
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కర్నూలులో ఎమ్మెల్యే విరుపాక్షితో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, పోలీసులపై జగన్ ఆరోపణలు చేశారు.
కర్నూలు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నిన్న(గురువారం) కర్నూలులో ఎమ్మెల్యే విరుపాక్షితో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, పోలీసులపై జగన్ ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలపై కర్నూలు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి (Venu Gopal Reddy) స్పందించారు. జైలు నిబంధనల ప్రకారమే జగన్ ఫొటోను తీసుకొని ములాఖత్‌కు అనుమతించామని స్పష్టం చేశారు.
ములాఖత్ సమయంలో అమర్యాదగా ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. మాజీ సీఎం హోదాకు భంగం కలిగించలేదని వెల్లడించారు. ములాఖత్‌కు వచ్చే ప్రతి ఒక్కరి ఫొటో తీసుకోవడం తప్పనిసరని తెలిపారు. ఆయన ఫొటో కూడా అలాగే తీసుకున్నామని వెల్లడించారు. జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షి, ఆయన తమ్ముడు శ్రీరాములను కలుస్తానని జగన్ కోరారని తెలిపారు. ఈ- ప్రిజన్స్ సాఫ్ట్వేర్ ప్రకారం ఎంతమంది ముద్దాయిలను కలుస్తానంటే అన్నిసార్లు ఫొటో తీసుకోవాలని చెప్పుకొచ్చారు. ఆ విధంగానే మాజీ సీఎం జగన్ ఫొటోను రెండుసార్లు తీశామని వెల్లడించారు. ఏ అధికారి, సిబ్బంది జగన్ గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
సింగపూర్ మోడల్‌తో అమరావతిని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు
వన్యప్రాణుల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్ కల్యాణ్
సీడ్ యాక్సెస్ రోడ్డులో S ఆకారపు మలుపుపై అపోహలు వద్దు: ఏపీ సర్కార్
Read Latest AP News And Telangana News And National News




