
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇప్పుడు ఇండియా ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కేవలం రూ.10 లక్షలలోపు ధరలో ఓ కొత్త ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయడానికి ఈ కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫార్చ్యూన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం… మారుతి తీసుకురాబోయే ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.8.50 లక్షల నుంచి రూ.10.50 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ఖరీదైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల లాగా పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్ కాకుండా నగరాల్లో రోజూ ప్రయాణించే వారికి ఈ కారు సరిగ్గా సరిపోతుందని అంచనా. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 నుంచి 315 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వడమే దీని లక్ష్యం. ఈ రేంజ్, టాటా మోటార్స్ వారి టియాగో ఈవీకి సమానం. ఇప్పటికే ఉన్న పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడం కాకుండా పూర్తిగా కొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పైనే డిజైన్ రెడీ అవుతోందట. దీనివల్ల బ్యాటరీని సరైన స్థలంలో అమర్చడానికి, క్యాబిన్లో ఎక్కువ స్పేస్ ఇవ్వడానికి, ఎలక్ట్రిక్ భాగాలను పర్ఫెక్ట్ గా అమర్చడానికి వీలవుతుందని మారుతి సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. దేశీయంగా ఎక్కువ భాగాలను తయారు చేయడం, చిన్న బ్యాటరీ ప్యాక్ ఉపయోగించడం వల్ల కారు ధరను అదుపులో ఉంచవచ్చని మారుతి సుజుకి భావిస్తోంది. సుమారు రూ.8.50 లక్షల నుంచి రూ.10.50 లక్షల మధ్య కొత్త ఈవి ఎక్స్-షోరూమ్ ధరను నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే భారత్‌లో చాలా మంది ఎలక్ట్రిక్ కారు కొనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వ్యాగనార్, స్విఫ్ట్ వంటి కార్లను కొనాలనుకునే కస్టమర్లను కూడా ఈ కొత్త ఈవీ ఆకర్షిస్తుందని అంచనా. మారుతి ప్రీమియం షోరూమ్ నెక్సా ద్వారా ఇ-విటారా అమ్ముడవుతోంది. కానీ ఈ కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ కారును అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్మే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అరీనా నెట్వర్క్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Mahindra XEV 9S EMI: మీరు కొత్త కారు కొనే ప్లాన్ లో ఉన్నారా? కొత్త కారు కొనడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. మహీంద్రా తన జనాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారు, XEV 9S కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త కారు 6-సీటర్ ఆప్షన్‌తో వస్తుంది. వెనుక సీట్లు కెప్టెన్-సీట్లుగా ఉంటాయి. ఇప్పుడు..ఈ కారు 7-సీటర్ .. 6-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ఎక్కువ సౌకర్యం.. ప్రీమియం అనుభూతిని కోరుకునే వారికి ఈ కారు సరైనది. మహీంద్రా XEV 9S ధర.. ఫీచర్ల గురించి తెలుసుకుందాం. కొత్త 6-సీటర్ XEV 9S లో ప్రత్యేకత ఏమిటి? మహీంద్రా XEV 9S కేవలం 7-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంది. మధ్య సీటు గతంలో బెంచ్-టైప్‌గా ఉండేది. కంపెనీ ఇప్పుడు 6-సీటర్ లేఅవుట్‌ను జోడించింది. ఈ కొత్త లేఅవుట్లో.. రెండవ వరుసలో బెంచ్ సీటుకు బదులుగా రెండు వేర్వేరు కెప్టెన్ సీట్లు ఉన్నాయి. ఈ సీట్లకు ప్రత్యేకమైన ఆర్మ్‌రెస్ట్‌లు ఉన్నాయి. దీనివల్ల మధ్య సీటు ఇద్దరు వ్యక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. సుదూర ప్రయాణాలను సౌకర్యవంతంగా చేసుకోవాలనుకునే కుటుంబాలకు ఈ లేఅవుట్ చాలా అనువైనదిగా ఉంటుంది. ఈ 6-సీటర్ ఆప్షన్ కారుకు ప్రీమియం అనుభూతిని ఇస్తుంది.. స్థలం కంటే సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారిని ఆకట్టుకుంటుంది. ఈ 6-సీటర్ కెప్టెన్ సీట్ ఆప్షన్ అన్ని వేరియంట్లలో అందుబాటులో లేదు. కంపెనీ దీనిని మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. అవి ప్యాక్ టూ అబవ్, ప్యాక్ త్రీ, ప్యాక్ త్రీ అబవ్. ఈ ఆప్షన్ బేసిక్ వేరియంట్

ఎలాంటి సినీ వారసత్వం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన అద్భుత నటనా కౌశలం, డాన్సులతో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఆర్థిక ప్రస్థానం అత్యంత స్పూర్తిదాయకం. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన ప్రయాణంలో కేవలం బాక్సాఫీస్ రికార్డులే కాకుండా, ఒక బలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా నిర్మించుకున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్న వేళ.. సీని, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.వివిధ నివేదికలు, జాతీయ మీడియా అంచనాల ప్రకారం, చిరంజీవి నికర ఆస్తి విలువ ప్రస్తుతం సుమారు రూ. 1,650 కోట్ల నుంచి రూ. 1,750 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. 1978లో సాధారణ నటుడిగా ప్రారంభమై, భారత్‌లోనే అత్యధిక పారితోషికం పొందే స్థాయికి చేరుకున్నారు. సినిమాల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు వాణిజ్య ప్రకటనలు, వివిధ వ్యాపార భాగస్వామ్యాలు ఆయన సంపదను నిలకడగా పెంచాయి. మెగాస్టార్ విధ్వంసం.. రచ్చ లేపుతున్న టైటిల్ గ్లింప్స్!అత్యాధునిక నివాసాలు - రియల్ ఎస్టేట్ఆయన ఆస్తులలో ప్రధాన భాగం రియల్ ఎస్టేట్ రంగానికి చెందింది. హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఆయనకు ఒక విలాసవంతమైన విల్లా ఉంది. గత నివేదికల ప్రకారం ఈ భవనం విలువ దాదాపు రూ. 28 కోట్ల పైచిలుకు ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు బెంగళూరు సహా పలు నగరాలలో ఉన్న విలువైన స్థిరాస్తులు ఆయన ఇన్వెస్ట్మెంట్ వ్యూహానికి నిదర్శనం.మెగాస్టార్ సినిమాలకు స్టార్లు కట్టిన ఏపీ మంత్రి.. రాత్రంతా థియేటర్ దగ్గరే ఉండిరాయల్ గ్యారేజ్ - లైఫ్స్టైల్ఆయన లగ్జరీ కార్ల సేకరణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన గ్యారేజ్‌లో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్‌తో పాటు రేంజ్ రోవర్, టయోటా ల్యాండ్ క్రూజర్, మెర్సిడెస్ బెంజ్ వంటి మోడళ్లు ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రైవేట్ జెట్ విమానం ఉందనే ప్రచారం

తమిళనాడు రాజకీయాల్లో కొత్త రగడ మొదలైంది. అసెంబ్లీలోని 234 మంది ఎమ్మెల్యేలకు ఉచిత కార్లు ఇస్తామని టీవీకే ప్రభుత్వం ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. ప్రతి ఎమ్మెల్యేకు కారుతో పాటు డ్రైవర్, పెట్రోల్, వాహన నిర్వహణ కోసం నెలకు ₹75,000 భత్యం కూడా ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ ఆఫర్‌ను ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ డీఎంకే పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు ఈ ఉచిత కార్లను తీసుకోకూడదని నిర్ణయించుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ఉదయనిధి స్టాలిన్ సభలో వివరంగా వెల్లడించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రవాణా సౌకర్యాలు అవసరమని వీసీకే ఎమ్మెల్యే జ్యోతిమణి డిమాండ్ చేశారని ప్రభుత్వం పేర్కొంది. ప్రజా ప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయాలంటే ఈ సదుపాయం తప్పనిసరి అని సర్కార్ సమర్థించుకుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తిచూపుతూ ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు విసిరారు. దింతో రాష్ట్రం ఎదుర్కొంటున్న అప్పుల భారాన్ని తగ్గించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఉదయనిధి తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక సంక్షోభం, అప్పుల భారం గురించి మాట్లాడుతూ, మరోవైపు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఇలాంటి ఆఫర్లు ఇవ్వడం ద్వంద్వ విధానమని విమర్శించారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృథా చేయకుండా, కార్లు లేని పేద ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫలితంగా ఈ అంశంపై తమిళనాడు అసెంబ్లీలో తీవ్రమైన చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో మిగతా రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఆఫర్‌ను స్వాగతించగా, డీఎంకే మాత్రం తోసిపుచ్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఇచ్చే ఉచిత సదుపాయాలను నిరాకరించడం ద్వారా ప్రజల వైపు తాము నిలబడ్డామని డీఎంకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముందుముందు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. ప్రజాధనాన్ని పదుపుగా వాడాలని డీఎంకే పట్టుబడుతుండటంతో టీవీకే

అత్యాధునిక ఫీచర్లతో తయారైన కియా సొరెంటో కారు త్వరలో మార్కెట్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా... పెనుకొండ రూరల్ (ఆంధ్రజ్యోతి): అత్యాధునిక ఫీచర్లతో తయారైన కియా సొరెంటో కారు త్వరలో మార్కెట్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో ఉన్న కియా పరిశ్రమలో ఈ కారును తయారు చేశారు. సరికొత్త ఏఐ ఫీచర్లతో తయారైన తొలి సొరెంటో కారు ఉత్పత్తి లైన్ నుంచి బయటకు వచ్చిందని కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గ్వాంగులీ తెలిపారు. సొరెంటోను సెప్టెంబరు 4న మార్కెట్లోకి విడుదల చేస్తామని, దేశంలోని కియా ఇండియా డీలర్‌షి్‌పలు, వెబ్సైట్ ద్వారా ప్రీ బుకింగ్స్‌కు అవకాశం కల్పించామని తెలిపారు

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్, నటనతోనే కాకుండా సంపాదనలోనూ తన సత్తా చాటుతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ చెన్నై బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా నిలిచారు. మీడియా నివేదికల ప్రకారం.. ప్రస్తుతం త్రిష నికర ఆస్తి విలువ సుమారు రూ. 85 కోట్లకు చేరింది. ‘పొన్నియిన్ సెల్వన్’, ‘లియో’ వంటి భారీ విజయాల తర్వాత త్రిష తన రెమ్యునరేషన్‌ను గణనీయంగా పెంచారు. ప్రస్తుతం ఆమె ఒక్కో చిత్రానికి రూ.10 నుంచి 12 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలతో పాటు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ, ఎండార్స్మెంట్ల ద్వారా ఏటా సుమారు రూ.9 కోట్లు ఆర్జిస్తున్నారు. ఆస్తి పెట్టుబడుల్లోనూ త్రిష ముందున్నారు. చెన్నైలో ఆమెకు సుమారు రూ.10 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు ఉంది. అలాగే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు ఉండేందుకు ఇక్కడ రూ. 6 నుంచి 6.5 కోట్ల విలువైన మరో ఇల్లు ఉంది. అంతేకాకుండా విదేశాల్లోనూ ఆమెకు పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం.ఇక లగ్జరీ కార్లంటే త్రిషకు చాలా ఇష్టం. ఆమె గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ ఎవోక్, ఆడి వంటి రూ. 3 నుంచి 4 కోట్ల విలువైన ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇలా నటనతో పాటు వ్యాపార దృక్పథంతో ముందుకు సాగుతూ త్రిష తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. మటన్ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్.. తర్వాత ఏమైందంటే.. Anupama Parameswaran: నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు.. టాలీవుడ్లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్ చర్యలు బఘీరా.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారా.. NTR ఎమోషనల్! Balakrishna 111: గాయాన్ని లెక్కచేయకుండా.. బాలయ్య మొండి పట్టు

భారతీయ కార్ల మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు.. రికార్డు సేల్స్ తో మరోసారి ఇద నిరూపితమైంది. జులై 2026లో ఈ సెగ్మెంట్ చాలా స్ట్రాంగ్ సేల్స్ నమోదు చేసింది. చాలా కాలం తర్వాత హ్యాచ్‌బ్యాక్ కార్ల మొత్తం మంత్లీ సేల్స్ 1 లక్ష యూనిట్ల మార్కును దాటేశాయి. జులై 2026లో దేశంలో ఏకంగా 1,07,602 హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది అంటే జులై 2025లో ఈ సంఖ్య 74,475 యూనిట్లుగా మాత్రమే ఉండేది. అంటే ఏడాది కాలంలో అమ్మకాలు 33,127 యూనిట్లు పెరిగి, వార్షికంగా 44.48 శాతం గ్రోత్ నమోదు చేశాయి. స్టార్టింగ్ ప్రైస్ రూ. 4.99 లక్షలు ఉన్న మారుతి సుజుకి వాగన్ ఆర్ (WagonR) అమ్మకాల్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జులై 2026లో కంపెనీ 23,338 వాగన్ ఆర్ కార్లను విక్రయించింది. జులై 2025లో సేల్ అయిన 14,710 యూనిట్లతో పోలిస్తే ఇది 58.65 శాతం పెరుగుదల. మొత్తం హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల్లో వాగన్ ఆర్ షేర్ 21.69 శాతంగా ఉంది. తక్కువ ధర, మంచి మైలేజ్, సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండటంతో యూజర్లు ఈ కారును తెగ ఇష్టపడుతున్నారు. రెండో స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ నిలిచింది. జులై 2026లో స్విఫ్ట్ 21,538 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది జులైలో అమ్మిన 14,190 యూనిట్లతో పోలిస్తే ఇది 51.78 శాతం గ్రోత్. స్పోర్టీ డిజైన్, ఫీచర్ల కారణంగా ఈ కారు 20 శాతం మార్కెట్ షేర్ సాధించింది. ఇక మూడో స్థానంలో మారుతి బలేనో నిలిచింది. జులై 2026లో బలేనో 18,241 యూనిట్ల సేల్స్ సాధించి 45.89 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. బలేనో మార్కెట్ షేర్ 16.95 శాతంగా ఉంది. ఈ సేల్స్ రిపోర్ట్‌లో అందరినీ ఆశ్చర్యపరిచింది మారుతి ఆల్టో. జులై 2026లో ఆల్టో 12,534 యూనిట్లు అమ్ముడయ్యాయి

2026లో దూసుకెళ్తున్న టాప్ 15 ఎలక్ట్రిక్ కార్లు భారత్‌లో టాప్ 15 లాంగ్-రేంజ్ ఈవీ కార్లు 600 కి.మీ రేంజ్ కల కాదు.. బెస్ట్ లాంగ్-రేంజ్ ఈవీలు Longest-Range Electric Cars : కొత్త ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా మారుతోంది. ఒకప్పుడు రేంజ్ విషయంలో వెనుకబడిన ఈవీలు ఇప్పుడు ఇప్పుడు 600 కి.మీ.కుపైగా క్లెయిమ్డ్ రేంజ్ అందిస్తున్నాయి. ప్రీమియం మోడళ్ల నుంచి అందుబాటు ధరలో అనేక భారతీయ ఈవీ కార్ల మోడల్స్ లభిస్తున్నాయి. 2026లో లాంగ్ డ్రైవ్ కోరుకునే కొనుగోలుదారులకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి.. ఇందులో మీ బెస్ట్ అండ్ ఫేవరెట్ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కారు ఏంటో ఎంచుకోండి.. 1. మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్ : మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్ 792 కి.మీ WLTP రేంజ్‌తో ఈ లిస్టులో నంబర్ వన్‌గా నిలిచింది. MMA ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ మోడల్ అడ్వాన్స్ బ్యాటరీ టెక్నాలజీ, ఏరోడైనమిక్ సామర్థ్యంతో ఆకట్టుకుంటుంది. ప్రారంభ ధర రూ. 55 లక్షల నుంచి రూ. 59 లక్షలు ఉంటుంది. 2. మహీంద్రా బీఈ 6 : మహీంద్రా బీఈ 6 ఏఆర్ఏఐ ప్రకారం 682 కి.మీ. రేంజ్ అందిస్తుంది. INGLO ప్లాట్‌ఫామ్, హై-డెన్సిటీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ADAS ఈ కారు స్పెషాలిటీ.. ధర రూ. 23.50 లక్షలు మాత్రమే 3. టెస్లా మోడల్ వై లాంగ్ రేంజ్ : టెస్లా మోడల్ వై లాంగ్ రేంజ్ 681 కి.మీ WLTP రేంజ్‌తో 3వ స్థానంలో ఉంది. భారీ బ్యాటరీ, అడ్వాన్స్ థర్మల్ మేనేజ్మెంట్, ఫాస్ట్ ఛార్జింగ్ దీని స్పెషాలిటీ.. ప్రారంభ ధర రూ. 61.99 లక్షలు. 4. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 : మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 ఈ ఎలక్ట్రిక్ కారు 677 కి.మీ WLTP రేంజ్ అందిస్తుంది. లగ్జరీతో

Trisha Krishnan Net Worth 2026: దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్. దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోయిన్గా కొనసాగుతున్న ఆమె ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఆస్తి వివరాలు వైరల్ అవుతున్నాయి.. నటిగా వచ్చిన క్రేజ్‌తో పాటు సౌత్ హీరోయిన్ త్రిష సంపాదన, ఆస్తులు కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం త్రిష మొత్తం నికర ఆస్తుల విలువ సుమారు రూ.85 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ మొత్తం అధికారికంగా వెల్లడించిన గణాంకం కాదని గుర్తుంచుకోవాలి. సినిమాల ద్వారా వచ్చే పారితోషికం, బ్రాండ్ ప్రమోషన్లు, ఆస్తులు, ఇతర పెట్టుబడులు కలిపి ఈ అంచనా రూపొందించినట్లు తెలుస్తోంది. త్రిష తన కెరీర్ ప్రారంభంలో తక్కువ పారితోషికంతో సినిమాలు చేసినప్పటికీ, ప్రస్తుతం ఆమె సౌత్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. సినిమా కథ, పాత్ర, నిర్మాణ సంస్థను బట్టి ఈ మొత్తం మారే అవకాశం ఉంటుంది. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, గిల్లీ, సామి, 96 వంటి సినిమాలు త్రిష కెరీర్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి. పొన్నియిన్ సెల్వన్, లియో వంటి భారీ చిత్రాల విజయాలతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది. సినిమాలతో పాటు త్రిష పలు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నారు. జువెలరీ, ఫ్యాషన్, బ్యూటీ వంటి విభాగాలకు సంబంధించిన బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కూడా ఆమెకు భారీ ఆదాయం వస్తున్నట్లు సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం ఈ మార్గంలో ఆమె ఏడాదికి దాదాపు రూ.9 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు అంచనా. త్రిషకు చెన్నైలో విలాసవంతమైన ఇల్లు

Hyundai: మార్కెట్‌ను ఊపేయడానికి హ్యుందాయ్ మాస్టర్ ప్లాన్.. త్వరలోనే 5 కొత్త పవర్ఫుల్ SUVs ఈ వార్తకు సంబంధించిన

కొన్నేళ్ల క్రితం 360-డిగ్రీ కెమెరా అంటే ఆడి, మెర్సిడెస్ బెంజ్, BMW వంటి లగ్జరీ కార్లలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సామాన్యుల బడ్జెట్ కార్లలోనూ ఈ ఫీచర్ వస్తోంది. రూ.10 లక్షల లోపు 360-డిగ్రీ కెమెరా ఉన్న టాటా కారు కోసం చూస్తుంటే టియాగో, పంచ్, ఆల్ట్రోజ్ బెస్ట్ ఆప్షన్లు. 360-డిగ్రీ కెమెరా టాటా కార్ల జాబితాలో టాటా టియాగో (2026 మోడల్) అత్యంత చవకైన కారు. దీని క్రియేటివ్ వేరియంట్లో ఈ ఫీచర్ లభిస్తుంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.8.24 లక్షలు, పెట్రోల్ ఆటోమేటిక్ (AMT) ధర రూ.8.87 లక్షలు, CNG మాన్యువల్ ధర రూ.9.14 లక్షలు, CNG ఆటోమేటిక్ (AMT) ధర రూ.9.79 లక్షలు (ఆన్-రోడ్). తక్కువ బడ్జెట్లో ఈ ఫీచర్ కోరుకునేవారికి టియాగో మంచి ఎంపిక. టాటా పాపులర్ కాంపాక్ట్ SUV అయిన పంచ్‌లో కూడా 360-డిగ్రీ కెమెరా సదుపాయం ఉంది. దీని అడ్వెంచర్ వేరియంట్ నుంచి ఈ ఫీచర్ మొదలవుతుంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.9.04 లక్షలు, పెట్రోల్ ఆటోమేటిక్ (AMT) ధర రూ.9.72 లక్షలు, CNG మాన్యువల్ ధర రూ.9.97 లక్షలు, టర్బో పెట్రోల్ 6-స్పీడ్ మాన్యువల్ ధర రూ.9.88 లక్షలు (ఆన్-రోడ్). అయితే CNG ఆటోమేటిక్ (AMT) వేరియంట్ ధర రూ.10.59 లక్షలు కావడంతో, అది రూ.10 లక్షల బడ్జెట్‌ను దాటుతుంది. 360-డిగ్రీ కెమెరా ఫీచర్‌తో వచ్చే మరో టాటా మోడల్ ఆల్ట్రోజ్. దీని క్రియేటివ్ వేరియంట్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ.9.48 లక్షలు. కాబట్టి ఇది రూ.10 లక్షల బడ్జెట్లో ఉంది. కానీ పెట్రోల్ ఆటోమేటిక్ (AMT) ధర రూ.10.11 లక్షలు, CNG మాన్యువల్ ధర రూ.10.35 లక్షలు, CNG ఆటోమేటిక్ (AMT) ధర రూ.10.96 లక్షలు. ఇవన్నీ బడ్జెట్‌ను మించిపోతాయి. ఒకవేళ మీకు డీజిల్ ఇంజిన్‌తో 360-డిగ్రీ

ఇరాన్ వార్ నేపథ్యంలో దేశ ఇంధన భద్రత పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ కలిపిన పెట్రోల్ ను వాహనదారులకు అలవాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఇలా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20)వాడకం వల్ల తమ వాహనాలు పాడైపోతున్నాయని, మైలేజ్ కూడా తగ్గిపోతుందని వాహనదారులు ఆరోపించడం ప్రారంభించారు. దీంతో కేంద్రం ఇప్పుడు పదే పదే ఈ20 పెట్రోల్ తో ఎలాంటి నష్టం లేదని చెప్పుకొస్తోంది. అయినా ఈ20ని వాహనదారుల కంటే ముందు కార్ల తయారీ సంస్థలే వద్దని చెప్పినట్లు అంతర్జాతీయ వార్తా సంస్ద రాయిటర్స్ బయటపెట్టింది.విపక్షాలకు అమిత్ షా బంపర్ ఆఫర్..! తోసిపుచ్చిన రాహుల్..!కేంద్రం తాజాగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల ఎలాంటి నష్టం లేదని పదే పదే చెప్తున్న తరుణంలో కార్ల తయారీదారుల సంస్థ అయిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM)కు గతంలో తాము పంపిన మెయిల్స్ ను మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా వంటి సంస్థలు వెనక్కి తీసుకున్నాయి. అయితే ఇంతకీ ఆ మెయిల్స్ లో అవేం చెప్పాయన్న దానిపై రాయిటర్స్ వివరాలు వెల్లడించింది. ఇందులో ఆయా సంస్థలు ఇథనాల్ కలిపిన పెట్రోల్ లో మితిమీరిన క్లోరైడ్, తేమ శాతం ఉండటం వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు తేలింది. ఈ సంస్థలకు దేశంలో 67 శాతం కార్ల వాటా ఉంది. పెట్రోల్ కార్లా ? వద్దు బాాబోయ్..! E20 దెబ్బకు సేల్స్ ఢమాల్- భారీ డిస్కౌంట్లు..!ఆయా కార్ల తయారీ సంస్థలు బహిరంగంగా ఈ20 వినియోగాన్ని సమర్థిస్తున్నప్పటికీ.. దీని నాణ్యతపై మాత్రం అంతర్గతంగా తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు దీన్ని బట్టి అర్దమవుతోంది. దేశంలోని దాదాపు 18 రాష్ట్రాల నుండి సేకరించిన 250కి పైగా ఇంధన నమూనాల పరీక్షల్లో ఇంధన నాణ్యత సరిగా లేదని పరిశ్రమ వర్గాలు గుర్తించాయి. కార్ల తయారీ సంస్థలు స్వయంగా నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం బయటపడింది. నిబంధనల

తక్కువ బడ్జెట్లో కొత్త కారు కొనాలనుకుంటే ఇక్కడ మేము కేవలం అయదు లక్షల రూపాయల్లో వచ్చే కార్ల వివరాలు ఇచ్చాము. రూ.5 లక్షల లోపు బడ్జెట్లో మారుతి సుజుకి సెలెరియో, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్, టాటా టియాగో వంటివి బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి. ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి మారుతి సుజుకి సెలెరియో మంచి ఆప్షన్. దీని ప్రారంభ ధర సుమారు రూ.4.70 లక్షలు. పెట్రోల్ వేరియంట్ 24.97 నుంచి 26.68 కిలోమీటర్ల వరకు, సీఎన్జీ వేరియంట్ 34.43 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో రోజూ ప్రయాణించేందుకు ఈ కారు చాలా ఉత్తమ ఎంపిక. అయిదు లక్షల రూపాయల కన్నా తక్కువ ధరలో కారు కొనాలనుకునే వారిని ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో చాలా బాగుంటాయి. ఆల్టో కె10 కారు ప్రారంభ ధర సుమారు రూ.3.70 లక్షలు. ఇది పెట్రోల్‌పై 24.39 నుండి 24.90 కిలోమీటర్లు, సీఎన్జీపై 33.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఒక ఎస్-ప్రెస్సో ప్రారంభ ధర సుమారు రూ.3.50 లక్షలు ఉంటుంది. ఇది పెట్రోల్‌పై 24.12 నుండి 25.30 కిలోమీటర్లు, సీఎన్జీపై 32.73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఎత్తైన సీటింగ్, మినీ ఎస్యూవీ లాంటి లుక్ దీని ప్రత్యేకతలు. డిజైన్ అదిరిపోవాలనుకుంటే రెనాల్ట్ క్విడ్ కొనండి. దీని ప్రారంభ ధర సుమారు రూ.4.30 లక్షలు. పెట్రోల్‌పై ఇది 21.7 నుంచి 22 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. చిన్న కారే అయినా, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత కావాలనుకుంటే టాటా టియాగో ఎంపిక చేసుకోవాలి. దీని ప్రారంభ ధర సుమారు రూ.4.70 లక్షలు కాగా, పెట్రోల్‌పై దాదాపు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని బలమైన నిర్మాణం, డ్రైవింగ్ అనుభవం దీని ప్రధాన బలాలు

ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే చాలా మందికి నిద్ర వస్తుంటుంది. అసలు ప్రయాణంలో ఎందుకు అంత త్వరగా నిద్ర వస్తుందో తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: కారు, బస్సు లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కొద్దిసేపటికే నిద్రలోకి జారుకుంటున్నారా? చాలా మందికి ప్రయాణం మొదలైన 10–15 నిమిషాల్లోనే నిద్రమత్తు వస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం తర్వాత ప్రయాణిస్తే ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది. అసలు ప్రయాణంలో ఎందుకు నిద్ర వస్తుంది? దానికి గల కారణాలేంటో చూద్దాం.. ప్రయాణిస్తున్నప్పుడు వాహనం స్వల్పంగా కదులుతూ ఉంటుంది. ఈ కదలికలు ఊయలలో ఊగుతున్న అనుభూతిని కలిగిస్తాయి. దీంతో శరీరం, మెదడు క్రమంగా రిలాక్స్ అవుతాయి. ఫలితంగా నిద్రమత్తు రావచ్చు. కారు, బస్సు లేదా రైలు వంటి మూసివున్న ప్రదేశాల్లో బయటితో పోలిస్తే సహజ కాంతి తక్కువగా ఉంటుంది. కాంతి తగ్గినప్పుడు శరీరంలోని నిద్ర–మేల్కొలుపు చక్రం ప్రభావితమై నిద్రమత్తు పెరగవచ్చు. ప్రయాణంలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఉండాల్సి వస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, పెద్దగా ఎలాంటి పని లేకపోవడం వల్ల మెదడు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నిద్ర వచ్చే అవకాశం పెరుగుతుంది. కారు, బస్సు లేదా రైలు ఇంజిన్, టైర్ల నుంచి నిరంతరం ఒకే రకమైన మృదువైన శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఈ శబ్దం కొంతమందికి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించి నిద్రమత్తును పెంచుతుంది. సాధారణంగా పెద్దలకు రోజుకు సుమారు 7–9 గంటల నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోవడం లేదా ఎక్కువగా అలసిపోయి ఉండటం వల్ల ప్రయాణంలో ప్రశాంతమైన వాతావరణం, వాహనం కదలికలు నిద్రను మరింత ప్రేరేపించవచ్చు. కారు, బస్సు లేదా రైలు ఒకే వేగంతో సాఫీగా ప్రయాణిస్తుంటే శరీరం క్రమంగా విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. ఒత్తిడి తగ్గి శరీరం, మనసు ప్రశాంతంగా మారడంతో నిద్ర సులభంగా రావచ్చు. ప్రయాణంలో కిటికీ బయట రోడ్లు, చెట్లు, పొలాలు, భవనాలు వంటి దృశ్యాలను చూస్తూ ఉండటం వల్ల కొంతమందికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది

ప్రపంచవ్యాప్తంగా కార్ల కంపెనీలు తమ వాహనాలను మరింత సామర్థ్యంతో మంచి మైలేజీ ఇచ్చేలా తయారు చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఈ దిశగా జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన ప్రత్యేకమైన ఇ-పవర్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఓ కొత్త మైలురాయిని సాధించింది. నిస్సాన్ ఖష్కాయ్ హైబ్రిడ్ ఎస్యూవీ ఎలాంటి బాహ్య ఛార్జింగ్ లేకుండా, పెట్రోల్ రీఫిల్ చేయకుండా ఒకే ఫ్యూయల్ ట్యాంకుతో 1,980 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. అత్యంత సుదూర ప్రాంతాన్న అధిగమించిన నాన్-ప్లగ్-ఇన్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ఇది రికార్డు సాధించింది.e-Visa: ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్!గొప్ప మైలేజ్విశేషమేమిటంటే, ఈ కారు ఈ రికార్డును ఏదో మూసివున్న ప్రయోగశాలలో కాకుండా, నిజమైన రహదారి, ట్రాఫిక్ పరిస్థితులలో నెలకొల్పింది. ఖష్కాయ్ 55-లీటర్ల ఇంధన ట్యాంక్ ఆధారంగా ఈ కారు లీటరుకు సుమారు 36 కిలోమీటర్ల (36 కిమీ/లీ) ఆకట్టుకునే మైలేజీని సాధించింది. ఈ ప్రయాణం 2026 జూలై 14 నుంచి 17 మధ్య కొలంబియాలో జరిగింది. ఈ వాహనం సముద్ర మట్టానికి 2,600 మీటర్ల ఎత్తులో ఉన్న బొగోటా నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి కరేబియన్ తీరానికి చేరుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మార్గమధ్యలో హైవేలు, నగర ట్రాఫిక్, అనేక కష్టతరమైన మార్గాలు ఉన్నాయి. ఎత్తు నుంచి కిందికి దిగేటప్పుడు వాహనంలోని రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, వాలుపై బ్రేక్ వేయడం వల్ల ఉత్పత్తి అయిన శక్తిని తిరిగి విద్యుత్తుగా మార్చి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది.అనుభవజ్ఞులైన డ్రైవర్ల కచ్చితమైన వేగ నియంత్రణ, నిస్సాన్ ఇ-పవర్ సిస్టమ్ కారణంగా వాహనం అంత సుదీర్ఘ దూరాలను ప్రయాణించగలిగింది.ఈ కారు ఎలాంటి బాహ్య ఛార్జింగ్ లేదా ఇంధనం నింపకుండా అత్యంత సుదూర ప్రయాణం చేసే నాన్-ప్లగ్-ఇన్ ఎక్స్టెండెడ్-రేంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో ప్రవేశించింది.నిస్సాన్ ఇ-పవర్ టెక్నాలజీ ఎలా భిన్నమైనది?సాధారణంగా హైబ్రిడ్ కార్లను తిప్పడానికి

TATA Motors Offer : పండగ సీజన్ మొదలయ్యింది… దీంతో టాటా మోటార్స్ అప్పుడే అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఈ కంపెనీ కార్లు ఈ నెల (ఆగస్ట్) లో అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. మీరు కొత్త కారు అదీ టాటాదే కొనాలనుకుంటే మాత్రం ఇదే మంచి సమయం… ఈ కంపెనీకి చెందిన పలు పాపులర్ మోడల్స్ భారీ తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. ఈ ఆగస్ట్ ఆఫర్ లో భాగంగానే క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ ఆఫర్లు, కార్పొరేట్ ఉద్యోగులకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది టాటా మోటార్స్. కొన్ని మోడళ్లపై లోన్ సౌకర్యాలు, త్వరిత డెలివరీ కూడా అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కార్లపై గరిష్ఠంగా రూ.77,500, ఎలక్ట్రిక్ కార్లపై రూ.2.25 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చని టాటా మోటార్స్ చెబుతోంది. మీరు పెట్రోల్, డీజిల్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే టాటా లో ఆల్ట్రోజ్‌పై మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ కారు కొనుగోలుపై ఏకంగా రూ.54,500 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. బ్యాంక్ లోన్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి. ఇక టాటా పాపులర్ SUV నెక్సాన్‌పై అయితే మరింత డిస్కౌంట్ ఉంది. ఈ కారుపై గరిష్ఠంగా రూ.72,500 వరకు ఆఫర్ ఇస్తున్నారు. ఇక టాటా కర్వ్ మోడల్‌పై రూ.77,500 వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. టాటా కంపెనీకి చెందిన ప్రీమియం SUV లు హారియర్, సఫారీలపై కూడా రూ.47,000 వరకు ఆఫర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు. ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ మంచి ఆఫర్లు అందిస్తోంది. నెక్సాన్ EV మోడల్‌పై రూ.60,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. అదే టాటా కర్వ్ EVపై రూ.55,000 వరకు ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. టాటా కొత్త ఎలక్ట్రిక్ SUV అయిన హారియర్ EVపై గరిష్ఠ ప్రయోజనాలు ఉన్నాయి