూ, రగడ్‌గా కనిపించిన ఈ హీరో, ఇప్పుడు నిజ జీవితంలో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అవును, విజయ్ దేవరకొండ పూర్తిగా మారిపోయాడు. తాజాగా `రోమాంచకం` మూవీ ఈవెంట్లో విజయ్ బయటపెట్టిన సీక్రెట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. `నేను తాగడం మానేశాను` అని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఒకప్పుడు జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా, బ్లెండర్స్ ప్రైడ్ నుంచి గ్లెన్ఫిడచ్ వరకు చాలా బ్రాండ్ల మందుని టేస్ట్ చేసిన విజయ్, ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్నది పెద్ద ప్రశ్న. అర్జున్ రెడ్డి పాత్రతో తాగే కల్చర్‌కు క్రేజ్ తెచ్చిన హీరోనే ఇప్పుడు మందు మానేయడం నిజంగా పెద్ద మార్పే కదా? ఇదే ఈవెంట్లో విజయ్ చెప్పిన మరో మాట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. "నేను ప్రేమించాను, బ్రేకప్ అయ్యింది, నా గుండె పగిలింది... ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను!" అని చెప్పాడు. తన ఫస్ట్ లవ్, బ్రేకప్ గురించి విజయ్ ఇంత ఓపెన్‌గా మాట్లాడటం విని అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే, విజయ్ మొదటి లవ్-బ్రేకప్ గురించి, అలాగే రష్మిక మొదటి లవ్-బ్రేకప్ గురించి అందరికీ తెలిసిందే. కాబట్టి, విజయ్ ఈ విషయం గురించి ఓపెన్‌గా చెప్పడంలో తప్పేమీ లేదు. అది తన జీవితం, అతని మాటల్లో జీవితంలోని ఎత్తుపల్లాలను చూసిన అనుభవం స్పష్టంగా కనిపించింది. విజయ్ దేవరకొండ పేరు వస్తే అక్కడ 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న పేరు రాకుండా ఉండదు. 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో మ్యాజిక్ చేసిన ఈ జంట, ఇప్పుడు 'రణబాలి' సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యింది. అయితే, 'హ్యాట్రిక్ జోడీ' అవ్వకముందే ఈ జంట పెళ్లి కూడా చేసుకున్నారనేది విశేషం! విజయ్, రష్మిక జోడీని మళ్లీ స్క్రీన్‌పై చూడాలని ఎదురుచూస్తున్న

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఆమె సరికొత్త అవతారంలో అలరించడానికి సిద్ధమయ్యారు. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మైసా విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 27న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ మేరకు రష్మిక స్వయంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఫస్ట్ లుక్ పంచుకుంటూ మైసా పాత్రలోని తీవ్రతను, ఆక్రోశాన్ని అభిమానులతో పంచుకున్నారు. గోండు తెగల నేపథ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక తీవ్రమైన, రఫ్ అండ్ రా వారియర్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆమె ఫేస్‌పై రక్తం, వైల్డ్ హెయిర్, చేతిలో ఈటె పట్టుకుని కనిపిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలో ఆమె పోషించిన గ్లామరస్ లేదా సాఫ్ట్ రోల్స్‌తో పోలిస్తే ఇది అత్యంత సాహసోపేతమైన పాత్ర అని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ అపారమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ గెటప్ కోసం ఆమె పూర్తి స్థాయిలో మేకోవర్ అయ్యారు. ఈ చిత్రంలో అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలిచేది నీటి అడుగున జరిగే పోరాట ఘట్టం. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారిగా ఒక కథానాయిక ఆధ్వర్యంలో ఇటువంటి అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించడం విశేషం. ఇదిలా ఉండగా ఈ సాహసోపేతమైన యాక్షన్ సీన్ కోసం రష్మిక స్వయంగా దాదాపు 20 గంటల పాటు నీటి అడుగున శ్రమించారు. ఎలాంటి డూప్ లేకుండా ఆమె చేసిన ఈ విన్యాసాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేయడం ఖాయమని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. అన్ ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రానికి జేక్స్ బిజోయ్ అద్భుతమైన
రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఈ ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక పవర్ ఫుల్ యాక్షన్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఇతర స్పెషల్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర బృందం ఈ పాన్ ఇండియా మూవీ విడుదల తేదీని ప్రకటించింది.'మైసా' చిత్రాన్ని 2026 నవంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా రష్మికకు సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ పంచుకున్నారు. ''స్వతహాగా ఆమె దృఢమైనది. స్వచ్ఛందంగా నిర్భయమైనది. అచంచలమైన స్ఫూర్తి కలది. మునుపెన్నడూ లేని విధంగా రష్మికతో కలిసి 'మైసా' ప్రపంచాన్ని ఎక్స్ పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి'' అని పేర్కొన్నారు.''మైసా.. ఆవేశం! వేదన! హృదయ వేదన! శోకం! దృఢ సంకల్పం! ధైర్యం! ఊహించని శక్తి - అదే మైసా'' అని రష్మిక పేర్కొన్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమాని డిసెంబర్ 3వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. ఇప్పుడు దానికి వారం రోజుల ముందుగా 'మైసా' మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బాక్సాఫీస్ దగ్గర 'ఫౌజీ' సందడి మొదలయ్యేలోపే 'మైసా' మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది.గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘మైసా’ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ లుక్ లో కనిపించనున్నారు. తొలిసారిగా యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. ఇది ఆమె కెరీర్ లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.రష్మిక మందన్న ప్రస్తుతం 'మైసా'తో పాటుగా 'రణబాలి' సినిమా చేస్తున్నారు. తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న 'రణబాలి' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ లో

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’(Mysaa). అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రవీంద్ర పుల్లె ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ను చిత్రబృందం ప్రకటించింది. మైసా ప్రపంచాన్ని మునుపెన్నడూ చూడని విధంగా రష్మిక మందన్నతో కలిసి అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల రష్మికకు గాయం కావడంతో షూటింగ్‌కు కొంత విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు. రష్మిక సెట్స్‌లోకి అడుగుపెట్టిన తర్వాత షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు

Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవల ఓ సినిమా షూటింగ్లో డ్యాన్స్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. డాక్టర్లు ఆమెకు ఆరు వారాల విశ్రాంతి అవసరం అని చెప్పడంతో ప్రస్తుతం ఇంట్లోనే కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది. అయితే రష్మికకు గాయం అవ్వడంతో ఆమె ఫిమేల్ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న మైసా సినిమా విడుదల ఆలస్యం అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా రష్మిక తన మైసా సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించింది. కేరళ బ్యాక్ డ్రాప్ గిరిజనుల కథాంశంతో యాక్షన్ సినిమాగా మైసా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రష్మిక అదిరిపోయే యాక్షన్ చేసింది అని ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించింది. రవీంద్ర పుల్లే అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. Also See : Jhansi Rathod : పెళ్లి చేసుకున్న ‘జగద్ధాత్రి’ సీరియల్ నటి ఝాన్సీ రాథోడ్.. ఫోటోలు వైరల్.. తాజాగా మైసా సినిమా నవంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్టు రష్మిక ప్రకటించింది. రష్మికకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉండగా రష్మిక కోలుకోగానే అది ఫినిష్ చేయడానికి మూవీ యూనిట్ రెడీగా ఉంది. ఇటీవలే విజయ్, రష్మిక జంటగా తెరకెక్కుతున్న రణబాలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. నెల రోజుల గ్యాప్ తో రష్మిక రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో రష్మిక ఫ్యాన్స్ ఈ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. MYSAA!The rage! The pain! The heartache! The grief! The grit! The courage! The power and the storm you don’t anticipate coming - That’s Mysaa! 🔥In cinemas worldwide on 27.11.26!❤️@RawindraPulle

నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బైనర్ పై ‘మైసా’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తోంది. హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన రవీంద్ర పుల్లె ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. రవీంద్ర గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాకు సాయి గోపా సహ నిర్మాత. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కతున్న ఈ సినిమా గ్లిమ్స్ కు అప్పట్లో మంచి స్పందన లభించింది. ఇటీవల రష్మికకు గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం గాయం నుండి కోలుకున్న రష్మిక త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో అడుగు పెట్టనుంది. రష్మిక సెట్స్ లో జాయిన్ అయ్యాక జెట్ స్పీడ్ లో షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 2026 నవంబర్ 27న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రష్మిక నటన, గ్లామర్ మరియు ఆమె పాత్రలోని వైవిధ్యం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఒక సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే

ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల సినిమాలకు సంబంధించిన ఇండియా టాప్ 10 లిస్ట్ విడుదల చేస్తుంటుంది. ఇందులో హీరోలు, హీరోయిన్లు, సినిమాలు, పాటలు, ఓటీటీలో ట్రెండ్ అయ్యే చిత్రాలుంటాయి. అందులో భాగంగా హీరోయిన్లకి సంబంధించిన జులై లిస్ట్ ని తాజాగా విడుదల చేసింది. ఇందులో ఇద్దరు హీరోయిన్ల ప్లేసులు తారుమారు అయ్యాయి. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా దారుణంగా పడిపోయింది. శ్రీలీల అసలులిస్ట్ లోనే లేదు. కానీ నయనతార, త్రిష మాత్రం దుమ్ములేపారు. టాప్‌లోకి దూసుకొచ్చారు. మరి సమంత, కాజల్, సాయిపల్లవి, దీపికా, అలియా భట్ వంటి వారి స్థానాలు ఏంటనేది చూద్దాం. ఇండియా వైడ్‌గా టాప్ 10లో మొదటి స్థానంలో సమంత నిలిచారు. ఆమెకి మొదటి స్థానంలో తిరుగులేదని చెప్పొచ్చు. హీరోల్లో ప్రభాస్ మాదిరిగానే సమంత స్థానంలో మార్పు ఉండటం లేదు. మధ్యలో ఒకటి రెండు నెలలు డౌన్ అయ్యారు. కానీ ఇప్పుడు మళ్లీ పుంజుకొని తన ప్లేస్‌ని పదిలంగా ఉంచుకుంటున్నారు. ఇటీవల సమంత `మా ఇంటి బంగారం` చిత్రంతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. బేబీ బంప్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రెండో స్థానంలో అలియాభట్ ఉన్నారు. ఈమె స్థానంలో కూడా పెద్దగా మార్పు ఉండటం లేదు. ఆ తర్వాత మూడో స్థానంలో దీపికా పదుకొనె ఉన్నారు. ఊహించని విధంగా నాల్గో స్థానంలోకి నయనతార రావడం విశేషం. గతంలో ఆమె టాప్ 5లో కూడా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఏకంగా టాప్ 4కి రావడం విశేషం. అయితే టాప్ 4లో ఉండాల్సిన రష్మిక మందన్నా మాత్రం డౌన్ అయ్యారు. ఆమె ఏడో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఇది ఆమెకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక ఐదో స్థానంలో కాజల్ అగర్వాల్ ఉన్నారు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలు లేకపోయినా.. నెట్టింట

స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగిన ఒక సరదా సంభాషణ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయ్ షేర్ చేసిన ఒక అందమైన ఫ్యామిలీ ఫోటోకు రష్మిక చేసిన ఫన్నీ కామెంట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.వివరాల్లోకి వెళితే, వర్షాల కారణంగా షూటింగ్ రద్దు కావడంతో విజయ్ దేవరకొండ తన నివాసంలో తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి దేవరకొండల మధ్య పడుకుని సేదతీరుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. "వర్షాల వల్ల షూటింగ్ రద్దయ్యింది. చిన్నప్పటి నా ఫేవరెట్ స్పాట్లో మధ్యాహ్నం నిద్ర దొరికింది" అని ఈ చిత్రానికి క్యాప్షన్ ఇచ్చాడు. అయితే, ఈ ఫోటో తీసింది తన భార్య రష్మిక మందన్నేనని పేర్కొంటూ ఆమెకు ఫోటో క్రెడిట్స్ ఇచ్చాడు.ఈ పోస్టుపై రష్మిక వెంటనే స్పందిస్తూ తన భర్తను సరదాగా ఆటపట్టించింది. "నేను ఇంటికి వచ్చాక నా పప్పీ ఐస్ (అమాయకపు చూపులు) చూడలేకే నాకు క్రెడిట్ ఇచ్చావా?" అంటూ ఫన్నీగా ప్రశ్నించింది. అంతేకాకుండా, ఇన్నేళ్లుగా తాను తీసిన మిగతా ఫోటోలకు కూడా క్రెడిట్ ఇవ్వాలని, తన ఫోటోగ్రఫీ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తున్నాయి.'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలతో హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందిన విజయ్, రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం 'రణబలి' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక ఇటీవలే 'కాక్టెయిల్ 2'లో కనిపించగా

రష్మిక మందన్న గాయంతో ‘మైసా’, ‘రణబాలి’ షూటింగ్స్‌పై ప్రభావం పడింది. తాజాగా అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా షూటింగ్ కూడా దాదాపు 45 రోజులు ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒక్క క్షణం కూడా తీరిక లేని స్టార్ హీరోయిన్‌కి గాయమై విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ఎంత నష్టం? ఒకటా? రెండా? ఎన్ని సినిమాల చిత్రీకరణలు ఆగిపోతాయి? రష్మిక (Rashmika Mandanna) పరిస్థితిని చూస్తున్న వారికి ఇప్పుడు ఈ విషయం చాలా బాగా అర్థమవుతోంది. ‘మైసా’ సినిమా కోసం పాట చిత్రీకరిస్తుండగా రష్మిక మందన్న కుడి వైపు తుంటి భాగానికి గాయమైంది. ఆరు వారాల రెస్ట్ ఎప్పుడు పూర్తవుతుందా... రష్మిక మళ్లీ ఎప్పుడెప్పుడు వస్తారా అని ‘మైసా’ (Mysaa) మేకర్స్ ఎదురు చూస్తున్నారు. అలాగే ‘రణబాలి’ (Ranabaali) సినిమా యూనిట్ కూడా రష్మిక మునుపటిలా తుళ్లుతూ సెట్‌కి వచ్చే రోజు కోసం వెయిటింగ్. ఇటు అల్లు అర్జున్ (Allu Arjun) ‘రాకా’ మూవీ మీద కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు రెండు నెలల పాటు ఆ షూట్లో ఆలస్యం చోటు చేసుకోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ‘రాకా’ (Raaka) సెట్లో రష్మిక డబుల్ యాక్టివ్‌గా ఉండాలి. సెప్టెంబర్ ఆఖరునగానీ, అక్టోబర్ మొదటివారంలోగానీ ఆమె సెట్‌కి వచ్చే అవకాశాలుండటంతో, ఆ ప్రకారమే షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడట అట్లీ (Atlee)

రాక్ స్టార్ యష్.. టాక్సిక్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. `కేజీఎఫ్ 2` తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌తో థియేటర్లోకి వస్తున్నారు యష్. ఈ చిత్రం చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. మార్చిలోనే రిలీజ్ కావాల్సింది. యుద్ధ ప్రభావంతో వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ నెల 28న రిలీజ్ కాబోతుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. యష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన మూడు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ట్రైలర్ ప్రారంభంలో బోల్డ్ గా ఆసక్తికరంగా అనిపించింది. కానీ ఇటీవల ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అది తలా తోక లేనట్టుగా ఉంది. కథ ఏంటో క్లారిటీ లేదు. యాక్షన్ పార్ట్ ని, రొమాన్స్ ని ఎక్కువగా చూపించారు. అదే సమయంలో సినిమాలోని మెయిన్ ట్విస్ట్ ని రివీల్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు యష్. అందులో భాగంగా ఆయన రష్మిక మందన్నా కామెంట్లకి, అదే సమయంలో అల్లు అరవింద్ కామెంట్లకి స్పందించారు. గతంలో వాళ్లు చేసిన వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇద్దరికి కలిపి ఇచ్చి పడేయడం విశేషం. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. ఒకప్పుడు `కేజీఎఫ్`కి ముందు యష్ ఎవరికీ తెలియదన్నారు. ఈ సినిమా తర్వాతనే అందరికి తెలుసు అని మాట్లాడారు. దీనికి యష్ రియాక్ట్ అవుతూ, `కేజీఎఫ్` తన లైఫ్‌ని మార్చిందనేది నిజమే అని, సినిమా సక్సెస్ కేవలం నిర్మాతది మాత్రమే కాదని, దాని వెనుక సమష్టి కృషి ఉంటుందన్నారు. హీరో సరిగ్గా నటించకపోతే సినిమా హిట్ కాలేదని, ఎవరికి ఎంత క్రెడిట్ ఇవ్వాలో ఆడియెన్స్ కి తెలుసు అని అదిరిపోయే సమాధానం చెప్పారు. ఈ సందర్భంగానే రష్మిక మందన్నా 2017లో

రష్మిక స్వతహాగా కన్నడ అమ్మాయి. 'కిరిక్ పార్టీ' మూవీతో హీరోయిన్ అయింది. తర్వాత మాతృభాషలో కొన్ని మూవీస్ చేసింది. ఇదంతా 9-10 ఏళ్ల కిందటి ముచ్చట. అయితే ఈ టైంలో పలు వివాదాల్లోనూ ఈమె ఇరుక్కుంది. అందులో 'కేజీఎఫ్' హీరో యష్‌పై చేసిన 'షో ఆఫ్' కామెంట్ కూడా ఉంది. దీని కారణంగా యష్ అభిమానులు రష్మికని చాలా ట్రోల్ చేశారు. తొమ్మిదేళ్ల క్రితం నాటి వ్యాఖ్యపై యష్ ఇన్నాళ్లకు స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో సదరు విషయమై క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: చిరంజీవితో సినిమా.. నేను ఇంకాస్త ఎదగాలి: డైరెక్టర్ వెంకీ అట్లూరి) 'ఆమె ఏ సందర్భంలో ఆ కామెంట్ చేసిందో నాకు తెలీదు. అప్పుడే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది. కొందరు యాంకర్లు ఇష్టమొచ్చినట్లు ప్రశ్నలు అడుగుతూ, ఆప్షన్లు ఇచ్చి ఏదో చెప్పమంటారు. బహుశా రష్మిక కూడా ఆ ఆప్షన్ నాకు సరిపోతుందని భావించి అలా మాట్లాడిందేమో! రష్మిక వ్యాఖ్యల వల్ల చాలామంది దర్శకులు ఇబ్బంది పడ్డారు. అయితే తోటి నటీనటులు ఎవరేమనుకున్నా నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. అది నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయదు. ఎవరైనా తమకు నచ్చింది చెప్పొచ్చు. కానీ దాని వల్ల నేనేం మారిపోను' అని యష్ అన్నాడు. ఇక తన అభిమానులని ఉద్దేశిస్తూ ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తోటి నటీనటులని గౌరవించలేని వాళ్లు తన అభిమానులే కాదని యష్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ వివాదంపై అప్పట్లోన రష్మిక స్పందించింది. అలా అన్నందుకు క్షమాపణ కూడా చెప్పింది. అయితే ఇన్నేళ్లకు సందర్భం రావడంతో యష్ కూడా స్పందించి ఎట్టకేలకు దీనికి ముగింపు పలికాడు. ఇకపోతే యష్ హీరోగా చేసిన 'టాక్సిక్'.. వచ్చే బుధవారం (ఆగస్టు 26) థియేటర్లలోకి రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: 'ఇరుముడి' నుంచి 'మల్లెపూల పల్లకి సాంగ్' రిలీజ్) భర్త బర్త్‌డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు) నల్లని

కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయిపోయింది. నేషనల్ క్రష్ గా అందరి మన్ననలు అందుకుంటోంది. అయితే గతంలో రాకింగ్ స్టార్ యశ్‌ను 'మిస్టర్ షో -ఆఫ్' అని పిలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. 2016లో 'కిరిక్ పార్టీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. ఇదే క్రమంలో హీరో యశ్ పై కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది రష్మిక. యశ్ అభిమానులు కూడా రష్మికపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయం తీవ్రరూపం దాల్చడంతో, రష్మిక బహిరంగంగా క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే తనపై రష్మిక చేసిన కామెంట్స్ పై ఇప్పటివరకు స్పందించలేదు యశ్. అయితే తాజాగా టాక్సిక్ ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోన్న రాకింగ్ స్టార్ రష్మిక కామెంట్స్ పై స్పందించాడు. 'మా గురించి ఎవరైనా అభిప్రాయం చెప్పవచ్చు. కానీ ఒకరి అభిప్రాయం నా వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేదు. నేను ఎలా ఉన్నా, ఇతరుల దృక్కోణం వల్ల అది మారదు. ఆమె ఏ ఉద్దేశంతో అలా అన్నారో నాకు తెలియదు. అప్పట్లో తను సినిమా ఇండస్ట్రీకి కొత్త. కొన్ని టీవీ షోలలో యాంకర్లు 3-4 ఆప్షన్లు ఇచ్చి ఏదో ఒకటి ఎంచుకోమంటారు. ఆ ఆప్షన్లలో నాకు ఇది సరిపోతుందని రష్మిక భావించి ఉండొచ్చు. నేను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి అభిప్రాయం వాళ్లది' అని యశ్ చెప్పుకొచ్చారు. కాగా రష్మిక కామెంట్స్ తర్వాత యష్ అభిమానులు సోషల్ మీడియాలో ఆమెను బాగా ట్రోల్ చేశారు. దీనిపై కూడా స్పందిచిన రాకింగ్ స్టార్ ఫ్యాన్స్ కు ఒక మంచి సందేశం ఇచ్చాడు. 'మీరు మరో నటుడిని లేదా నటిని గౌరవించకపోతే, మీరు నా అభిమాని కాలేరు' అని చెప్పుకొచ్చారు టాక్సిక్ హీరో. ఇక 'టాక్సిక్' సినిమా విషయానికి వస్తే

పాన్ ఇండియా స్టార్ యశ్ (Yash) ప్రస్తుతం తన రాబోయే భారీ యాక్షన్ డ్రామా టాక్సిక్ (Toxic) సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. పాన్ ఇండియా స్టార్ యశ్ (Yash) ప్రస్తుతం తన రాబోయే భారీ యాక్షన్ డ్రామా టాక్సిక్ (Toxic) సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార, రుక్మణి వసంత్, తార సుతరియా, కియారా అద్వానీ, హుమా ఖురేషీ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 26 న టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన యష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో గతంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న తనపై చేసిన మిస్టర్ షో ఆఫ్ వ్యాఖ్యల గురించిన ప్రశ్న ఎదురైంది. రష్మిక వ్యాఖ్యలపై యశ్ ఎంతో హుందాగా, స్పష్టంగా స్పందించి అభిమానులను ఆకట్టుకున్నాడు. గతంలో రష్మిక ఒక ఇంటర్వ్యూలో యశ్‌ను ఉద్దేశించి చేసిన ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.2017లో ఇండస్ట్రీ ప్రారంభంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో రష్మిక.. యశ్‌ను ఉద్దేశించి మిస్టర్ షో ఆఫ్ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో యశ్ అభిమానులు రష్మికను తీవ్రంగా ట్రోల్ చేయడంతో ఆమె క్షమాపణలు కూడా చెప్పింది. ఈ విషయంపై యశ్ మాట్లాడుతూ.. 'ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాట అనిందో నాకు తెలియదు. అప్పట్లో తను ఇండస్ట్రీకి కొత్త. కొన్ని టీవీ షోలలో యాంకర్లు ఆప్షన్లు ఇచ్చినప్పుడు అలా చెప్పి ఉండవచ్చు. దాన్ని నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఎవరి అభిప్రాయం వారిది, కానీ ఒకరి అభిప్రాయం నా వ్యక్తిత్వాన్ని మార్చలేదు' అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన అభిమానులకు యశ్ ఒక సందేశాన్ని ఇచ్చాడు. సహ నటీనటులను

Rashmika Mandanna vs Yash: కన్నడ స్టార్ హీరో యష్, హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన పాత కామెంట్‌పై తాజాగా స్పందించారు. రష్మిక కెరీర్ ప్రారంభంలో చేసిన ఈ వ్యాఖ్య అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ విషయంపై యష్ మాట్లాడటంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. రష్మిక 2017లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కన్నడ ఇండస్ట్రీలో ‘మిస్టర్ షోఆఫ్’ ఎవరు అని అడిగినప్పుడు యష్ పేరు చెప్పింది. ఆ సమయంలో ఆమె ఇండస్ట్రీలో కొత్తగా ఎదుగుతున్న హీరోయిన్. రష్మిక చేసిన ఈ వ్యాఖ్య యష్ అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.ఇటీవల యష్, ప్రముఖ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్మిక చేసిన పాత కామెంట్ గురించి యష్‌ను ప్రశ్నించారు. దీనికి యష్ చాలా ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. రష్మిక ఆ మాట ఏ ఉద్దేశంతో చెప్పిందో తనకు తెలియదని యష్ అన్నారు. ఆమె అప్పటికి కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిందని గుర్తు చేశారు. కొన్ని టీవీ కార్యక్రమాల్లో యాంకర్లు ఒక ప్రశ్నకు మూడు లేదా నాలుగు ఆప్షన్లు ఇస్తారని, అందులో ఒకదాన్ని ఎంచుకునే సమయంలో అలా జరిగి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఎవరో ఒకరు తన గురించి ఏదైనా అభిప్రాయం చెప్పినంత మాత్రాన అది తన వ్యక్తిత్వాన్ని నిర్ణయించదని యష్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉందని అన్నారు. తాను ఎవరో ఇతరుల అభిప్రాయాల వల్ల మారిపోనని తెలిపారు. అంతేకాదు, యష్ తన అభిమానులకు కూడా ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ఇతర నటీనటులను అభిమానులు గౌరవించాలని చెప్పారు. మరో నటుడిని గౌరవించని వ్యక్తిని తాను తన అభిమానిగా భావించనని యష్ స్పష్టంగా చెప్పారు. అప్పట్లో వచ్చిన విమర్శల తర్వాత రష్మిక కూడా తన వ్యాఖ్యలపై

ఇంటర్నెట్ డెస్క్: నటి రష్మిక (Rashmika Mandanna) గతంలో తనపై చేసిన ఓ కామెంట్‌పై పాన్ ఇండియా స్టార్ యశ్ (Yash) స్పందించారు. 2017లో ఓ ఇంటర్వ్యూలో రష్మిక.. యశ్‌ను ఉద్దేశించి ‘మిస్టర్ షో ఆఫ్’ అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై యశ్ తనదైన శైలిలో బదులిచ్చారు. ‘‘ఆమె ఏ ఉద్దేశంతో అలా అన్నారో నాకు తెలియదు. అప్పట్లో తను ఇండస్ట్రీకి కొత్త. కొన్ని టీవీ షోలలో యాంకర్లు 3-4 ఆప్షన్లు ఇచ్చి ఏదో ఒకటి ఎంచుకోమంటారు. ఆ ఆప్షన్లలో నాకు ఇది సరిపోతుందని రష్మిక భావించి ఉండొచ్చు. నేను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి అభిప్రాయం వాళ్లది. అయినా, ఒకరి అభిప్రాయం నా వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ నిర్ణయించలేదు. ఇతరుల దృష్టికోణాన్ని బట్టి నా క్యారెక్టర్ మారదు’’ అని యశ్ స్పష్టం చేశారు. అలాగే తన అభిమానులను ఉద్దేశించి.. ‘‘సహ నటీనటులను గౌరవించని వారు నా అభిమానులు కారు’’ అని చెప్పారు. ఇక, రష్మిక వ్యాఖ్యలపై అప్పట్లో యశ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడంతో.. ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యశ్ ‘టాక్సిక్’ (Toxic) సినిమా విడుదలకు సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న విమర్శలకు యశ్ బదులిస్తూ.. ‘‘నేను అశ్లీలతను ప్రోత్సహించను. ఇది ఇప్పటి యువత కోసం తీసిన సినిమా’’ అని వివరణ ఇచ్చారు. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు నితేశ్ తివారీ తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ‘రామాయణ’ (Ramayana)లో యశ్ రావణుడిగా నటిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల

రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడడంతో ప్రస్తుతం కొన్ని వారాలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ(vijay devarakonda) హీరోగా రాహుల్ సంకృత్యాన్(Rahul Sakrityan) దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి(Ranabaali) చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే రష్మిక గాయం కారణంగా ఆమె పాల్గొనాల్సిన సీన్స్ వాయిదా పడటంతో సినిమా రిలీజ్ షెడ్యూల్‌పై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. మొదట సెప్టెంబర్ రిలీజ్ ను టార్గెట్ గా పెట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్‌లో రిలీజయ్యే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రష్మిక కోలుకున్న వెంటనే రణబాలికి ప్రాధాన్యత ఇచ్చి తన డేట్స్ ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న రాకా(Raaka) సినిమా షూటింగ్ కూడా ఆమె అందుబాటులో లేకపోవడంతో మార్పులకు లోనైంది. ప్రస్తుతం రష్మిక అవసరం లేని సీన్స్ ను షూట్ చేస్తున్న యూనిట్, మిగిలిన షెడ్యూల్‌లను తిరిగి ప్రణాళిక చేస్తున్నట్లు సమాచారం. ముంబైలో జరుగుతున్న ప్రస్తుత షెడ్యూల్ తర్వాత రష్మిక నవంబర్‌లో తిరిగి సెట్స్‌లో చేరే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక బాలీవుడ్లో తెరకెక్కుతున్న మైసా(Mysaa) సినిమా షూటింగ్ కూడా ఈ గాయం కారణంగా ఆలస్యమైంది. హై ఎనర్జీ డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ టైమ్ లో ఆమెకు హిప్ టెండన్ డిటాచ్మెంట్ గాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా రిలీజ్ ప్లాన్స్ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మొత్తంగా రష్మిక గాయం ప్రస్తుతం మూడు ప్రధాన చిత్రాల షూటింగ్, షెడ్యూల్స్, రిలీజ్ డేట్స్ పై ప్రభావం చూపినట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఆమె త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్లలో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ ‘రణబాళి’ చిత్రం నుంచి పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కథానాయకుడు విజయ్ దేవరకొండ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక భీకరమైన యోధుడి గెటప్‌లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచారు. రక్తం చిందిన గాయాలతో, జాతీయ జెండాను ధరించి ఆయన ఇస్తున్న లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. “మరపురాని మన చరిత్రలోని అత్యంత ధైర్యసాహసాల అధ్యాయం” అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమా కథాంశంపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామాను దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. 1854 నుంచి 1878 కాలం నాటి రాయలసీమ నేపథ్యంలో బ్రిటిష్ వలస పాలనపై సాగిన పోరాటమే ఈ చిత్ర ప్రధాన కథాంశం. అప్పటి చారిత్రక సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో రాయలసీమ వీరుల త్యాగాలను ఈ సినిమా ద్వారా వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనుంది. ఇదిలా ఉండగా, హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (ది మమ్మీ ఫేమ్) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతర్జాతీయ స్థాయి నటుడు భాగస్వామ్యం కావడంతో రణబాళి చిత్రంపై సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చ మొదలైంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. దీంతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదలైన ఈ పోస్టర్ నెట్టింట సెన్సేషన్‌గా మారింది. నెటిజన్లు విజయ్ దేవరకొండ మేకోవర్‌ను ప్రశంసిస్తూ కామెంట్లతో పోస్టర్‌ను షేర్ చేస్తున్నారు. ఫలితంగా రణబాళి చిత్రం గురించి సినీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పీరియాడిక్ డ్రామాలో వాస్తవ సంఘటనలను ప్రతిబింబించేలా విజువల్స్ ప్లాన్

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను నటిస్తున్న 'రణబాలి' చిత్రం నుంచి దేశభక్తి ఉట్టిపడేలా ఉన్న ఒక పవర్ఫుల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం ఎంతగా పోరాడారో గుర్తుంచుకోవాలని, స్వేచ్ఛ కోసం చెల్లించిన మూల్యాన్ని ఎప్పటికీ మరువొద్దని ఆయన పిలుపునిచ్చారు."ఇది మనందరికీ గొప్ప పండుగ రోజు. మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం ఎంత కష్టపడ్డారో, మనం ఎంత దూరం ప్రయాణించామో గుర్తుంచుకోవాల్సిన రోజు. స్వేచ్ఛ కోసం చెల్లించిన మూల్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ కుటుంబాలకు, దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురండి. నా సోదరులకు, నా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు" అని విజయ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ దేశభక్తి కలిగిన 'రణబాలి' అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న 'జయమ్మ' పాత్రలో కనిపించనుంది. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'ది మమ్మీ'లో ఇమ్హోటెప్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో 'సర్ థియోడర్ హెక్టర్' అనే ప్రతినాయకుడి పాత్ర పోషిస్తుండటం విశేషం.ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది. 19వ శతాబ్దం నేపథ్యంలో ముఖ్యంగా 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను పాన్-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. చరిత్ర పుస్తకాల్లో చోటు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం రాకా పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ మినహా పెద్దగా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. దీంతో సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా రాకా లో నటించే హీరోయిన్ల పాత్రలపై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లు కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఈ ప్రాజెక్టులో భాగమని అధికారికంగా వెల్లడించారు. ఆమె సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్లో దీపికా పాల్గొంటున్నారని, ఆమెకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కూడా రాకా లో కీలక పాత్రలు పోషించనున్నారనే ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్ ఓ గిరిజన యువతిగా కనిపించనున్నారని, ఆమె పాత్రకు కథలో మంచి ప్రాధాన్యత ఉంటుందని టాక్. రష్మిక పాత్ర మాత్రం మరింత ఆసక్తికరంగా ఉండబోతుందని సమాచారం. ఆమె పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుందని, నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని ప్రచారం సాగుతోంది. మృణాల్ ఠాకూర్ కూడా కథలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి పాత్రలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

ప్రముఖ నటి రష్మిక మందన్న ఇటీవల తుంటి గాయానికి గురై ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ఊహించని విరామం వృత్తిపరమైన పని, వ్యక్తిగత జీవితంపై తన దృక్పథాన్ని ఎలా మార్చిందో ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఒకప్పుడు విరామం లేకుండా నిరంతరం పనిచేయడాన్ని ఇష్టపడిన తనకు, ప్రస్తుతం ఆ ఆలోచనే ఆందోళన కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు.ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రష్మిక ఒక ఆసక్తికర పోస్ట్‌ను పంచుకున్నారు. "క్షణం తీరిక లేకుండా నిరంతరం పనిచేస్తున్నప్పుడు, అకస్మాత్తుగా వేగాన్ని తగ్గించడం భయంగా అనిపిస్తుంది. కానీ, అనుకోని పరిస్థితుల వల్ల నెమ్మదించాల్సి వచ్చినప్పుడు, గతంలో చేసిన ఆ తీవ్రమైన శ్రమ (హస్లింగ్) ఇప్పుడు భయాన్ని కలిగిస్తోంది. బహుశా ఇదే జీవితం కావచ్చు" అని రష్మిక రాసుకొచ్చారు. తన కుటుంబ సభ్యులతో గడుపుతున్న కొన్ని ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. తాను ప్రస్తుతం ప్రేమ, సానుకూలత, ప్రార్థనల మధ్య ఉన్నానని చెబుతూ, అభిమానుల ఆదరాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.తన ఆరోగ్య పరిస్థితి గురించి కొద్ది రోజుల క్రితమే స్పందించిన రష్మిక, ప్రస్తుతం తగినంత విశ్రాంతి తీసుకోవడం, పుస్తకాలు చదవడం, పజిల్స్ ఆడటం, తన పెంపుడు కుక్క 'ఆరా'తో సమయం గడపడమే తన దినచర్యగా మారిందని తెలిపారు. అలారం అవసరం లేకుండా నిద్రలేవడం తన శరీరానికి ఎంతో మేలు చేస్తోందని, అప్పుడప్పుడు పని వేగాన్ని తగ్గించడం అంత చెడ్డదేమీ కాదని తాను గ్రహించినట్టు ఆమె పేర్కొన్నారు. 'పుష్ప', 'యానిమల్' చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మిక, తన తదుపరి చిత్రం

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాలలో రణబాలి ఒకటి. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా పెళ్లి తరువాత వారిద్దరూ జంటగా నటించిన ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాలలో రణబాలి (Ranabaali) ఒకటి. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) - రష్మిక మందన్నా (Rashmika Mandanna) పెళ్లి తరువాత వారిద్దరూ జంటగా నటించిన ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అంతేకాకుండా విజయ్ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా విజయ్ కి ఒక మంచి హిట్ లేదు. రణబాలి.. కచ్చితంగా హిట్ అందుకుంటుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్నీ బావుండి ఉంటే.. ఈ పాటికి విజయ్ - రష్మిక రణబాలి ప్రమోషన్స్ లో ఉండేవారు. సెప్టెంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉండటంతో సినిమా విడుదలను వాయిదా వేసిన విషయం తెల్సిందే. అన్నయ్య ఎలాగో రావడం లేదు కదా ఆ డేట్ ని నేను వాడుకుంటాను అని తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన సినిమా ఎపిక్ ని రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో రణబాలి కొత్త విడుదల తేదీ ఎప్పుడనే దానిపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, దానికి సమాధానం లభించింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈసారి మాత్రం విజయ్ అస్సలు తగ్గేదెలే అంటున్నట్లు సమాచారం. ఇక రష్మిక కూడా భర్త కోసం రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక డ్యాన్స్ షూటింగ్లో రష్మిక తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. డాక్టర్లు ఆమెకు ఆరు వారాల విశ్రాంతిని

టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్‌గా పేరున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’ (Ranabali) ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్‌గా పేరున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’ (Ranabali) ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌తో పాటు దర్శకుడి ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన గత చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఈ జంట మరోసారి తెరపై కనిపించనుండటంతో అభిమానులు ‘రణబాలి’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలుత ‘రణబాలి’ చిత్రాన్ని సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే సినిమా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా అని విజయ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీపై ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. అక్టోబర్ 30న ‘రణబాలి’ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ‘రణబాలి’ తొలుత అనుకున్న సెప్టెంబర్ 11 తేదీన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘EPIC’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అన్నదమ్ముల సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్స్ కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి

అలియా భట్ తన 28వ ఏట, 2022 ఏప్రిల్ 14న రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. బాంద్రాలోని తమ ఇంట్లోనే చాలా సింపుల్‌గా వీరి పెళ్లి వేడుక జరిగింది.అలియా భట్ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భర్త రణబీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టు రామాయణలో నటిస్తున్నారు. ఈ సినిమాపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న తన 30వ ఏట అడుగుపెట్టకముందే, 2026 ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంది. విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో క్రేజీ హీరో కాగా రష్మిక పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తోంది.పుష్ప, ఛావా, యానిమల్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాల్లో రష్మిక హీరోయిన్ గా నటించింది. విజయ్ దేవరకొండ, రష్మిక కలసి ప్రస్తుతం రణబలి అనే చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం మైసాలో నటిస్తోంది. జెనీలియా తన 24 ఏళ్ల వయసులోనే, 2012 ఫిబ్రవరి 3న రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుంది.జెనీలియా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి. సై, బొమ్మరిల్లు, ఢీ లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్, రామ్ పోతినేని లాంటి స్టార్స్ తో జెనీలియా స్క్రీన్ షేర్ చేసుకుంది. రవీనా టాండన్ తన 29వ ఏట, 2004 ఫిబ్రవరి 22న అనిల్ తడానిని వివాహం చేసుకుంది. రవీనా టాండన్ బాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా ఉన్నారు. కొన్ని తెలుగు చిత్రాల్లో కూడా ఆమె నటించారు. బంగారు బుల్లోడు, పాండవులు పాండవులు తుమ్మెద, ఆకాశ వీధిలో లాంటి తెలుగు చిత్రాల్లో ఆమె నటించింది

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Vijay Deverakonda:బోనాల సందర్భంగా లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శించిన విజయ్ దేవరకొండ, తన భార్య రష్మిక మందన్న క్షేమంగా ఉండాలని అమ్మవారిని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయంలో విజయ్ చేసిన ప్రార్థనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్న వేళ పలువురు సినీ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. నటి నిహారిక కొణిదెల బంగారు బోనం సమర్పించిన అనంతరం విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయానికి వెళ్లారు. విజయ్ దేవరకొండ ఆలయానికి వచ్చారని తెలియడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు, భక్తులు అక్కడికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన విజయ్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని తాను తొలిసారి దర్శించుకున్నట్లు తెలిపారు. తన భార్య రష్మిక మందన్న క్షేమంగా ఉండాలని, ఆమె త్వరగా కోలుకోవాలని అమ్మవారి ఆశీస్సులు కోరినట్లు విజయ్ తెలిపారు. అలాగే తమ సందీప్ రెడ్డి వంగా ప్రొడక్షన్ హౌస్‌కు కూడా భద్రకాళి పేరు పెట్టిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. విజయ్ దేవరకొండ రష్మిక కోసం ప్రత్యేకంగా ప్రార్థించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బోనాల వేళ భార్య కోసం విజయ్ చేసిన ఈ ప్రత్యేక ప్రార్థన అభిమానులను ఆకట్టుకుంటోంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు