
జపాన్ తో భారత్ కీలక రక్షణ ఒప్పందం.. చైనా, పాక్ కు పెరిగిన టెన్షన్
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించేందుకు రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, జపాన్ దేశాలు నిర్ణయించాయి. ఢిల్లీలో నేడు(ఆగస్టు 20) భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సముద్ర భద్రతా సహకారంపై ఓ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సముద్ర భద్రతా రంగంలో ఇరు దేశాల మధ్య మరింత సహకారానికి ఇరుదేశాల రక్షణ మంత్రిత్వ శాఖలు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశాయి. సముద్ర భద్రతా రంగంలో ఇరు దేశాల సైన్యాల మధ్య ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించేందుకు కూడా ఓ ఒప్పందం కుదిరింది.Agni Missile: ఏకఛత్రాధిపత్యానికి చెక్.. క్షిపణుల తయారీలో ప్రైవేట్ జోరు!ఢిల్లీలో సమావేశమైన రాజ్‌నాథ్ సింగ్, షింజిరో కొయిజుమిఈ ఒప్పందం ప్రకారం.. సముద్ర డొమైన్ సమాచారాన్ని పంచుకోవడంతో సహా, జపాన్ సముద్ర స్వీయ-రక్షణ దళం, భారత నౌకాదళం మధ్య సహకారం బలోపేతం అవుతుంది. ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం ఓ కీలకమైన స్తంభం అని ఇరు దేశాల రక్షణ మంత్రులు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. సముద్ర భద్రత, నౌకాదళ సహకారం, రక్షణ పరికరాలు, సాంకేతికత, సైనిక విన్యాసాలు, రక్షణ పరిశ్రమ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు మంత్రులు అంగీకరించారు. జులై 2026లో ఇరు దేశాల నాయకులు జారీ చేసిన సంయుక్త ప్రకటనను ఇరుపక్షాలు గుర్తుచేసుకున్నాయి.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి,స్థిరత్వం కోసం ప్రధాన ఒప్పందంస్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్ లక్ష్యాన్ని సాధించేందుకు రక్షణ సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని ఇరు దేశాల రక్షణ మంత్రులు పునరుద్ఘాటించారు. ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా పరిస్థితిపై అంచనాలను పంచుకోవాల్సిన ప్రాముఖ్యతను ఇద్దరు రక్షణ మంత్రులు స్పష్టం చేశారు. నౌకాయానం, విమానయాన స్వేచ్ఛ, భద్రతకు ఆటంకం కలిగించే ఏకపక్ష చర్యలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా గాలింపు, సహాయక