
CJP Protest: విద్యార్థికి నోటీసులు ఇచ్చిన మెజిస్ట్రేట్‌పై సస్పెన్షన్
CJP Protest: విద్యార్థికి నోటీసులు ఇచ్చిన మెజిస్ట్రేట్‌పై సస్పెన్షన్
© 2026 nimisham.in

CJP Protest: విద్యార్థికి నోటీసులు ఇచ్చిన మెజిస్ట్రేట్‌పై సస్పెన్షన్

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపై సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్లను రద్దు చేసింది. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన నిరసనల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు రద్దు కానున్నాయి. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన సీజేపీ నిరసనలపై దేశంలో ఎక్కడా ఎఫ్ఐఆర్లను నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2,873 నేరచరిత్ర కలిగిన వారి నేపథ్యంలో వారిపై ఎఫ్ఐఆర్ల నమోదుపై పోలీసులకు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నష్టపరిహారం చెల్లింపులపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశించింది. విధివిధానాలు రూపొందించిన మూడు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలరని చెప్పింది. ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహనకు కట్టుబడి ఉండాలనే షరతుకి లోబడి ఆర్టికల్ 142 కింద ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తున్నామని, ఈ విధానాన్ని రాష్ట్రాలు సైతం పాటించవచ్చని పేర్కొంది. ‘సెప్టెంబర్ 5 ర్యాలీ’ రద్దు విద్యార్థులపై కేసుల ఉపసంహరణతో కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5న తలపెట్టిన ర్యాలీని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. మరోవైపు, అంతకుముందు ఎఫ్ఐఆర్ల రద్దుకు సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు ఢిల్లీ , బిహార్, అస్సాం, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర పోలీసులు. రెండు పక్షాలు పరస్పర నమ్మకంతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిదని సీజేఐ చెప్పారు. విద్యార్థులను ప్రత్యర్థులుగా భావించడం లేదని సొలిసిటర్ జనరల్ తెలిపారు. తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్ కొబ్బరికాయ కొట్టేస్తా

జైపూర్, రాజస్థాన్: స్కూల్ ఠీక్ కరో' (పాఠశాలలను బాగు చేయండి) ప్రచారంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రాజస్థాన్‌లో చేపట్టిన కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు దాడిచేయడంపై సీజేపీ స్పందించింది. సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా, ఇతరులపై అమానుషంగా దాడిచేయడాన్ని,వాహనాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. తమపై ఎటాక్ చేసిన దుండగులను 24 గంటల్లో అరెస్టు చేయాలని రాజస్థాన్ పోలీసులను డిమాండ్ చేసింది. లేదంటే 24 గంటల తర్వాత రాజస్థాన్‌లో 'జంతర్ మంతర్ 2.0' ప్రారంభమవుతుంది; ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత తమది కాదని హెచ్చరించింది. అయితే ఈ విషయంలో గ్రామస్తులను మాత్రం వేధించకూడదని స్పష్టం చేసింది. ఇందులో గ్రామస్తుల ప్రమేయం ఏమీ లేదనీ వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ కూడా స్పందించింది. గ్రామ పాఠశాలను సందర్శించిన సందర్భంగా జరిగిన ఘర్షణ వాతావరణంపై కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ స్పందిస్తూ , "ప్రజలు, యువత , విద్యార్థులలో ఆగ్రహం ఉంది. ప్రభుత్వం దానిని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. అనుమతి లేకుండా పాఠశాలల్లోకి ప్రవేశించడం, ఫోటోలు తీయడం లేదా నివేదికలు ప్రచురించడం వంటివి చేయరాదని జర్నలిస్టులకు కూడా ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తప్పబట్టారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలను జారీ చేయడం సరైనది కాదన్నారు. పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్న పరిస్థితిని, సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టడానికి బదులుగా, ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి చేటున్నారు. అనుమతి లేకుండా పాఠశాలల్లోకి ప్రవేశించకుండా లేదా ఫోటోలు తీయకుండా ప్రజలను అడ్డుకోలేరన్నారు. వాస్తవానికి, ప్రభుత్వం వార్తలను అణచివేయడానికి , ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాగా సీజేపీ ప్రచారంలో భాగంగా జయపూర్ జిల్లాలోని బగ్రూ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న రాంపురా కన్వర్పురా గ్రామంలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేయడానికి వచ్చిన కార్యకర్తలను గ్రామస్తులు, సీజేపీ బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. సీజేపీ బృందం రాకముందే గ్రామస్తులు

నీట్ పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ గత నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు నెలరోజుల పాటు నిరసనలు (CJP Protests) చేపట్టింది. ఆ తర్వాత గత నెల 20న పార్లమెంట్ మార్చ్ కు కూడా పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు వచ్చి ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసులు వీరిని అడ్డుకునేందుకు బలప్రయోగం కూడా చేశారు. ఆ తర్వాత కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఇవాళ బిగ్ ట్విస్ట్ ఎదురైంది. కాక్రోచ్ దెబ్బకు బీజేపీలో రెండో వికెట్..! కొత్త టీమ్ లో కీలక నేతపై వేటు..!జంతర్ మంతర్ సహా ఢిల్లీలో జరిగిన నిరసనలపై స్వతంత్ర విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇవాళ ఢిల్లీలో విద్యార్ధుల నిరసనలు, పోలీసుల బల ప్రయోగంపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. ఈ మేరకు తుది అంచనాకు రావడానికి సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ న్యాయమూర్తితో కూడిన కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని నిర్ణయించింది. దీంతో ఇన్నాళ్లూ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్దులపై కేసులు ఉండవని కేంద్రం ఇచ్చిన హామీ ప్రమాదంలో పడింది. ఉరికి బదులు ఇంజెక్షన్ తో మరణశిక్ష- తేల్చేసిన సుప్రీంకోర్టు..!జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిర్వహించిన నిరసనల వల్ల తలెత్తిన సమస్యలు, ఆరోపణలను పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలనే దానిపై సంబంధిత వర్గాలు, పిటిషనర్ల సూచనలను చేర్చిన తర్వాత రేపు తుది ఉత్తర్వులను విడుదల చేస్తామని పేర్కొంది. తమవైపు నుంచి సీబీఐ మాజీ డైరెక్టర్ ఒకరిని, అలాగే మాజీ న్యాయమూర్తి ఒకరిని ఈ కమిటీలో చేర్చింది. విద్యార్ధుల నిరసన ప్రదర్శన, పోలీసుల చర్యలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఈ

పుదుచ్చేరిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కుటుంబ సభ్యుల ఇంటికి పోలీసులు వెళ్లడం వివాదానికి దారితీసింది. పోలీసులు తమ కుటుంబాన్ని ప్రశ్నల పేరుతో భయబ్రాంతులకు గురిచేశారని దాస్ ఆరోపించగా.. పోలీసు శాఖ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో చేపట్టే సాధారణ భద్రతా చర్యల్లో భాగంగానే ఇంటికి వెళ్లామని స్పష్టం చేసింది. పోలీసులు తమ కుటుంబం వద్దకు వచ్చి రకరకాల ప్రశ్నలు అడిగారని దాస్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఇది కేవలం సాధారణ విచారణ కాదని, తనను మౌనం చేయించేందుకు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న చర్యగా ఆయన అభివర్ణించారు. పుదుచ్చేరిలో బీజేపీ ప్రభుత్వం తన కుటుంబాన్ని ఎందుకు భయపెడుతోందని దాస్ ప్రశ్నించారు. ఈ చర్య వెనుక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా? అసలు ఇలాంటి విచారణకు చట్టపరమైన ఆధారం ఏమిటని నిలదీశారు. తనను బెదిరించి మౌనం చేయించాలని చూస్తే అది సాధ్యం కాదని, ఇలాంటి చర్యలు తమ పోరాట సంకల్పాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు. అంతేకాదు, రెండు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుదుచ్చేరికి వచ్చి అక్కడి హోంమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమావేశమైన విషయాన్ని కూడా దాస్ ప్రస్తావించారు. ఆ సమావేశంలోనే తన కుటుంబాన్ని సందర్శించే నిర్ణయం తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. అయితే, పోలీసుల వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. దాస్ బంధువుల ఇంటికి పోలీసులు వెళ్లిన విషయం నిజమేనని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కానీ ఇందులో ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేవని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి ముఖ్యమైన రోజులకు ముందు భద్రతా చర్యల్లో భాగంగా కీలక మార్గాల సమీపంలో నివసించే ప్రజల ఇళ్లను పోలీసులు సందర్శించడం సాధారణమేనని చెప్పారు. ముఖ్యమైన రూట్లకు సమీపంలో నివసించే ప్రజలను కలిసి కొన్ని వివరాలు తెలుసుకోవడం, భద్రతకు సంబంధించిన సాధారణ ప్రశ్నలు అడగడం పోలీసుల రొటీన్

గతంలో నిరుద్యోగుల్ని బొద్దింకలుగా అభివర్ణించారని, కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటుున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Suryakanth)పై విద్యార్ధుల ఆగ్రహం చల్లారడం లేదు. దీనికి పలు కారణాలున్నాయి. వీటిలో కాక్రోచ్ లుగా నిరుద్యోగుల్ని అభివర్ణించడం ఒక్కటే కాదు, తాజాగా ఢిల్లీలో విద్యార్దుల్ని పోలీసులు కొట్టిన వీడియోల్ని చూసేందుకు తనకు టైమ్ లేదని పిటిషన్ తో వచ్చిన న్యాయవాదితో చెప్పారని భావిస్తున్న వ్యాఖ్యలు కూడా కారణాలుగా ఉన్నాయి. అయితే ఈ రెండు సందర్భాల్లో వ్యాఖ్యలపై సీజేఐ వివరణ ఇచ్చినా విద్యార్ధుల్లో కోపం మాత్రం అలాగే ఉంది.వాహనదారులకు సుప్రీం భారీ షాక్- ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్-కొత్త రూల్స్ ఇవే..!దీని ప్రభావం ఇప్పుడు పలు చోట్ల కనిపిస్తోంది. తాజాగా ముంబైలోని టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) విద్యార్ధుల నిరసనల భయంతో వీసీ ఏకంగా తమ స్నాతకోత్సవాన్నే వాయిదా వేసేశారు. ఈ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్ హాజరు కావాల్సి ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం (NALSAR) విద్యార్ధులు అయితే ఏకంగా సీజేఐ సూర్యకాంత్ కు తమ వీసీ పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఓ లేఖ రాశారు. ఇది మరింత కలకలం రేపుతోంది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్దల్లో విద్యార్ధులకు సీజేఐ సూర్యకాంత్ పై ఉన్న కోపం స్థాయి ఏంటో ఇది తేటతెల్లం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. Cockroach Janta Party: కాక్రోచ్ పార్టీ నెక్స్ట్ ఉద్యమం ఇదే-అజెండా ప్రకటన..!హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్) యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులలో ఓ వర్గం .. యూనివర్సిటీ 2026 స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తోంది. 2026 బ్యాచ్‌కు చెందిన విద్యార్థుల బృందం సీజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ వీసీ, రిజిస్ట్రార్, అధ్యాపక బృందం, యూనివర్సిటీ పాలకవర్గంలోని ఇతర సభ్యులకు లేఖ రాసింది.

ఏపీ రాజకీయాల్లో గతంలో యాక్టివ్ గా ఉండి, వైసీపీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా పనిచేసిన విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఆ తర్వాత ఆ పార్టీ అధికారం కోల్పోగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అనంతరం బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించి .. అది కూడా సాధ్యం కాక తిరిగి రాజకీయాల్లో సొంత పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చేందుకు సాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ తనపై అటెన్షన్ ఉండేలా చూసుకుంటున్నారు.UPI పేమెంట్స్ పై ఛార్జీలు ? కేంద్రానికి సాయిరెడ్డి హెచ్చరికలు..!ఇదే క్రమంలో ఆయన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న జెన్ జీ(Gen Z)పై సానుభూతి ప్రదర్శించాల్సిన అవసరం ఉందంటూ ఓ ట్వీట్ చేశారు. ఇందుకు గల కారణాలను కూడా విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో వెల్లడించారు. ఈ సందర్భంగా సాధారణంగా చర్చకు రాని పలు విషయాన్ని కూడా సాయిరెడ్డి బయటపెట్టారు. ఆయా కారణాలతో వారి మాటల్ని సానుభూతితో వినాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ తేల్చేశారు. 2.5 లక్షలకు PPF లిమిట్ ?- ఆర్థికమంత్రికి సాయిరెడ్డి కీలక ప్రతిపాదన..!మనం మన Gen Z మాటలను సానుభూతితో వినాలని సాయిరెడ్డి కోరారు. వారు అనిశ్చిత ఉద్యోగాలు, అందుబాటులో లేని ఇళ్లు, క్షీణిస్తున్న పర్యావరణం, కొరతగా ఉన్న వనరులు, ఉమ్మడి కుటుంబం, స్నేహం వంటి బలహీనపడుతున్న మద్దతు వ్యవస్థలతో కూడిన ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతున్నారని సాయిరెడ్డి తెలిపారు. వారికి ఆశ, అవకాశాలు, వారి ఆందోళనలను తీవ్రంగా పరిగణించే విధానకర్తలు అవసరమన్నారు. తాను ఆ గొంతుకలలో ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నానని తన మనసులో మాటను కూడా సాయిరెడ్డి బయటపెట్టేశారు. తద్వారా తనను తాను జెన్ జీకి మద్దతుదారుడినని చెప్పుకునే ప్రయత్నం చేశారు

సంబల్పూర్: నీట్ పేపర్ లీకేజీ వివాదంలో తన పదవికి రాజీనామా చేయడంపై మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ పేపర్ లీకేజీలో జెన్‌జీని తప్పుదోవ పట్టించారని.. అందులో తాను బాధితుడినయ్యానని వ్యాఖ్యానించారు. సంబల్పూర్లో జరిగిన పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్ వివాదం ముదిరిన తీరును చూస్తే కొంతమంది వ్యక్తులు జెన్‌జీని తప్పుదోవ పట్టించే ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది. విద్యార్థుల అసంతృప్తిని రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వాడుకోవాలని చూశారు. అందుకే యువత ఆకాంక్షలను గుర్తించి, వారి ఆందోళనలను పరిష్కరించాలని తాను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో నా వ్యక్తిగత గౌరవానికి నేనెప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. మోదీ నా ప్రతిపాదనకు అంగీకరించి, ఆ తర్వాత స్వయంగా ఆయనే పిల్లలతో మాట్లాడారు అని పేర్కొన్నారు. జులై 25న సమర్పించిన తన రాజీనామా లేఖలోని అంశాలను ఆయన గుర్తుచేశారు. ఈ ఆందోళనలను దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థానికి వాడుకోకుండా ఉండటానికి, దేశ ఐక్యతను కాపాడటానికి, విద్యార్థుల భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా చూసేందుకే తాను మంత్రి పదవిని వదులుకున్నట్లు స్పష్టం చేశారు. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో ప్రభుత్వం వెంటనే స్పందించిందని, దర్యాప్తును సిబిఐకి అప్పగించి, వివాదాస్పద పరీక్షను రద్దు చేసి జూన్ 21న తిరిగి నిర్వహించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్ హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ (ఫొటోలు) నువ్వు