
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్తప్లాన్
చంద్రుడిపై మనిషి అడుగుపెట్టి ఇప్పటికే ఐదు దశాబ్దాలు దాటిపోయాయి. కానీ ఇప్పుడు ప్రపంచం దృష్టి కేవలం చంద్రుడిపై అడుగుపెట్టడంపైనే కాదు.. అక్కడే శాశ్వతంగా నివసించడంపై పడింది. భూమికి దాదాపు 3 లక్షల 84 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపై.. మనిషి కోసం ఒక స్థావరం ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు వేగం పుంజుకుంటున్నాయి. మరి చంద్రుడిపై నీరు దొరుకుతుందా? అక్కడ మనిషి ఎలా జీవిస్తాడు? చంద్రుడి నుంచి అంగారక గ్రహానికి ప్రయాణం సాధ్యమవుతుందా? ఈ ప్రయత్నాల్లో భారత్ పాత్ర ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. చంద్రుడిపై మనిషి శాశ్వతంగా నివసించడం.. ఇప్పటివరకు సినిమాల్లో, సైన్స్‌ఫిక్షన్ కథల్లో మాత్రమే చూసిన ఆలోచన. కానీ ఇప్పుడు ఇదే ఆలోచనను నిజం చేసేందుకు ప్రపంచంలోని అగ్రశ్రేణి అంతరిక్ష సంస్థలు అడుగులు వేస్తున్నాయి. రాబోయే ఆరేళ్లలో చంద్రుడిపై మనుషులు ఎక్కువ కాలం ఉండేలా ఒక స్థావరాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపడుతున్న చంద్ర స్థావర ప్రణాళికలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను కూడా భాగస్వామ్యం చేసుకోవాలన్న ప్రతిపాదన ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. చంద్రుడిపై ఒకేసారి పెద్ద నగరాన్ని నిర్మించడం నాసా లక్ష్యం కాదు. ముందుగా చంద్రుడి ఉపరితలాన్ని మరింతగా అధ్యయనం చేస్తారు. ఇందుకోసం రోవర్లు, ఇతర యంత్రాలను అక్కడికి పంపిస్తారు. మనుషులు నివసించడానికి ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది? ఎక్కడ నీటి మంచు లభించే అవకాశం ఉంది? ఎక్కడ సన్‌లైట్ ఎక్కువగా అందుతుంది? వంటి అంశాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత విద్యుత్, సమాచార వ్యవస్థలు, రవాణా సదుపాయాలు, మనుషులు నివసించేందుకు అవసరమైన గదులు వంటి మౌలిక సదుపాయాలను దశలవారీగా ఏర్పాటు చేస్తారు. ఇక చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి మరో ప్రధాన కారణం ఉంది. అదే.. నీటి మంచు. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఎప్పుడూ సన్‌లైట్ పడని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ