Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
© 2026 nimisham.in
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే కేవలం భారీ విజువల్స్, వందల కోట్ల బడ్జెట్, స్టార్ కాస్టింగ్ మాత్రమే ఉంటే సరిపోదని మరోసారి రుజువైంది. బలమైన కథ, గుండెలను తాకే భావోద్వేగాలు ఉంటే చిన్న చిత్రాలు కూడా ప్రపంచ స్థాయి బాక్సాఫీస్‌ను షేక్ చేయగలవని అనేక సినిమాలు నిరూపించాయి. మన దగ్గర వచ్చిన 'హనుమాన్' వంటి చిత్రాలు అల్ప బడ్జెట్‌తో వచ్చి ఊహించని వసూళ్లు సాధించినట్లే, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక చైనీస్ ఫ్యామిలీ డ్రామా భారీ సంచలనం సృష్టిస్తోంది. అదే 'డియర్ యూ' (Dear You). హాంగ్‌చున్ లాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చైనీస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర తిరగరాస్తోంది. 2026 ఏప్రిల్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సుమారు 14 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో (మన భారతీయ కరెన్సీలో రూ. 132 కోట్లు) రూపుదిద్దుకుంది. అయితే ఈ చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద రాబట్టిన వసూళ్లు చూసి గ్లోబల్ ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా చైనాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా 300 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. అంటే ఇండియన్ రూపాయిల్లో ఈ వసూళ్లు దాదాపు రూ. 2,849 కోట్లకు పైగానే ఉండటం విశేషం! పెట్టిన పెట్టుబడికి ఏకంగా ఇరవై రెట్లకు పైగా లాభాలను తీసుకొచ్చి 2026లో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద సంచలనాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చైనీస్ భాషలో 'డియర్ యూ' అంటే 'అమ్మమ్మకు ప్రేమలేఖ' అనే ఆత్మీయ భావం వస్తుంది. అప్పులు, కుటుంబ సమస్యల్లో కూరుకుపోయిన ఒక యువకుడు, థాయ్‌లాండ్‌లో కోటీశ్వరుడిగా స్థిరపడ్డాడని భావిస్తున్న తన తాతను వెతికేందుకు బయలుదేరడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. తీరా అక్కడికి వెళ్లాక దశాబ్దాల క్రితం నాటి ఒక హృదయవిదారక రహస్యం బయటపడుతుంది. వలసల నేపథ్యం, మానవ అనుబంధాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ

ఆ హీరో ఫ్యాన్స్ మీరున్న సిటీలో మీ కళ్ళ ముందు ఉండే ఉంటారు.. అచ్చు ఆ హీరోలాగానే హెయిర్ స్టైల్, డ్రెస్, ఫేస్ కట్స్ తో 24 అవర్స్ ఆన్ మై హీరో యాటిట్యూడ్ అనేలా ఉండటం కూడా ఆ హీరో ఫ్యాన్స్ నైజం. కానీ ఆ హీరో సుమారు 270 చిత్రాల్లో చేస్తే 180కి పైగా ప్లాప్స్. పైగా ముప్పై ఏళ్ల పాటు సరైన సోలో హిట్ లేదు. నిజం సైతం నిజామా అని ఆశ్చర్యపోయినా కూడా ఇది నిజమే. కానీ తన క్రేజ్, స్టార్డమ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆయనే భారతీయ సినీ యవనికపై 'డిస్కో డాన్సర్'గా ముద్ర వేసుకున్న హీరో మిథున్ చక్రవర్తి. . 1976లో ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ తెరకెక్కించిన 'మృగయ' అనే క్లాసిక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మిథున్, తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 1982లో వచ్చిన 'డిస్కో డాన్సర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. అప్పట్లోనే ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ కాలపు అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అక్కడ నుంచి మిథున్ ఇండియాలోనే మోస్ట్ డిమాండింగ్ స్టార్లలో ఒకరిగా మారారు. అయితే కాలం మారే కొద్దీ కథల ఎంపికలో వేగం, క్వాలిటీ కంటే క్వాంటిటీకే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. 90ల కాలంలో ఏడాదికి పదుల సంఖ్యలో, తక్కువ బడ్జెట్ మరియు వేగంగా పూర్తయ్యే సినిమాల్లో నటిస్తూ రికార్డులు క్రియేట్ చేశారు. దీనివల్ల ఆయన ఖాతాలో ఓటములు ఎక్కువగా చేరుతూ వచ్చాయి. 1993 నుంచి 1998 మధ్యకాలంలోనే ఆయన నటించిన 33 చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అలా తన మొత్తం కెరీర్లో 350కి పైగా చిత్రాల్లో నటించగా, ఏకంగా 180కి పైగా సినిమాలు తీవ్రమైన డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దాదాపు 30 ఏళ్ల పాటు బాక్సాఫీస్
మాస్ మహారాజా రవితేజ , సున్నితమైన భావోద్వేగాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భావోద్వేగ భక్తిరస చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన ప్రజాదరణను దక్కించుకుంది. రవితేజ మార్క్ ఎనర్జీకి తోడు, కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే శివ నిర్వాణ కథా కథనాలు సినిమాను బ్లాక్‌బస్టర్ దిశగా నడిపించాయి. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి రవితేజ కెరీర్లోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఈ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది.12 రోజుల్లోనే రూ. 200 కోట్లు ఈ అప్రతిహత విజయ యాత్రను కొనసాగిస్తూ కేవలం 12 రోజుల్లోనే 'ఇరుముడి' ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఈ ఘనతను పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, యువత నుంచి కుటుంబ ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ థియేటర్లలో ఈ చిత్రాన్ని ఒక ఉత్సవంలా ఆదరిస్తున్నారని మేకర్స్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ఇది జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.సడెన్‌గా హాస్పిటల్లో చేరిన మమితా బైజు... డాక్టర్లు ఏం చెబుతున్నారంటేనైజాంలో కాసుల వర్షంఆంధ్రా, సీడెడ్ ఏరియాలతో పాటు ఓవర్సీస్లోనూ 'ఇరుముడి' అద్భుతమైన కలెక్షన్లు రాబడుతున్నప్పటికీ నైజాం మార్కెట్లో మాత్రం ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం ఊహకందని రీతిలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజూ అద్భుతమైన వసూళ్లను రాబడుతూ రవితేజ కెరీర్లోనే నైజాం ఏరియాలో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా దూసుకుపోతోంది. 12వ రోజైన మంగళవారం ఈ చిత్రం నైజాంలో రూ.2.51 కోట్ల గ్రాస్, రూ.1.19 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఓవరాల్‌గా చూసుకుంటే

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినాను చూపిస్తూ రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన నుంచి వచ్చిన ‘ఇరుముడి’ పోస్టర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినాను చూపిస్తూ రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌తో థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును విజయవంతంగా దాటేసి ‘జనరేషనల్ బ్లాక్‌బస్టర్’గా నిలిచింది. రవితేజ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచి సరికొత్త మైలురాయిని అందుకుంది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం విడుదల చేసిన సరికొత్త స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణ ఫోటో ఫ్రేమ్ రూపంలో డిజైన్ చేసిన ఈ పోస్టర్లో.. మధ్యలో బేబి నక్షత్రను పులిపై కూర్చున్న శ్రీ మణికంఠుడి (బాల అయ్యప్ప) అవతారంలో చూపించారు. ఆమెకు ఇరువైపులా రవితేజ, ప్రియా భవానీ శంకర్ దంపతులుగా చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉండటం ఆకట్టుకుంటోంది. సినిమాలోని ఫ్యామిలీ బాండింగ్, ఎమోషన్స్‌తో పాటు పోస్టర్లో మణికంఠుడి రూపం సరికొత్తగా కుదరడంతో అభిమానులు ఈ పోస్టర్‌ను తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, భావోద్వేగాలతో కూడిన కథనం సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత చేరువ చేశాయి. పోటీగా ఇతర భారీ చిత్రాలు ఉన్నప్పటికీ ఏమాత్రం తగ్గకుండా రవితేజ తన మార్క్ ఎనర్జీతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. 200 కోట్ల మార్కును దాటినప్పటికీ ఇప్పటికీ థియేటర్లలో స్ట్రాంగ్ ఆక్యుపెన్సీతో ‘ఇరుముడి’ తన

Toxic: రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యశ్‌కు బలమైన మార్కెట్ ఉన్న సొంత రాష్ట్రం కర్ణాటకలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలకు సొంత రాష్ట్రంలో మొదటి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. సినిమా టాక్ ఎలా ఉన్నా.. హీరోకు ఉన్న క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా తొలి వారంలోనే భారీ వసూళ్లు నమోదవుతుంటాయి. అయితే ‘టాక్సిక్’ విషయంలో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యశ్ హోమ్ స్టేట్ అయిన కర్ణాటకలో ఈ సినిమా కనీసం రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను కూడా చేరుకోలేకపోయిందనే వార్తలు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. యశ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఈ మార్క్‌ను ‘టాక్సిక్’ సులభంగా అందుకుంటుందని చాలామంది అంచనా వేశారు. కానీ మొదటి రోజు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు నుంచే గణనీయమైన డ్రాప్‌ను చూసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడం సినిమా థియేట్రికల్ రన్‌పై ప్రభావం చూపినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కర్ణాటకలో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌ను అందుకోవాలనే టార్గెట్‌ను ‘టాక్సిక్’ చేరుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రానికి హిందీ మార్కెట్లో మాత్రం సినిమాకు కొంత ఊరట లభించినట్లు తెలుస్తోంది. కన్నడ వెర్షన్‌తో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లోని హిందీ బెల్ట్‌లో ‘టాక్సిక్’కు మెరుగైన స్పందన వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అక్కడి నుంచి వస్తున్న వసూళ్లు సినిమాకు కొంత బలాన్నిస్తున్నాయని చెబుతున్నారు. ఇక తెలుగులోనూ ‘టాక్సిక్’కు తొలి రోజు సాలిడ్ ఓపెనింగ్ వచ్చినప్పటికీ.. రెండో రోజు నుంచి పరిస్థితి మారిపోయినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో షోలు క్యాన్సిల్ అయ్యే

మాస్ మహారాజ రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్, హరిహర సుతుడు అయ్యప్ప ల 'ఇరుముడి' 200 కోట్ల రూపాయిలు చేరుకోవడానికి రెడీ అవుతుంది. తాజాగా ఇరుముడి నుంచి సరికొత్త డివోషనల్ వీడియో సాంగ్ 'కార్తీక మాసం' విడుదలై అభిమానులని ప్రేక్షకులని ఎంతోగానో ఆకట్టుకుంటోంది. స్వామి అయ్యప్ప భక్తి పారవశ్యాన్ని, మండల దీక్షా నియమాలను ఎంతో లోతుగా ఆవిష్కరించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది. ఈ అద్భుతమైన గీతానికి దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా సాహిత్యాన్ని అందించగా, జి. వి. ప్రకాష్ కుమార్ తో కలిసి శివ నిర్వాణ ఆలపించాడు 4 నిమిషాల 5 సెకన్ల నిడివితో ఉండగా నేరుగా శబరిమల భక్తి లోకంలోకి తీసుకెళ్తుంది. "ఇది మరి కార్తీక మాసం స్వామి... తలపై చన్నీళ్ల స్నానం కాని మనసే మరింత భద్రం స్వామి" అంటూ సాగే లిరిక్స్ దీక్షా ధారుల జీవితాన్ని, శారీరక కష్టాలను దాటి పొందే ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతిబింబిస్తాయి. భక్తులు పడే తపన, చలిలో ఉదయాన్నే చేసే స్నానాలు, కటిక నేలపై పడుకునే నిరాడంబరమైన జీవనశైలిని చాలా సహజంగా ఈ పాటలో వర్ణించారు. పాటలోని అతి ముఖ్యమైన అంతరార్థం ఏమిటంటే— "కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష... నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష". బయటి సమాజంతో లేదా శత్రువులతో చేసే పోరాటం కాదు మండల దీక్ష, మనలోని అహంకారాలు, ద్వేషాలు, కామక్రోధాలపై మనతో మనమే చేసే అంతర్యుద్ధం అనే గొప్ప సందేశాన్ని ఈ పాటకు శివ నిర్వాణ అందించారు. అలాగే "నేను అంటే నువ్వే అంటూ స్వామి పదవి ఇచ్చావు... ద్వేషాల్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి" అని అయ్యప్ప దీక్షలోని సమభావనను ఎత్తిచూపారు. కులమతాల భేదం లేకుండా, చిన్నపెద్ద తారతమ్యం లేకుండా నల్లటి దుస్తులు ధరించి ప్రతి ఒక్కరినీ 'స్వామి' అని పిలుచుకునే ఆచారాన్ని
తెలంగాణ వాణిజ్య పన్నుల ఆదాయంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో నమోదైన జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల్లో సుమారు 69 శాతం మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆగస్టు నెలలో రాష్ట్ర మొత్తం జీఎస్టీ వసూళ్లలో నగరం ఏకంగా 91.1 శాతం వాటాను నమోదు చేసింది. హైదరాబాద్‌లో ఆగస్టు జీఎస్టీ వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 20.53 శాతం పెరిగి రూ.3,956 కోట్లకు చేరాయి. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో సుమారు 5.8 లక్షల మంది జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు నమోదై ఉన్నారు. వీరిలో దాదాపు 4 లక్షల మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. అంటే రాష్ట్రంలోని ప్రతి 10 మంది నమోదిత జీఎస్టీ చెల్లింపుదారుల్లో ఏడుగురు నగరానికి చెందినవారే. ఆగస్టులో తెలంగాణ మొత్తం రూ.4,341 కోట్ల జీఎస్టీ ఆదాయం సాధించగా.. అందులో హైదరాబాద్ నుంచే రూ.3,956 కోట్లు సమకూరాయి.పన్ను చెల్లింపుదారుల సంఖ్యతో పోలిస్తే హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం గణనీయంగా అధికంగా ఉండటానికి నగరంలో అధిక విలువ కలిగిన ఆర్థిక కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐటీ, ఐటీఈఎస్, ఔషధ, రియల్ ఎస్టేట్ రంగాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉండటంతో పెద్ద మొత్తంలో పన్ను పరిధిలోకి వచ్చే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక్కో నమోదిత పన్ను చెల్లింపుదారుపై సగటు జీఎస్టీ వసూళ్లు సుమారు రూ.98,900గా ఉండగా.. రాష్ట్ర సగటు రూ.74,845గా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో తెలంగాణ పరోక్ష పన్నుల ఆదాయం కూడా బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జీఎస్టీ, వ్యాట్ కలిపి రూ.36,636 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.31,477 కోట్లతో పోలిస్తే ఇది 16.39 శాతం అధికం. అంటే ఈ ఐదు నెలల్లో అదనంగా రూ.5,159 కోట్ల ఆదాయం సమకూరింది.ఏప్రిల్-ఆగస్టు 2025లో రూ.17,414 కోట్లుగా

రవితేజకి సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో నిరూపించింది `ఇరుముడి` మూవీ. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గత నెల 21న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటించగా, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, సాయికుమార్, రమేష్ ఇందిరా, స్వసిక విజయ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అయ్యప్ప భక్తుల కథతో, తండ్రీకూతుళ్ల బాండింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. అయ్యప్ప భక్తుల కథ, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ఈ మూవీని చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పటికీ దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. `ఇరుముడి` మూవీ రవితేజకి అదిరిపోయే విజయాన్ని అందించారు. ఆయనకు సరైన హిట్ పడితే బాక్సాఫీసు వద్ద రచ్చ ఎలా ఉంటుందో ఈ మూవీ చూపిస్తోంది. ఇది ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్లింది. వీకెండ్లోనే కాదు వీక్ డేస్‌లోనూ ఊహించని వసూళ్లని రాబట్టడం విశేషం. మంగళవారం(12వ రోజు) కూడా బాక్సాఫీసు వద్ద రవితేజ దుమ్ములేపాడు. ఈ చిత్రానికి ఇండియాలో రూ.5.90కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్లో యాభై లక్షలు రాబట్టింది. మొత్తంగా 12 రోజుల్లో ఈ మూవీ రూ.186.50కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. అయితే ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద సాలిడ్‌గా రన్ కావడం మరో విశేషం. ఓ వైపు టాక్సిక్ మూవీ థియేటర్లో ఆడుతోంది. అంతో ఇంతో సందడి చేస్తోంది. ఆ పోటీని తట్టుకొని కూడా ఈ చిత్రానికి ఇంతటి భారీ వసూళ్లు రావడం విశేషంగా చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి అయిన బడ్జెట్ రూ.40కోట్లు. థియేట్రికల్‌గా అయిన బిజినెస్ రూ.20 కోట్లు. రూ.21కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ మూవీ రెండు రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. మూడో రోజుతోనే లాభాల్లోకి వెళ్లింది. నిర్మాతలకు
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు, విశ్లేషణలు, స్పెషల్ స్టోరీలు రాస్తున్నారు. సినిమాల గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. రాజశేఖర్ జేఎన్టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ నుంచి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ పొందారు. తుపాకీ న్యూస్, ఏబీపీ దేశం, ఇండియా హెరాల్డ్ డాట్ కామ్ లాంటి మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు. 2019 ఎన్నికల టైంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడో 19 ఏళ్ల క్రితం వచ్చిన ఓ ఫ్లాప్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీయడమేంటి? అది సూపర్ హిట్ అవడమేంటి? ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించడమేంటి? బాలీవుడ్లో ఇప్పుడు అలాంటి అద్భుతమే జరిగింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ‘ఆవారాపన్ 2’ (Awarapan 2). 2007లో ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi), శ్రియా శరణ్ (Shriya Saran) జోడీగా నటించిన ‘ఆవారాపన్’ (Awarapan) విడుదలైంది. మోహిత్ సూరి (Mohit Suri) తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలే వచ్చినా, బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది. రూ.18 కోట్ల బడ్జెట్‌తో తీస్తే, రూ.12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. థియేటర్ల నుంచి ఈ సినిమా వెళ్లిపోయిన తరువాత టీవీల్లో చూసిన ప్రేక్షకులు దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అలా ఈ సినిమాకు కల్ట్ స్టేటస్ వచ్చింది. ఇన్నేళ్ల తరువాత ఈ ఏడాది ‘ఆవారాపన్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ జోడీగా నటించిన ఈ సినిమాను నితిన్ కక్కర్ తెరకెక్కించారు. ఆగస్టు 14న విడుదలైన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వసూళ్ల వర్షం కురిసింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు సాధించడం విశేషం. అన్నదానాలతో ప్రచారం చేసి.. రూ.50 కోట్లు సాధించి..: ‘హనుమాన్ అంశ్’ విశేషాలివీ ఈ చిత్ర ఘనవిజయంపై ఇమ్రాన్ హష్మి భావోద్వేగానికి గురయ్యారు. ‘‘రెండు దశాబ్దాల క్రితం విడుదలైన సినిమాకు ప్రేక్షకుల ఆదరణ లభించలేదు. అయినప్పటికీ సీక్వెల్‌తో మళ్లీ వచ్చింది. ఈసారి చరిత్రను తిరగరాసింది. ఇది అపూర్వ విజయం. ఇదే నా బెస్ట్ ఫిలిం’’ అని ఆయన పోస్ట్ చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు

ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఈక్వెషన్ యష్ విషయంలో శృతి తప్పింది. యష్ హోమ్ స్టేట్ కర్ణాటకలో టాక్సిక్ కి తగిలిన షాక్ ట్రేడ్ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది. షాక్ కి గురి చేయడమే కాదు ఎందుకు ఇలా అనే విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. యష్ కి ఉన్న క్రేజ్, మాస్ ఇమేజ్‌ని బట్టి కర్ణాటకలో టాక్సిక్ చాలా తేలికగా 100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరుతుందని అందరూ ఆశించారు. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా వచ్చిన . 140 కోట్ల గ్రాస్ లో కర్ణాటకలోనే దాదాపు 30.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డుల బోణీ కొట్టింది. కానీ, రెండో రోజు నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కర్ణాటకలో ఎలాంటి సినిమా లేకపోయినా కూడా ప్రేక్షకులు టాక్సిక్ థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో కర్ణాటక థియేట్రికల్ రన్లో కనీసం 100 కోట్ల గ్రాస్ మార్జిన్ అందుకోలేక చేతులెత్తేసింది. అయితే ఉత్తరాది హిందీ బెల్ట్‌లో మాత్రం ‘టాక్సిక్’ అద్భుతమైన ప్రదర్శనతో ఊరటనిస్తోంది. కన్నడ వెర్షన్‌తో పోలిస్తే బాలీవుడ్ మార్కెట్లో ఈ చిత్రానికి విశేష ఆదరణ దక్కుతుండటం విశేషం. హిందీ బెల్ట్‌లో తొలి రోజే ఏకంగా 55 కోట్ల మేర సాలిడ్ కలెక్షన్లు సాధించి, సౌత్ ఇండియా సినిమాల్లోనే హిందీ వెర్షన్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమా కంటెంట్‌కి, యశ్ స్క్రీన్ ప్రజెన్స్‌కి బ్రహ్మరథం పడుతుండటంతో అక్కడ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బాక్సాఫీస్ పరిస్థితిని పరిశీలిస్తే మరో రకమైన షాకింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. తెలుగులో మొదటి రోజు 20.1 కోట్ల గ్రాస్ సాధించి సాలిడ్ ఓపెనింగ్ తెచ్చుకున్నప్పటికీ, రెండో రోజు నుంచే థియేటర్లలో దారుణమైన పరిస్థితి నెలకొంది. ఆడియన్స్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో పలు థియేటర్లలో షోలు రద్దయ్యే పరిస్థితులు కూడా చూసింది

రాకింగ్ స్టార్ యాష్ హీరోగా, వర్సటైల్ నటి నయనతార , ప్రముఖ నటి కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. థియేటర్లలో విడుదలై ఆరో రోజుకు చేరుకున్న నేపథ్యంలో, బాక్సాఫీస్ వసూళ్లలో గణనీయమైన మార్పులు నమోదు అయ్యాయి. ఆరో రోజు వసూళ్లలో మునుపటి రోజులతో పోలిస్తే 67.6 శాతం మేర తగ్గుదల (డ్రాప్) కనిపించినప్పటికీ, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలిపి ఇప్పటివరకు రూ. 304.05 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఐదు రోజుల్లో భారీ ఓపెనింగ్స్ సాధించి రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోయింది. యాష్‌కు ఉన్న అంతర్జాతీయ మార్కెట్ క్రేజ్, అలాగే నయనతార, కియారా అద్వానీల సపోర్టింగ్ రోల్స్ ఈ సినిమాకు మంచి ఆదరణ తెచ్చిపెట్టాయి. ఆరో రోజు సాధారణ పనిదినం (వర్కింగ్ డే) కావడంతో వసూళ్లలో 67.6 శాతం మేర తగ్గుదల నమోదైనట్లు బాక్సాఫీస్ విశ్లేషకులు వెల్లడించారు. అయినప్పటికీ, అంతర్జాతీయంగా, దేశీయంగా సాధించిన వసూళ్లతో కలిపి మొత్తం రూ. 304.05 కోట్ల గ్రాస్ మార్కును చేరుకోవడం టాక్సిక్ పవర్ ను చూపిస్తోంది. టాక్సిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద రోజురోజుకూ వసూళ్లు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియా నెట్ కలెక్షన్లలో ఇప్పటికే రూ. 200 కోట్ల మార్కును దాటినప్పటికీ, మొదటి రోజు సాధించిన రికార్డు ఓపెనింగ్స్ తర్వాత ప్రతిరోజూ వసూళ్లు పడిపోతున్నాయి. ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ Sacnilk కథనం ప్రకారం, మొదటి సోమవారం ఈ చిత్రం కేవలం రూ. 7.45 కోట్లు మాత్రమే రాబట్టింది. సినిమా విడుదలైనప్పటి నుండి ఇదే అత్యల్ప సింగిల్-డే కలెక్షన్ కావడం గమనార్హం. దీంతో ఈ చిత్రం ఇప్పటివరకు భారత్‌లో సాధించిన మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 221.55 కోట్లకు చేరుకున్నాయి. ఇండియాలో గ్రాస్ వసూళ్లు.. 264.80 కోట్లు కాగా.. ఒవర్ సిస్ లో

రవితేజ హీరోగా నటించిన ఇరుముడి చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ టాలీవుడ్ పరిశ్రమ మొత్తానికి కొత్త ఊపిరి పోసిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనియాడారు. రాజ్‌తరుణ్, శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కూర్మావతార్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్లకు జనం తండోపతండాలుగా తరలివస్తుంటేనే సినిమాలు తీసే నిర్మతలకు, నటీనటులకు కొండంత ధైర్యం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సినిమాలో గురుస్వామి పాత్రలో జీవించిన సీనియర్ నటుడు సాయికుమార్ నటనపై ఆయన ప్రత్యేకంగా ప్రశంసలు గుప్పించారు. ఆగస్టు 21న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన ఇరుముడి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మైండ్ బ్లాకింగ్ కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ అండ్ భక్తిరస డ్రామా ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో తండ్రి కూతుళ్ల అనుబంధంతో పాటు అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమా తెచ్చిపెట్టిన పాజిటివ్ వైబ్ కేవలం ఒక చిత్ర బృందానికే కాకుండా మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతో ప్లస్ అయిందని దిల్ రాజు విశ్లేషించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ రేసులో ఇరుముడి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ సినిమా భారతదేశంలో నెట్ వసూళ్ల రూపంలో ఏకంగా రూ. 129.55 కోట్లు సాధించింది. ఇదిలా ఉండగా ఇండియా గ్రాస్ పరంగా రూ. 150 కోట్ల మార్కును చాలా సులువుగా దాటేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. వరల్డ్‌వైడ్‌గా చూస్తే ఈ చిత్రం రూ. 170 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించి రవితేజ కెరీర్లోనే మైలురాయిగా నిలిచింది. ఈ విజయం ఒకవైపు జోరుగా కొనసాగుతుండగా మరోవైపు

‘ఇరుముడి’(Irumudi)చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఇరుముడి’(Irumudi)చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద జోరు కనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి స్పందన రావడం చిత్రానికి కలిసొచ్చే అంశంగా మారింది. ‘ఇరుముడి’ తొలి రోజే సుమారు రూ.23–25 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మౌత్ టాక్ తో వీకెండ్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రవితేజకు ఉన్న మాస్ ఫాలోయింగ్, పాజిటివ్ రెస్పాన్స్ కలిసి బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. ‘ఇరుముడి’ దూకుడు ఇప్పుడు ఇప్పటికే థియేటర్లలో ఉన్న ‘విశ్వనాథ్ & సన్స్’కు (Vishwanath and sons) కొంత పోటీగా మారే పరిస్థితి కనిపిస్తోంది. సూర్య నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విడుదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా డీసెంట్ బిజినెస్ చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాభాల జోన్లోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో వీకెండ్లోకి అడుగుపెడుతున్న సమయంలో ‘ఇరుముడి’ రావడం సూర్య సినిమాకు సవాల్‌గా మారింది. ‘ఇరుముడి’ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకర్షిస్తుండటంతో థియేటర్లలో ప్రేక్షకులు డివైడ్ అయ్యే అవకాశం ఉంది. ‘విశ్వనాథ్ & సన్స్’కు కొన్ని కేంద్రాల్లో ఆక్యుపెన్సీ తగ్గే అవకాశాలు లేకపోలేదు. అలాగని పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పలేం. ఇప్పటికే సినిమాకు వచ్చిన టాక్, తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వసూళ్లు దానికి బలంగా మారాయి. సినిమా లాభాల దిశగా

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన 'ఇరుముడి' నిన్ననే థియేటర్లకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. అయ్యప్పస్వామి భక్తుడిగా రవితేజ కనిపించడం .. ఈ సినిమా నుంచి సాంగ్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడం బాగా కలిసొచ్చింది. దాంతో ఈ మధ్య కాలంలో థియేటర్స్ దగ్గర ఎప్పుడూ కనిపించని సందడి ఈ వారం కనిపించింది. ఆన్ లైన్ లో చకచకా టికెట్స్ అమ్ముడయ్యాయి. నిజానికి రవితేజ మినహా మిగతా ఆర్టిస్టులంతా ఓ మాదిరి క్రేజ్ ఉన్నవారే. ఇక రవితేజతో పాటు తెరపై పూర్తి స్థాయిలో కనిపించిన పాప 'నక్షత్ర' కూడా ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం లేదు. అయినా విడుదలకు ముందు నుంచి ఈ సినిమా మంచి బజ్ ను సంపాదించుకుంది. రవితేజ క్రేజ్ .. 'ఇరుముడి' అనే టైటిల్ .. ట్రైలర్ .. సాంగ్స్ అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఈ సినిమా, విడుదలైన తొలిరోజునే ప్రపంచవ్యాప్తంగా 24 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.అయ్యప్పస్వామి వైపు నుంచి ఉన్న డివోషనల్ టచ్. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి కథానాయకుడు కావడం .. కూతురుపై అతనికి గల ప్రేమ .. తాను ఉన్నానంటూ కూతురుకు అండగా నిలిచే తీరు .. ఆడపిల్లల్లో భయాన్ని కాదు, ధైర్యాన్ని నింపాలి అనే సందేశం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. కథాకథనాలు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. లొకేషన్స్ ను కవర్ చేసిన విధానం .. హుషారెత్తించే పాటలు

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. విడుదలైన తొలిరోజుకే భారీ వసూళ్లు రాబట్టింది. ఇండియాలో రూ.14.80 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించినట్లు సాక్నిల్క్ నివేదిక అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.24.20 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది. ఏపీ తెలంగాణ నుంచే రూ.15 కోట్లు తొలిరోజు ‘ఇరుముడి’ వసూళ్లలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి రూ.15కోట్లు గ్రాస్ వచ్చినట్లు అంచనా. కర్ణాటక నంచి 1.5 కోట్లు, తమిళనాడు నుంచి రూ.34 లక్షలు, మిగతా ప్రాంతాల నుంచి 36 లక్షలు వసూళయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం గ్రాస్ రూ.17.20 కోట్లకు చేరింది. ఓవర్సీస్లో రూ.7 కోట్ల గ్రాస్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు రూ.24.20 కోట్లకు చేరాయి. బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) పీవీ సింధూ పోస్టుకి, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాకూ తేడా తెలీదు ఇరుముడిలో మరో ఎడిట్.? జోరుగా టికెట్ బుకింగ్ బిడ్డ వ్యాఖ్యలపై కొండా మురళి రియాక్షన్..!

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రారంభాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు 20 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టు 21న విడుదలైన సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 24.20 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం బ్రేక్ ఈవెన్‌కు అవసరమైన వసూళ్లలో మొదటి రోజే గణనీయమైన భాగాన్ని అందుకుంది. శనివారం వసూళ్లు ఇదే స్థాయిలో కొనసాగితే బ్రేక్ ఈవెన్ మరింత వేగంగా సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘ఇరుముడి’కి ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 నుంచి 45 కోట్ల గ్రాస్ వస్తే బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుందని ట్రేడ్ అంచనాలు పేర్కొంటున్నాయి. తొలి రోజు భారత్‌లో సుమారు 14.80 కోట్ల నెట్, 17.20 కోట్ల గ్రాస్ నమోదైనట్లు సమాచారం. ఓవర్సీస్ నుంచి మరో 6 నుంచి 7 కోట్ల వరకు వచ్చినట్లు ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. భారత్‌లో వచ్చిన వసూళ్లలో తెలుగు వెర్షన్ ప్రధాన వాటా సాధించినట్లు అందుబాటులో ఉన్న సమాచారం సూచిస్తోంది. ప్రీమియర్లు, ముందస్తు బుకింగ్స్ నుంచి కనిపించిన స్పందన మొదటి రోజు వసూళ్లలోనూ కొనసాగింది. దీంతో ‘ఇరుముడి’ తొలి రోజే బ్రేక్ ఈవెన్ లక్ష్యంలో 60 శాతానికి పైగా రికవరీ సాధించినట్లు కొన్ని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రాక్టాలీవుడ్ వంటి ట్రేడ్ సోర్సులు బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని సుమారు 40 కోట్ల గ్రాస్‌గా అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా, మరికొన్ని అంచనాల్లో ఈ లక్ష్యం 45 కోట్ల వరకు ఉండొచ్చని పేర్కొంటున్నారు. ఈ రెండు అంచనాల్లో ఏది తీసుకున్నా తొలి రోజు 24.20 కోట్ల గ్రాస్ సినిమా వసూళ్లకు బలమైన పునాది వేసినట్లే కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం వరకు ఇదే జోరు కొనసాగితే లక్ష్యానికి మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఫలితంగా రవితేజకు ఇటీవలి చిత్రాల తర్వాత ‘ఇరుముడి’

సూర్య లేటెస్ట్ గా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఆయన `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీతో విజయాన్ని అందుకున్నారు. గత వారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. దీంతో వారు సినిమాని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ 8 రోజులు పూర్తి చేసుకుంది. ఈ శుక్రవారం కొత్త సినిమాలు వచ్చాయి. అయినా ఈ మూవీ కలెక్షన్లు తగ్గలేదు సరికదా, శుక్రవారం పెరగడం విశేషం. `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీకి ఎనిమిదో రోజు రూ.4.50కోట్లు వచ్చాయి. గురువారం రూ.4.20కోట్లు రాగా, ముప్పై లక్షలు పెరగడం విశేషం. వీకెండ్స్ లో ఈ మూవీ పుంజుకుంటుందనేదానికిది నిదర్శనం. ఇక 8 రోజుల్లో ఈ చిత్రం మొత్తంగా రూ.149.77కోట్లు రాబట్టింది. ఆల్మోస్ట్ 150కోట్ల క్లబ్లో చేరింది. ఇండియాలో దీనికి రూ.99.52కోట్ల గ్రాస్ రాగా, రూ.86.10కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఎనిమిదో రోజు ఓవర్సీస్లో కోటిన్నర రాబట్టింది. మొత్తంగా అక్కడ రూ.50.26కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ సినిమాకి తమిళంలో కంటే తెలుగులోనే కలెక్షన్లు ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. 8వ రోజు కూడా తమిళంలో రూ.1.85కోట్లు వస్తే, తెలుగులో రూ.2.40కోట్లు రావడం విశేషం. ఓవరాల్ కలెక్షన్లలో కూడా తమిళం కంటే తెలుగులోనే ఎక్కువగా ఉండటం మరో విశేషం. ఇక ఈ చిత్రానికి రూ.130కోట్ల బడ్జెట్ అయ్యింది. సుమారు రూ.90కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యిందట. ఈ లెక్కన సినిమా హిట్ కావాలంటే రూ.180కోట్ల గ్రాస్ రావాలి. ఇప్పటికే రూ.150కోట్లు దాటింది. ఈ వచ్చే వారంలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన `విశ్వనాథ్ అండ్ సన్స్` చిత్రంలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్ గా నటించింది. రాధికా శరత్ కుమార్, రవీనా టండన్, వైవా హర్ష

రవితేజకి `ధమాఖా` తర్వాత హిట్ లేదు. ఆ తర్వాత చేసిన ఆరేడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతూనే ఉన్నాయి. తన మార్క్ కమర్షియల్, ఎంటర్టైనర్స్ థియేటర్లో సేల్ కావడం లేదు. దీంతో రూట్ మార్చాడు రవితేజ. తన జోనర్ మార్చాడు. భక్తిరస చిత్రాల వైపు టర్న్ తీసుకున్నారు. అయ్యప్పస్వామి భక్తులకు సంబంధించిన ఆధ్యాత్మిక కథతో వచ్చారు. తండ్రీ కూతురు సెంటిమెంట్‌ని, ఎమోషన్స్ ని, యాక్షన్ థ్రిల్లర్ అంశాలను మేళవించి రూపొందించిన `ఇరుముడి` చిత్రంతో ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తున్నాడు. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ఇది శుక్రవారం విడుదలైంది. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా, సాయికుమార్, అజయ్ ఘోష్, స్వసిక విజయ్, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిరా వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. `ఇరుముడి` మూవీకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం బాక్సాఫీసుపై కనిపిస్తుంది. సినిమా మంచి వసూళ్ల దిశగా వెళ్తోందని ట్రేడ్ సైట్లు చెబుతున్నాయి. ఇక ఫస్ట్ డే ఈ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. రవితేజ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రావడం విశేషం. రవితేజ కెరీర్లో సోలో హీరోగా వచ్చిన చిత్రాల్లో `ధమాఖా`, `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాలు మాత్రమే ఎనిమిది కోట్లతో టాప్ లో ఉన్నాయి. కానీ `ఇరుముడి` మూవీ మాత్రం వాటి రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాదు అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ ఏడాది వచ్చిన చిరంజీవి `మన శంకరవర ప్రసాద్ గారు` మూవీ రికార్డుని కూడా బ్రేక్ చేసింది. దానికి రూ.31.6వేల టికెట్స్ బుక్ అయితే `ఇరుముడి`కి రూ.32.25వేల టికెట్స్ అడ్వాన్స్ గా అమ్ముడు పోవడం విశేషం. `ఇరుముడి` చిత్రానికి మొదటి రోజు ఏకంగా రూ.24.20కోట్లు రావడం విశేషం. రవితేజ గత చిత్రాలతో పోల్చితే మూడు రెట్లు అధికంగా వచ్చాయి. ఇది ఇండస్ట్రీకి, ట్రేడ్ వర్గాలకే

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా, రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. సినిమా విడుదలైన కేంద్రాల్లో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వ్యక్తమవుతోంది. థియేటర్ల వద్ద హారతులు, భజనలతో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చిత్రంలోని ‘మల్లెపూల పల్లకి’ పాటకు థియేటర్లలో పిల్లలు డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తుండగా, సంగీతంపై కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఉదయం షోల నుంచి మొదలైన ఈ జోరు షో టు షో మరింతగా పెరుగుతోంది. చాలా చోట్ల సెకండ్ షోలకు టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయి హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అన్ని సెంటర్లలోనూ భారీ కలెక్షన్ల దిశగా సాగుతున్న ‘ఇరుముడి’, థియేటర్లలో సరికొత్త మాస్ జాతరను సృష్టిస్తోంది

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా మరి నటించిన మొదటి మూవీ 'DC'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగష్టు 7న థియేటర్లలో అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ మూవీ రెండు వారాల్లో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. కథలో 'దాస్' పాత్రలో లోకేష్ కనకరాజ్, 'చంద్ర' పాత్రలో వామికా గబ్బి నటించారు. వీరిద్దరి పేర్లలోని మొదటి అక్షరాల కలయికే ఈ 'DC'. లోకేష్ ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేస్తున్నారని తెలిసినప్పుడు మొదట్లో కొందరు అనుమానాలు వ్యక్తం చేసినా, లోకేష్ తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో, రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో అందరినీ మైండ్ బ్లాక్ చేశారు, ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ కావడానికి కారణం కేవలం లోకేష్ క్రేజ్ మాత్రమే కాదు. అరుణ్ మాథేశ్వరన్ మార్క్ కల్ట్ విజువల్స్, వామికా గబ్బి పవర్ఫుల్ యాక్టింగ్, అనిరుధ్ రవిచందర్ అందించిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అసలైన ప్రాణం పోశాయి. అనిరుధ్ ఇచ్చిన బిజీఎమ్ థియేటర్లలో సీన్స్ ప్లే అవుతున్నంతసేపు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఒక సెన్సేషనల్ ఫిల్మ్‌మేకర్ తన తొలి ప్రాజెక్ట్‌తోనే నటుడిగా ఈ స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు. 100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించిన 'DC' చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 'స్పిరిట్' మూవీ నుంచి ప్రకాష్‌రాజ్ ఔట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.!

దర్శకుడు వెంకీ అట్లూరి సితార ఎంటర్టైన్మెంట్స్తో తనకున్న ప్రత్యేక అనుబంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్య కథానాయకుడిగా నాగవంశీ నిర్మించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సితార సంస్థతో తనకున్న సంబంధం డబ్బులు, అగ్రిమెంట్లకు అతీతమైనదని ఆయన స్పష్టం చేశారు. తన్ను నమ్మి వరుసగా అవకాశాలు ఇచ్చినందుకు ఆ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మూడేళ్ల క్రితమే సిద్ధమైన కథఈ సినిమా వెనుక ఉన్న నిర్మాణ ప్రయాణాన్ని వెంకీ అట్లూరి వివరంగా పంచుకున్నారు. ఈ కథను 2022 లోనే రాసుకున్నానని, సూర్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా కొన్ని మార్పులు చేశానని తెలిపారు. సూర్య కూడా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్న సమయంలో ఈ కథ వినగానే ఎంతో ఇష్టపడ్డారని పేర్కొన్నారు. అనవసరమైన కామెడీ లేకుండా కథను ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా చెప్పాలని సూర్య సూచించడంతో దానికి అనుగుణంగా చిత్రీకరించినట్లు వెల్లడించారు. పాత్రల ఎంపిక మరియు వసూళ్ల తీరుకథాంశం మరియు నటీనటుల ఎంపిక గురించి కూడా ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. 'ప్రేమలు' సినిమా చూసిన తర్వాత మమితా బైజును ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేశామని, తమిళంపై ఆమెకున్న పట్టు సినిమాకు ప్లస్ అయిందని తెలిపారు. దీంతో తమిళ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రాన్ని ప్రధానంగా తమిళంలో రూపొందించినట్లు చెప్పారు. అక్కడ థియేటర్లు, టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వల్ల ప్రారంభ వసూళ్లు తక్కువగా కనిపిస్తాయి, అయితే లాంగ్ రన్ బలమైన ప్రభావం చూపిస్తుందని ఆయన విశ్లేషించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయంసినిమా వసూళ్ల వివరాలను చూస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా మొదటి వారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ₹155 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో నికరంగా ₹81.63 కోట్లు వసూలు

ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రై కార్పొరేషన్లలోని ప్లానింగ్ విభాగం లీలలు హైదరాబాద్ సిటీ: ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతుల నుంచి ఓసీల జారీ వరకు.. ఫైల్‌కు ఇంత అని, అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం బట్టి రేట్లు నిర్ణయించి మరీ లంచాలు తీసుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకుంటే నోటీసులు, కూల్చివేతలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) పరిధిలో ఈ తతంగం ఎక్కువగా జరుగుతుండగా.. తామేమి తక్కువ కాదన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) యంత్రాంగం కూడా వారితో పోటీ పడుతోంది. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల దోపిడికి అడ్డూ అదుపు ఉండడం లేదు. మాదాపూర్‌లో నోటరీ స్థలాల్లో నాలుగైదు అంతస్తుల భవన నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించి.. నిర్మాణదారుల నుంచి కొందరు అధికారులు వసూళ్లు చేస్తుండడం గమనార్హం. కూకట్పల్లి జోన్ పరిధిలోనూ పలువురు పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. అంతా మేం చూసుకుంటాం.. అదనపు అంతస్తులు నిర్మించుకోండని భవన యజమానులకు భరోసా ఇస్తున్నట్టు తెలిసింది. గ్రౌండ్ ప్లస్ రెండంతస్తుల భవనానికి అనుమతి తీసుకున్న ఓ వ్యక్తి అదనంగా మరో రెండంతస్తులు నిర్మించారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోగా.. త్వరగా బయటి వైపు పనులు పూర్తి చేసి రంగులు వేయాలని సూచించినట్టు సమాచారం. చైన్‌మెన్ నుంచి టీపీఎస్, ఏసీపీ, సిటీ ప్లానర్ల వరకు అవినీతిలో భాగస్వాములుగా ఉంటున్నారు. ప్రతీ ఫైల్‌కు ముడుపులు ముట్టాల్సిందే అని కింది స్థాయి సిబ్బంది వద్ద పైఅధికారులు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ఈ స్థాయి స్పందన రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కథ వినగానే సూర్య గారి రియాక్షన్ ఏంటి? కథ వినగానే సూర్య గారికి చాలా నచ్చేసింది. నిజానికి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారు. అదే విషయం నాకు చెప్పారు. ఈ కథ నా దగ్గర అప్పటికే సిద్ధంగా ఉండటంతో, ఆయనకు వినిపించాను. సూర్య గారికి కథ చాలా నచ్చింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాము. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య గారు చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు. త్రివిక్రమ్ గారి రచనలో ఉండే బలం, మీ రచనలో కనిపిస్తుంది అనే ప్రశంసలు రావడం ఎలా ఉంది? నేను సినీ పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తి నింపినది మణిరత్నం గారు, త్రివిక్రమ్ గారు. అలాంటిది త్రివిక్రమ్ గారితో నన్ను పోల్చడం అనేది గౌరవంగా భావిస్తున్నాను. దానిని

హీరో తేజ సజ్జా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘మిరాయ్’ జపాన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం శుక్రవారం జపాన్‌లో అత్యంత వైభవంగా విడుదల కానుంది. రిలీజ్‌కు ముందే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. గతంలో ఇండియన్ సినిమాలకు సంబంధించి జపాన్ మార్కెట్లో ట్రెండ్ సెట్ చేసిన బాహుబలి 2, టైగర్ జిందా హై వంటి భారీ చిత్రాల రికార్డులను ‘మిరాయ్’ దాటేసింది. భారతీయ చిత్ర పరిశ్రమ దృష్టిని ఈ బుకింగ్స్ ఒక్కసారిగా ఆకర్షించాయి. దీంతో జపాన్‌లో అత్యధిక డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన భారతీయ సినిమాల టాప్ 10 జాబితాలో ‘మిరాయ్’ 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా, యంగ్ హీరో తేజ సజ్జా మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోందని ఈ అడ్వాన్స్ బుకింగ్స్ నిరూపిస్తున్నాయి. ఫలితంగా జపాన్‌లో ఇప్పటికే విజయం సాధించిన ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ వంటి విజువల్ వండర్స్ సరసన ఈ సినిమా చేరింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయ ప్రేక్షకులతో పాటు స్థానిక మూవీ లవర్స్ కూడా ఈ సినిమాపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో జపాన్ మార్కెట్లో ‘మిరాయ్’ మరిన్ని కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో తెలుగు చిత్రాల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 143 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ‘మిరాయ్’, 2025లో అత్యధిక రెవెన్యూ సాధించిన టాప్ టాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. జపాన్ విడుదలతో ఈ కలెక్షన్ల రేంజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది

వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా `కొరియన్ కనకరాజు` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. దీన్ని కామెడీ హర్రర్, థ్రిల్లర్‌గా ఆయన రూపొందించారు. సత్య, మురళీధర్ గౌడ్, సునీల్, టెంపర్ వంశీ ముఖ్య పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్ట్ 7న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా 13రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా థియేటర్లో రన్ అవుతుంది. 13వ రోజు ఎంత కలెక్షన్లని రాబట్టింది, ఇప్పటి వరకు టోటల్‌గా ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యింది. కేవలం రూ.12కోట్ల థియేట్రికల్ బిజినెస్‌తో విడుదలైన ఈ మూవీ మొదటి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. కాకపోతే పెద్ద స్థాయిలో సినిమా వసూళ్లని కలెక్ట్ చేస్తుందని భావించారు. కానీ ఆ స్థాయిలో చేయలేకపోయింది. వంద కోట్ల వరకు వెళ్లలేకపోయింది. ఈ మూవీ 13 రోజుల్లో మొత్తంగా రూ.31.75కోట్లు రాబట్టింది. బుధవారం దీనికి రూ.25లక్షలు మాత్రమే వచ్చాయి. మంగళవారంతో పోల్చితే మూడు లక్షలు తగ్గాయి. ఇది సినిమా థియేట్రికల్ గా క్లోజ్ అవుతుందనేదానికి సంకేతంగా చెప్పొచ్చు. మహా అయితే ఈ వారాంతం వరకు ఆడుతుంది. ఆ తర్వాత ఎత్తేయాల్సి వస్తుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా 10 రోజులకే రూ.50కోట్లు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ లెక్కన ఇప్పటి వరకు మరో కోటి, రెండు కోట్లు యాడ్ చేసి ఉంటారు. చిత్ర బృందం అధికారిక లెక్కల ప్రకారం ఇది దాదాపు రూ.52కోట్ల వరకు వసూలు చేసి ఉండొచ్చు. ఏదేమైనా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లో వెళ్తుంది. ట్రేడ్ సైట్ల లెక్కల ప్రకారం దీనికి నాలుగైదు కోట్ల లాభాలు వచ్చి ఉంటాయి. అదే టీమ్ లెక్కల ప్రకారం పది కోట్లకుపైగానే లాభాలను రాబట్టిందని చెప్పొచ్చు

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఇరుముడి’ చిత్రం నార్త్ అమెరికా మార్కెట్లో ప్రీ-సేల్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 20న ప్రీమియర్లు, ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ముందస్తు బుకింగ్స్‌లో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటోంది. ప్రవాసాంధ్రులు, అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా టికెట్ల కొనుగోలుకు భారీగా ఆసక్తి చూపిస్తున్నారు. రవితేజ కెరీర్లో ఇటీవలి కాలంలో వచ్చిన చిత్రాల ఫైనల్ అడ్వాన్స్ కలెక్షన్లను ఇది చాలా తక్కువ సమయంలోనే దాటేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం, ఆగస్టు 19 నాటికి ‘ఇరుముడి’ ప్రీ-సేల్స్ వసూళ్లు $150,000 మైలురాయిని దాటి విజయవంతంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా $75K, $100K, $125K మైలురాళ్లను వేగంగా అధిగమిస్తూ ఈ సినిమా మార్కెట్లో తన పట్టును నిరూపించుకుంది. ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 10,000కు పైగా టికెట్లు అమ్ముడైనట్లు పంపిణీదారులు స్పష్టం చేశారు. ఈ స్థాయి ముందస్తు స్పందన రావడం విదేశీ మార్కెట్లో రవితేజ చిత్రాలకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గతంలో రవితేజ నటించిన బిఎమ్‌డబ్ల్యూ ఫైనల్ అడ్వాన్స్ వసూళ్లు $45K, మిస్టర్ బచ్చన్ $44K, ఈగల్ $41K, మాస్ జాతర $29K వద్ద ముగిశాయి. దీంతో పోలిస్తే ‘ఇరుముడి’ ఇంకా ప్రీమియర్‌కు సమయం ఉండగానే $150K దాటడం విశేషం. ఇదిలా ఉండగా, గతంలో ధమాకా సాధించిన $539K మార్కు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించే దిశగా ఈ చిత్రం వేగంగా దూసుకుపోతోంది. విదేశీ బాక్సాఫీస్ వద్ద నమోదు అవుతున్న ఈ గణాంకాలు చిత్ర యూనిట్‌కు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది. ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయి కుమార్

సూర్య హీరోగా నటించిన `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీ బాక్సాఫీసు వద్ద నెమ్మదిగా స్లో డౌన్ అవుతుంది. వీకెండ్స్ తో పోల్చినప్పుడు చాలా వరకు తగ్గింది. కానీ వీక్ డేస్‌లోనూ ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి. స్ట్రాంగ్‌గానే ఉండటం విశేషం. చాలా వరకు సినిమాలు వీక్ డేస్‌లో భారీగా పడిపోతాయి. ఈ చిత్రం మాత్రం డీసెంట్ గా వసూళ్లని రాబట్టడం విశేషం. ఇది సినిమా విజయానికి కారణమవుతుందని చెప్పొచ్చు. సూర్య, మమితా బైజు జంటగా నటించిన `విశ్వనాథ్ అండ్ సన్స్` కలెక్షన్లు చూస్తే, ఐదో రోజు ఇండియాలో రూ.7.33కోట్లు రాబట్టింది(సాక్నిల్క్ లెక్కల ప్రకారం). ఓవర్సీస్లో మరో రెండు కోట్లు వచ్చాయి. సోమవారంతో పోల్చితే కోటి వరకు తగ్గాయి. కానీ అది పెద్ద మార్పుగా చెప్పలేం. సాధారణంగా బుధ, గురువారం వరకు కలెక్షన్లు తక్కువగానే ఉంటాయి. మళ్లీ శుక్రవారం నుంచి పుంజుకుంటాయి. ఈ సినిమా విషయంలోనూ అదే జరుగుతుందా అనేది చూడాలి. ఈ సినిమా ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.128.60కోట్లు రాబట్టడం విశేషం. ఇండియాలో రూ.83.60కోట్ల గ్రాస్, రూ.72.30కోట్ల నెట్ వచ్చింది. ఓవర్సీస్లో సుమారు రూ.45కోట్లు రావడం విశేషం. ఇది ఓవర్సీస్లో దుమ్ములేపుతోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే కలెక్షన్లని రాబడుతుంది. తెలుగులో ఐదో రోజు రూ.3.50కోట్లు రాగా, తమిళంలో రూ.2.35కోట్లు మాత్రమే రావడం గమనార్హం. `విశ్వనాథ్ అండ్ సన్స్` సినిమాకి అయిన థియేట్రికల్ బిజినెస్ రూ.90కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.22కోట్లుగా నిర్ణయించారు. ఇక్కడ ఈ వీక్‌తో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక నాన్ థియేట్రికల్‌గా ఈ సినిమాకి ఓటీటీ రూపంలో రూ.85కోట్లు వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. శాటిలైట్ రూపంలో మరో రూ.28కోట్లు వచ్చాయి. ఆడియో రూపంలో రూ.12కోట్లు వచ్చాయి. మొత్తంగా బిజినెస్ రూ.215కోట్లు అని సమాచారం. సినిమాకి అయిన బడ్జెట్ రూ.130కోట్లు. దీంతో మేకర్స్ ఇప్పటికే రూ.85కోట్ల లాభాల్లో ఉన్నారు. థియేట్రికల్ గా సినిమా హిట్ కావాలంటే రూ.180కోట్ల గ్రాస్

ఇప్పుడు సౌత్ సినీ పరిశ్రమలో, అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒకటే చర్చ.. విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ చాలా బాగుంది, సూర్య, మమితా భైజు, రాధికా శరత్ కుమార్ ఒక రేంజ్ లో నటించారు అని. రోజు వారి ఫ్యామిలీ డిస్కర్షన్ లో ఒకటిగా కూడా మారిందంటే విశ్వనాధ్ అండ్ సన్స్ ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్ర కథని దర్శకుడు వెంకీ అట్లూరి మొదట ధనుష్, దుల్కర్ సల్మాన్ కి వినిపించాడు. ఆ తర్వాత టీం సలహాతో సూర్యకి వినిపించడం జరిగింది. ఆ విధంగా సూర్య వద్దకి చేరి ఇప్పుడు అభిమానులని, సినీ ప్రియులని విశేషంగా ఆకర్షిస్తుంది. మాస్ మహారాజా రవితేజతో పాటు పలువురు స్టార్ తెలుగు హీరోల పేర్లు కూడా వినిపించాయి. కానీ అవన్నీ ఒట్టి రూమర్స్. దుల్కర్, ధనుష్ మాత్రం నిజం. ఇక బాక్సాఫీస్ వద్ద విశ్వనాధ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లతో జోరు చూపిస్తూ కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 121 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, తమిళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచింది. లాంగ్ రన్ లో పలు చిత్రాల రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయం. దిల్ రాజు రియల్ లైఫ్ సీన్: 'విశ్వనాథ్ & సన్స్'కి ఇన్స్పిరేషన్ ఏంటో చెప్పిన వెంకీ అట్లూరి.! లక్ష రూపాయలతో తీసిన చెత్త సినిమా, 20 కోట్లు కలెక్ట్ చేసింది.. ఎలాగంటే?
సినిమా అంటేనే చిత్ర విచిత్రాలతో కూడుకున్న మాధ్యమం. భారీ బడ్జెట్‌తో తీసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. అదే సమయంలో తక్కు వ బడ్జెట్‌తో చేసిన కొన్ని సినిమాను సూపర్‌హిట్ అయి కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. సినిమా అనేది ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఇలాంటి అరుదైన సంఘటనలు చాలా సందర్భాల్లో జరిగాయి. ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటివరకు జరగని ఒక విచిత్రమైన విషయం చైనాలో నిర్మించిన ఒక యానిమేషన్ సినిమాకు జరిగింది. ఎలాంటి ప్రచారం లేకుండా, చాలా తక్కువ ఖర్చుతో రూపొంది, ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది చైనా భాషలో రూపొందిన నియు లై. 86 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రచార చిత్రాలు, ట్రైలర్లు ఏవీ లేకుండా విడుదలైన ఈ సినిమా, ఆ తర్వాత సోషల్ మీడియా ధాటికి ఏకంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. చైనాకు చెందిన తల్లి, కుమారుడు జిన్ యుమెంగ్, సన్ లీఫాంగ్ అనే ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ చిత్రాన్ని సుమారు రూ.1 లక్ష బడ్జెట్‌తో రూపొందించడం విశేషం. పాత సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లను ఉపయోగించి ఐదేళ్ల పాటు శ్రమించి ఈ యానిమేషన్ చిత్రాన్ని సిద్ధం చేశారు. ఓ చిన్న దూడ, స్కైలార్క్ పక్షి మధ్య జరిగే కథతో ఇది తెరకెక్కింది. ఆగస్టు ప్రారంభంలో థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. మొదటి పది రోజుల్లో కేవలం రూ.1 లక్ష మాత్రమే వసూలు చేసి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే సోషల్ మీడియాలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల మొత్తం సీన్ మారిపోయింది. సినిమాలోని అత్యంత నాసిరకం గ్రాఫిక్స్, అసంపూర్ణ వాయిస్ ఓవర్లు, పాత్రల డిజైనింగ్‌ను నెటిజన్లు మీమ్స్ రూపంలో విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. దాంతో అసలు "ఈ సినిమా ఎంత చెత్తగా ఉందో మనమే వెళ్లి చూడాలి"

నటుడు సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' థియేటర్లలో దుమ్మురేపుతోంది. రిలీజైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో సూర్య, మమితా బైజు నటనకు మంచి మార్కులు పడ్డాయి. వారి కెమిస్ట్రీనే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. 'కరుప్పు' తర్వాత సూర్యకు ఇది మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'విశ్వనాథ్ అండ్ సన్స్' సోమవారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.9.50 కోట్లు వసూలు చేసింది. ఇందులో కేవలం భారతదేశంలోనే రూ.7.50 కోట్లు రాబట్టగా, ఓవర్సీస్లో రూ.2 కోట్ల కలెక్షన్లు సాధించింది. నిన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రూ.3.85 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత తమిళనాడులో రూ.3.65 కోట్లు వసూలు చేసింది. అయితే, షోల పరంగా చూస్తే తెలుగులో 1924 షోలు, తమిళంలో 3038 షోలు ప్రదర్శించారు. ఈ మూవీ తమిళంలో కంటే తెలుగులోనే విశేష ఆదరణ పొందుతోంది

ఎంఎస్ రాజు దర్శకుడిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కమర్షియల్ గా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. దర్శకుడిగా అంతకు ముందు చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో కమర్షియల్ హిట్ కోసం ఈజీ ఫార్ములా అయిన థ్రిల్లర్ ని ఎంచుకున్నారు. మిస్టరీ, హర్రర్, థ్రిల్లర్ అంశాలతో ఈ మూవీని నడిపించారు. అయితే హర్రర్ సినిమాల్లో చాలా వరకు కామెడీని జోడిస్తారు. కానీ ఈ సినిమాని సీరియస్‌గా నడిపించారు ఎంఎస్ రాజు. దీంతో ఇది ఆడియెన్స్ ని ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఎంఎస్ రాజు అగధ మూవీ బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్ అవుతుంది. దీనికి ప్రారంభం నుంచి స్ట్రగుల్స్ తప్పడం లేదు. భారీ అంచనాలతో సినిమాని రిలీజ్ చేశారు. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో వెనకబడింది సినిమా. అది కలెక్షన్లపై ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక ఈ సినిమా నాలుగు రోజులు పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీకెండ్లో డీసెంట్‌గానే కలెక్షన్లని రాబట్టింది. మరి సోమవారం వసూళ్లు ఎలా ఉన్నాయనేది చూస్తే, 30శాతానికిపైగానే డ్రాప్ కనిపిస్తుంది. 4వ రోజు `అగధ` చిత్రానికి ఇండియాలో రూ.15లక్షలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇరవై లక్షలు రాబట్టింది. దీంతో నాల్గు రోజుల్లో ఈ సినిమాకి ఇండియాలో సుమారు రూ.1.38కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా రూ.1.50కోట్లు వచ్చినట్టు ట్రేడ్ సైట్లు వెల్లడించాయి. అంటే దాదాపు రూ.80లక్షల షేర్ వచ్చింది. సినిమాకి అయిన బడ్జెట్ రూ.10కోట్లు. థియేట్రికల్ బిజినెస్‌ని ఐదు కోట్లుగా లెక్క కట్టారు. ఇప్పటి వరకు కోటి షేర్ కూడా రాలేదు. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.30కోట్ల షేర్ రావాలి. అంటే ఎనిమిది కోట్లకుపైగానే గ్రాస్ రావాలి. అది సాధ్యమా అనేది చూడాలి. ఎంఎస్ రాజు దర్శకుడిగా రూపొందించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ మెయిన్ లీడ్‌గా చేసింది. మహాదేవి పాత్రలో ఒదిగిపోయింది. ఆమెతోపాటు శ్రావణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, భాను చందర్, జోవికా విజయ్ కుమార్, షిజ్జు వంటి వారు

విశ్వనాధ్ అండ్ సన్స్ లో అభిమానులు సెల్యులాయిడ్ పై 'సూర్య' ని విశ్వనాధ్ గా చూసుకొని మురుసిపోతున్నారు. ఇది కదా సూర్య అంటే అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ శ్రావణ మాస శోభకి మరింత కాంతులు వెదజల్లుతున్నారు. ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ బాట పట్టడానికి శ్రావణ మాస శోభనే ఒక కారణం కావచ్చు. నిజానికి సంజయ్ విశ్వనాధ్ గా సూర్య నటన అంత ఆషామాషి తో కూడుకున్న వ్యవహారం కాదు. క్యారక్టర్ కి తగ్గట్టుగా పిన్ టూ పిన్ బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాలంటే ఎంతో శ్రమ తప్పని సరి. ఇక ఈ సినిమా నైజాం ఏరియాలో కలెక్షన్స్ తుపాన్ సృష్టిస్తుంది. ఆదివారం ఒక్క రోజే 5.2 కోట్ల గ్రాస్ ని రాబట్టి తన అర్హత ఉన్న రేంజ్ ని చాటి చెప్పింది. దీంతో మొదటి మూడు రోజులకి కలిపి నైజాంలో మొత్తం గ్రాస్ కలెక్షన్లు 14 కోట్ల మార్కుని తాకాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి నైజాం అత్యుత్తమ వసూళ్లు నమోదు చేసిన ప్రాంతంగా కూడా నిలవడం గమనార్హం. తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు రావడంతో, ఈ సినిమా నేటితో (సోమవారం) జీఎస్టీ మినహాయించి బ్రేక్ ఈవెన్ స్థాయిని చేరుకోనుంది. వీకెండ్ తర్వాత పనిదినాల్లో కూడా ఇదే జోరు కొనసాగితే, నైజాం డిస్ట్రిబ్యూటర్లకి మంచి లాభాలు దక్కే వీలుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం, మాటలకి, మాగి గా మమితా బైజు నాచురల్ పెర్ ఫార్మెన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ విలువలు, జి.వి. ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిమిష్ రవి ఫొటోగ్రఫీ పోటాపోటీగా విశ్వనాధ్ అండ్ సన్స్ కి కుదిరాయి. వరల్డ్ వైడ్ గా మూడు రోజులకి సుమారు 120 కోట్ల వరకు గ్రాస్ ని రాబట్టింది. ఎన్టీఆర్ 'డ్రాగన్' అప్డేట్: బిగ్ షాక్ ఇవ్వబోతున్న ప్రశాంత్ నీల్.! 'ది ప్యారడైజ్'

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, మాస్ ఇమేజ్ కోసం పాకులాడకుండా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన రూట్‌ను ఎంచుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇప్పుడాయన నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. టాలీవుడ్లో ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) ఒకరు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, మాస్ ఇమేజ్ కోసం పాకులాడకుండా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన రూట్‌ను ఎంచుకున్నారు. ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ లవ్‌స్టోరీలు, యాక్షన్ థ్రిల్లర్లు, స్పేస్ అడ్వెంచర్, బాక్సింగ్ డ్రామా, పేట్రియాటిక్ సినిమాలు ఇలా జోనర్ ఏదైనా సరే తనదైన నటనతో వైవిధ్యం చాటుకుంటూ వస్తున్నారు. అయితే, వరుణ్ గత మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో వరుణ్‌కి ఎప్పుడెప్పుడు హిట్ వస్తుందా? అని అటు ఫ్యామిలీ, ఇటు ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. ఆ కొరతను తీరుస్తూ.. తాజాగా ఆయన నటించిన సరికొత్త ఇండో-కొరియన్ హారర్-కామెడీ డ్రామా ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) సంచలన విజయాన్ని నమోదు చేసి, థియేటర్ల వద్ద కలెకన్ల సునామీ సృష్టిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఆగస్ట్ 7వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 50.30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలుపుతూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీకెండ్స్‌లోనే కాకుండా వీక్డేస్లోనూ ఈ సినిమా కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. అన్ని ప్రాంతాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందిస్తూ.. వరుణ్ తేజ్ కెరీర్లోనే ఒక మైలురాయిలా నిలిచిందీ చిత్రం. ఇక ‘కొరియన్ కనకరాజు’ కథ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండ గ్రామానికి చెందిన కనకరాజు అనే పల్లెటూరి కుర్రాడి శరీరంలోకి ఊహించని

ఇలాంటి వాచ్ లు పట్టు చీరల మీదకు కూడా మ్యాచ్ అవుతాయి. ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ డిజైన్ మంచి గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తుంది. ఇప్పటి వరకు కుందన్స్ తో ఉన్న చాలా రకాల జ్యూవెలరీ డిజైన్లు చూసి ఉండొచ్చు. ఈసారి ఇలా కుందన్స్ తో ఉన్న వాచ్ డిజైన్లు ట్రై చేయండి. మంచి లుక్ ఇస్తాయి. ఇలాంటి వాచ్ డిజైన్లు క్లాసీ లుక్ ఇస్తాయి. చేతికి బ్రేస్లేట్ పెట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. ఎలాంటి దుస్తులకు అయినా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. జడావు కుందన్స్ డిజైన్ లో ఉన్న వాచ్ లు మంచి గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తాయి. చేతికి చాలా అందంగా ఉంటాయి. Gold Tops: 5 గ్రాముల్లోపు వచ్చే గోల్డ్ టాప్స్.. చూస్తే ఫిదా అవుతారు! Collar Neck Blouse: లేటెస్ట్ కాలర్ నెక్ మోడల్స్.. అందరి చూపు మీవైపే Strawberry: స్ట్రాబెర్రీ తింటే కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! Thread Bangles: అద్దాలతో మెరిసే థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ చూసేయండి

సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద నిలకడైన వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, తొలి వీకెండ్లో అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ఆదివారం నాడు నైజాం వ్యాప్తంగా ఉన్న ప్రధాన థియేటర్లలో ప్రేక్షకుల సందడి భారీగా కనిపించింది. ఆదివారం ఒక్క రోజే నైజాం ఏరియాలో ఈ చిత్రం ₹5.2 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో మొదటి మూడు రోజులకు కలిపి నైజాంలో మొత్తం గ్రాస్ కలెక్షన్లు ₹14 కోట్ల మార్కును తాకాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి నైజాం అత్యుత్తమ వసూళ్లు నమోదు చేసిన ప్రాంతంగా (Best Performing Area) నిలిచింది. తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు రావడంతో, ఈ సినిమా నేటితో (సోమవారం) జీఎస్టీ మినహాయించి బ్రేక్ ఈవెన్ స్థాయిని చేరుకోనుంది. వీకెండ్ తర్వాత పనిదినాల్లో కూడా ఇదే జోరు కొనసాగితే, నైజాం డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు దక్కే వీలుంది. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా సినిమా విజయానికి మంచి బలాన్ని చేకూర్చింది

స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, తొలి వీకెండ్లో బలమైన పట్టు కనబరిచింది. ముఖ్యంగా ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోని థియేటర్లలో భారీ ఆక్యుపెన్సీ కనిపించింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్‌మైషో’లో ఈ సినిమా భారీ స్థాయిలో టికెట్ సేల్స్ నమోదు చేసింది. ఆదివారం ఒక్క రోజే (గడిచిన 24 గంటల్లో) ఏకంగా 3.11 లక్షలకు పైగా (311.33K) టికెట్లు బుక్ అయినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభించడంతో ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో మంచి సంఖ్యలో హౌస్‌ఫుల్ షోలు కనిపించాయి. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటించగా, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, తల్లీ కొడుకుల అనుబంధం చుట్టూ తిరిగే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి వీకెండ్లో అత్యుత్తమ వసూళ్లు నమోదు చేయడంతో, ఈ వారం వర్కింగ్ డేస్‌లో కూడా సినిమా నిలకడైన రన్ కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల `కొరియన్ కనకరాజు` చిత్రంతో ఆడియెన్స్ ని పలకరించారు. ఆయన మొదటి సారి హర్రర్, థ్రిల్లర్, కామెడీ కాన్సెప్ట్ తో `కొరియన్ కనకరాజు` మూవీ చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రితిక నాయక్ హీరోయిన్గా నటించగా, సత్య, మురళీధర్ గౌడ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన చిత్రమిది. దీనికి ముందు అటు వరుణ్ తేజ్, ఇటు మేర్లపాక గాంధీకి హిట్లు లేవు. దీంతో వీరిద్దరు ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఈ మూవీని చేశారు. చాలా కసితో చేశారని చెప్పొచ్చు. ఆ కసి సినిమాలో కనిపిస్తుంది. ఆగస్ట్ 7న `కొరియన్ కనకరాజు` మూవీ విడుదలైంది. కామెడీ అంశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. దీంతో సినిమా జనాలకు కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా సత్య కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే సినిమాకి నిజమైన హీరో అయనే అని చెప్పొచ్చు. అంతగా సినిమాని నడిపించాడు. వరుణ్ కి హిట్ రావడానికి కారకుడయ్యాడు. అలాగే మేర్లపాక గాంధీ టేకింగ్, రైటింగ్, మ్యూజిక్ వంటివన్నీ సినిమాకి ప్లస్ అయ్యాయి. మొత్తంగా వరుణ్ తేజ్ హిట్ కొట్టారు. బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇక ఈ మూవీ విడుదలై పది రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయి. ఎంత లాభాలు సాధించిందనేది చూస్తే. `కొరియన్ కనకరాజు` మూవీకి అయిన బడ్జెట్ రూ.38కోట్లు, థియేట్రికల్ బిజినెస్ రూ.12కోట్లు అని సమాచారం. నాన్ థియేట్రికల్‌గానే దీనికి రూ.26కోట్ల వరకు వచ్చిందట. దీంతో పన్నెండు కోట్లని థియేట్రికల్‌గా నిర్ణయించారు. ఈ లెక్కన ఈ మూవీ మొదటి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇప్పుడు లాభాల దిశగా వెళ్తోంది. ఈ సినిమాకి పదిరోజుల్లో రూ.31.15కోట్లు వచ్చాయి. అంటే రూ.16కోట్ల షేర్ వచ్చింది. నాలుగు కోట్లకుపైగానే లాభాలు పొందింది. ఈ

సూర్య, మమితా బైజు జంటగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. 'సర్', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. ఇదే రోజు విశాల్ నటించిన `మకుటం`(మగుడం) మూవీ కూడా విడుదలైంది. కానీ దీనికి నెగటివ్ టాక్ వచ్చింది. సూర్య గత చిత్రాల్లోని యాక్షన్, మాస్ అంశాలకు భిన్నంగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' మంచి కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో నడేస్తుంది. మమితా బైజు నటన కూడా యువతను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించింది. దీని ఫలితంగా, సినిమా విడుదలైన మూడు రోజులకే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లను దాటినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. సూర్య కెరీర్లో అత్యంత వేగంగా రూ.100 కోట్లు వసూలు చేసిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే, 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు పోటీగా ఆగస్టు 14న విడుదలైన విశాల్ 'మకుటం' సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ తేలిపోయింది. 'ఈట్టి', 'ఐంగరన్' చిత్రాల దర్శకుడు రవి అరసు మొదట ఈ ప్రాజెక్టుకు దర్శకుడిగా పనిచేశారు. కథ, స్క్రీన్‌ప్లే పనుల్లో కూడా ఆయన పాలుపంచుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత నటుడు విశాల్ స్క్రీన్‌ప్లేలో మార్పులు చేసి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విడుదలైనప్పటి నుంచి 'మకుటం' సినిమాకు ఎక్కువగా నెగటివ్ టాక్ వచ్చింది. ఆ ప్రభావం బాక్సాఫీస్ వసూళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. సాక్నిల్క్ డేటా ప్రకారం, ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2.10 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. ఒకవైపు 'విశ్వనాథ్ అండ్ సన్స్' రోజూ రూ.20 కోట్లకు పైగా వసూలు చేస్తూ రూ.110 కోట్ల

నిర్మాత ఎంఎస్ రాజు లేట్ వయసులో దర్శకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నిర్మాతగా అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు తీశారు. స్టార్ ప్రొడ్యూసర్‌గా రాణించారు. కానీ వరుస పరాజయాల తర్వాత నిర్మాణం పక్కన పెట్టారు. అదే సమయంలో తన కొడుకు సుమంత్ అశ్విన్ కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. కొడుకుని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆయన కూడా హీరోగా సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో ఎంఎస్ రాజు దర్శకుడిగా మారి సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే `వాన`, `డర్టీ హరి`, `7నైట్స్ 6డేస్`, `మళ్లీ పెళ్లి` వంటి చిత్రాలను రూపొందించారు. ఇవి పెద్దగా ఆడలేదు. లేటెస్ట్ గా `అగధ` చిత్రాన్ని తెరకెక్కించారు. కమర్షియల్ గా హీరో కొట్టాలని, దర్శకుడిగా సక్సెస్ కావాలనే తపనతో మిస్టరీ హర్రర్ థ్రిల్లర్ `అగధ` చిత్రాన్ని రూపొందించారు ఎంఎస్ రాజు. హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు కంటెంటే బాగుంటే మంచి ఆదరణ పొందుతాయి. హిట్ కొట్టడం ఈజీ. దీంతో ఎంఎస్ రాజు కూడా అదే ప్లాన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించగా, శ్రావణ్ రెడ్డి, భానుచందర్, వనితా విజయ్ కుమార్, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. ఈ మూవీ గత శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. సినిమా ప్రారంభం నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. థ్రిల్ చేయలేకపోయిందని, భయపెట్టలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. స్లోగా సాగిందని, ఎంగేజ్ చేయలేకపోయిందంటున్నారు. అదే తరహాలో కలెక్షన్లు ఉన్నాయి. ఈ మూవీ పెద్ద రేంజ్ లో హిట్ అవుతుందని ఎంఎస్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది. ఇప్పటి వరకు ఈ మూవీ కోటి వరకు మాత్రమే కలెక్షన్లని రాబట్టింది. మూడు రోజుల్లో ఈ సినిమా రూ.1.17కోట్లు(ఇండియాలో) రాబట్టింది. మూడో రోజు రూ.39లక్షలు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది సుమారుగా రూ.1.30కోట్లు వసూలు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద తన స్టామినా మరోసారి నిరూపించుకున్నారు. ఈ ఏడాది ‘కరుప్పు’తో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆయన తాజాగా ‘ విశ్వనాథ్ అండ్ సన్స్ ’తో మరో బిగ్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. టాలెంటెడ్ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై తొలి ఆట నుంచే యునానిమస్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకుని అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని సరికొత్త సంచలనాన్ని నమోదు చేసింది.రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ మైలురాయిని అధిగమించింది. మాస్ ఎలిమెంట్స్ లేకుండా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఇంత తక్కువ టైమ్‌లోనే వంద కోట్ల క్లబ్లో చేరడం సినీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇందుకు సంబంధి మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని నింపింది.* మెగాస్టార్ vs సూపర్ స్టార్... బాక్సాఫీస్ వద్ద చిరంజీవి - రజనీకాంత్ మధ్య ‘డబుల్ క్లాష్’!ఫ్యామిలీ ఆడియెన్స్ ప్రభంజనంక్లీన్ ఎంటర్టైన్మెంట్, హృదయాలను హత్తుకునే బలమైన ఫ్యామిలీ ఎమోషన్ష్తో తెరకెక్కిన చిత్రం కావడంతో ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు పోటెత్తుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఓవర్సీస్ అంతటా దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పంపిణీదారులు అనేక ప్రాంతాల్లో అదనపు స్క్రీన్లను, ప్రత్యేక షోలను కేటాయిస్తున్నారు. ఆదివారం కూడా ఇదే

Vishwanath & Sons Collections : సూర్య, మమిత బైజు జంటగా తెరకెక్కిన సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ ఇటీవల ఆగస్టు 14న రిలీజయి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చాన్నాళ్ల తర్వాత సూర్య ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో రావడం, మమిత తన కామెడీ టైమింగ్ తో నవ్వించడం, మదర్ ఎమోషన్ తో ఏడిపించడంతో ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. విశ్వనాథ్ & సన్స్ సినిమా రెండు రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. అమెరికాలో ఆల్మోస్ట్ 1 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. Also See : Trisha : చీరకట్టులో త్రిష.. ఎంత అందంగా ముస్తాబయిందో.. దీంతో సూర్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశ్వనాథ్ & సన్స్ సినిమా దాదాపు 300 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక సూర్య కరప్పు, విశ్వనాథ్ & సన్స్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు