
పార్లమెంటులో విదేశీ సహకార నియంత్రణ బిల్లుపై రచ్చరచ్చ.. ఇంతకేం జరిగిందంటే
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Parliament Foreign Contribution Regualtion ACT: విదేశీ సహకార నియంత్రణ బిల్లుపై చర్చ సమయంలో పార్లమెంటులో గందరగోల పరిస్థితి నెలకొంది. విదేశీ విరాళాల నిబంధనలను కఠినతరం చేసే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకు రావాలనుకుంటే విపక్షాలు అడుగడుగునా అడ్డుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని విపక్ష నేతలు ఎండగట్టారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. మైనారిటీలు, ఎన్జీవోలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం దీనిని తీసుకొచ్చిందన్నారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. దీంతో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. చట్టపరమైన కార్యాచరణ లేకుండా విదేశీ నిధులను దేశంలోకి అనుమతించలేమన్నారు. సభను విపక్షాలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం మంచిదికాదు - రిజిజు.. దేశీయంగా స్వచ్ఛంద సేవ ముసుగులో విదేశీ విరాళాలు దుర్వినియోగం గాకుండా… సమాజాభివృద్ధిలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నియంత్రణ చట్టం పనిచేస్తుందని కేంద్ర మంత్రి రిజిజు సభకు వివరించారు. కేంద్రప్రభుత్వం ఉన్నతాశయంతో తెచ్చే చట్టం మైనారిటీలను, ఎన్జీవోలను ఇబ్బందిపెట్టే అంశాలు లేవని స్పష్టంచేశారు. వాస్తవిక విషయాలను తెలుసుకోకుండా విపక్షాలు సభను తప్పుదోవ పట్టించడం తగదని కేంద్ర మంత్రి రిజిజు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది భారతదేశంలోని వ్యక్తులు, సంఘాలు , ఎన్జీవోలు విదేశీ విరాళాలను స్వీకరించడాన్ని నియంత్రించే ఒక చట్టం. దేశ