
ఆల్‌టైం రికార్డ్ ధరకు జైలర్ 2 రైట్స్? రజనీ మూవీకి ఆంధ్రా- నైజాం హక్కులు ఎన్ని కోట్లంటే?
ఆల్‌టైం రికార్డ్ ధరకు జైలర్ 2 రైట్స్? రజనీ మూవీకి ఆంధ్రా- నైజాం హక్కులు ఎన్ని కోట్లంటే?
© 2026 nimisham.in

ఆల్‌టైం రికార్డ్ ధరకు జైలర్ 2 రైట్స్? రజనీ మూవీకి ఆంధ్రా- నైజాం హక్కులు ఎన్ని కోట్లంటే?

జైలర్ 2 రీ షూట్స్ వెనక అసలు కారణం అదేనా..?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్-2పై (Jailar 2) ఆసక్తికరమైన గాసిప్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో 'జైలర్ 2' ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2023లో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'జైలర్' మూవీకి సీక్వెల్ ఇది. దసరా కానుకా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మూవీ వాయిదా పడనుందని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.'జైలర్ 2' సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పెండింగ్ ఉండటంతో సినిమా అనుకున్న తేదీకి విడుదల కావడం కష్టమే అనే కామెంట్స్ వచ్చాయి. పోస్ట్ పోన్ అవుతుందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీటికి చెక్ పెడుతూ మేకర్స్ బిగ్ అప్డేట్ అందించారు. ముందుగా ప్రకటించినట్లే 2026 అక్టోబర్ 15న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఇందులో రజనీ చేతిలో తుపాకీ పట్టుకొని ఇంటెన్స్ గా చూస్తూ నిలబడి ఉన్నారు.'జైలర్ 2' నుంచి ఇటీవల వచ్చిన 'అలా బోలేలో' సాంగ్ వైరల్ అవుతోంది. అంతకముందు రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ టీజర్, రిలీజ్ డేట్ గ్లింప్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణ, మిథున్ చక్రవర్తి, ఎస్జే సూర్య, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు, మిర్నా, అన్నా రాజన్, యోగిబాబు, జతిన్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, జాకీ ష్రాఫ్ స్పెషల్ క్యామియో రోల్స్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు

సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్ 2 రిలీజ్ పై గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ చాలా సైలెంట్ గా సాగుతుండటం, రీషూట్స్ జరుగుతున్నాయనే పుకార్లు రావడంతో పాటు దసరా రేసులో తెలుగు సినిమాలు కూడా పోటీ పడుతుండటంతో జైలర్ 2 వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ పై చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. సినిమా పోస్ట్‌పోన్ అవుతుందంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలకు సన్ పిక్చర్స్ తమదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టింది. చిత్ర యూనిట్ అఫిషియల్ గా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, సినిమాను 2026 అక్టోబర్ 15నే గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ విడుదల చేసిన లేటెస్ట్ పిక్చర్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. టైగర్ ముత్తువేల్ పాండియన్ లుక్ లో రజనీకాంత్ చేతిలో తుపాకీ పట్టుకుని చాలా మాస్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ పై మొదటి భాగంలోని సూపర్ హిట్ డైలాగ్ 'అలప్పారై సెలబ్రేషన్స్' లైన్ తో పాటు అక్టోబర్ 15 రిలీజ్ డేట్ ను స్పష్టంగా మెన్షన్ చేశారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొదటి భాగాన్ని మించేలా పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, ఎస్. జె. సూర్య కీలక పాత్రల్లో

రజనీకాంత్ 'జైలర్ 2' సినిమాని లెక్క ప్రకారం వచ్చే నెల 15న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. కానీ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని డైలాగ్స్ తొలగించి రీషూట్ చేస్తున్నారని, దీంతో చెప్పిన తేదీకి విడుదల కాకపోవచ్చే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయం నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్లడంతో అలర్ట్ అయింది. ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) ముందే చెప్పినట్లు అక్టోబరు 15నే 'జైలర్ 2' థియేటర్లలో రిలీజ్ కానుందని కొత్తగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదివరకే పూర్ణ చేసిన స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. విడుదలకు మరో నెలన్నర ఉంది కాబట్టి కొన్నిరోజుల తర్వాత ప్రమోషన్లు మొదలుపెడతారేమో అనిపిస్తుంది. 'జైలర్ 2'కి పోటీగా తెలుగులో విజయ్ దేవరకొండ 'రణబాలి', వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' బరిలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బాక్సాఫీస్ దగ్గర దసరాకి మంచి ఫైట్ చూడొచ్చు. 2023లో వచ్చిన 'జైలర్' అద్భుతమైన సక్సెస్ అందుకుని రజనీకాంత్‌కి కంబ్యాక్ మూవీగా నిలిచింది. సూపర్‌స్టార్ పని ఇక అయిపోయింది అనే టైంలో రిలీజైన ఈ మూవీ తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు సీక్వెల్‌పైనా బజ్ ఓ మాదిరిగా ఉంది. తొలి భాగంలోని నటీనటులు ఇందులోనూ కనిపించబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. (ఇదీ చదవండి: అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు) పులివెందుల : భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ (ఫొటోలు) తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక Idupulapaya: YSR ఘాట్ వద్ద జగన్ నివాళులు Nepal Floods: ప్రియ

కర్ణాటక: విచారణ ఖైదీ అయిన శ్రీరంగపట్న ప్రభుత్వ అధికారి మహమ్మద్ హుస్సేన్‌కు సహాయం చేశారని, జైలులో డబ్బు చెల్లిస్తే రాజమర్యాదలు అందిస్తారని ఆరోపణలు రావడంతో జిల్లా జైలు ప్రధానాధికారి ఎం.శతమ్మను జైళ్ల చీఫ్ అలోక్ కుమార్ బళ్లారి సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు. జైలులో అక్రమాలపై ఖైదీలు రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖ వైరల్ అయిన తర్వాత ఈ ఉత్తర్వు వెలువడింది. ఫోర్జరీ విచారణ ఖైదీగా ఉన్న మహమ్మద్ హుస్సేన్.. అనారోగ్యం లేకున్నా జబ్బు సాకుతో మిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా కొందరు గుట్టురట్టు చేశారు. జిల్లా సెషన్స్ జడ్జి బృందం ఆసుపత్రిని తనిఖీ చేసి విచారించారు. ఈ కేసులో శతమ్మ నిర్లక్ష్యం స్పష్టం కావడంతో బళ్లారి జైలుకు బదిలీ చేసి ఆమె స్థానంలో ఫక్కీరప్ప బరకర్‌ను నియమించారు. చదవండి: రసోడా గ్యాంగ్ కి'లేడీ'ల కార్ఖానా హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు) పులివెందుల : భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ (ఫొటోలు) ‘మిర్జాపూర్ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్ (ఫొటోలు) ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ 2 పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ 2 (Jailer 2) పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక జైలర్ 2 అంతకుమించి ఉండనుందని తెలియడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ కానుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 15 న రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే.. జైలర్ 2 అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదని తమిళ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జైలర్ 2 వాయిదా పడడానికి ప్రధాన కారణం తమిళనాడు సీఎం విజయ్ అని కోలీవుడ్ కోడై కూస్తోంది. అదేంటీ.. ఆయనకు, జైలర్ 2 కి సంబంధం ఏంటి అంటే.. ఈ సినిమాలో మొదట విజయ్ రాజకీయాల్లో గెలవరు అనుకోని రజనీ ప్రభుత్వం, రాజకీయ పనితీరుపై కొన్ని ఘాటు డైలాగ్స్ చెప్పాడట. కానీ, విజయ్ గెలిచి సీఎం కూడా అయ్యారు. ఇప్పుడు ఆ డైలాగ్స్ ని విజయ్ ఫ్యాన్స్ అపార్థం చేసుకుంటే సినిమాకి డ్యామేజ్ జరుగుతుందనే ఉద్దేశంతో డైరెక్టర్ నెల్సన్ కీలక మార్పులు చేయడం మొదలుపెట్టాడట. దీనికోసమే కొత్తగా డైలాగ్స్ రాసి.. రీషూట్ చేస్తున్నారట. ఈ షూట్ కాకుండా ఇంకా ఈ సినిమాకు బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ కాలేదని టాక్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేకర్స్.. అక్టోబర్ 15 న కాకుండా కొత్త తేదీని వెతికే పనిలో పడ్డారట. ఇక ఈ రేసులో జైలర్ 2 వెనక్కి తగ్గితే ఆ స్లాట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వారి

Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలు అవినీతి ఆరోపణలు సహా పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు రావల్పిండిలోని ఆడియాలా జైలులో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లోనే ఉన్నాడు. ఆయన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి అనుమతి లేదు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఓ ప్రైయివేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాజాగా.. హైకోర్టు కూడా ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట కల్పిస్తూ తీర్పునిచ్చింది. పాకిస్థాన్ తెహ్రిక్ -ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ ఖాన్‌ను ఏకాంత నిర్బంధంలో ఉంచారని పేర్కొంటూ ఆయన సోదరి అలీమా ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటీషన్ వేసింది. బుష్రా బీబీ తరపున ఆమె కుమార్తె ముబషరా ఖవార్ మనేకా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటీషన్లపై విచారణ చేపట్టిన కోర్టు ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలకు ఊరటనిస్తూ తీర్పునిచ్చింది. ఇకపై వారిని ఏకాంత నిర్బంధంలో ఉంచరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రావల్పిండిలోని అదియాలా జైలు అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది జైలు నిబంధనల ప్రకారం ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ మధ్య సమావేశం జరిగేలా జైలు అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించింది. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ తన కుమారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రతిరోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు అందించడంతో పాటు జైలు నిబంధనల ప్రకారం అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేసే బాధ్యతను అదియాలా జైలు సూపరింటెండెంట్‌కు అప్పగించింది. ఆదేశాలు అమలు చేసిన తీరుపై 15 రోజుల్లోగా

అవినీతి ఆరోపణలపై మూడేళ్లుగా జైలు జీవితం గడుపుతూ, తరచుగా అనారోగ్యం పాలవుతున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు (Imran Khan), ఆయన భార్య బుష్రా బీబీకి ఇవాళ ఇస్లామాబాద్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, ఆయన పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ హైకోర్టు.. ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. అనంతరం ఇమ్రాన్ తో పాటు ఆయన భార్యకు పలు వెసులుబాట్లు కల్పిస్తూ కీలక తీర్పు వెలువరించింది.ఇ లార్డ్స్ టెస్టు బాయ్ కాట్ కు పాక్ విఫలయత్నం..? ఇమ్రాన్ కొడుకుల ఇంటర్వ్యూ చిచ్చు..!ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలను ఇకపై ఏకాంత నిర్బంధంలో ఉంచకూడదని హైకోర్టు ఆదేశించింది. జైలు నిబంధనల ప్రకారం వీరిద్దరూ సమావేశమయ్యేందుకు వీలు కల్పించాలని కూడా ఇస్లామాబాద్ హైకోర్టు అడియాలా జైలు అధికారులను ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్‌ను ఏకాంత నిర్బంధంలో ఉంచడాన్ని సవాలు చేస్తూ ఆయన సోదరి అలీమా ఖాన్ కోర్టును ఆశ్రయించగా, బుష్రా బీబీకి సంబంధించి ఆమె కుమార్తె ముబషరా ఖవార్ మనేకా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కోసం ఏకమైన 21 మాజీ కెప్టెన్లు- భారత్ నుంచి వీరే..!జైలు నిబంధనల ప్రకారం ఇమ్రాన్ కుటుంబ సభ్యులు ఆయనను కలిసేందుకు అనుమతించాలని, అలాగే ఆయన తన కుమారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి ఖాదిమ్ హుస్సేన్ ఆదేశించారు.ఇమ్రాన్ ఖాన్ కు ప్రతిరోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు అందించాలని, జైలు నిబంధనల ప్రకారం వైద్య సదుపాయాలు అందేలా చూడాలని కూడా ఆదేశించారు. కోర్టు ఆదేశాలను పూర్తిగా అమలు చేసేలా చూడాలని, 15 రోజుల్లోగా అమలుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని అడియాలా జైలు సూపరింటెండెంట్‌ను హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు

Facilities in Jail : తప్పు చేసినవారిని శిక్షించేందుకు ప్రభుత్వాలు జైళ్లను ఉపయోగిస్తాయి. కోర్టులు జైలు శిక్ష విధించగా పోలీసులు దాన్ని అమలుచేస్తారు... ఇలా ప్రభుత్వం, కోర్టులు, పోలీస్ వ్యవస్థలు కలిసి జైళ్ల పర్యవేక్షణ చూసుకుంటాయి. నేరాలకు పాల్పడినవారిలో పరివర్తన తీసుకువచ్చేలా జైలు శిక్షను అమలుచేస్తారు... అందుకే ఇక్కడ చాలా కఠిన నియమ నిబంధనలు పాటిస్తారు. మరి భారతదేశంలోని జైళ్లలో ఖైదీలకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారో ఇక్కడ తెలుసుకుందాం. జైళ్ల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం... కాబట్టి ఒక్కోరాష్ట్రంలోని ఖైదీలకు ఒక్కో రకమైన సదుపాయాలు ఉంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే జైలులోని సాధారణ ఖైదీలకు బెడ్ (మంచం) ఉండదు.. నేలపైనే పడుకోవాలి. అయితే కింద పర్చుకోడానికి బెడ్ షీట్ లేదా చాప ఇస్తారు.... అలాగే కప్పుకోడానికి దుప్పటి కూడా అందిస్తారు. అయితే కోర్టు అనుమతితో లేదా ఆరోగ్య కారణాలతో డాక్టర్ల సూచనమేరకు కొందరు ఖైదీలు బెడ్ సదుపాయం పొందవచ్చు. ఇక విఐపి ఖైదీలను జైలులోని ప్రత్యేక బ్యారక్స్ లో ఉంచుతారు... ఇందులో బెడ్ తో పాటు టేబుల్, కుర్చీ వంటి ప్రత్యేక వసతులు ఉంటాయి. కోర్టు అనుమతితో టీవి, న్యూస్ పేపర్ సదుపాయాన్ని కూడా కొందరు విఐపి ఖైదీలు పొందుతుంటారు. ఇండియాలో ఆధునిక జైళ్లు వస్తున్నాయి... వీటిలో ఖైదీలకు విదేశీ జైళ్ల తరహా సదుపాయాలను కల్పిస్తున్నారు. ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించేందుకు బంక్ బెడ్స్ అంటే ఒకదానిపై ఒకటి ఉండే మంచాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇలా ఇటీవల కాలంలో నిర్మించిన సెంట్రల్ జైళ్ళలో సాధారణ ఖైదీలకు కూడా బెడ్ సదుపాయం కల్పిస్తున్నారు. తెలంగాణ జైళ్లలో ఖైదీలు ఉపయోగించే బెడ్ షీట్స్, దుప్పట్లను స్వయంగా వాళ్లు తయారుచేసుకున్నవే ఉంటాయి. అంటే జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైదీలతో వీటిని తయారుచేయిస్తారు... రాష్ట్రంలోని అన్ని జైళ్లకు సరఫరా చేస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పోలీస్ శిక్షణా కేంద్రాల్లోనూ ఖైదీలు తయారుచేసిన బెడ్ షీట్స్, దుప్పట్లనే
అమెరికాలో డ్రైవింగ్ చేయడం అనేది కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదు, అది అత్యంత బాధ్యతతో కూడుకున్న విషయం. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ట్రాఫిక్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడిపే విషయంలో అమెరికా ప్రభుత్వం- పోలీసులు "జీరో టాలరెన్స్" వైఖరిని అవలంబిస్తారు. సోషల్ మీడియాలో నిత్యం చూస్తున్నట్లుగా, అమెరికాలో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ దొరికిపోతే జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అమెరికాలో మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కితే అక్కడ సర్దుబాట్లు ఉండదు, రాజీపడే అవకాశమే లేదు. వారితో వాదించడం, గొడవపడటం లాంటివి చేయకూడదు. చేస్తే విషయం ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. పోలీసులు కారును ఆపిన క్షణం నుంచే తమ 'బాడీ కెమెరా' (Body Cam) ఆన్ చేసి ప్రతీ విషయాన్ని రికార్డ్ చేస్తారు. సస్పెక్ట్కు నేలపై నడవమని చెప్పడం (Field Sobriety Test) లేదా బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహిస్తారు. రక్తంలో ఆల్కహాల్ శాతం (BAC) 0.08% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, అక్కడికక్కడే చేతులకు సంకెళ్లు (Handcuffs) వేసి అరెస్ట్ చేస్తారు. వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. DUI కేసు నమోదైతే మొదటిసారి నేరానికి కూడా భారీగా ఫైన్ తో పాటు క్రిమినల్ శిక్షలు పడతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం తీవ్రతను బట్టి $1,000 నుండి $10,000 డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. అంతే కాదు మొదటిసారి నేరానికైనా కొన్ని రోజుల నుండి కొన్ని నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ మద్యం మత్తులో యాక్సిడెంట్ జరిగి ఎవరికైనా గాయాలైతే అది 'ఫెలోని' (Felony) నేరంగా మారి ఏళ్ల తరబడి జైలు శిక్షకు దారితీస్తుంది. కేసు వాదించడానికి లాయర్ల ఫీజులు, కోర్టు ఖర్చులకు మరో $5,000 నుండి $15,000 వరకు అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. DUI కేసు
Sukesh Chandrashekhar Sentenced 8 Years : సాధారణంగా బెయిల్ పొందడానికి ఏవేవో కారణాలు చెబుతుంటారు. ఎలాగోలా బయటకు వచ్చేందుకు సాధ్యమైనన్ని పనులు చేస్తుంటారు చాలా మంది. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ వ్యక్తి మాత్రం బెయిల్ కోసం.. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవతారమెత్తాడు. అంతేనా ఓ ప్రత్యేక జడ్జీని బెదిరించి ఘోర మోసానికి పాల్పడ్డాడు. అయితే ఈ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ తీవ్ర నేరానికి గాను అతనికి ఎనిమిది ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఢిల్లీ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ హర్షితా మిశ్రా సంచలన తీర్పును ఇచ్చారు. నిందితుడు చేసిన తప్పు.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను, విచారణ ప్రక్రియను దెబ్బతీసే కుట్రగా అభివర్ణించారు.పోలీస్ కస్టడీలోనే ప్లాన్.. కానిస్టేబుల్ ఫోన్‌తో డ్రామాఅవినీతి కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ 2017 ఏప్రిల్ 28వ తేదీన.. కానిస్టేబుల్ మంజీత్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను దక్కించుకున్నాడు. దాని ద్వారా అప్పట్లో అవినీతి నిరోధక చట్టం కేసులను విచారిస్తున్న స్పెషల్ జడ్జ్ పూనం చౌదరి ల్యాండ్‌లైన్, మొబైల్ నంబర్లకు ఫోన్ చేశాడు. మొదట సుప్రీంకోర్టు జడ్జి వద్ద పనిచేసే ప్రైవేట్ కార్యదర్శినని పరిచయం చేసుకుని, ఆ తర్వాత స్వయంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తినేనని బురిడీ కొట్టించాడు. తన కేసులో వెంటనే బెయిల్ మంజూరు చేయాలని, లేకపోతే ఉద్యోగ పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జడ్జీని బెదిరింపులకు గురిచేశాడు.ఇదీ చూడండి: జడ్జిపై తెలుగు లాయర్ అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన సీజేఐవిడివిడిగా శిక్షలు.. ఒకదాని తర్వాత ఒకటి అమలు!కానీ జడ్జీ మాత్రం ఈ పని చేసింది ఎవరో తెలుసుకున్నారు. ముఖ్యంగా అది కానిస్టేబుల్ నెంబర్ అని తెలుసుకుని.. నిందితుడిపై మరికొన్ని కేసులు నమోదు చేశారు. ఆపై విచారణ జరిపి.. సుకేష్ చంద్రశేఖరే నిందితుడిని గుర్తించారు. ముఖ్యంగా ఆగస్టు 20వ తేదీన సుకేష్‌ను ఐపీసీ సెక్షన్లు

రష్యా ఘోస్ట్ ఫ్లీట్‌కు చెందిన చమురు రవాణా నౌక కెప్టెన్ అజయ్ పంత్ అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఏడాది జూన్ 14న ఇంగ్లిష్ ఛానల్లో ప్రయాణిస్తున్న ‘స్మిర్టోస్’ నౌకను బ్రిటన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, తన భర్త కెప్టెన్ అజయ్ పంత్‌ను కేంద్ర ప్రభుత్వం విడిపించాలని భార్య రీతూ పంత్ కోరారు. న్యూఢిల్లీ: రష్యా ఘోస్ట్ ఫ్లీట్‌కు చెందిన చమురు రవాణా నౌక కెప్టెన్ అజయ్ పంత్ అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఏడాది జూన్ 14న ఇంగ్లిష్ ఛానల్లో ప్రయాణిస్తున్న ‘స్మిర్టోస్’ నౌకను బ్రిటన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. భారతీయుడైన అజయ్ పంత్‌తో పాటు 24 మంది నౌక సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన అక్కడి జైలులోనే ఉన్నారు. ఈ ఘటనపై కెప్టెన్ అజయ్ పంత్ భార్య రీతూ పంత్ తొలిసారి స్పందించారు. ఈ వ్యవహారంలో తన భర్తను బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన చోట ఆయన లేకపోవడంతోనే చిక్కుకున్నారని చెప్పుకొచ్చారు. కాగా, అజయ్ పంత్ స్మిర్టోస్ అనే చమురు నౌకకు కెప్టెన్‌గా ఉన్నారు. జూన్ 14న దాదాపు 98 వేల టన్నుల చమురుతో వెళ్తున్న ఆ నౌకను బ్రిటన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. రష్యా చమురు ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్న ‘షాడో ఫ్లీట్’లో ఈ నౌక కూడా భాగమని బ్రిటన్ ఆరోపిస్తోంది. అరెస్టు తర్వాత తొలిసారి ఫోన్లో మాట్లాడినప్పుడు తన భర్త తీవ్రంగా కలత చెందారని రీతూ పంత్ తెలిపారు. ‘నేను జైలులో ఉన్నాను.. నన్ను బయటకు తీసుకురండి’ అంటూ ఆయన ఏడ్చారని ఆమె చెప్పారు. అజయ్ పంత్ కేవలం నౌక యజమాని ఆదేశాలను పాటిస్తూ విధులు నిర్వహించారని, కెప్టెన్‌గా తన బాధ్యత సరకును సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమేనని రీతూ పంత్ పేర్కొన్నారు. అయితే, బ్రిటన్ ప్రాసిక్యూషన్ మాత్రం నౌకకు అజయ్ కెప్టెన్
సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'జైలర్ 2'. 2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'జైలర్' మూవీకి సీక్వెల్ ఇది. దసరా కానుకా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ బయటకు వదల్లేదు. అప్పుడెప్పుడో వచ్చిన అనౌన్స్ మెంట్ టీజర్, ఇటీవల వచ్చిన రిలీజ్ డేట్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదల చేయడంతో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.'జైలర్ 2' నుంచి ''అలా బోలేలో'' అంటూ సాగే పాటను ఫస్ట్ సింగిల్ గా లాంచ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ ఈ డ్యాన్స్ నంబర్ కి ట్యూన్ చేయడమే కాదు, హుషారుగా ఆలపించారు. తెలుగు వెర్షన్ కి శ్రీనివాస మౌళి లిరిక్స్ రాశారు. ఈ పాట వినడానికి మలయాళం, తమిళం, తెలుగు మిక్స్ చేసినట్లుగా ఉంది. చూడ్డానికి కూడా బాగుంది. ఇందులో నటి పూర్ణ తన డ్యాన్సులతో సర్ప్రైజ్ చేశారు. మాస్, క్లాసికల్ మిక్స్ చేసి ఆమె వేసిన స్టెప్పులు అలరిస్తున్నాయి. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.'గుంటూరు కారం' సినిమాలో పూర్ణ డ్యాన్స్ చేసిన 'కుర్చీ మడతపెట్టి' పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు 'అలా బోలేలో' సాంగ్ కూడా ఆమెకు అంతే పేరు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. లిరికల్ వీడియోలో రజనీకాంత్ డ్యాన్స్ చేసినట్టుగా చూపించలేదు. 'జైలర్'లో తమన్నా చేసిన 'కావాలయ్యా' పాట ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గ నిలిచిందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు 'జైలర్ 2'లో 'అలా బోలేలో' ఏ మేరకు వైరల్ అవుతుందో చూడాలి.'జైలర్ 2' చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజయదశమి పండగ సందర్భంగా 2026 అక్టోబర్ 15న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు

ఇంటర్నెట్ డెస్క్: అగ్ర కథానాయకుడు రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘జైలర్2’ (Jailer2). ఇది వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘జైలర్’కి సీక్వెల్. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజాగా చిత్రబృందం సినిమాలోని ‘అలా బోలేలో’ (Ala Bolelo) పాటను రిలీజ్ చేసింది. ఇందులో నటి పూర్ణ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. అనిరుధ్ సంగీతం అందించారు. అక్టోబరు 15న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వార్త చదివారా: రివ్యూ: ‘ఇరుముడి’.. రవితేజ ఖాతాలో హిట్ పడిందా?

అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్-2 చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) హీరోగా నటించిన జైలర్-2 (Jailer 2) చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. అలా బోలేలో (Ala Bolelo Lyric Video) అంటూ సాగే ఈ హుషారైన పాటకు శ్రీనివాస మౌళి (Srinivasa Mouli) సాహిత్యం అందించగా స్వీయ సంగీతంలో అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఆలపించాడు. జైలర్ మొదటి భాగంలో తమన్నాపై చిత్రీకరించిన పాట దేశ వ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ దఫా పూర్ణపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం ఆ పాట అంచనాలను అందుకునేంతగా ఏ కోశానా కనిపించడం లేదు. డ్యాన్స్ మూవ్స్ అన్నీ ఎక్ట్రాన్డినరీగా ఉన్నప్పటికీ ట్యూన్ అంతగా క్యాచీగా లేకపోవడంతో జనాలకు ఆడియన్స్‌కు అంతగా ఎక్కేలా లేదు. ఇదిలాఉంటే.. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్‌పై నిర్మాత కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీని అక్టోబరు 15వ తేదీన విడు దల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సీక్వెల్ మూవీ జైలర్-2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం తలైవా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. అలా బోలేలో అంటూ సాగే మాస్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు అరుణ్రాజా కామరాజ్ లిరిక్స్ అందించగా.. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ భారీ ప్రాజెక్ట్ అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) హైదరాబాద్ : హైటెక్స్‌లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు) తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా ! రోహిత్, గిల్ రికార్డులు OUT పంత్ @ NO.1 ఎవరికీ సాధ్యం కాని ఘనత - రామోజీరావు ఆస్తులు అమ్మాల్సిందే.. ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు నువ్వు 10 కోట్లు ఇవ్వకపోతే.. లింగమనేని కొడుకు యాక్సిడెంట్ పై KA పాల్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టు ఆదేశాల మేరకు అడియాలా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇమ్రాన్ సోదరి ఉజ్మా ఖాన్ స్పందిస్తూ... నిరంతరం డెత్ సెల్లో ఉంచి, బయటి ప్రపంచంతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడనివ్వకుండా సుదీర్ఘకాలం పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచడం వల్లే తన ఆరోగ్యం క్షీణించిందని తన సోదరుడు తనతో చెప్పారని తెలిపారు. ఇది తనకు ఎంతో ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. మరోవైపు, ఇమ్రాన్ ఖాన్‌ను సుదీర్ఘంగా ఒంటరిగా ఉంచడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి బీపీ, గుండె సంబంధిత తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇమ్రాన్ కు పూర్తిస్థాయి మెరుగైన వైద్యం అందించాలని, రాజకీయ కక్షసాధింపులకు స్వస్తి చెప్పాలని పీటీఐ నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలయ్యారు. ఇస్లామాబాద్‌లోని షిఫా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను మళ్లీ పోలీసులు జైలుకు తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలయ్యారు. ఇస్లామాబాద్‌లోని షిఫా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను మళ్లీ పోలీసులు జైలుకు తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పీటీఐ సభ్యులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇమ్రాన్ ఆరోగ్యం దృష్ట్యా ఆయనను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాలని ఇటీవల పాక్ సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ దాదాపు మూడేళ్లుగా జైల్లో ఉంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అనంతరం మళ్లీ రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించింది. ఆరోగ్యం చక్కబడే వరకూ ఇమ్రాన్ ఖాన్‌ను ప్రైవేటు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఓ మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌కు త్వరలో తన ఇంట్లో ఉండి చికిత్స తీసుకునే అవకాశం కూడా రావొచ్చని అక్కడి విశ్లేషకులు కామెంట్ చేశారు. రాజకీయాల్లోకి ఇమ్రాన్ రీఎంట్రీకి ఇది తొలి అడుగు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఇమ్రాన్ విడుదల వెనుక ఏదో డీల్ జరిగే ఉంటుందని కొందరు అన్నారు. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుకెళ్లడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తేల్చారు. దీంతో ఆయన్ను తిరిగి అడియాలా జైలుకు తరలించారు. గురువారం అర్ధరాత్రి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య పరీక్షలు చేయాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. 48 గంటల్లో ప్రత్యేక ఆసుపత్రికి తరలించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు.73 ఏళ్ల ఇమ్రాన్‌కు ఆరుగురు నిపుణులైన వైద్యులతో కూడిన బృందం పరీక్షలు చేసింది. రక్తపోటులో హెచ్చుతగ్గులు, గుండె దడ, తలనొప్పి, ఆందోళన వంటి సమస్యలను పరిశీలించారు. కుడి కంటికి గతంలో తలెత్తిన సమస్యపై కూడా పరీక్షలు నిర్వహించారు.పరీక్షల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సిన అవసరం లేదని తేల్చారు. జైలులోనే ఉండటం సురక్షితమని వైద్య బృందం సూచించింది.ఆసుపత్రి పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇమ్రాన్ రాకపోకల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షలు పూర్తయిన వెంటనే ఆయనను తిరిగి అడియాలా జైలుకు తరలించారు.ఆగస్టు 2023లో అరెస్టైన ఇమ్రాన్ ఖాన్ వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన ఆరోగ్యం, నిర్బంధం పాకిస్థాన్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ వేకువ జామున ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇస్లామాబాద్ లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి చేర్చారు. 73 ఏళ్ల వయసున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించడానికి ఓ స్వతంత్ర వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు.2023 ఆగస్ట్ నుంచి ఆయన రావల్పిండి లోని అడియాలా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటివరకు ఆయనకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా వెలుగులోకి రాలేదు. ఆరోగ్య పరిస్థితి గురించి కూడా బయటి ప్రపంచానికి తెలియదు. ఆ దేశ సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే.. ఇమ్రాన్ ఖాన్ ను తాజా ఆసుపత్రికి తరలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనను తరలించే సమయంలో కూడా ఫొటోలు, వీడియోలు రాకుండా భద్రత సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.2022 ఏప్రిల్ వరకు ఆ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవిని కోల్పోయారు. అనంతరం తోషాఖానా కేసులో దోషిగా తేలడంతో జైలు పాలు కావాల్సొచ్చింది. ఆ తర్వాత ఆయన సతీమణి బుష్రా బీబీపై కూడా పలు రకాల కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు, కేసులన్నీ కూడా పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని పీటీఐ వాదిస్తోంది. బెయిల్ కోసం చేసిన ఏ ప్రయత్నం కూడా సఫలం కాలేదు.పాకిస్తాన్ కు చుక్కలే: కేంద్రం డేగకన్ను: ఏకంగా రూ. 1,943 కోట్లతో మెరుపు తీగెలు లీజ్శిక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలు వెలుపలికి రావడం ఇదే మొదటిసారి. అడియాలా జైలు గోడల మధ్య దాదాపు 1,111 రోజుల పాటు అంటే మూడేళ్లకు పైగా సుదీర్ఘ ఖైదు అనుభవిస్తూ వస్తోన్నారాయన. ఆరోగ్యం క్షీణించడంతో వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఇన్ని రోజుల తర్వాత మొదటిసారిగా బయటికొచ్చారు. హైబీపీ

జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సై ఫై థ్రిల్లర్ 'కిల్లర్' సినిమా విజయదశమి కానుకగా అక్టోబర్ 17న విడుదల అవుతోంది. జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ 'కిల్లర్'. ఇందులో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను విజయదశమి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 17న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. 'కిల్లర్' సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా విడుదలయ్యే అక్టోబర్ 17న మన దేశపు గొప్ప సైంటిస్ట్ డా.పూర్వజ్ ను ఏలియన్స్ కాంటాక్ట్ అవుతారు. ఒక స్పేస్ షిప్ ను భూమికి పంపిస్తున్నట్లు తెలియజేస్తారు. ఈ విషయాన్ని మిగతా వారికీ చెప్పమని, తాము మానవులను రక్షించాలని అనుకుంటున్నట్లు ఆ ఏలియన్ డా.పూర్వజ్ కు చెబుతుంది. మన భవిష్యత్, ఆ ఏలియన్ కు గతం. ఇలా మరో కాలం నుంచి వస్తున్న ఆ ఏలియన్ డా.పూర్వజ్ ను ఎందుకు కాంటాక్ట్ అయ్యింది ? స్పేస్ షిప్ ను భూమికి ఎందుకు పంపించాలనుకుంది ? మానవాళికి ఏర్పడిన ముప్పు ఏంటి ? ఆ ఏలియన్ చేయాలనుకున్న సాయం ఏంటి ? వంటి ప్రశ్నలతో రిలీజ్ డేట్ గ్లింప్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. 'కిల్లర్' మూవీని ఓఎంజి పిక్చర్స్ సంస్థ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. దీనిని అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో విడుదల చేయబోతోంది. ఇదిలా
Former Congress MP Sajjan Kumar Death : వేలాది మంది ప్రాణాలను బలిగొన్న 1984 నాటి ఘోర సిక్కు వ్యతిరేక హింసాకాండ కేసులో ప్రధాన దోషిగా జైలు శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు సజ్జన్ కుమార్ గురువారం నాడు తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల వయస్సు కలిగిన ఆయన, ఢిల్లీలోని ప్రసిద్ధ తీహార్ జైలులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వెంటనే జైలు అధికారులు అత్యవసరంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికే ఆయన మరణించినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించి అధికారికంగా ప్రకటించారు.సిక్కు అల్లర్ల కేసు ఏమైందంటే?మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దారుణ హత్య అనంతరం 1984 నవంబర్ 1, 2 తేదీలలో దేశ రాజధానిలోని పాలం కాలనీ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఆ భయానక ఘటనల్లో ఐదుగురు నిర్దోషులు ప్రాణాలు కోల్పోవడానికి సజ్జన్ కుమార్ ప్రత్యక్షంగా కారణం అయ్యాడని ఆరోపణలు వచ్చాయి. ఈ అల్లర్ల వ్యవహారంపై సుదీర్ఘంగా జరిగిన విచారణ అనంతరం.. ఆయనను తీవ్ర నేరస్థుడిగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు 2018 డిసెంబర్ 17న సంచలన తీర్పును ఇచ్చింది. ఈక్రమంలోనే జీవిత ఖైదు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆనాటి నుంచి ఆయన తీహార్ జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారు. హైకోర్టు విధించిన ఈ కఠినమైన శిక్షను సవాలు చేస్తూ ఆయన దేశ అత్యున్నత నాయస్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ఇన్నాళ్లూ సుప్రీం కోర్టులో విచారణ దశలోనే పెండింగ్‌లో ఉండిపోయింది.1984 నాటి సిక్కుల వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన పలు చోట్ల నమోదైన అనేక కేసులలో సజ్జన్ కుమార్ పేరు ప్రధానంగా వినిపించింది. రాజధాని పరిధిలోని జానక్‌పురి, వికాస్పురి ప్రాంతాల్లో అల్లర్లను తీవ్రంగా రెచ్చగొట్టారనే తీవ్రమైన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయితే ఈ కేసులను విచారించిన ఢిల్లీలోని స్థానిక

కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (Sajjan Kumar) ఇవాళ తీహార్ జైల్లో కన్నుమూశారు. 1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో దోషిగా నిర్ధారణ అయిన ఆయనకు కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో ఆయన తీహార్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఇవాళ ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సజ్జన్ కుమార్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరున్న 80 ఏళ్ల సజ్జన్ కుమార్ జీవితం అలా ముగిసిపోయింది. ఇథనాల్ దెబ్బకు రికార్డు స్దాయికి పంచదార ధరలు..! జనం గగ్గోలు..!1984 అక్టోబర్ 31 తేదీన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె బాడీ గార్డులే దారుణంగా కాల్చి చంపారు. ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో తీవ్రవాదుల ఏరివేత కోసం అమృత్ సర్ లోని సిక్కుల పవిత్ర స్వర్ణదేవాలయంలోకి బూట్లతో సైనికుల్ని పంపారన్న కోపంతో వారు ఆమె హత్యకు పాల్పడ్డారు. అయితే ప్రధాని ఇందిర హత్యతో కాంగ్రెస్ శ్రేణులు రగిలిపోయాయి. సిక్కుల్ని టార్గెట్ చేస్తూ పలు రాష్ట్రాల్లో దాడులకు దిగారు. ఆ తర్వాత ఇవి కాస్తా ముదిరి హత్యల వరకూ వెళ్లాయి.దెబ్బకు దెబ్బ తీసిన భారత్..! పాక్ కవ్వింపు చర్యకు ఢిల్లీలో దీటైన జవాబు..!అలా ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలో చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులుగా ఆరోపణలు ఎదుర్కొని, దోషిగా కూడా తేలిన నేతల్లో సజ్జన్ కుమార్ కూడా ఒకరు. జాట్ నేత అయిన సజ్జన్ కుమార్.. ఇందిర మరణాన్ని జీర్ణించుకోలేక ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్ని రెచ్చగొట్టి సిక్కుల ఊచకోతకు కారకులయ్యారనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై కోర్టుల్లో సుదీర్ధ విచారణ తర్వాత సజ్జన్ కుమార్ పై మోపిన అభియోగాలు వాస్తవమని రుజువయ్యాయి. దీంతో ఆయన్ను కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచీ తీహార్ జైల్లోనే ఉంటున్న సజ్జన్ కుమార్.. ఇవాళ మృతి చెందారు

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (80) కన్నుమూశారు. ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆయన అస్వస్థతకు గురికావడంతో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరణానికి గల కచ్చితమైన కారణాలను ఆసుపత్రి వర్గాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.1984లో నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య అనంతరం ఢిల్లీలో సిక్కులపై తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని పాలం కాలనీ ప్రాంతంలో నవంబర్ 1, 2 తేదీల్లో ఐదుగురు సిక్కుల మరణానికి కారణమైన కేసులో సజ్జన్ కుమార్ దోషిగా తేలారు. ఈ కేసులో 2018 డిసెంబరులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.ఔటర్ ఢిల్లీ నుంచి మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన సజ్జన్ కుమార్, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండేవారు. అయితే, 2018లో కోర్టు దోషిగా నిర్ధారించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. కాగా, ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారమే ఢిల్లీలో 3,000 మందికి పైగా సిక్కులు ప్రాణాలు కోల్పోయారు

రజినీకాంత్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘జైలర్ 2’. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అలా బోలెలో’ పాటను ఆగస్టు 21న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన ‘జైలర్’ గతంలో భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం తాజాగా ఒక ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో షామ్నా కాసిమ్ (పూర్ణ) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పాట గురించిన చర్చ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా, అనిరుధ్ అందించిన మలయాళీ ట్యూన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ‘జైలర్’ చిత్రంలోని ‘కావాలయ్యా’ పాటకు తమన్నా చేసిన డ్యాన్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ‘జైలర్ 2’లో ఆ స్థానాన్ని షామ్నా కాసిమ్ భర్తీ చేయడంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఫలితంగా ‘అలా బోలెలో’ పాట ఏ స్థాయిలో హిట్ అవుతుందనే ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రజినీకాంత్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారని సమాచారం. అక్టోబర్ 2న ఆడియో వేడుకను నిర్వహించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుధ్ మ్యూజిక్, రజినీకాంత్ స్వ్యాగ్ తో ‘జైలర్ 2’ మరో రికార్డు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు

Pargi: పరిగి సబ్‌జైలులో వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా ఆకస్మిక తనిఖీ! PARGI: వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS బుధవారం పరిగి సబ్‌జైలును సందర్శించి భద్రతా ఏర్పాట్లపై సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌జైలులోని భద్రతా ఏర్పాట్లు, ఖైదీల భద్రత, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది విధులను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. జైలు పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జైలులోకి అనధికారిక వస్తువులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్, జైలు సిబ్బంది సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, లోపాలు గుర్తించిన వెంటనే వాటిని సరిదిద్దాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా జైలు అధికారులు భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విధులు, అందుబాటులో ఉన్న భద్రతా పరికరాలపై ఎస్పీకి వివరాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రాజేశ్ మీనా, IPS, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ వీరేష్, పరిగి సీఐ కొండల్ రెడ్డి, పరిగి సబ్‌జైల్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, పరిగి ఎస్ఐ మోహన కృష్ణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు

జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ.. పాకిస్థాన్ ప్రభుత్వం చివరి నిమిషంలో హైడ్రామాకు దిగింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే అంశంపై మరోసారి అనిశ్చితి నెలకొంది. మంగళవారం మూడు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. రెండు రోజుల్లోగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించాలని జైలు అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా.. సెప్టెంబర్ 16న కేసు తదుపరి విచారణ జరిగే వరకు ఇమ్రాన్ ఖాన్‌ను ఆసుపత్రిలోనే ఉంచేందుకు ధర్మాసనం అనుమతించింది. తొలుత ‘అమలు చేస్తాం’ అన్న ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే పాకిస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తారిఖ్ ఫజల్ చౌదరీ భిన్నంగా స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ‘అక్షరాలా, స్ఫూర్తితో అమలు చేస్తాం’ అని ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్‌కు ఆయన పార్టీ నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాకపోయినా.. జైలులోనే సాధ్యమైనంత ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అయితే.. సుప్రీం ఆదేశాలపై ప్రభుత్వ సమీక్ష కొద్ది గంటల్లోనే సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గింది. కోర్టు ఉత్తర్వులను పూర్తిగా అమలు చేయడం కాకుండా.. వాటిలో తగిన మార్పులు చేయాలని కోరుతూ సమీక్ష పిటిషన్ దాఖలు చేయనున్నట్లు న్యాయశాఖ మంత్రి ఆజమ్ నజీర్ తరార్ ప్రకటించారు. సంబంధిత చట్టాన్ని పరిశీలించిన తర్వాత.. సుప్రీంకోర్టును సమీక్ష పిటిషన్ ద్వారా ఆశ్రయించి ఉత్తర్వుల్లో తగిన మార్పులు కోరాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌ను ఆసుపత్రికి తరలించాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల అమలుపై ఉత్కంఠ నెలకొంది. ‘జైల్లో నరకం చూపిస్తున్నారు’.. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ జైలు పరిస్థితులపై ఆయన కుటుంబ
హత్య, హత్యాయత్నం, దోపిడీ, ఎక్సైజ్, గంజాయి, గొడవలు, బైండోవర్ కేసుల్లో కీలక నిందితుడిగా ఉంటూ.. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న రాయలసీమ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సయ్యద్ సుల్తాన్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లు పోలీసుల కంటపడకుండా తిరుగుతున్న సుల్తాన్‌ను అరెస్టు చేసి పిట్ ఎన్డీపీఎష్ యాక్ట్ పెట్టి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. ఈ మేరకు విలేకర్ల సమావేశం నిర్వహించిన ఎస్పీ ధీరజ్ సయ్యద్ సుల్తాన్ అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. మదనపల్లె త్యాగరాజవీధికి చెందిన 31 సంవత్సరాల సయ్యద్ సుల్తాన్‌పై హత్య, హత్యాయత్నం, దోపిడీ, ఎక్సైజ్, గంజాయి, గొడవలు, బైండోవర్ కేసులు ఉన్నాయని.. మదనపల్లె, పీలేరు, ఆత్మకూరు స్టేషన్లలో గంజాయి కేసులు కూడా నమోదయినట్లు తెలిపారు. మూడు కేసుల్లో 51.915 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.READ ALSO ప్రాణం తీసిన చికెన్ పకోడి.. శనివారం మాంసం తినొద్దన్న అన్న.. గొడ్డలితో నరికి చంపిన తమ్ముడుగంజాయి రవాణా, విక్రయాలు, వినియోగం చేస్తుండటంతో ప్రభుత్వానికి నివేదిక పంపగా ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిటీ ట్రాఫిక్ ఇన్ నార్కో డ్రగ్స్ అండ్ సైకోథెరఫిక్ సబ్స్టెషన్స్ యాక్ట్ 1998 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న సయ్యద్ సుల్తాన్ ముంబై, హైదరాబాద్, కర్ణాటకలో తిరుగుతున్నట్లు గుర్తించి బృందాలు ఏర్పాటు చేశామని.. టెక్నాలజీ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.సయ్యద్ సుల్తాన్‌పై మూడు గంజాయి, రెండు హత్య కేసులు, ఏడు హత్యాయత్నం కేసులు, దోపిడీ కేసు ఒకటి, ఎక్సైజ్ కేసు 1, గొడవ కేసులు 2, బైండోవర్ కేసులు రెండు ఉన్నాయని.. పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఆరు నెలలు జైలులోని ఉండాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఆపై పీటీ వారెంట్‌పై పెండింగ్ కేసులకు సంబంధించి అదుపులోకి తీసుకుని మళ్లీ అరెస్టు చేస్తామన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ తెలంగాణ (Telangana BJP) రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (N. Ramchander Rao) శ్రష్టి వర్మకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు ఈ సందర్భంగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే శక్తులు ఒక్కటవుతున్న సమయంలో యువత రాజకీయాల్లోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ఇటావాలో జన్మించిన శ్రష్టి వర్మ ఇంటర్ వరకు చదివింది. చిన్న వయసులోనే డ్యాన్స్‌పై ఆసక్తితో ఈటీవీలో ప్రసారమైన ‘ఢీ’ డ్యాన్స్ షో ద్వారా బుల్లితెరపైకి వచ్చారు. తొలుత కో-డ్యాన్సర్‌గా కనిపించిన ఆమె.. ఆ తర్వాత ‘ఢీ జోడీ’లో తన ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆపై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృష్టి వర్మ క్రమంగా స్టార్ హీరోల సినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ చేసే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలోనే.. శృష్టి వర్మ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై చేసిన లైంగిక ఆరోపణలు పెను సంచలనం సృష్టించగా జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరిగింది. అంతేగాక జానీ మాస్టర్ పోక్సో కేసులో జైలుకు కూడా వెళ్లారు. అదే సమయంలో అల్లు అర్జున్ ‘పుష్ప 2’లోని ‘సూసేకి’ పాటకు కొరియోగ్రఫీ చేయడం ద్వారా శ్రష్టి వర్మ పేరు మారుమ్రోగింది. అంతకుముందు రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ పాటకు కూడా ఆమె నృత్యరీతులు సమకూర్చారు. ‘క్రాక్’, ‘బీస్ట్’, ‘అల వైకుంఠపురములో’, ‘గేమ్ ఛేంజర్’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, ‘మనమే’ తదితర చిత్రాలకు ఆమె కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆపై

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తలపడే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ నెలలో ఈ ఇద్దరు దిగ్గజ నటుల సినిమాలు ఒకేసారి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 15న రజినీకాంత్ ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే సమయంలో చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ను అక్టోబర్ 16న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. గతంలో భోళా శంకర్ మరియు జైలర్ సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఆ పోటీలో రజినీకాంత్ జైలర్ విజయం సాధించి పైచేయి సాధించింది. అయితే, చిరంజీవి మరియు రజినీకాంత్ మధ్య దశాబ్దాల కాలంగా మంచి స్నేహం ఉంది. కాళీ వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పోటీపడటం ఆసక్తికరంగా మారింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 చిత్రీకరణను ఎటువంటి వాయిదాలు లేకుండా పూర్తి చేస్తున్నారు. దీంతో అక్టోబర్ 15న సినిమా విడుదల ఖాయమని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ పోటీ అక్టోబర్ తోనే ముగిసేలా లేదు, 2027 సంక్రాంతికి కూడా కొనసాగే సంకేతాలు ఉన్నాయి. రజినీకాంత్ నటిస్తున్న ధర్మన్ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలపాలని నిర్మాత కమల్ హాసన్ భావిస్తున్నారు. ఫలితంగా సంక్రాంతికి భారీ స్థాయిలో రజినీకాంత్ సినిమా రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి మెగా 158 చిత్రం కూడా సంక్రాంతికే సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158పై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. రెండు ప్రధాన చిత్రాలు సంక్రాంతికి

మెగాస్టార్ చిరంజీవి - సూపర్ స్టార్ రజనీకాంత్ నడుమ బాక్సాఫీస్ వార్ సాగనుంది. అది ఒకసారి కాదు రెండు సార్లు జరగనుందని టాక్. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)నడుమ బాక్సాఫీస్ వార్ సాగనుంది. అది ఒకసారి కాదు రెండు సార్లు జరగనుందని టాక్. ఈ 'డబుల్ క్లాష్' క్రమంలో ఇటు టాలీవుడ్ లో చిరు - అటు కోలీవుడ్ లో రజనీ ఇతర టాప్ స్టార్స్ తో పోటీపడ్డ వైనాన్ని గుర్తు చేసుకుందాం. డబుల్ క్లాష్'పై సినీ ఫ్యాన్స్ ఫోకస్... రజనీకాంత్ 'జైలర్-2' చిత్రం అక్టోబర్ 15న విడుదలవుతూండగా, చిరంజీవి 'విశ్వంభర' సినిమా ఆ మరుసటి రోజునే జనం ముందుకు వస్తోంది. ఈ దసరా సీజన్ పోటీ తరువాత పొంగల్ బాక్సాఫీస్ వార్ లోనూ రజనీకాంత్, చిరంజీవి మరోమారు తలపడనున్నారని టాక్. అప్పుడు చిరంజీవితో బాబీ తెరకెక్కిస్తోన్న 'కదిరి నరసింహుడు'తో రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మిస్తోన్న 'ధర్మన్' ఢీ కొంటుందని వినికిడి. అలా చిరు-రజనీ బాక్సాఫీస్ వార్ రెండు సార్లు సాగనుండటం సినీ ఫ్యాన్స్ లో ఆసక్తి చోటు చేసుకుంది. టాలీవుడ్ మెగాస్టార్ - కోలీవుడ్ సూపర్ స్టార్ మధ్య పోటీ కావడం వల్ల ఇతర చిత్రసీమల్లోనూ వీరి సినిమాలపై సినీజనం ఫోకస్ పెట్టారు. చిరుపై రజనీ పైచేయి... చిరంజీవి, రజనీకాంత్ సినిమాలు ఒకే రోజున రిలీజైన సందర్భాలు ఇంత వరకూ లేవు. అయితే ఒకే ఒక్కసారి వీరిద్దరి చిత్రాలు ఒక్క రోజు తేడాతో విడుదలయ్యాయి. ఆ బాక్సాఫీస్ వార్ 2023లో చోటు చేసుకుంది. అప్పుడు ఆగస్టు 10న రజనీకాంత్ 'జైలర్' రిలీజ్ కాగా, మరుసటి రోజునే ఆగస్టు 11న చిరంజీవి 'భోళాశంకర్' జనం ముందు నిలచింది. రజనీకాంత్ 'జైలర్' బంపర్ హిట్ అనిపించుకుంది. అందువల్లే ఈ సారి 'జైలర్-2' ముందు 'విశ్వంభర' ఏం చేస్తుందో అన్న ఉత్కంఠ ఫ్యాన్స్ లో ఉంది

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కర్నూలులో ఎమ్మెల్యే విరుపాక్షితో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, పోలీసులపై జగన్ ఆరోపణలు చేశారు. కర్నూలు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నిన్న(గురువారం) కర్నూలులో ఎమ్మెల్యే విరుపాక్షితో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, పోలీసులపై జగన్ ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలపై కర్నూలు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి (Venu Gopal Reddy) స్పందించారు. జైలు నిబంధనల ప్రకారమే జగన్ ఫొటోను తీసుకొని ములాఖత్‌కు అనుమతించామని స్పష్టం చేశారు. ములాఖత్ సమయంలో అమర్యాదగా ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. మాజీ సీఎం హోదాకు భంగం కలిగించలేదని వెల్లడించారు. ములాఖత్‌కు వచ్చే ప్రతి ఒక్కరి ఫొటో తీసుకోవడం తప్పనిసరని తెలిపారు. ఆయన ఫొటో కూడా అలాగే తీసుకున్నామని వెల్లడించారు. జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షి, ఆయన తమ్ముడు శ్రీరాములను కలుస్తానని జగన్ కోరారని తెలిపారు. ఈ- ప్రిజన్స్ సాఫ్ట్వేర్ ప్రకారం ఎంతమంది ముద్దాయిలను కలుస్తానంటే అన్నిసార్లు ఫొటో తీసుకోవాలని చెప్పుకొచ్చారు. ఆ విధంగానే మాజీ సీఎం జగన్ ఫొటోను రెండుసార్లు తీశామని వెల్లడించారు. ఏ అధికారి, సిబ్బంది జగన్ గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సింగపూర్ మోడల్‌తో అమరావతిని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు వన్యప్రాణుల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్ కల్యాణ్ సీడ్ యాక్సెస్ రోడ్డులో S ఆకారపు మలుపుపై అపోహలు వద్దు: ఏపీ సర్కార్

ఏపీలో కూటమి సర్కార్ పై అలుపెరగని పోరాటాలు చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan)ను కట్టడి చేసేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ ప్రభుత్వం వదులుకోవడం లేదు. ఇవాళ కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన జగన్.. జిల్లా జైల్లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్ లో కలిశారు. అయితే ఈ సందర్భంగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దీంతో జగన్ కూడా దీనిపై షాకయ్యారు. అనంతరం జైలు బయటికి వచ్చిన జగన్.. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. వైసీపీపై దాడికి టీడీపీకి చంద్రబాబు కొత్త అస్త్రం..! మంత్రులకు క్లియర్..!జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత జగన్ .. తాను ఓ మాజీ ముఖ్యమంత్రిని అని, తనను అవమానించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో లోపలికి వెళ్లేందుకు లోపలికి వెళ్లేందుకు కెమెరాతో ఫొటో తీసుకుంటారని, అలాగే తనను కూడా తీసుకుంటారని భావించినట్లు తెలిపారు. ఎవరినైనా లోపలికి అనుమతించేందుకు లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టి ఫొటో తీసుకుంటారని, కానీ తనను గ్రిల్ బయట నిలబెట్టి ఫొటో తీసుకుని పంపారన్నారు. చంద్రబాబు శాడిస్టిక్ మనస్తత్వం అలా ఉందన్నారు. తాను జైలు అధికారుల్ని అందరినీ ఇలాగే ఫొటో తీస్తారా అని అడిగానని, కానీ వారు మాత్రం పై స్థాయి నుంచి ఆదేశాలు వచ్చినట్లు తనకు చెప్పారన్నారు. ఏపీలో డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్- ఇక 10 మంది అక్కర్లేదు..!తమ ప్రభుత్వ హయాంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని జగన్ గుర్తుచేసారు. ఎవరైనా స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వస్తే వారిని కూర్చోబెట్టి చిరునవ్వుతో ఫిర్యాదు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. కానీ ఇక్కడ మాత్రం అవమానించేలా చేశారన్నారు. జైలు అధికారులని తాను అడిగితే.. తనను నిలబెట్టి ఫొటో తీయాలని ఆదేశాలు వచ్చినట్లు చెప్పారని జగన్ తెలిపారు. రేపు పొద్దున్న ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని, ఏదయితే విత్తుతున్నారో అవే పండ్లు అవుతాయన్నారు

వయస్సు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని చాలామంది అంటుంటారు. కానీ, దానిని ప్రాక్టికల్‌గా నిరూపించి చూపిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. వయస్సు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని చాలామంది అంటుంటారు. కానీ, దానిని ప్రాక్టికల్‌గా నిరూపించి చూపిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth). ప్రస్తుతం 75 ఏళ్ల వయసులో ఉన్న తలైవా వేగం చూస్తుంటే.. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా కుర్ర హీరోలందరికీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఈ ఏజ్‌లో ఆ స్పీడ్ ఏంటి తలైవా.. అంటూ అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. ఏడాదికి కనీసం ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలనే క్లియర్ టార్గెట్‌తో దూసుకుపోతున్నారు రజనీకాంత్. గతేడాది ఆయన కథానాయకుడిగా వచ్చిన ‘కూలీ’ (Coolie) సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ.. టాక్ విషయంలో కాస్త మిశ్రమ ఫలితాలనే సాధించింది. అయితే, ఆ సినిమా టాక్ ఎలా ఉన్నా సరే, తలైవా రేంజ్, మేనియా మాత్రం తగ్గలేదని బాక్సాఫీస్ నంబర్స్ స్పష్టం చేశాయి. ఇక ‘కూలీ’ తర్వాత అభిమానుల చూపు మొత్తం ‘జైలర్ 2’ (Jailer 2) పైనే ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ భారీ సీక్వెల్ ఈ ఏడాది అక్టోబర్‌లో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. మొదటి భాగం సృష్టించిన సునామీతో పోలిస్తే.. పార్ట్-2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రజనీకాంత్ మార్క్ మాస్ యాక్షన్‌తో పాటు అనిరుధ్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఇక్కడితోనే రజనీ వేగం ఆగలేదు. ‘జైలర్ 2’ రిలీజ్ కాకముందే మరొక క్రేజీ ప్రాజెక్ట్‌ను జెట్ స్పీడ్‌తో ముందుకు తీసుకెళ్తున్నారు. ‘ఓ మై కడవులే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ వంటి వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో ‘ధర్మన్’ (Dharman) అనే చిత్రం తెరకెక్కుతోంది. విశ్వనటుడు కమల్ హాసన్ సొంత నిర్మాణ

సాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలు జైలులో కూటమి సర్కార్ రెడ్‌బుక్ అరాచకానికి తెరలేపింది. మాజీ సీఎం జగన్‌ను అవమానించేందుకు కుట్రలు చేసింది. కావాలనే గ్రిల్స్ వెనుక నిలబెట్టి జైలు సిబ్బంది ఫొటోలు తీశారు. అడిగితే పైనుంచి వచ్చిన ఆదేశాలంటూ జైలు సిబ్బంది చెప్పారు. చంద్రబాబు సర్కార్ కుట్రలపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబుది శాడిస్ట్ మెంటాలిటీ. నన్ను అవమానించాలని చూశారు. మాజీ సీఎం అని చూడకుండా నన్ను అవమానించాలని చూశారు. ..నన్ను గ్రిల్ వెనుక నిలబెట్టి ఫొటో తీయించారు. అడిగితే పై నుంచి వచ్చిన ఆర్డర్స్ అని చెప్పారు. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు. బాబు నాటిన తప్పుడు విత్తనాలే రేపు విషవృక్షాలవుతాయి’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘వెన్నుపోటు పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తుంది. బీసీ నాయకులపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?. సీదిరి అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్ చేస్తే. వెన్నుపోటు పార్టీ కుట్ర కేసుగా మార్చింది. మహిళా ఎస్ఐని చంపబోయాడని చింతాడ రవిపై కేసు పెట్టారు. ముస్తఫా, కారుమూరి సునీల్‌పై కూడా అక్రమ కేసులు కట్టారు. ఇప్పుడేమో విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టారు’’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) 'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్ (ఫొటోలు) బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్ ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు) విరుపాక్షి ఏమైనా ఉగ్రవాదా ? కూటమికి జగన్ వార్నింగ్.. రచించిన కుట్ర రాజకీయాలు బాబు పై జగన్ ఫైర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ.. అసలు ఏం జరిగిందంటే? LIVE: MLA విరూపాక్షితో ములాఖత్ అనంతరం YS జగన్ సంచలన PRESS MEET

కర్నూలు జిల్లా కేంద్ర జైలు పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) జైలు పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా ఆంక్షలు విధించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జగన్‌ను చూసేందుకు మరియు ఆయనకు స్వాగతం పలికేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్కడికక్కడే అడ్డుకుని వెనక్కి పంపేయడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ఈ తీరుపై వైప్యాసార్సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భద్రతా కారణాలను అడ్డుపెట్టుకుని కర్నూలు జైలు పరిసరాల్లో పోలీసులు అసాధారణ ఆంక్షలు అమలు చేస్తున్నారు. జైలు ప్రధాన ద్వారం నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరం వరకు ఎవరినీ అనుమతించేది లేదని స్పష్టం చేస్తూ నో-ఎంట్రీ జోన్‌గా ప్రకటించారు. అంతేకాకుండా, జైలుకు వెళ్లే రహదారుల వెంబడి ముళ్లకంచెలు (Barricades) ఏర్పాటు చేసి భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ముందస్తు అనుమతి ఉన్న కొద్దిమంది నేతలను తప్ప సామాన్య కార్యకర్తలను, అభిమానులను జైలు దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే జైలు వద్ద విధుల్లో ఉన్న సీఐ తేజోమూర్తి వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. నిబంధనల పేరుతో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులను సైతం ఆయన అడ్డుకున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి సతీమణికి చెందిన వాహనాన్ని జైలు పరిసరాల్లోకి అనుమతించకుండా సీఐ తేజోమూర్తి వెనక్కి పంపించివేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల పట్ల కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి మరియు భయానక వాతావరణాన్ని సృష్టించడానికే ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌తో పట్టుబడటం కలకలం రేపింది. జైలు అధికారులు జరిపిన తనిఖీల్లో ప్రజ్వల్ రేవణ్ణ వద్ద అభ్యంతరకరమైన మొబైల్ ఫోన్ లభ్యమైంది. ఈ ఫోన్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా, అందులో భారీగా అశ్లీల కంటెంట్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. జైలు నిబంధనలను ఉల్లంఘించి మాజీ ఎంపీ ఈ తరహా చర్యలకు పాల్పడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం తనపై నమోదైన పనిమనిషి అత్యాచారం కేసులో జీవితఖైదు అనుభవిస్తున్నారు. ఈ కేసులో విచారణ ముగిసిన అనంతరం ఆయనకు శిక్ష ఖరారవ్వడంతో పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ జైలులోకి సెల్ ఫోన్ ఎలా వచ్చిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అధికారులు ఇప్పటికే దీనిపై అంతర్గత విచారణను వేగవంతం చేశారు. అధికారులు స్వాధీనం చేసుకున్న ఆ ఫోన్లో సుమారు 80 నుంచి 90 వరకు అశ్లీల వీడియోలు ఉన్నట్లు తెలిసింది. కేవలం వీడియోలే కాకుండా, మహిళల అసభ్యకర ఫోటోలతో కూడిన కొన్ని పేపర్ క్లిప్పింగ్స్‌ను కూడా ఫోన్లో దాచి ఉంచారు. దీంతో జైలులో ఉంటూ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు చూడటం అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. ఇది జైలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైలులో నిషిద్ధ వస్తువులు దొరకడంతో అధికారులు ఆయనపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఫలితంగా ప్రజ్వల్ రేవణ్ణకు కల్పించే సౌకర్యాలపై కోత విధించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో జైలులోని భద్రతా లోపాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఫోన్ ఎలా అందిందనే కోణంలో జైలు సిబ్బంది పాత్రపై కూడా లోతైన విచారణ జరగనుంది. రాబోయే రోజుల్లో ఈ ఘటనపై జైలు శాఖ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఆయనపై అదనపు కేసులు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అటు రాజకీయంగా కూడా

కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తాజాగా రాజమంత్రి ప్రత్యేక కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే ఆ పిటిషన్ లో ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షా కాల సమావేశాలలో ప్రజా సమస్యలపై గళం వినిపించడానికి తనకు బెయిలు మంజూరు చేయాలని కోరడం ఇప్పుడు రాజకీయవర్గాలలోనే కాకుండా జన బాహుల్యంలో కూడా హాట్ టాపిక్ గా మారింది. శాసనమండలి, శాసనసభ సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రజా సమస్యలపై మాట్లాడటానికి, తన నియోజకవర్గ ప్రజల తరఫున గళం విప్పడానికి తనకు బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు తన బెయిల్ పిటిషన్ లో అభ్యర్థించారు, డిసెంబర్ 2021 నుంచి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనంత బాబు.. గతంలో సభలో ప్రజా సమస్యలపై ఎంతవరకు గళమెత్తారనే విషయాన్ని పక్కనబెడితే.. ప్రస్తుతం ఆయన వినిపిస్తున్న వాదన విమర్శలకు దారితీస్తోంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించడానికే బెయిల్ కావాలని ఆయన అడుగుతుంటే.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నవైసీపీ శాసనసభ సమావేశాలను బహిష్కరించింది. ఒకవైపు పార్టీ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే.. మరొ వైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు మాత్రం ప్రజా సమస్యల సభలో గళమెత్తుతానంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది. కేవలం జైలు నుంచి బయటకు రావడం కోసమే ప్రజా సమస్యల నెపంతో బెయిల్ డ్రామాలు ఆడుతున్నారంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీగా అనంతబాబు మండలిలో గళమెత్తిన సందర్భాలు దాదాపు మృగ్యమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. కారు డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి సభలో ప్రజా సమస్యలపై ఏం మాట్లాడుతారని నిలదీస్తున్నారు. మొత్తం మీద అనంతబాబు బెయిలు పిటిషన్ ఇప్పుడు పొలిటికల్

ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నారు. ఆర్మీ స్పష్టతతో తీరిన ఉత్కంఠ. కుటుంబ భేటీకి పీటీఐ పట్టు. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులోనే మరణించారంటూ సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తలు ఆ దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. గత కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఉత్కంఠ నెలకొనడంతో పీటీఐ శ్రేణులు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైనిక సమాచార విభాగం ఎట్టకేలకు మౌనం వీడి స్పందించింది. ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ వస్తున్న వార్తలన్నీ తప్పుడు నివేదికలని, ఆయన క్షేమంగానే ఉన్నారని ఆర్మీ స్పష్టం చేసినట్లు ప్రముఖ జర్నలిస్ట్ వజాహత్ ఖాన్ వెల్లడించారు. RC Transfer: మీ బండిని అమ్మేశారా?.. ఆర్సీ మార్చకపోతే పోలీస్ కేసే.. ఆర్టీఓ కొత్త రూల్స్ ఇవే! ఆర్మీ ప్రకటనపై జర్నలిస్ట్ వజాహత్ ఖాన్ విశ్లేషణ: ISPR స్పందనపై వజాహత్ ఖాన్ తాజా వీడియోలో స్పందిస్తూ.. సైన్యం తన కథనాన్ని ‘ఫేక్’ అని కొట్టిపారేసినప్పటికీ, ఆర్మీ ప్రకటన ద్వారా ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారనే నిజం బయటకు రావడం ఊరటనిచ్చే అంశమని తెలిపారు. GHQ లోని ముగ్గురు సీనియర్ అధికారులు కేవలం తమ ఆందోళనను మాత్రమే పంచుకున్నారని, మరణాన్ని ధ్రువీకరించలేదని స్పష్టం చేశారు. ఆర్మీ అసాధారణంగా మౌనంగా ఉండటమే ఈ అనుమానాలకు కారణమైందని, తమ ఒత్తిడి వల్లే ప్రభుత్వం, సైన్యం స్పందించక తప్పలేదని ఆయన పేర్కొన్నారు. కుటుంబ భేటీ కోసం పీటీఐ పట్టుబట్టడం ఆర్మీ ప్రకటనతో కొంత స్పష్టత వచ్చినప్పటికీ, 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పీటీఐ పార్టీ అనుమానాలు పూర్తిగా నివృత్తి కాలేదు. జైలులో ఉన్న ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులను, వ్యక్తిగత వైద్యులను వెంటనే అనుమతించాలని పీటీఐ డిమాండ్ చేస్తోంది. ముఖాముఖి భేటీకి అనుమతి ఇచ్చి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి పారదర్శకత చూపించే వరకు తమ ఆందోళనలు ఆపబోమని పార్టీ స్పష్టం చేసింది

లైంగిక వేధింపుల కేసుల్లో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ఆయన సెల్లో అక్రమంగా వాడుతున్న మొబైల్ ఫోన్‌ను జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపింది. జైలు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై కొత్తగా మరో కేసు నమోదు చేశారు.జైలు ఉన్నతాధికారులు, సిబ్బంది కలిసి ప్రజ్వల్ రేవణ్ణ ఉన్న సెల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆయన రహస్యంగా దాచిన స్మార్ట్‌ఫోన్ బయటపడింది. జైలులోకి నిషేధిత ఎలక్ట్రానిక్ పరికరాన్ని తీసుకెళ్లి, వినియోగించినందుకు గాను ఆయనపై పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), జైళ్ల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనను కర్ణాటక హోంశాఖ చాలా తీవ్రంగా పరిగణించింది. జైలు భద్రతను దాటి సెల్‌లోకి ఫోన్ ఎలా చేరిందనే దానిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ప్రజ్వల్‌కు ఈ ఫోన్‌ను ఎవరు అందించారు? జైలు లోపలి నుంచి ఆయన ఎవరెవరితో మాట్లాడారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికోసం ఫోన్ కాల్ డేటా రికార్డులను (సీడీఆర్), ఇతర డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు.అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలులోకి స్మార్ట్‌ఫోన్ చేరడం వెనుక జైలు సిబ్బంది ప్రమేయం ఉందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు జైలు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు

బెంగళూరులోని పరప్పన అగ్రహారం సెంట్రల్ జైలులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ సందర్బంగా జేడీ ఎస్ మాజీ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరోసారి అడ్డంగా దొరికిపోయారు. బెంగళూరు, ఆగస్టు 12: అత్యాచారం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెల్ ఫోన్‌తోపాటు పెన్ డ్రైవ్ వాడుతున్నట్లు సెంట్రల్ క్రైమ్ బృందం గుర్తించింది. బెంగళూరులోని పరప్పరన అగ్రహారం సెంట్రల్ జైలులో ఈ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రజ్వల్ రేవణ్ణ సెల్ ఫోన్‌తోపాటు పెన్ డ్రైవ్ వినియోగిస్తున్నట్లు కనుగొంది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. అతడికి ఇవి ఎలా అందాయనే అంశంపై విచారణకు ఆదేశించింది. మరో వైపు జైలు అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈరన్న రంగాపూర్పై సస్పెన్షన్ వేటు వేసింది. సదరు జైలులో లోపాలపై వివరణ ఇవ్వాలంటూ జైలు సూపరింటెండెంట్ అనుష్కు కుమార్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది

క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో జైల్ బరో విజయవంతం బూర్గంపహాడ్, ఆగస్టు 10 : కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రజా సంఘాలు మండిపడ్డాయి. క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో దేశవ్యాప్తంగా చేపట్టిన జైల్బరో కార్యక్రమం బూర్గంపహాడ్ మండలంలో సోమవారం విజయవంతమైంది. వ్యవసాయ కార్మిక సంఘంతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాస్తారోకో చేపట్టారు. తొలుత మండల కేంద్రంలో కార్మికులు, కర్షకులకు జరుగుతున్న అన్యాయాన్ని నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. రాస్తారోకో చేస్తుండగా భగ్నం చేసేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రాస్తారోకో చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, కేవీపీఎస్ మండల కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరు నాయకులను లాక్కెళ్లి పోలీసు జీపులో స్టేషన్‌కు తరలించారు. దీంతో ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు స్టేషన్ వద్దకు వెళ్లి రాస్తారోకోను భగ్నం చేసినందుకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రం నాలుగు లేబర్కోడ్లు అమలుచేస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని, విద్యుత్ సవరణ బిల్లు 2025 విత్తన చట్టానికి సవరణలు ప్రతిపాదించారని దీంతో సులభతర వ్యాపారం పెట్టుబడిదారుల చేతిలో లాభాలు తెచ్చిపెట్టిందని విమర్శించారు. వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకువచ్చి ఉపాధి కార్మికుల పొట్టకొట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు ఎస్కే అబిద, సీఐటీయూ నాయకురాలు, ఐద్వా మండల కార్యదర్శి పాపినేని సరోజిని, కేవీపీఎస్ మండల కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లు, రైతు సంఘం మండల కార్యదర్శి నాగేశ్వరరావు, మరియమ్మ, అప్పారావు, ప్రతాప్, ఆదూరి నర్సింహారావు, కార్మికులు, కర్షకులు, వివిధ రంగాల అసంఘటిత కార్మికులు పాల్గొన్నారు. [caption id="attachment_2479205" align="alignnone" width="1200"] 'మోదీని గద్దె దింపాల్సిందే'[/caption]

ప్రియుడిపై ప్రేమ.. తండ్రి భయం.. చివరకు జైలు గేటు ముందు జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఖైదీని కలిసేందుకు వచ్చిన మైనర్ బాలిక దగ్గర 10 బుల్లెట్ తూటాలు దొరకడం ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. నకిలీ ఆధార్ కార్డు, కొంత నగదును కూడా ఆమె నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోండా డివిజనల్ జైలులో ఉన్న ఖైదీ హర్షు కశ్యప్‌ను కలిసేందుకు బాలికతో పాటు మరో వ్యక్తి గురువారం జైలుకు వచ్చినట్లు జైలర్ అఫ్తాబ్ ఆలం అన్సారీ తెలిపారు. జైలు ప్రధాన గేటు దగ్గర తనిఖీల సమయంలో బాలిక తప్పుడు గుర్తింపుతో రావడం భద్రతా సిబ్బందికి అనుమానం కలిగించింది. ఆధార్ కార్డులో ఉన్న పేరుకు భిన్నంగా ఆమె మరో పేరు చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆమెను తనిఖీ చేయగా.. జేబులో 10 లైవ్ బుల్లెట్ కార్ట్రిడ్జ్లు బయటపడ్డాయి. వెంటనే జైలు ఔట్ పోస్ట్ ఇన్ఛార్జ్కు సమాచారం అందించి.. బాలికతో పాటు వచ్చిన వ్యక్తితో పాటు వారి దగ్గర ఉన్న వస్తువులను పోలీసులకు అప్పగించారు. విచారణలో బాలిక తన అసలు వివరాలను బయటపెట్టింది. ఆ బుల్లెట్లు తన తండ్రి లైసెన్స్ గన్లోనివని.. తన తండ్రికి కోపం ఎక్కువని.. తాను జైలులో ఉన్న ప్రియుడిని కలవడానికి వెళ్లిన విషయం తెలిస్తే ఆయన ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భయపడి బుల్లెట్లను వెంట తీసుకువచ్చానంటూ చెప్పింది. దీంతో అధికారులు షాక్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్ హైదరాబాద్ లో సందడి చేసిన