
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన నేపథ్యంలో 'హైడ్రా' కమిషనర్ రంగనాథ్ శనివారం ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలన్నింటినీ నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తామని హెచ్చరించారు.కేవలం 50 గజాల స్వల్ప విస్తీర్ణంలో నిబంధనలకు విరుద్ధంగా ఏడంతస్తుల భవనాన్ని నిర్మించడమే కాకుండా, దానిపై అదనంగా పెంట్‌హౌస్‌ను కూడా నిర్మించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బిల్డర్ సాజిద్ నిర్మించే భవనాలన్నీ అత్యంత నాసిరకంగా ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నట్లు కమిషనర్ ఈ సందర్భంగా వెల్లడించారు.అంజయ్య నగర్ ప్రాంతంలో ఇటువంటి అక్రమ నిర్మాణాలు అనేకం ఉన్నాయని, కనీసం సెట్బ్యాక్లు కూడా పాటించకుండా బహుళ అంతస్తుల భవనాలను నిర్మించారని రంగనాథ్ పేర్కొన్నారు. నాలాలను ఆక్రమించి ఇష్టారాజ్యంగా కట్టడాలు చేపట్టారని, వీటిలో అధిక శాతం ప్రస్తుతం హాస్టళ్లుగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న ఆయా భవనాలను యజమానులు వెంటనే ఖాళీ చేయాలని ఆయన ఆదేశించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన అన్ని భవనాలను కూల్చివేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు
హైదరాబాద్ గచ్చిబౌలిలోనిఅంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంజయ్య నగర్లో ఇలాంటి భవనాలు చాలా ఉన్నాయన్న రంగనాథ్.. నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాలు, నాలాను ఆక్రమించి కట్టిన వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు . శనివారం కుప్పకూలిన ఏడు అంతస్తుల భవనాన్ని.. సాజిద్ అనే బిల్డర్ కట్టినట్లు రంగనాథ్ తెలిపారు. సాజిద్ కట్టిన భవనాలు అన్నీ ఇదే తరహాలో ఉంటున్నట్లు స్థానికులు చెప్తున్నారని.. కొద్దిరోజుల్లో వాటిని కూల్చేస్తామని తెలిపారు.50 గజాల స్థలంలో ఏడు అంతస్తుల భవనం నిర్మించడమే కాకుండా పైన పెంట్ హౌస్ కూడా ఏర్పాటు చేస్తున్నారని రంగనాథ్ తెలిపారు. అంజయ్య నగర్లో ఇలాంటి భవనాలు ఇంకా ఉన్నాయని.. చాలావాటికి సెట్బ్యాక్లు లేవని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు అంజయ్య నగర్‌లోని భవనాలు హాస్టల్స్ కోసం ఉపయోగిస్తున్నారన్న రంగనాథ్.. వాటిని ఖాళీ చేయాలని యజమానులకు సూచించారు. నాలాను ఆక్రమించి భవనాలు కట్టారని.. అంజయ్య నగర్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు.మరోవైపు గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేశ్ కారే (34), మోపత్ (42) అనే ఇద్దరు టైల్స్ కార్మికులు చనిపోయారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కూలిన భవనం శిథిలాలు పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై పడ్డాయి. దీంతో అపార్టుమెంటులో నివశిస్తున్న ఇద్దరు వృద్ధులకు గాయాలయ్యాయి. అపార్ట్మెంట్ గోడలు కూడా ధ్వంసమయ్యాయి. భవనం నిర్మించిన సాజిద్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది.మరోవైపు సాజిద్ బిల్డింగులు అన్నింటిని పరిశీలిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన స్పష్టం

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కోర్టు స్టే అమల్లో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్తుల డిమోలిషన్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం.. ఆయనపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ కమిషనర్ రంగనాథ్‌కు నోటీసులు జారీ చేసింది. మల్కాజిగిరి మండలంలో ఉన్న వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్థలాల విషయంలో గతంలోనే న్యాయస్థానం స్టే మంజూరు చేసింది. అయినప్పటికీ.. ఆ స్టే ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ.. కూల్చివేతలు చేపట్టారంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. సంబంధిత అధికారులను వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్, మల్కాజిగిరి, తిరుమలగిరి మండలాల తహసీల్దార్లు కోర్టుకు హాజరయ్యారు. విచారణ సమయంలో జిల్లా కలెక్టర్ స్పందిస్తూ కీలక విషయాలను న్యాయస్థానానికి వివరించారు. మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగిన సదరు కూల్చివేతలకు రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి అనుమతులు, ఉత్తర్వులు ఇవ్వలేదనీ, తమ శాఖ సమ్మతి లేకుండానే జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ప్రదేశాల్లో హైడ్రా బలగాలు కూల్చివేతలు సాగించాయని కలెక్టర్ హైకోర్టు ధర్మాసనం ముందు వెల్లడించారు. దీనిపై హైడ్రా తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడటమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ అందించిన ప్రాథమిక సమాచారం, జీఎల్ఆర్ సూచనల మేరకే చర్యలు తీసుకున్నామన్నారు. అయితే ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. క్షేత్రస్థాయి రికార్డులను, న్యాయపరమైన ఉత్తర్వులను సమగ్రంగా పరిశీలించకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని, అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనీ పేర్కొంది. ఈ సంఘటనలను తీవ్రంగా పరిగణించిన హై కోర్టు.. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండటానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హైడ్రా పరిధిలోకి వచ్చే అన్ని జిల్లాల

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మరోసార్ హాట్ కామెంట్స్ చేశారు. కోర్ట్‌ను తప్పుదోవ పట్టిస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు. హైదరాబాద్, ఆగస్టు 10: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మరోసార్ హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు(సోమవారం) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. హైకోర్టు చెప్పినా రంగనాథ్ తీరు మారడం లేదని వ్యాఖ్యానించారు. కోర్ట్‌ను తప్పుదోవ పట్టిస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు. నాదర్గుల్లో చాలా ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా ఎందుకు పరిరక్షించడం లేదని ప్రశ్నించారు. అక్కడ ఎన్నో ఎకరాల భూమిలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని తెలిపారు. రంగనాథ్‌కు మజ్లీస్ మీదున్న ప్రేమ.. ప్రజల మీద లేదని విమర్శించారు. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని చెబుతున్న హైడ్రా.. మరి ఆ భూములను ఎక్కడ దాచిపెట్టారని.. ఎందుకు ప్రజల ముందు ఉంచడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుణయాగం చేస్తే.. తాము రాష్ట్రంలో కాంగ్రెస్ కొట్టుకుపోవాలని వాయు యాగం చేస్తామన్నారు. వానాకాలం అంతా అయిపోయాక రేవంత్ రెడ్డిది ఇదో కొత్త నాటకమంటూ విమర్శించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ఉన్న విషయం సీఎంకు తెలియదా అని రాంచందర్ రావు ప్రశ్నించారు. మనుషులకు ‘ఆధార్’ లాగే.. భూములకూ ‘భూధార్’: మంత్రి పొంగులేటి కోటి మందికిపైగా స్మార్ట్ రేషన్‌కార్డులు ఇవ్వబోతున్నాం: జగ్గారెడ్డి