Bank Jobs: భారతీయ బ్యాంకింగ్ రంగంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తుండడంతో ఉద్యోగాల కల్పన తీరుతెన్నులు మారుతున్నాయి. ఆర్థిక సంవత్సరం 2025-26లో దేశంలోని టాప్-10 ప్రైవేట్ బ్యాంకులు కలిపి 10,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను తగ్గించుకున్నట్లు ప్రముఖ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. గత కొన్ని ఏళ్లలో భారీ స్థాయిలో నియామకాలు చేపట్టిన బ్యాంకులు ఇప్పుడు సాంకేతికత అందుబాటులోకి రావడంతో తమ సిబ్బంది సంఖ్యను క్రమబద్ధీకరించడం ప్రారంభించాయని అర్థమవుతోంది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.బ్యాంకింగ్‌లో మారుతున్న నియామకాల శైలిగతంలో బ్రాంచుల విస్తరణ, కస్టమర్ సర్వీస్ కోసం భారీగా నియామకాలు చేపట్టిన ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలపై దృష్టి సారించాయి. దేశంలోని ప్రైవేట్ రంగం అతిపెద్ద బ్యాంకులైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వంటి అగ్రగామి బ్యాంకులు తమ డిజిటల్ నెట్వర్క్ వేగవంతం చేశాయి. దీంతో సాంప్రదాయ పనులను చూసే ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.Read Also: AI Layoffs: ఏఐ దెబ్బకు భారీగా ఉద్యోగాల కోత.. మళ్లీ షురూ.. 3 టెక్ దిగ్గజాల షాకింగ్ ప్రకటన!ఏఐ రాకతో ప్రధాన మార్పులుకస్టమర్ల సందేహాలను నివృత్తి చేయడం, రుణాల ముందస్తు ఆమోదం, కేవైసీ ప్రక్రియలు, ప్రాసెసింగ్ పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిసెంట్లు చూసుకుంటున్నాయి. తక్కువ సిబ్బందితో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఎక్కువ మంది వినియోగదారులకు వేగంగా సేవలు అందించడం బ్యాంకులకు సాధ్యమవుతోంది. డేటా ఎంట్రీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి పనులను రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ పర్యవేక్షిస్తుండడంతో బ్యాక్ ఆఫీస్ నియామకాలు దాదాపుగా నిలిచిపోయాయని చెప్పవచ్చు.ఒక్క ఏడాదిలో 10 వేల జాబ్స్ కట్దేశంలోని టాప్-10 ప్రైవేట్ బ్యాంకుల్లో మార్చి 31, 2026తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 10,114 ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. అంతకు ముందు ఏడాది చూస్తే ఏకంగా 9,637 ఉద్యోగాలు తగ్గాయి. బ్యాంకుల వార్షిక నివేదికల ఆధారంగా ఎకనామిక్ టైమ్స్ ఈ మేరకు డేటాను క్రోడీకరించింది. ఆర్థిక సంవత్సరం 2023-24 సమయానికి బ్యాంకుల్లో మొత్తం 83,645 మంది ఉద్యోగులు ఉండగా ఆ తర్వాత నుంచి పరిస్థితులు మారిపోయినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-4 బ్యాంకుల్లోనే ఏకంగా 14,364 ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఒక్క ఐసీఐసీఐ బయాంకులోనే 6,633 ఉద్యోగులు తగ్గారు. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3,346, యాక్సిస్ బ్యాంక్ 3,116, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1,269 ఉద్యోగాలకు కోత పెట్టింది.టాప్ -10 బ్యాంకుల డేటా ఆర్థిక సంవత్సరం మొత్తం ఉద్యోగుల సంఖ్య నికర జమ/ కోత 2022-23 6,75,558 - 2023-24 7,59,203 +83,645 2024-25 7,49,566 -9,637 2025-26 7,39,452 -10,114





