
Tata Motors August 2026 Discounts On Nexon Harrier And Ev Cars Nn0pxxu
TATA Motors Offer : పండగ సీజన్ మొదలయ్యింది… దీంతో టాటా మోటార్స్ అప్పుడే అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఈ కంపెనీ కార్లు ఈ నెల (ఆగస్ట్) లో అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. మీరు కొత్త కారు
TATA Motors Offer : పండగ సీజన్ మొదలయ్యింది… దీంతో టాటా మోటార్స్ అప్పుడే అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఈ కంపెనీ కార్లు ఈ నెల (ఆగస్ట్) లో అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. మీరు కొత్త కారు అదీ టాటాదే కొనాలనుకుంటే మాత్రం ఇదే మంచి సమయం… ఈ కంపెనీకి చెందిన పలు పాపులర్ మోడల్స్ భారీ తగ్గింపు ధరకే లభిస్తున్నాయి.
ఈ ఆగస్ట్ ఆఫర్ లో భాగంగానే క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ ఆఫర్లు, కార్పొరేట్ ఉద్యోగులకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది టాటా మోటార్స్. కొన్ని మోడళ్లపై లోన్ సౌకర్యాలు, త్వరిత డెలివరీ కూడా అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కార్లపై గరిష్ఠంగా రూ.77,500, ఎలక్ట్రిక్ కార్లపై రూ.2.25 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చని టాటా మోటార్స్ చెబుతోంది.
మీరు పెట్రోల్, డీజిల్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే టాటా లో ఆల్ట్రోజ్‌పై మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ కారు కొనుగోలుపై ఏకంగా రూ.54,500 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. బ్యాంక్ లోన్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి.
ఇక టాటా పాపులర్ SUV నెక్సాన్‌పై అయితే మరింత డిస్కౌంట్ ఉంది. ఈ కారుపై గరిష్ఠంగా రూ.72,500 వరకు ఆఫర్ ఇస్తున్నారు. ఇక టాటా కర్వ్ మోడల్‌పై రూ.77,500 వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది.
టాటా కంపెనీకి చెందిన ప్రీమియం SUV లు హారియర్, సఫారీలపై కూడా రూ.47,000 వరకు ఆఫర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు.
ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ మంచి ఆఫర్లు అందిస్తోంది. నెక్సాన్ EV మోడల్‌పై రూ.60,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. అదే టాటా కర్వ్ EVపై రూ.55,000 వరకు ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం.
టాటా కొత్త ఎలక్ట్రిక్ SUV అయిన హారియర్ EVపై గరిష్ఠ ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే టాటా కారు ఉన్నవారికి లాయల్టీ ఆఫర్ కింద రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఉండొచ్చు. దీనితో పాటు ఉచిత ఇన్సూరెన్స్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంది.
అయితే టాటా హారియర్ EVపై ఏకంగా రూ.2.25 లక్షల గరిష్ఠ ప్రయోజనాలను పొందవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే ఈ కారు కొనుగోలు చేసే కస్టమర్లు కొన్ని విషయాలు గమనించాలి… ఈ డిస్కౌంట్ మొత్తం అందరికీ ఒకేలా వర్తించే డైరెక్ట్ డిస్కౌంట్ కాదు. కస్టమర్ అర్హత, లాయల్టీ ఆఫర్, ఇన్సూరెన్స్ బెనిఫిట్, పాత వాహనం ఎక్స్ఛేంజ్ ఆఫర్, డీలర్షిప్ లెవల్ ఆఫర్లను బట్టి తుది ప్రయోజనం ఆధారపడి ఉంటుంది. నగరం, డీలర్షిప్, వేరియంట్, స్టాక్ లభ్యతను బట్టి కూడా ఆఫర్ మొత్తం మారవచ్చు. కాబట్టి ఆన్లైన్లో చెప్పిన గరిష్ఠ ఆఫర్‌ను చూసి ఆన్-రోడ్ ధరను లెక్కించడం సరైన పద్ధతి కాదు.
మొత్తం మీద ఆగస్ట్‌లో టాటా కారు కొనాలనుకునే వారికి పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలపై రకరకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్యూయల్ కార్లలో కర్వ్, నెక్సాన్ వంటి మోడళ్లు మంచి ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో హారియర్ EV, నెక్సాన్ EV, కర్వ్ EVలు మంచి ఆప్షన్లుగా ఉన్నాయి.
అయితే ప్రతి కస్టమర్‌కు లభించే అసలు ఆఫర్ మారవచ్చు. కాబట్టి బుకింగ్ చేసే ముందు దగ్గర్లోని టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, లాయల్టీ ఆఫర్, ఇన్సూరెన్స్, తుది ఆన్-రోడ్ ధర వివరాలను విడివిడిగా నిర్ధారించుకోవడం ఉత్తమం.






