
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజూ 15 వేల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, తర్వాత వచ్చే వాహనాలను చెక్ పాయింట్ల వద్ద నిలిపివేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తితిదే దృష్టికి వచ్చింది.

సింగరేణి కాలరీస్ నష్ట నివారణా చర్యలపై దృష్టి సారిస్తోంది. సింగరేణి కాలరీస్ కు సంబంధించి భూగర్భ గనులలో భారీగా నష్టాలు నమోదు అవుతున్న క్రమంలో కేంద్రం సూచనలను పరిశీలిస్తోంది. భారీ నష్టాలను తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ భారీ నష్టాల్లో ఉన్న భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే దిశగా అడుగులు వేస్తోంది.సింగరేణి ఆధ్వర్యంలో రాగి, బంగారం అన్వేషణ షురూ!నష్టాలను తగ్గించుకునే ఆలోచనలో సింగరేణికేంద్ర బొగ్గు శాఖ సూచనల మేరకు గని అభివృద్ధి, నిర్వహణ ఎండీవో విధానంలో ఈ బదిలీ జరుగుతుంది. కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ వంటి జాతీయ సంస్థలు ఇదే విధానం ద్వారా నష్టాలను తగ్గించుకున్న నేపథ్యంలో సింగరేణి కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.వరుస విజయాల సింగరేణి.. తాజాగా మరో చారిత్రాత్మక మైలురాయి!శాంతిఖని భూగర్భ గని త్వరలో ప్రైవేటీకరణమందమర్రి ప్రాంతంలోని శాంతిఖని భూగర్భ గనిని ప్రయోగాత్మకంగా అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా ఒక ప్రైవేటు కంపెనీ ముందుకు వచ్చింది. దీనికోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఈ విధానంలో ప్రైవేటు సంస్థ సొంత ఖర్చుతో బొగ్గు తవ్వి నిర్ణీత ధరకు సింగరేణికి అందిస్తుంది. సింగరేణి ఆ బొగ్గును మార్కెట్లో విక్రయిస్తుంది.రూ.1,924 కోట్లు నష్టాల్లో భూగర్భ గనులుప్రస్తుతం శాంతిఖనిలో టన్ను బొగ్గు ఉత్పత్తికి సుమారు రూ.21,558 ఖర్చవుతుండగా విక్రయ ధర కేవలం రూ.4,167 మాత్రమే. ఆడ్రియాల గనిలో టన్నుకు ఉత్పత్తి వ్యయం రూ.30,333 కాగా విక్రయ ధర రూ.2,492 మాత్రమే. ఒక్క గనిలోనే గతేడాది రూ.302 కోట్లకు పైగా నష్టం వచ్చింది. 2025 చివరి నాటికి 22 భూగర్భ గనుల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. వాటి మొత్తం నష్టం రూ.1,924 కోట్లు దాటింది.సింగరేణి పూర్తిగా నష్టాల ఊబిలో చిక్కుకునే ప్రమాదంఇంత నష్టాలలో ఉన్న సింగరేణి గట్టెక్కాలి అంటే ప్రైవేటీకరణ మార్గం అని కేంద్ర బొగ్గు శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో ఎండీవో విధానంలో ప్రైవేట్ కు

Kakinada: తునిలో ఘోర రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు! ఈ వార్తకు సంబంధించిన

అది అట్లాంటిక్ మహాసముద్రపు తీరం.. చుట్టూ దట్టమైన అడవి, పక్షుల కిలకిలా రావాలు, నీటి అలల సప్పుడు తప్ప మనుషుల అలికిడే ఉండదు. వినడానికి ఏదో హర్రర్ సినిమాలో సైలెంట్ ఐలాండ్ లా అనిపించినా.. ఇది అమెరికాలోని మైనే తీరంలో ఉన్న విచ్ ఐలాండ్ (Witch Island) కథ! సరిగ్గా 18 ఎకరాల వైశాల్యం ఉన్న ఈ చిన్న దీవి వెనుక నమ్మశక్యం కాని ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. ఒకప్పుడు సముద్రపు దొంగలు దాక్కునే స్థలంగా, ఆ తర్వాత దెయ్యాల దీవిగా ప్రచారంలోకి వచ్చి.. చివరకు ఒక రహస్య మహిళ చేతి నుంచి పక్షులు, వన్యప్రాణుల రక్షణ కేంద్రంగా ఎలా మారిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.1630ల కాలంలో డిక్సీ బుల్ అనే ప్రసిద్ధ సముద్రపు దొంగ తన దోపిడీ సొత్తును దాచడానికి ఈ దీవిని ఒక సీక్రెట్ స్థావరంగా వాడుకునేవాడని ఇక్కడ ప్రచారంలో ఉన్న పాత కథ. ఆ తర్వాత ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఓడలు ఇక్కడే దాక్కునేవట. కాలక్రమేణా ఈ దీవి పలువురి చేతులు మారింది. అయితే 1887లో డానియల్, అన్నా చిట్టెండెన్ అనే దంపతులు వేలంలో ఈ దీవిని కొనుగోలు చేయడంతో దీని అసలు కథ ప్రారంభమైంది.ఎవరీ విచ్ ఆఫ్ వాల్ స్ట్రీట్?అన్నా అనే మహిళ జీవితం ఒక హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. చిన్నతనంలోనే కష్టాలు అనుభవించి, నాటకరంగంలో రాణించి, ఒక భారీ ఓడ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు ఎలా పెరుగుతాయో ముందుగానే ఊహించి చెప్పే విచిత్ర శక్తి తన వద్ద ఉందంటూ వాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టింది. పెద్ద పెద్ద బ్యాంకర్లు, స్టాక్ బ్రోకర్లు ఆమె జోస్యాలు విని పెట్టుబడులు పెట్టేవారు. దీంతో ప్రతిఒక్కరూ ఆమెను ప్రేమగా, భయంగా విచ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ (వాల్ స్ట్రీట్ మంత్రగత్తె) అని పిలవడం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Vizag School Tragedy News: విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాలలో దారుణమైన ఘటన జరిగింది. టీచర్ దెబ్బలను తట్టుకోలేక ఆరేళ్ల బాలుడు మృతి చెందినట్లు సమాచారం. హోంవర్క్ చేయలేదనే కారణంతో ఉపాధ్యాయురాలు కొట్టడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అసలు కారణం ఇదే? చిన్నారి ప్రణయ్ గుండెపోటుతో చనిపోయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ వర్సిటీకి చెందిన వైస్ ఛాన్స్లర్ చంద్రశేఖర్ మాట్లాడారు. తీవ్ర ఒత్తిడితో గుండె అకస్మాత్తుగా ఆగిపోతుందని..గతంలో ఎంసెట్ విద్యార్థులకు ఇలా జరిగిందని చెప్పారు. ప్రణయ్ తీవ్ర ఒత్తిడికి గురికావడం వల్ల గుండె ఎలక్ట్రికల్ షట్‌డౌన్ అయి చనిపోయి ఉండొచ్చని ఆయన వెల్లడించారు. టీచర్లు పిల్లలతో సున్నితంగా మాట్లాడాలని చంద్రశేఖర్ సూచించారు. ఏం జరిగిందంటే..? విశాఖపట్నం వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్ లో ప్రణయ్ తేజ అనే బాలుడు యూకేజీ చదువుతున్నాడు. అయితే క్లాస్ రూమ్ లో టీచర్ అందరి హోంవర్క్ ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రణయ్ తేజను హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు బెదిరించారు. దాంతో భయపడిపోయిన ప్రణయ్.. కొట్టొద్దు అంటూ విలపించాడు. అయినా ఆ ఉపాధ్యాయురాలు బాలుడి చెంపపై కొట్టింది. దాంతో బెదిరిపోయిన బాలుడు.. క్లాస్ రూమ్ లోనే స్పృహ కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. వెంటనే బాలుడ్ని కేజీహెచ్ కు తరలించారు

నిషేధిత జాబితాలో చేరినవి ఎన్ని? లెక్కలు తేల్చండి.. వివరాలు ఇవ్వండి! 22ఏ సెక్షన్ నేపథ్యంలో తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు సబ్ రిజిస్ర్టార్లతో సంప్రదింపులు జరపాలని సూచన జిల్లాలో రోజువారీ రిజిస్ర్టేషన్ల ప్రక్రియపై ఆరా హైదరాబాద్ సిటీ: 22ఏ కింద నిషేధిత జాబితాలో చూపుతున్న లక్షలాది మంది నిరుపేదల నివాసాలు, ఖాళీ స్థలాలతో పాటు పెద్ద పెద్ద భవనాలను ఆ జాబితా నుంచి బయటపడేసేందుకు జిల్లా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో చర్చిస్తూ, రికార్డులను సరిచూస్తున్నారు. ప్రధానంగా రిజిస్ర్టేషన్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ర్టార్లు తిరస్కరిస్తున్న సర్వే నంబర్లలో ఉన్న మొత్తం భూమి ఎంత.. అందులో ఎంతవరకు ప్రైవేట్ పట్టా స్థలాలు ఉన్నాయి.. వాటి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఎన్ని కోర్టు కేసులు నడుస్తున్నాయి.. అనే వివరాలను ఆరా తీస్తున్నారు. అధికారుల తప్పిదంతో నిషేధిత జాబితాలోకి.. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలలుగా 22ఏ సెక్షన్ తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టంతో 50 ఏళ్లకు పైబడిన ప్రైవేట్ పట్టా భూములు, ఇళ్లు సైతం అనుకోకుండా ప్రోహిబిటెడ్ లిస్టులోకి వెళ్లాయి. అయితే కొంతమంది రెవెన్యూ అధికారుల తప్పిదంతోనే ఈ పొరపాట్లు చోటుచేసుకున్నాయని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులుగా దిద్దుబాటు చర్యలకు దిగింది. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఈ సమస్య తక్కువగా ఉన్నప్పటికీ, గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లో ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నివేదిక ఇచ్చేందుకు హడావుడి వాస్తవంగా జిల్లాలో 12 లక్షలకు పైగా భూములు వివిధ కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఏళ్ల తరబడి ఇవి కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. కౌంటర్లు దాఖలు చేయడంలో కొంతమంది తహసీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మగ్గుతున్నాయి. దీంతో కొంత మంది వాటిని ఆక్రమించుకుని పట్టాలు సైతం పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ

విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాలలో దారుణమైన ఘటన జరిగింది. టీచర్ దెబ్బలను తట్టుకోలేక ఆరేళ్ల బాలుడు మృతి చెందినట్లు సమాచారం. హోంవర్క్ చేయలేదనే కారణంతో ఉపాధ్యాయురాలు కొట్టడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఏం జరిగిందంటే..?విశాఖపట్నం వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్ లో ప్రణయ్ తేజ అనే బాలుడు యూకేజీ చదువుతున్నాడు. అయితే క్లాస్ రూమ్ లో టీచర్ అందరి హోంవర్క్ ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రణయ్ తేజను హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు బెదిరించారు. దాంతో భయపడిపోయిన ప్రణయ్.. కొట్టొద్దు అంటూ విలపించాడు. అయినా ఆ ఉపాధ్యాయురాలు బాలుడి చెంపపై కొట్టింది. దాంతో బెదిరిపోయిన బాలుడు.. క్లాస్ రూమ్ లోనే స్పృహ కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. వెంటనే బాలుడ్ని కేజీహెచ్ కు తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. మరోవైపు బాలుడు ప్రణయ్ తేజ మృతిపై మంత్రి లోకేశ్ స్పందించారు. టీచర్ కొట్టడంతో చిన్నారి మరణించడం బాధాకరం అని అన్నారు. బాధ్యులు, సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ప్రణయ్ తేజ తల్లిదండ్రులకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేనిదాని.. వారికి తన ప్రగాఢ సంతాపం తెలియజేయడంతో పాటు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ లో లోకేశ్ పోస్ట్ పెట్టారు.ఇక ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి.. బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఏ విద్యార్థి కూడా ఇలాంటి విషాదానికి బలికాకుండా ప్రతి పాఠశాలలో పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ మేరకు 'ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026'ను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. నిబంధనలను సరళతరం చేసి, ఉన్నత విద్యా రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తిగా తీసుకొచ్చిన 'జన్ విశ్వాస్' విధానంలో భాగంగానే ఈ సవరణలు చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అన్ని రంగాలకు విస్తరింపజేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఉన్నత విద్యా రంగంలో నియంత్రణలను సులభతరం చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వర్సిటీల సంఖ్య తక్కువగా ఉందని, ఈ సవరణల ద్వారా కొత్త సంస్థలను ప్రోత్సహించవచ్చని తెలిపారు.ఈ బిల్లులో పలు కీలక సవరణలు ప్రతిపాదించారు. ప్రధానంగా, ప్రైవేటు వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని 50 ఎకరాల నుంచి సీఆర్డీఏ, విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో 10 ఎకరాలకు, ఇతర ప్రాంతాల్లో 15 ఎకరాలకు తగ్గించారు. కనీస పెట్టుబడి నిబంధనను పూర్తిగా తొలగించి, కేసును బట్టి నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకునేలా మార్పు చేశారు. ఎండోమెంట్ ఫీజును రూ.5 కోట్లకు పరిమితం చేశారు. బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీగా మారాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం కనీసం 3.01 సీజీపీఏ తప్పనిసరి చేశారు.ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో రెండో మహిళా విశ్వవిద్యాలయంగా 'విష్ణు మహిళా విశ్వవిద్యాలయం' ఏర్పాటుకు మార్గం సుగమమైందని మంత్రి తెలిపారు
Bank Jobs: భారతీయ బ్యాంకింగ్ రంగంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తుండడంతో ఉద్యోగాల కల్పన తీరుతెన్నులు మారుతున్నాయి. ఆర్థిక సంవత్సరం 2025-26లో దేశంలోని టాప్-10 ప్రైవేట్ బ్యాంకులు కలిపి 10,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను తగ్గించుకున్నట్లు ప్రముఖ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. గత కొన్ని ఏళ్లలో భారీ స్థాయిలో నియామకాలు చేపట్టిన బ్యాంకులు ఇప్పుడు సాంకేతికత అందుబాటులోకి రావడంతో తమ సిబ్బంది సంఖ్యను క్రమబద్ధీకరించడం ప్రారంభించాయని అర్థమవుతోంది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.బ్యాంకింగ్‌లో మారుతున్న నియామకాల శైలిగతంలో బ్రాంచుల విస్తరణ, కస్టమర్ సర్వీస్ కోసం భారీగా నియామకాలు చేపట్టిన ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలపై దృష్టి సారించాయి. దేశంలోని ప్రైవేట్ రంగం అతిపెద్ద బ్యాంకులైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వంటి అగ్రగామి బ్యాంకులు తమ డిజిటల్ నెట్వర్క్ వేగవంతం చేశాయి. దీంతో సాంప్రదాయ పనులను చూసే ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.Read Also: AI Layoffs: ఏఐ దెబ్బకు భారీగా ఉద్యోగాల కోత.. మళ్లీ షురూ.. 3 టెక్ దిగ్గజాల షాకింగ్ ప్రకటన!ఏఐ రాకతో ప్రధాన మార్పులుకస్టమర్ల సందేహాలను నివృత్తి చేయడం, రుణాల ముందస్తు ఆమోదం, కేవైసీ ప్రక్రియలు, ప్రాసెసింగ్ పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిసెంట్లు చూసుకుంటున్నాయి. తక్కువ సిబ్బందితో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఎక్కువ మంది వినియోగదారులకు వేగంగా సేవలు అందించడం బ్యాంకులకు సాధ్యమవుతోంది. డేటా ఎంట్రీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి పనులను రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ పర్యవేక్షిస్తుండడంతో బ్యాక్ ఆఫీస్ నియామకాలు దాదాపుగా నిలిచిపోయాయని చెప్పవచ్చు.ఒక్క ఏడాదిలో 10 వేల జాబ్స్ కట్దేశంలోని టాప్-10 ప్రైవేట్ బ్యాంకుల్లో మార్చి 31, 2026తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా

CM Revanth Reddy: తెలంగాణలో 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల సమస్యలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశమైన సీఎం.. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్ భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారి భూమి 22-ఏ జాబితాలో ఉన్నట్లయితే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లోగా ఆ భూమిని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. పరిశీలనలో అది ప్రైవేట్ భూమిగా తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా 22-ఏ జాబితాలో ఉన్న భూములను జిల్లా కలెక్టర్లు క్షుణ్నంగా పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సరైన జాబితాను రూపొందించాలని సీఎం ఆదేశించారు. నిషేధిత భూముల కొత్త జాబితాలో ఎలాంటి తప్పులు, పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భూముల వడపోత, తప్పుల సవరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆస్తుల్లో ఒక్క అంగుళం భూమికి కూడా సమస్య రానివ్వబోమని స్పష్టం చేశారు. భూ యజమానుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 22-ఏ భూముల విషయంలో ప్రజలు దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సీఎం సూచించారు. ఎలాంటి పుకార్లు, కట్టుకథలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారిక ప్రక్రియ ద్వారానే భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లాలో ప్రయివేట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 11న కొండమల్లెపల్లిలోని తన ఇంట్లోనే రూపారెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి మిస్టరీని పోలీసులు ఛేదించినట్టు సమాచారం. ఈ దారుణానికి ఒడిగట్టిన హంతకులను అదే పాఠశాలలో చదివిన కొండమల్లెపల్లి మండలానికి చెందిన వంశీ, అనిల్ అనే విద్యార్థులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. డబ్బుల కోసం ఆశపడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం.హత్య అనంతరం వీరు గోవాకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనలో విద్యార్థులే హంతకులుగా ఉండటం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పోలీసులు దాదాపు 80 మందిని విచారించిన అనంతరం ఆ విద్యార్థులే హత్య చేశారని గుర్తించినట్లు సమాచారం. రూపారెడ్డిను హత్యచేసిన అనంతరం ఆమె ఇంట్లోని సుమారు రూ.4 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రూపారెడ్డిని హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .. దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ప్రిన్సిపాల్‌ను హత్య చేసింది నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులేనని దర్యాప్తులో గుర్తించారు. జల్సాలకు అలవాటుపడి డబ్బుకోసమే ఈ దారుణానికి పాల్పడినట్టు వెల్లడైంది. ఈ హత్యకు దారితీసిన పరిస్థితులపై మరింత లోతుగా దర్యాప్తు సాగుతోందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.కొండమల్లేపల్లి జేబీ కాలనీలో రూపారెడ్డి నివాసం ఉంటున్నారు. నాగార్జున గ్రామర్ స్కూల్ నిర్వహకురాలైన ఆమె ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్ శివారులోని గుర్రంగూడలోనూ వీరికి సొంత ఇల్లు ఉంది. ఆమె కుమారుడు అభినవ్ రెడ్డి హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సెలవుల్లో హైదరాబాద్‌కు వెళ్లి కుమారుడితోపాటే గడుపుతారు. ఈ క్రమంలోనే ఆగస్టు 8 నుంచి 10 వరకు వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో… భర్తతో కలిసి హైదరాబాద్‌లోని తన కుమారుడి వద్దకు ఆమె వెళ్లారు. తిరిగి ఆగస్టు 11న

ప్రకాశం జిల్లాలోని మైనింగ్ క్వారీలో జరిగిన ప్రమాదం కేసులో అనుకూల నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో పలువురి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను అరెస్ట్ చేసింది. అతడితో పాటు ప్రైవేట్ మైనింగ్ సంస్థ ప్రతినిధి, కన్సల్టెంట్‌ను అరెస్ట్ చేశారు. అమరావతి, ఆగస్టు 18: ప్రకాశం జిల్లాలో మైనింగ్ క్వారీలో జరిగిన ప్రమాదం కేసులో అనుకూల నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో పలువురి ప్రమేయం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గుర్తించింది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే ప్రైవేట్ మైనింగ్ సంస్థ ప్రతినిధి, కన్సల్టెంట్‌ను అరెస్ట్ చేశారు. వీరిని విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. గతంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌కు రూ. లక్ష లంచం ఇచ్చినట్లు కూడా సీబీఐ గుర్తించింది. అనుకూల నివేదికతో పాటు మైనింగ్ సంస్థ నుంచి త్రైమాసిక లంచాల కోసం రూ. 2 లక్షలు ఏర్పాటు చేసినట్లు కనుగోంది. మైనింగ్ క్వారీ ప్రమాదంలో అనుకూల నివేదిక కోసం రూ. 2 లక్షల నగదు తీసుకుంటూ డిప్యూటీ డైరెక్టర్‌ను సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ నగదును సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒంగోలు, కడప, హైదరాబాద్‌లలో నిందితులకు చెందిన ఇళ్లలో కూడా సీబీఐ సోదాలు చేపట్టింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఆలయ ఉద్యోగాల్లో జోనల్ విధానం లేదు.. మెరిట్‌కే ప్రాధాన్యం: మంత్రి ఆనం రామనారాయణ ఆ మున్సిపాలిటీల విలీన ప్రక్రియ... స్థానిక ఎన్నికల తర్వాతే: సీఎం చంద్రబాబు

స్టూడెంట్ ట్రైబ్ ఈవెంట్లో UPEL.. యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు హైదరాబాద్: ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్ రంగంలో సేవలు అందిస్తున్న UPEL Private Limited యువతతో మరింతగా కనెక్ట్ అయ్యేందుకు స్టూడెంట్ ట్రైబ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయిన UPEL టీమ్.. యువతలోని ప్రతిభను గుర్తించి, వారికి పరిశ్రమకు సంబంధించిన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అందించేందుకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం Electronics, Electrical, ECE, EEE, Mechatronics, Automation వంటి టెక్నికల్ విభాగాలతో పాటు Digital Marketing, Content Creation, Video Production, Social Media, Business Development, Sales వంటి విభాగాల్లో కూడా ఇంటర్న్‌షిప్ అవకాశాలను UPEL అందించనుంది. టెక్నికల్ విభాగాల్లో ఎంపికయ్యే విద్యార్థులకు VFDs, PLCs, HMIs, Servo Drives, CNC Systems, PCB Repair, Control Panels, Industrial Automation, Troubleshooting వంటి అంశాలపై ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందే అవకాశం ఉంటుంది. అదే సమయంలో క్రియేటివ్ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు సోషల్ మీడియా కంటెంట్, రీల్స్, వీడియో ప్రొడక్షన్, డిజిటల్ మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్ మరియు B2B కంటెంట్ వంటి విభాగాల్లో పనిచేసే అవకాశం కల్పించనున్నారు. ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన క్లిష్టమైన అంశాలను యువతకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తూ, రోజువారీ టెక్నికల్ కంటెంట్‌ను రూపొందించే కార్యక్రమాన్ని కూడా UPEL చేపట్టనుంది. ఇందులో భాగంగా టెక్నికల్ నాలెడ్జ్‌తో పాటు కెమెరా ముందు కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలిగే యువ ప్రతిభకు ప్రత్యేక అవకాశాలు కల్పించనున్నారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు రియల్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ వర్క్ కల్చర్, కెరీర్‌పై అవగాహన కల్పించడమే ఈ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని UPEL Founder అజయ్ కుమార్ ఇనమడుగు మరియు CEO నరేష్ సిలివేరు తెలిపారు. స్టూడెంట్ ట్రైబ్ వంటి యువత వేదికలతో కలిసి పనిచేయడం ద్వారా విద్యార్థులు–పరిశ్రమల మధ్య వారధిగా

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్, ఆగస్టు 18: నగరంలోని అత్తాపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. శ్రీలత(28) అనే మహిళ.. జ్వరం కారణంగా నిన్న(సోమవారం) ప్రైవేటు హాస్పిటల్లో చేరింది. నిన్నటి నుంచి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అయితే రాత్రి పరిస్థితి విషమంగా ఉందంటూ ఐసీయూకు తరలించిన వైద్యులు.. ఆ తర్వాత శ్రీలత మృతి చెందినట్లు ప్రకటించారు. మహిళ మృతితో కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందంటూ బంధువులు ఆరోపించారు. మృతురాలి బంధువులు.. ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆస్పత్రి వద్ద బందోబస్తు నిర్వహించారు. మృతురాలి బంధువులకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు మత్స్యకారుల గల్లంతు ఘటన.. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలంటూ సీఎం ఆదేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు అభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థులకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ సంస్థ భారీ ఊరట కలిగించింది. వైద్య విద్యా కోర్సుల కాలపరిమితి కేవలం నాలుగున్నర సంవత్సరాలే అయినందున.. విద్యార్థుల నుంచి నాలుగున్నరేళ్లకే మాత్రమే ట్యూషన్ ఫీజు వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు నియమాలకు విరుద్ధంగా ఐదేళ్ల పూర్తి కాలానికి ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు కళాశాలలు.. చివరి ఆరు నెలలకు అదనంగా తీసుకున్న మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఆజ్ఞాపించింది. టీఏఎఫ్ఆర్సీ జారీ చేసిన ఈ ఆదేశాలతో ప్రైవేట్ యాజమాన్యాల అదనపు ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట పడినట్లయింది.గత కొంతకాలంగా ప్రైవేట్, మైనారిటీ, నాన్-మైనారిటీ వైద్య కళాశాలలు చివరి ఆరు నెలల సమయానికి కూడా పూర్తి ఏడాది ఫీజు వసూలు చేస్తుండటంతో తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. దీనివల్ల బి-క్యాటగిరీ విద్యార్థులపై దాదాపు రూ.6-7 లక్షలు, సి-క్యాటగిరీ విద్యార్థులపై రూ.13-15 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. ఈ అన్యాయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా.. సమస్యను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు టీఏఎఫ్ఆర్సీని ఆదేశించింది. ఈ నేపథ్యంతో టీఏఎఫ్ఆర్సీ 2021-23, 2023-26 బ్లాక్ పీరియడ్ల వారీగా కోర్సు ఫీజు, వార్షిక ఫీజులతో పాటు చివరి ఆరు నెలలకు చెల్లించాల్సిన రుసుములపై పూర్తి స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం.. 2021-23 బ్లాక్ పీరియడ్‌లో బీ-క్యాటగిరీ ఏడాదికి రూ.12.50 లక్షల ఫీజు ఉంటే, చివరి ఆరు నెలలకు కేవలం రూ.6.25 లక్షలు మాత్రమే వసూలు చేయాలి. అలాగే 2023-26 బ్లాక్ పీరియడ్‌కు ఏడాదికి రూ.13 లక్షల చొప్పున నిర్ణయించగా.. చివరి ఆరు నెలలకు రూ.6.50 లక్షలు మాత్రమే తీసుకోవాలి. ప్రభుత్వం 2026-29 బ్లాక్ పీరియడ్‌కు కూడా పాత ఫీజులనే కొనసాగించడంతో ఈ ఏడాది ప్రవేశాలు పొందే విద్యార్థులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. అదనంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ కాలేజీలలో అధిక ఫీజులపై ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ కార్యదర్శి సూర్యచంద్రరావు సీరియస్‌గా స్పందించారు. కాలేజీలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఉంచుకోవడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేశారు. రాష్ట్రంలో పలు ప్రైవేట్ కాలేజీలు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విద్యార్థులు, మీడియా ద్వారా ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ దృష్టికి వచ్చిందన్నారు.రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలు ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ నిర్ణయించిన కన్వీనర్ కోటా ఫీజు కంటే ఎక్కువ డిమాండ్ చేయకూడదన్నారు. ప్రవేశాల సమయంలో, కోర్సు పూర్తయిన తర్వాత, కోర్సు మధ్యలో విద్యార్థులు వెళ్లిపోయేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇచ్చేయాలని.. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని, గుర్తింపు రద్దుచేయాలని యూనివర్సిటీలకు సిఫార్సు చేస్తామన్నారు. ప్రైవేట్ కాలేజీలు నిబంధనల మేరకు ఫీజులు వసూలు చేయాలని సూచించారు.ఈఏపీసెట్‌లో కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో చేరే సమయంలో రకరకాలుగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. వాస్తవానికి కన్వీనర్ కోటా సీట్లు పొంది విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తోంది. అందుకే ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అలాట్మెంట్ లెటర్లలో విద్యార్థులు చెల్లించాల్సిన కాలేజీ ఫీజు ‘0’ అని ప్రస్తవించారు. కొన్ని కాలేజీలలో మాత్రం ప్రభుత్వం ఫీజులు ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియదు కాబట్టి మొదట కొంత ఫీజు చెల్లించాలని చెబుతున్నారు. రీయింబర్స్మెంట్ ప్రభుత్వం నుంచి రాగానే ఆ డబ్బులు తిరిగి ఇస్తామని చెబుతున్నారు. ఇలా ఫీజులు కట్టమని అడగటంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ అంశంపై ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ స్పందించింది. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కన్వీనర్ కోటాలో ప్రైవేట్ కాలేజీలలో చేరిన విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు ఫీజులు

ఆమె లక్నోలో చదువుకున్న ఓ ఉన్నత విద్యావంతురాలు.. బాబా అణు పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉద్యోగం.. ఆ తర్వాత సివిల్స్ వైపు అడుగులు.. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా కీలక బాధ్యతలు. ఇదీ నిధి తివారీ ప్రయాణం. శాస్త్రవేత్తగా మొదలైన ఆమె కెరీర్.. విదేశాంగం, భద్రతా వ్యవహారాల్లో పనిచేసే స్థాయికి ఎలా చేరిందో చూస్తే ఆసక్తికరమే.నిధి తివారీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందినవారు. అక్కడే పాఠశాల విద్య, డిగ్రీ పూర్తి చేశారు. బీఎస్సీ తర్వాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. ఈ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించారు.బార్క్‌లో శాస్త్రవేత్తగా..చదువు పూర్తయ్యాక బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్)లో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. అయితే సివిల్స్ సర్వీసులోకి వెళ్లాలన్న పట్టుదలతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. 2008లో బార్క్ నుంచి బయటకు వచ్చి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యారు.ఒక్కసారి కాదుసివిల్స్ ప్రయాణం ఆమెకు వెంటనే విజయాన్ని అందించలేదు. 2012లో జరిగిన పరీక్షలో ఆమె పేరు వెయిటింగ్ లిస్ట్‌లో వచ్చింది. అయినా ప్రయత్నం ఆపలేదు. 2013లో మళ్లీ పరీక్ష రాశారు. ఈసారి ఆల్ ఇండియా స్థాయిలో 96వ ర్యాంకు సాధించారు. దీంతో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికై 2014 బ్యాచ్‌లో చేరారు.విదేశాంగం నుంచి పీఎంవోకుఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేసే సమయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖలో నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై పనిచేశారు. విదేశాంగ విధానం, అంతర్జాతీయ భద్రతపై ఆమెకు వచ్చిన అనుభవం తర్వాత పీఎంవోలో కీలకంగా ఉపయోగపడింది.2022 నవంబర్‌లో పీఎంవోలో అండర్ సెక్రటరీగా చేరారు. ఆ తర్వాత

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పేట్ ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్, ఆగస్టు 13: జిల్లాలోని ఆర్మూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పేట్ ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేటు బస్సు టైర్ పంక్చర్ అవడంతో బస్సును డ్రైవర్ రోడ్డుపై నిలిపాడు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు బస్సు ఎదుట ఉన్న డివైడర్‌పై కూర్చుకున్నారు. ఇదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన కంటైనర్ లారీ.. వెనుక నుంచి బస్సును ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు ముందు డివైడర్‌పై కూర్చున్న మహిళలపైకి బస్సు టైర్ ఎక్కడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మహిళల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేవంత్.. నువ్వు ముఖ్యమంత్రివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా: హరీశ్ రావు సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు జీఏడీకి అప్పగింత

దేశంలోని మెట్రో నగరాల్లో ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్న గది అద్దెలకు పరిమితి విధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఆయా ఆసుపత్రుల సమీపంలోని 3-స్టార్ హోటళ్ల సగటు అద్దె కంటే ఈ ఛార్జీలు అధికంగా ఉండకూడదని స్పష్టం చేసింది. పెరుగుతున్న వైద్య ఖర్చులను అదుపులోకి తీసుకువచ్చి, రోగులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కమిటీ ఈ కీలక సూచనలు చేసింది.ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం తన 176వ నివేదికలో ఈ సిఫార్సులను పొందుపరిచింది. 'ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల అందుబాటు-స్తోమత' పేరిట రూపొందించిన ఈ నివేదికను ఆగస్టు 7న పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. ఆసుపత్రుల్లోని మౌలిక సదుపాయాలు, సేవలను బట్టి గది అద్దెల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, తక్షణమే వీటిని హేతుబద్ధీకరించాలని కమిటీ సూచించింది. ఈ నిబంధన కేవలం ప్రాథమిక గది అద్దెకే వర్తిస్తుందని, రెసిడెంట్ డాక్టర్, నర్సింగ్, భోజనం ఖర్చులను ఆసుపత్రులు అదనంగా వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.జాతీయ నమూనా సర్వే (2025) గణాంకాలను కమిటీ ఈ సందర్భంగా ఉటంకించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సగటు చికిత్స వ్యయం రూ. 6,631గా ఉండగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో అది రూ. 50,508గా ఉందని పేర్కొంది. ఉదాహరణకు, ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సింగిల్ రూమ్ అద్దె రోజుకు రూ. 6,000 నుంచి రూ. 12,000 వరకు ఉండగా, సమీపంలోని 3-స్టార్ హోటళ్లలో అది రూ. 2,500 నుంచి రూ. 4,500 మధ్యే ఉందని నివేదికలో

తెలంగాణలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్-మైనారిటీ, మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూసే విద్యార్థులకు సర్కారు ఊరటనిచ్చింది. 2026-29 బ్లాక్ పీరియడ్‌కు నోటిఫికేషన్ విడుదల.. ప్రైవేట్, మైనారిటీ, ఆర్మీ డెంటల్ కాలేజీలకు వర్తింపు హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్-మైనారిటీ, మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూసే విద్యార్థులకు సర్కారు ఊరటనిచ్చింది. 2026-29 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను ఖరారు చేస్తూ కాళోజీ హెల్త్ యూనివర్శిటీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.98 ప్రకారం.. రాబోయే నాలుగేళ్ల కాలానికి పాత ఫీజులే కొనసాగుతాయని స్పష్టం చేసింది. 2023-26 బ్లాక్ పీరియడ్ కోసం గతంలో జీవో నం. 106,132 ద్వారా నిర్ణయించిన ఫీజులే ఈ కొత్త కాలానికి కూడా వర్తిస్తాయని యూనివర్సిటీ రిజిస్ర్టార్ వెల్లడించారు. కాగా తెలంగాణ విద్యా సంస్థల చట్టం 1983లోని సెక్షన్ 7 ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలతో పాటు సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సె్సలోనూ ఇవే ఫీజులు అమలులో ఉంటాయి. ఒకవేళ 2026-29 మధ్య కాలంలో ఏదైనా కొత్త కాలేజీలకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తే, ఆ సంస్థలో అప్పటికే అమల్లో ఉన్న కనిష్ట ఫీజును మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించింది. రాష్ట్రంలో మొత్తం 27 ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటిల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ కోర్సులో ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా (కేటగీరీ-ఎ) కింద ఏడాదికి రూ.60 వేలు ఫీజును ఖరారు చేశారు. మేనేజ్మెంట్ కోటా (కేటగీరీ-బి) కింద వివిధ కళాశాలల్లో రూ.11.55 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఉండాలని నిర్ణయించారు. అపోలో, చల్మెడ, కామినేని నార్కెట్‌పల్లి, కామినేని

ప్రతిష్ఠ పరంగా ఏపీ పాలిటిక్స్ లో వైసీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఈ రెండేళ్లలో వైసీపీ రాష్ట్రంలో బలం పుంజుకునే దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అసెంబ్లీకి ముఖం చాటేయడం దగ్గర నుంచి, వైసీపీ అధినేత జగన్ చుట్టపు చూపుగా రాష్ట్రానికి రావడం వరకూ వైసీపీ చర్యలన్నీప్రజలకు దూరం జరిగేలాగే ఉన్నాయి. వైసీపీ అధినేత అడపాదడపా చేపట్టే నిరసన కార్యక్రమాలలోనూ ఆ పార్టీ జనాలకు చేరువకావడం అటుంచి అతి తీరుతో దూరం అవుతూనే వస్తోంది. తాజాగా మెగా డీఎస్సీలో అక్రమాలంటూ చేపట్టిన నిరసన కార్యక్రమాలలో వైసీపీ తెగింపు ఏ స్థాయికి చేరిందో తేటతెల్లమైంది. మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలను తప్పుపడుతూ... మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు భారీ ప్రదర్శన నిర్వహించి, వైసీపీ ఆందోళనలకు వ్యతిరేకంగా నినదించారు. ఆత్మగౌరవం పేరుతో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు నిరసనకు దిగడంతో.. వైసీపీ కంగుతింది. అయినా మెగా డీఎస్సీ వ్యతిరేక ఆందోళన ఆపలేదు సరికదా.. ఏకంగా తమ నిరసనలకు సొంతంగా ప్రైవేట్ పోలీసు పార్టీనే ఏర్పాటు చేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ప్రైవేటు పోలీస్ సైన్యం రంగంలోకి దిగింది. పోలీసులు, చిహ్నాలు ధరించిన ప్రైవేటు పోలీసు పార్టీ వైసీపీ నిరసనల్లో ప్రత్యక్షం కావడంతో.. నిజమైన పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ ప్రైవేట్ పోలీసులను అదుపులోనికి తీసుకున్నారు. ఎందుకంటే.. చట్ట ప్రకారం.. ప్రభుత్వ పోలీస్ యూనిఫామ్‌ను గానీ, పోలీస్ చిహ్నాలను గానీ పోలి ఉండే దుస్తులు ధరించడం నేరం. పోలీస్ శాఖ ఉపయోగించే ప్రత్యేకమైన బిల్లలు, స్టార్లు , టోపీలు వంటివి ప్రైవేటు వ్యక్తులు వాడటం శిక్షార్హమైన నేరం. ఆ నేరం చేసినందునే.. పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగగా వైసీపీ ప్రైవేటు పోలీసులకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నెటిజనులు వైసీపీ తెగింపునకు, అరాచకత్వానికీ

బాంకీపూర్ ఉప ఎన్నికలో విజయం సాధించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ యువతకు కీలక హామీ ఇచ్చారు. వచ్చే రెండేళ్లలో నియోజకవర్గానికి చెందిన కనీసం 10 వేల మంది యువతకు ప్రైవేట్, కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. ఇందుకోసం విద్యార్హతలు ఉన్న యువత బయోడేటాలు, సీవీలను తన కార్యాలయంలో అందజేయాలని కోరారు.బాంకీపూర్‌లో మంగళవారం నిర్వహించిన పలు కృతజ్ఞత సభల్లో ప్రశాంత్ కిశోర్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని తాను హామీ ఇవ్వడం లేదని చెప్పారు. అయితే తన పరిచయాలు, నెట్‌వర్క్‌ను ఉపయోగించి దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు లభించేలా చూస్తానని తెలిపారు.బిహార్‌లో జనసురాజ్ వ్యవస్థ బలపడిన తర్వాత ఉపాధి కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని ప్రశాంత్ కిశోర్ అన్నారు. నియోజకవర్గంలో పిల్లల విద్యకు పునాది వేసే చర్యలు చేపడతానని చెప్పారు. నిలిచిపోయిన వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.రేషన్ కార్డు కోసం లంచం అడిగే పరిస్థితి లేకుండా చేస్తానని చెప్పారు. ఇందుకు మూడు నెలల సమయం ఇవ్వాలని ప్రజలను కోరారు. రేషన్ కార్డు ఉన్నవారికి ప్రస్తుతం అందుతున్న నాలుగు కిలోల ధాన్యాన్ని ఐదు కిలోలకు పెంచుతామని తెలిపారు. వృద్ధుల పింఛన్ సమస్యలను మూడు నెలల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.బాంకీపూర్ ఉప ఎన్నిక ఫలితాలతో బిహార్ రాజకీయాల్లో మార్పు కనిపిస్తోందని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ‘ఎన్కౌంటర్ల’ గురించి కాకుండా

ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చులతో సతమతమవుతున్న సామాన్యులకు పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో నగరాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో బేసిక్ రూమ్ రెంట్ అదే ప్రాంతంలోని 3-స్టార్ హోటళ్లలో వసూలు చేస్తున్న సగటు అద్దెను మించకూడదని సిఫారసు చేసింది. న్యూఢిల్లీ: ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చులతో సతమతమవుతున్న సామాన్యులకు పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో నగరాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో బేసిక్ రూమ్ రెంట్ అదే ప్రాంతంలోని 3-స్టార్ హోటళ్లలో వసూలు చేస్తున్న సగటు అద్దెను మించకూడదని సిఫారసు చేసింది. ఆస్పత్రుల బిల్లుల్లో గది అద్దెలు భారీగా ఉండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసం ఉందని కమిటీ పేర్కొంది. ప్రైవేటు ఆస్పత్రుల బిల్లింగ్ విధానాన్ని పరిశీలించి గది అద్దెలను అత్యవసర ప్రాతిపదికన హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు పెద్ద మెట్రో నగరాల్లోని ఆస్పత్రి సమీప ప్రాంతాల్లో ఉన్న 3-స్టార్ హోటళ్ల సగటు గది అద్దెను ప్రామాణికంగా తీసుకుంది. దాని కంటే ఎక్కువగా ఆస్పత్రి బేసిక్ రూమ్ ఛార్జీ ఉండకూడదని సూచించింది. ఈ ప్రమాణాన్ని ప్రైవేటు ఆస్పత్రులకు తప్పనిసరి చేయాలని సిఫారసు చేసింది. ఈ సందర్భంగా ఆస్పత్రి గది, హోటల్ గది ఒక్కటి కాదని స్పష్టం చేసింది. ఆస్పత్రి గదితోపాటు నర్సింగ్, రోగి పర్యవేక్షణ, ఇన్ఫెక్షన్ నియంత్రణ, అత్యవసర వైద్య సేవలు, ఇతర వైద్య మౌలిక సదుపాయాలు అందుతాయని పేర్కొంది. 3-స్టార్ హోటల్ ధరను పోలికగా తీసుకోవడం కేవలం గది అద్దెను హేతుబద్ధీకరించేందుకేనని తెలిపింది. అలాగే ప్రైవేటు వైద్య రంగంలో బిల్లింగ్ పారదర్శకత పెంచడంపైనా కమిటీ దృష్టి పెట్టింది. ముఖ్యమైన చికిత్సలు, శస్త్రచికిత్సలు, పరీక్షలకు సంబంధించిన ధరలను స్పష్టంగా అందుబాటులో ఉంచాలని సూచించింది. పెద్ద చికిత్సలకు ముందు రోగులు, వారి కుటుంబ సభ్యులకు మొత్తం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ(పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్నర్షిప్) పాలసీ -2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. అమరావతి, ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ(పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్నర్షిప్) పాలసీ -2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర రంగాల్లో పీపీపీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రూ.1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టుల పైప్‌లైన్ ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2026- 27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,500 కోట్ల స్టేట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF)ను ప్రభుత్వం కేటాయించింది. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక మూలధన అవసరాలను VGF ద్వారా సర్కార్ భర్తీ చేయనుంది. ప్రాజెక్టుల ప్లానింగ్, అప్రైజల్, ప్రొక్యూర్మెంట్, అమలు, పర్యవేక్షణకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రారంభ దశలో ఆర్థికంగా లాభదాయకంగా లేని, భవిష్యత్తులో ఆదాయాన్ని సమకూర్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులకు ప్రాజెక్ట్ వయబిలిటీ బ్రిడ్జి ఫండ్ ద్వారా వడ్డీలేని రుణాన్ని అందించే విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రైవేట్ రంగ పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యాలను వినియోగించుకోవడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. నాణ్యమైన ప్రజా సేవలను అందించడంతో పాటు పెట్టుబడిదారులకు అనుకూలమైన మౌలిక వసతుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పీపీపీ విధానాలను పరిశీలించడంతో పాటు, సంబంధిత స్టేక్హోల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పాలసీని రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు పీపీపీ పాలసీ-2026ను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. తాడిపత్రిలో హైటెన్షన్ లండన్‌లో మంత్రి నారాయణ
అనంతపురం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పామిడి మండలం పొగరూరు సమీపంలోని బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ - ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో రెండూ కూడా కల్వర్టుపై నుంచి కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 32 మందిలో 20 మందికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. అటువైపు వెళ్తున్న వారు చూసి విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పడంతో, సహాయక చర్యలు మొదలయ్యాయి.హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న లారీ - ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనతో రెండు వాహనాలు కూడా కల్వర్టులోకి పడిపోయాయి. స్థానికులు వెంటనే రెండు వాహనాల డ్రైవర్లను బయటకు తీశారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పామిడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం, నిద్ర మత్తే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఘటనకు కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు

సాక్షి,అనంతపురం: హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని పామిడి మండలం పొగరూరు పరిధిలో వేగంగా ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్రైవేట్ బస్సు నియంత్రణ కోల్పోయి, హైవేపై ఉన్న ఒక కల్వర్టు పైనుంచి కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా నలిగిపోవడంతో, బస్సు, ఐషర్ వాహనాల డ్రైవర్లు క్యాబిన్లలోనే ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమించి, వాహనాల భాగాలను కట్ చేసి ఇద్దరు డ్రైవర్లను సురక్షితంగా వెలుపలికి తీశారు. గాయపడిన డ్రైవర్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులందరినీ వెంటనే చికిత్స నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్ హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ (ఫొటోలు) నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఐషర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం, ఆగస్టు 09: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు గ్రామ సమీపంలోని హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఐషర్ వాహనం ఢీకొన్నాయి. దీంతో కల్వర్టుపై నుంచి ఆ రెండు వాహనాలు కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులతోపాటు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను పామిడిలోని ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు బస్సు- ఐషర్ వాహనాల్లో ఇరుక్కుపోయిన డ్రైవర్లను స్థానికుల సహాయంతో పోలీసులు రక్షించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతి వేగంతోపాటు నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు