
Broiler Chicken: రోజూబ్రాయిలర్ చికెన్ తింటున్నారా? వామ్మో.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!
Broiler Chicken: రోజూ బ్రాయిలర్ చికెన్ తింటున్నారా? వామ్మో.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

Broiler Chicken: రోజూ బ్రాయిలర్ చికెన్ తింటున్నారా? వామ్మో.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

Vijayawada Mayor : అధికార టీడీపీలో విజయవాడ మేయర్ పదవి కోసం అప్పుడే పోటీ మొదలైనట్లు కనిపిస్తోంది. ఎంపీ కోటాలో కొమ్మారెడ్డి పట్టాభి..ఎమ్మెల్యే కోటాలో బొండా సిద్ధార్థ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

నిత్యం గొంతు సమస్యలతో ఇబ్బంది పడతుంటే ఇది తాగితే రిలీఫ్ నిత్యం గొంతు సమస్యలతో ఇబ్బంది పడతుంటే ఇది తాగితే రిలీఫ్ Prasanna Yadla 02 september 2026 Pic credit - Pinterest కొందరు నిత్యం గొంతు సమస్యలతో ఇబ్బంది పడతూనే ఉంటారు అలాంటి వాళ్లు ఈ బోన్ సూప్ తాగితే మంచిది గొంతు సమస్యలు ముందుగా మీరు మటన్ తీసుకుని ఎముకలను బాగా కడిగి పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి మటన్ ఆ తరువాత వీటిని ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసి దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, 5 యాలకులు వేసి వేయించాలి. ప్రెషర్ కుక్కర్లో ఇంకా దీనిలో ఉల్లిపాయ, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నిముషాలు పచ్చి వాసన పోయే దాకా వేయించాలి. ఉల్లిపాయ, అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఇక ఇప్పుడు క్లీన్ చేసిన మటన్ బోన్స్ కూడా 5 నిమిషాల పాటు వీటిని బాగా వేయించాలి. మటన్ బోన్స్ ఇంకా దీనిలో కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ కారం, టీ స్పూన్ మిరియాల పొడి ఉప్పు వేసి కలపాలి. ఈ బోన్స్ మొత్తం మునిగేలా నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి, 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి దించడమే మటన్ బోన్ సూప్ (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

తెలుగు సినిమా చరిత్రలో 90s టైమ్ అద్భుతమనే చెప్పాలి. అప్పుడే అదిరిపోయే సినిమాలెన్నో వచ్చాయి. ఎంటర్టైన్మెంగ్ తో పాటు సెంటిమెంట్, ఎమోషనల్, యాక్షన్ మూవీస్ సందడి చేశాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో ‘హలో బ్రదర్’ కచ్చితంగా ముందువరుసలో ఉంటుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో రూపొందిన ఈ చిత్రం 1994 ఏప్రిల్ 20న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. నాగార్జున మాస్, క్లాస్ లుక్స్‌తో పాటు రమ్యకృష్ణ, సౌందర్యల గ్లామర్, రాజ్-కోటి సంగీతం ఈ చిత్రాన్ని ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. మిసెస్ అండ్ మిస్టర్ చక్రవర్తి (శరత్ బాబు, సంగీత) దంపతులకు కవల పిల్లలు జన్మిస్తారు. జన్మతః వీరిద్దరికీ ఒక విచిత్రమైన కనెక్షన్ (రిఫ్లెక్స్ యాక్షన్) ఉంటుంది. ఒకరికి నొప్పి కలిగితే మరొకరికి స్పందన రావడం, ఒకరు కదిలితే మరొకరు కూడా అదే పనిచేయడం వీరి ప్రత్యేకత. అయితే, విశ్వనాథ్ ఉద్యోగరీత్యా ఒక ప్రమాదకరమైన క్రిమినల్ మిట్రా (నెపోలియన్)ని అరెస్ట్ చేసే క్రమంలో, మిట్రా ఈ కవలలలో ఒకరిని ఎత్తుకెళ్లి ఆసుపత్రి నుంచి తప్పించుకుంటాడు. ఈ క్రమంలో ఒక బాబు (దేవా) కూలిపనులు చేసుకునేవారికి దొరుకుతాడు. వారికి అప్పటికే ఓ ఆడపిల్ల కూడా ఉంటుంది. రోడ్డుపై రఫ్ అండ్ టఫ్ వాతావరణంలో దేవా (నాగార్జున) పెరిగి పెద్దవాడవుతాడు. మరో బాబు (రవి వర్మ) తన తల్లిదండ్రుల వద్దే పెరిగి విదేశాలలో చదువుకుని పెద్ద మ్యూజిషియన్‌గా ఇండియాకు తిరిగివస్తాడు. దేవా స్థానిక రౌడీలతో గొడవపడుతూ మాస్ క్యారెక్టర్‌గా మారితే, రవి వర్మ అత్యంత సాఫ్ట్ అండ్ క్లాస్ కుర్రాడిగా ఉంటాడు. దేవాను చక్రవర్తి ఫ్రెండ్ (గిరిబాబు) కూతురు మంగ (రమ్యకృష్ణ) ప్రేమిస్తుంది. రవి వర్మను తన ఈవెంట్ మేనేజర్ అక్కమాంబ( అన్నపూర్ణమ్మ) కూతురు ఊహ (సౌందర్య) ప్రేమిస్తుంది. విధి వశాత్తూ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే నగరంలో కలుసుకున్నప్పుడు వారి రిఫ్లెక్స్ చర్యల వల్ల ఎలాంటి అలజడి సృష్టింపబడింది?

Narendra Modi: భారతదేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ భారత్ మంచి వృద్ధిని సాధించిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని, అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేయడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వృద్ధి దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. ప్రపంచంలో యుద్ధాలు, అంతర్జాతీయ సమస్యలు, సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా విదేశీ పర్యటనల గురించి కూడా ప్రధాని మాట్లాడారు. కేవలం వినోదం కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించారు. అలాగే విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం కూడా తగ్గించాలని అన్నారు. అవసరం లేని సమయంలో బంగారం కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరారు. దేశంలో తయారయ్యే వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించడం వల్ల దేశంలోని వ్యాపారాలు, పరిశ్రమలు, ఉద్యోగాలకు కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని మోదీ కోరారు. దేశ ప్రజలంతా కలిసి పనిచేస్తే భారత్ మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని అన్నారు. ముఖ్యంగా యువత కలలను నెరవేర్చే బాధ్యత నేటి తరంపై ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశంలో నిరాశ వాతావరణం సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా ప్రధాని విమర్శలు చేశారు. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిస్తూ 7.8 శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సమావేశానికి పలు దేశాల నాయకులు హాజరయ్యారు. భారత్ అభివృద్ధి, స్వయం

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్- ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో ట్రీసా-గాయత్రి జోడీ చైనాకు చెందిన లియు షెంగ్షు, టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి పాలైంది. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్- ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో ట్రీసా-గాయత్రి జోడీ చైనాకు చెందిన లియు షెంగ్షు, టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి పాలైంది. అయితే మహిళల డబుల్స్ విభాగంలో భారత్ చివరిసారిగా 2011లో పతకం సాధించింది. అప్పట్లో జ్వాలా గుత్తా-అశ్విని పొన్నప్ప కూడా కాంస్యం గెలిచారు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత అదే విభాగంలో ట్రీసా-గాయత్రి కాంస్యం గెలిచి రికార్డు నెలకొల్పారు. మ్యాచ్‌ను చైనా జోడీ దూకుడుగా ప్రారంభించినా.. భారత షట్లర్లు అద్భుతంగా పుంజుకున్నారు. కీలక సమయాల్లో వరుస పాయింట్లు సాధిస్తూ ఆధిపత్యం ప్రదర్శించిన ట్రీసా-గాయత్రి తొలి గేమ్‌ను 21-18తో సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో ఇరు జట్ల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. స్కోరు 12-12తో సమం కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే ఆ తర్వాత టాన్ నింగ్-లియు షెంగ్షు జోడీ ఒక్కసారిగా గేర్ మార్చింది. వరుస పాయింట్లు సాధిస్తూ భారత జోడీపై ఒత్తిడి పెంచిన చైనా షట్లర్లు రెండో గేమ్‌ను 21-13తో గెలిచారు. దీంతో మ్యాచ్ నిర్ణాయత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. మూడో గేమ్‌లో మాత్రం ట్రీసా-గాయత్రి జోడీ పెద్దగా ప్రతిఘటించలేకపోయింది. ఆరంభం నుంచే చైనా జోడీ ఆధిపత్యం కొనసాగించింది. భారత షట్లర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-8తో మూడో గేమ్‌ను ముగించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని దారుణ హత్య కోహ్లీ కాదు

భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం సాధించాలన్న ఆశలు క్వార్టర్ ఫైనల్లోనే ముగిశాయి. చైనాకు చెందిన ప్రపంచ నంబర్-3 జోడీ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో భారత జంట వరుస గేముల్లో ఓటమి పాలైంది. ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం సాధించాలన్న ఆశలు క్వార్టర్ ఫైనల్లోనే ముగిశాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చైనాకు చెందిన ప్రపంచ నంబర్-3 జోడీ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో భారత జంట వరుస గేముల్లో ఓటమి పాలైంది. ప్రపంచ నంబర్-5గా ఉన్న సాత్విక్–చిరాగ్ 36 నిమిషాల్లో 18–21, 9–21 తేడాతో పరాజయం చవి చూశారు. మ్యాచ్ ఆరంభం నుంచే ఆశించిన స్థాయిలో పదును చూపలేకపోయిన భారత జోడీ.. రెండో గేమ్‌లో పూర్తిగా వెనుకబడింది. 2022, 2025 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించిన సాత్విక్–చిరాగ్.. ఈసారి మూడో పతకంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేతలైన లియాంగ్–వాంగ్ జోడీ ముందు భారత జంటకు ఎదురుదెబ్బ తగిలింది. కుల్దీప్ యాదవ్‌పై వారికి నమ్మకం లేదు.. అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు ఒక్క మ్యాచ్‌తో కుల్దీప్ సామర్థ్యాన్ని అంచనా వేయొద్దు: స్పిన్ కోచ్ బహుతులే

పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించిన ఆతిథ్య జట్టు.. ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి రోజు నుంచే ఒత్తిడిలో కనిపించిన పాకిస్థాన్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ పూర్తిగా విఫలమయ్యారు. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది. అబ్దుల్లా షఫీక్ మాత్రమే అర్ధశతకం సాధించి 61 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. జోష్ టంగ్ కూడా పాక్ బ్యాటింగ్ లైనప్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 409 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో పాకిస్థాన్‌పై ఏకంగా 238 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో భారీ స్కోరు నమోదైంది. వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ముందుండి నడిపించాడు. 93 బంతుల్లో 91 పరుగులు చేసిన అతడు 13 బౌండరీలు బాదాడు. జోర్డాన్ కాక్స్ 73, కొత్త టెస్టు కెప్టెన్ జో రూట్ 66, డాన్ లారెన్స్ 51 పరుగులతో అర్ధశతకాలు సాధించారు. పాకిస్థాన్ బౌలర్లలో అలీ ఉస్మాన్ ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ భారీ స్కోరును కొంతమేర అడ్డుకున్నాడు. 238 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ బ్యాటింగ్ మరోసారి కుప్పకూలింది. షాన్ మసూద్ 29, అబ్దుల్లా షఫీక్ 15, సౌద్ షకీల్ 14, మహమ్మద్ రిజ్వాన్ 41 పరుగులతో కొంతసేపు పోరాడినా.. ఎవరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. చివరకు పాక్ 135 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ విజయానికి జోష్ టంగ్, ఓలీ రాబిన్సన్ కీలకంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన టంగ్.. రెండో ఇన్నింగ్స్‌లో మరో

Eng Vs Pak: ఇంగ్లాండ్, పాకిస్థాన్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే వాతావరణం వేడెక్కింది. ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై తీవ్రమైన విమర్శలు చేశాడు. “పాకిస్థాన్ పరమచెత్త జట్టు. వారిలో ఏమాత్రం టాలెంట్ లేదు. ఇంగ్లాండ్ ఈ సిరీస్‌ను 3-0 తేడాతో చాలా తేలికగా గెలుచుకుంటుంది” అంటూ వ్యాఖ్యానించాడు. లీడ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ కేవలం 171 పరుగులకే ఆలౌట్ కావడంతో బ్రాడ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా పై సల్మాన్ భట్ ప్రశ్నాస్త్రాలు స్టువర్ట్ బ్రాడ్ చేసిన విమర్శలపై సల్మాన్ భట్ ఘాటుగా స్పందించాడు. తమ జట్టు ప్రస్తుతం మంచి క్రికెట్ ఆడటం లేదనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నానని, అలా అని చెత్త జట్టు అని సంబోధించడం సరైంది కాదని మండిపడ్డాడు. ఇంగ్లాండ్ జట్టు గొప్పలు చెప్పుకోవడం ఆపి తమ సొంత రికార్డులను చూసుకోవాలని సూచించాడు. “మీరు ఆస్ట్రేలియా వెళ్లిన ప్రతిసారీ 0-5 తేడాతో ఘోరంగా ఓడిపోయి వస్తారు. గత 16 ఏళ్లుగా ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేకపోయింది. కేవలం ఒక్కటంటే ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే గెలిచింది” అంటూ ఇంగ్లాండ్ వైఫల్యాలను ఎండగట్టాడు. ఇది కూడా చదవండి: Test Record: సచిన్ 200 మ్యాచ్‌ల ప్రపంచ రికార్డ్ అవుట్.. 167వ టెస్టులోనే సంచలనం సృష్టించిన ఇంగ్లాండ్ బ్యాటర్ ఒకప్పుడు పాకిస్థాన్ బౌలింగ్ విభాగం అత్యంత బలంగా ఉండేదని సల్మాన్ భట్ గుర్తు చేశాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ జట్టులో 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సాధారణ బౌలర్లు ఉన్నారని, అప్పట్లో ఎవరూ ఇంగ్లాండ్‌ను చెత్త జట్టు అని అనలేదని పేర్కొన్నాడు. తమ జట్టు బలహీనంగా ఉన్న మాట వాస్తవమేనని, ఒకవేళ ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్

అక్కినేని వారసులుగా నాగ చైతన్య, అఖిల్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. నాగార్జున టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరో. రీసెంట్ గా వీరు ముగ్గురూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమ కెరీర్, ఫ్యామిలీలో ఉన్న అనుబంధం ఇతర విశేషాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, అఖిల్ ఇంత వరకు కలసి ఫుల్ లెన్త్ మూవీ చేయలేదు. మనం మూవీలో అఖిల్ కొన్ని నిమిషాల పాటు తళుక్కున మెరుస్తాడు అంతే. ఆ మూవీలో నాగార్జున, చైతు పూర్తి స్థాయిలో నటించారు. అక్కినేని అన్నదమ్ముల కాంబోలో ఫుల్ లెన్త్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో అఖిల్, చైతూకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ తండ్రి సినిమాల్లో దేనిని రీమేక్ చేయడనికి ఇష్టపడతారు అని ప్రశ్నించగా.. అఖిల్, చైతూ ఇద్దరూ ఒకే సినిమా పేరు చెప్పారు. ఆ సినిమా ఏంటంటే.. హలో బ్రదర్. నాగార్జున డ్యూయెల్ రోల్ లో నటించిన హలొ బ్రదర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 90వ దశకంలో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఇది కూడా ఒకటి. రమ్యకృష్ణ, సొందర్య హీరోయిన్లుగా నటించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు చైతూ, అఖిల్ ఇద్దరూ చెప్పారు. అయితే అఖిల్, చైతూ హలో బ్రదర్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అనే లెక్కలు అప్పుడే అభిమానుల్లో మొదలయ్యాయి. అది 32 ఏళ్ళ నాటి సినిమా. ఆ తరహా ఎంటర్టైన్మెంట్ కి, కథలకు ఎప్పుడో కాలం చెల్లింది. అలాంటి కథలతో ఇప్పుడు సినిమాలు చేస్తే వర్కౌట్ కావు సరికదా.. హలో బ్రదర్ లాంటి క్లాసిక్ మూవీ పరువు తీసినట్లు అవుతుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటి ట్రెండ్

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సోదరుడు శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వృద్ధాప్యంలో ఉన్న తనకు తమ్ముడి నుంచి ఆర్థిక సహాయం కంటే ఆత్మీయమైన పలకరింపే కావాలని ఆయన చెప్పిన మాటలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాను బ్రహ్మానందం తనను పట్టించుకోవడం లేదని నేరుగా విమర్శించకుండా.. ఒక్కసారి ఫోన్ చేసి “ఎలా ఉన్నావన్నయ్యా?” అని అడిగితే చాలని తన మనసులోని మాటను వెల్లడించారు. తమది ఆరుగురు అన్నదమ్ముల కుటుంబమని శ్రీనివాసరావు తెలిపారు. బ్రహ్మానందం ఐదో సోదరుడని, మిగిలిన నలుగురు ఇప్పటికే కన్నుమూశారని చెప్పారు. ప్రస్తుతం తామిద్దరమే ఉన్నామని పేర్కొంటూ.. వృద్ధాప్యంలో ఒంటరితనం మరింత ఎక్కువగా అనిపిస్తోందని తన ఆవేదనను వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉండే బ్రహ్మానందం షూటింగ్‌ల మధ్య ఖాళీ సమయం దొరికినప్పుడు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడితే ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు. తనకు తమ్ముడిపై ఎలాంటి కోపం లేదని, అతడి నుంచి పెద్దగా ఏమీ ఆశించడం లేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. “ఎలా ఉన్నావన్నయ్యా? ఏం చేస్తున్నావ్?” అని ఆప్యాయంగా రెండు మాటలు మాట్లాడితే తనకు అదే పెద్ద సంతోషమని చెప్పారు. డబ్బులు, ఇతర సహాయాలు తనకు అవసరం లేదని తెలిపారు. బ్రహ్మానందం తనకంటే ఎంతో పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి కావడంతో తానే వెళ్లి పలకరించడానికి కొంత సంకోచంగా ఉంటుందని శ్రీనివాసరావు చెప్పారు. గొప్పవాళ్లు తమను ఆప్యాయంగా పలకరిస్తే చిన్నవాళ్లకు సంతోషంగా ఉంటుందని, కానీ తామే వారి దగ్గరకు వెళ్లాలంటే ఏదో తెలియని భయం ఉంటుందని వివరించారు. బ్రహ్మానందం తనను ఏమీ అనరని తెలిసినా, తనలో అలాంటి భావన ఉందన్నారు. ఇటీవల బ్రహ్మానందం తమ ఊరికి వచ్చినట్లు తెలిసినా తాను వెళ్లి కలవలేకపోయానని చెప్పారు. తన నడక నెమ్మదిగా ఉంటుందని, అక్కడ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటే వారిని దాటుకుని వెళ్లడం తనకు సాధ్యం కాదని వివరించారు. బ్రహ్మానందం తన ఇంటికి రావాలని కూడా తాను కోరుకోవడం

Alwal: అల్వాల్‌లో వినూత్న చోరీ చందా కోసం వెళ్లి నగదు దోచుకున్న మైనర్లు ఈ వార్తకు సంబంధించిన

హాస్య బ్రహ్మగా టాలీవుడ్లో గొప్ప గుర్తింపు తెచ్చుకుని.. తెలుగు వాళ్ల గుండెళ్లో చిరస్థాయిగా నిలిచేంత క్రేజ్ సంపాదించుకున్న బ్రహ్మానందం ఇప్పుడు తన సొంత అన్న కారణంగా.. ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ కారణంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. బ్రహ్మానందానికి ఆరుగురు తోబుట్టువులు. అందులో నలుగురు కాలం చేయగా.. బ్రహ్మానందం, వదన్ మాత్రమే ఇప్పుడు ఉన్నారు. అయితే బ్రహ్మానందానికి అన్నయ్య అయిన వదన్ ఇప్పుడు వృద్దాప్యంలో బతుకీడుస్తున్నారు. ఈ క్రమంలో తన తమ్ముడైన బ్రహ్మానందం..‘అన్నయ్యా’ అంటూ రెండు మాటలు మాట్లాడితే విందామని ఎదురుచూస్తున్నట్లు వాపోయాడు.ఈ మేరకు ఆయన ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వయసులో ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది తానొక్కడినే అని వదన్ అంటున్నారు. ఈ మధ్యనే తన తమ్ముడు బ్రహ్మానందం తమ ఊరికి వచ్చి.. కనీసం పలకరించకుండానే వెళ్లిపోవడం తనను కలిచివేసిందని చెబుతున్నారు. తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి “అన్నయ్యా.. ఎలా ఉన్నావ్?” అని అడుగుతాడేమో అని ఆశగా ఎదురుచూస్తున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు. గొప్పవాళ్లు పలకరిస్తే చిన్నవాళ్లకు ఎంతో సంతోషంగా ఉంటుంది. తమ్ముడి నుంచి ఒక్క ఫోన్, ఒక్క పలకరింపు కోసం ఈ వృద్దాప్యంలో ఎదురుచూస్తున్నా.. అంటూ వదన్ చెబుతుండం అందర్నీ కలిచివేస్తోంది. ఈయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ బ్రహ్మానందం వైపే వేలెత్తేలా చేస్తున్నాయి. దీంతో బ్రహ్మా కూడా దీనిపై మీడియాతో మాట్లాడారు. తన అన్నయ్య వదన్..మానసికంగా బలహీనంగా ఉన్నారని బ్రహ్మీ అంటున్నారు. ఎవరో ఒక యూట్యూబర్ మాట్లాడించడంతో.. అలా మాట్లాడారని.. ఆ వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోందని చెబుతున్నారు. తన అన్నయ్యకు, ఆయన కుటుంబానికి తాను చాలా సాయం చేశానని బ్రహ్మానందం చెబుతున్నారు. అయితే బ్రహ్మానందం వర్షెన్ ఎలా ఉన్నా కూడా.. ఈ వయసులో వదన్ చెబుతున్న మాటలు మాత్రం అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాయి. Pallavi Prashanth: డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ‘బిగ్ బాస్’ లాగేసుకుంటే..నేనెట్టా పంచేది! ఆదిరెడ్డి

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Brahmanandam:హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తన కామెడీతో ఎన్నో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. వేలాది సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు దేశవ్యాప్తంగా భారీ అభిమానగణం ఉంది. ప్రస్తుతం సినిమాల సంఖ్య తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన మీమ్స్, కామెడీ సన్నివేశాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా బ్రహ్మానందం అన్నయ్య శ్రీనివాసరావు మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను బ్రహ్మానందం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం ఆశించడం లేదని, కేవలం అప్పుడప్పుడు ఫోన్ చేసి ప్రేమగా పలకరిస్తే చాలని శ్రీనివాసరావు తెలిపారు. తమది ఆరుగురు అన్నదమ్ముల కుటుంబమని, వారిలో ప్రస్తుతం తామిద్దరే ఉన్నామని చెప్పారు. వృద్ధాప్యంలో తమ్ముడి నుంచి ఒక ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పడం భావోద్వేగానికి గురిచేసింది. బ్రహ్మానందం తనను కలవడానికి రావాల్సిన అవసరం లేదని, ఆయన వస్తే అభిమానులు, జనసందోహం కారణంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. తనను హైదరాబాద్‌కు పిలిపించి ఒక్కసారి కలిస్తే చాలని చెప్పారు. తన కుమార్తెలే ప్రస్తుతం తనను చూసుకుంటున్నారని, తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని వివరించారు. అయితే ఇదే సమయంలో బ్రహ్మానందం తమ కుటుంబానికి చేసిన సాయాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. తాను ప్రస్తుతం నివసిస్తున్న ఇంటిని బ్రహ్మానందమే నిర్మించారని తెలిపారు. తన ముగ్గురు కుమార్తెల వివాహాలను కూడా తమ్ముడే నిర్వహించారని చెప్పారు. కుటుంబంలోని ఇతర సభ్యులకు కూడా బ్రహ్మానందం తన స్థాయికి తగ్గట్టుగా సాయం చేశారని వెల్లడించారు
లెజెండరీ కమెడియన్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గత కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నారు. అన్ని భాషల్లో కలుపుకొని దాదాపు 1250కి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. ఇటీవల కాలంలో సినిమాలు కాస్త తగ్గించిన బ్రహ్మానందం.. 'కామెడీ కింగ్'గా, 'మీమ్ గాడ్'గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. ఇన్నేళ్ల కెరీర్ లో ఎలాంటి వివాదాలు లేకుండా సినీ ప్రయాణం సాగించిన బ్రహ్మానందంపై, ఆయన సొంత అన్నయ్య అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.''వృద్ధాప్యంలో తమ్ముడి ప్రేమ, అనురాగం కోసం ఎదురు చూస్తున్న బ్రహ్మానందం అన్నయ్య'' అంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో బ్రహ్మానందం సోదరుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''మేము ఆరుగురం అన్నదమ్ములం. ఐదోవాడు బ్రహ్మానందం. నలుగురు చనిపోయారు. ఉన్నది మేమిద్దరమే. ఇక్కడ నేను ఒంటరిగా మిగిలిపోయను. బ్రహ్మానందం ఎప్పుడైనా ఫోన్ చేసి పలకరిస్తాడేమో అని ఎదురు చూస్తున్నా. హైదరాబాద్ నుంచే, ఆయనకు షూటింగ్ లేనప్పుడైనా ఒక్కసారి అయినా ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. 'రేయ్ అన్నయ్యా.. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావ్?' అని అడుగుతాడేమో అని అడగొచ్చు కదా అని అనుకుంటాను'' అని అన్నారు.''గొప్పవాళ్ళు పలకరించినప్పుడు నాలాంటి చిన్నవాళ్లకు సంతోషంగా ఉంటుంది. చనువుగా మాట్లాడటానికి బాగుంటుంది. మనకు మనంగా వాళ్ల దగ్గరకు వెళ్తే ఏమవుతుందో అనే భయం ఉంటుంది. వాడు ఏదో అంటాడని కాదు కానీ, నాకు అలాంటి ఫీలింగ్ ఉంది. నాకు బాధేమీ లేదు కానీ.. 'ఎలా ఉన్నావ్ అన్నయ్యా?' అని ఒక్క మాట అడిగితే చాలు అనేదే నా బాధ. నాకు డబ్బులేమీ అక్కర్లేదు. ప్రేమగా పలకరిస్తే చాలు. అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇటీవల మా ఊరికి వచ్చాడంట. నాకు తెలియదు. అయినా నేను వెళ్లలేను. ఎందుకంటే నేను చిన్నగా నడుస్తాను. అంతమంది జనంలో ఎలా వెళ్లాలో తెలియదు''''వాడు

ఎక్స్ట్రాక్షన్ 3 మూవీలో మాజీ జేమ్స్ బాండ్ పియర్స్ బ్రాస్నన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. జేమ్స్ బాండ్ నటుడిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న పియర్స్ బ్రాస్నన్ తాజాగా 'ఎక్స్ట్రాక్షన్ 3' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. క్రిస్ హేమ్స్ వర్త్ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'ఎక్స్ట్రాక్షన్ 3'ని నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఫ్రాంచైజీలోని ఈ చిత్రంలో ‘ట్రెయిన్ టు బుసాన్’ ఫేమ్ డాన్ లీ, ‘28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్’ ఫేమ్ చి లూయిస్ - ప్యారీ, జో టస్లిమ్, సియెనా అగుడాంగ్ కూడా నటిస్తున్నారు. ఆసక్తికరంగా, డాన్ లీ ఇటీవల ఈ ఫ్రాంచైజీకి చెందిన కొరియన్ భాషా చిత్రమైన ‘టైగో’లో కూడా చేరారు. 'ఎక్స్ట్రాక్షన్ 3'లో ఇద్రిస్ ఎల్బా, గోల్షిఫ్తే ఫరహానీ కూడా యాక్ట్ చేస్తున్నారు. రస్సో బ్రదర్స్‌కు చెందిన ఏజీబీవో, హేమ్స్‌వర్త్‌కు చెందిన వైల్డ్ స్టేట్ సంస్థలు రూపొందిస్తున్న ఈ ఫ్రాంచైజీ, ఆండే పార్క్స్ గ్రాఫిక్ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ ఫ్రాంచైజీలో హేమ్స్‌వర్త్ టైలర్ రేక్ అనే ఆస్ట్రేలియన్ కిరాయి సైనికుడిగా నటిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన రక్షణ వ్యవస్థకు అతను హామిగా ఉంటాడు. ఈ థర్డ్ పార్ట్ కు సామ్ హార్గ్రేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. డేవిడ్ వెయిల్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇక పియర్స్ బ్రాస్నన్ విషయానివస్తే ఆయన హెలెన్ మిర్రెన్, బెన్ కింగ్స్లీ, జొనాథన్ ప్రైస్లతో కలిసి ‘ది థర్స్డే మర్డర్ క్లబ్’లో నటించారు. అలాగే పారామౌంట్ ప్లస్ క్రైమ్ డ్రామా ‘మాబ్ల్యాండ్’లోనూ యాక్ట్ చేశారు. 'ఎక్స్ట్రాక్షన్' మొదటి రెండు భాగాలు 2020, 2023లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యి అత్యంత వీక్షకాదరణ పొందాయి. తొలి భాగం విడుదలైన మొదటి నెలలోనే 9.9 కోట్ల

Brahmanandam Brother : తెలుగు లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను నవ్వించారు. గత కొన్నాళ్లుగా ఆయన చాలా తక్కువగా అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. తాజాగా బ్రహ్మానందం పై తన సొంత అన్న శ్రీవదన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బ్రహ్మానందం తల్లితండ్రులకు ఆరుగురు సంతానం. అందులో శ్రీవదన్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ బ్రహ్మానందం తనను కనీసం పలకరించట్లేదని వాపోయారు. Also See : Thiruveer : భార్య, కొడుకుతో తిరుమలలో హీరో తిరువీర్.. ఫొటోలు.. బ్రహ్మానందం అన్నయ్య శ్రీవదన్ మాట్లాడుతూ.. మేము ఆరుగురు సంతానం. నలుగురు చనిపోయారు. ఉన్నది మేమిద్దరమే. ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది నేను ఒక్కడినే. నాకు కూతుళ్లు ఉన్నారు. వాళ్ళు నాకు ఫుడ్ పెడతారు. బ్రహ్మానందం ఎప్పుడైనా కనీసం పలకరిస్తాడేమో అని చూస్తున్నాను. ఆయనకు షూటింగ్ లేనప్పుడైనా రోజులో ఒక్క నిమిషం అయినా ఫోన్ చేసి అన్నయ్య ఎలా ఉన్నావు అని అడుగుతాడేమో అని ఆశగా చూస్తున్నాను. అలంటి గొప్పవాళ్ళు పలకరించినప్పుడు నాలాంటి చిన్నవాళ్లు సంతోషంగా ఉంటారు. నాకు అతని దగ్గరనుంచి డబ్బులేమీ వద్దు. కేవలం పలకరింపు చాలు. నాకు ఉన్నంతలో నేను బతుకుతున్నాను. ఇటీవల మా ఊరికి వచ్చాడంట. నేను వెళ్ళలేను. నేను చిన్నగా నడుస్తాను. కనీసం ఇటు వచ్చినప్పుడైనా పలకరించి వెళ్తే బాగుండేది అంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో బ్రహ్మానందం తన సొంత అన్నని కనీసం పలకరించట్లేదు అంటూ శ్రీవదన్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. మరి ఇవి బ్రహ్మానందం వద్దకు వెళ్లి ఆయన ఇప్పటికైనా తన అన్నయ్యని పలకరిస్తారేమో చూడాలి

కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం సృష్టించిన సినీ 'ఆరా; గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. స్టిల్ ఈ టైంకి కొన్ని లక్షల మంది బ్రహ్మానందం గారి కామెడీ వీడియోస్ చూసి రిఫ్రెష్ అవుతుంటారు. రీసెంట్ గా బ్రహ్మానందం పై అయన సోదరుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బ్రహ్మానందం అన్నయ పేరు వదన్ . ఆయన మాట్లాడుతు' మేము ఆరుగురం. నలుగురు చనిపోయారు. మిగిలింది ఇద్దరమే. ఇప్పుడు ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాను. తమ్ముడు ఒక్కసారైనా ఫోన్ చేసి ‘అన్నయ్య ఎలా ఉన్నావు?’ అని అడుగుతాడేమో అని ఆశగా ఎదురుచూస్తున్నాను. గొప్పవాళ్లు పలకరిస్తే చిన్నవారికి చాలా సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. రామ్ పోతినేనికి విలన్‌గా మారిన ఆ స్టార్ హీరో!

ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రసారాల రూపురేఖలను మార్చేసిన ఈఎస్పీఎన్ (ESPN) సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ (93) కన్నుమూశారు. కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, నిన్న తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల ఈఎస్పీఎన్ ప్రస్తుత, మాజీ ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన దార్శనికతను స్మరించుకున్నారు.1970వ దశకం చివర్లో తన కుమారుడు స్కాట్‌తో కలిసి 24 గంటల పాటు కేవలం క్రీడల కోసమే ఒక కేబుల్ నెట్వర్క్ ఉండాలనే ఆలోచనకు బిల్ రాస్ముసెన్ బీజం వేశారు. ఈ ఆలోచన ఫలితంగా 1979 సెప్టెంబర్ 7న ఈఎస్పీఎన్ ప్రారంభమైంది. మొదట్లో ఈ కాన్సెప్ట్‌పై ఎన్నో సందేహాలు వ్యక్తమైనా, అనతికాలంలోనే ఇది మీడియాలో ఒక సంచలనంగా మారింది. రాస్ముసెన్ ఈఎస్పీఎన్ మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు.ఈఎస్పీఎన్ ఛైర్మన్ జిమ్మీ పిటారో నివాళులర్పిస్తూ.. "రాస్ముసెన్ ఒక అసాధారణ వ్యక్తి, గొప్ప దార్శనికుడు, ఆవిష్కర్త. క్రీడలకే అంకితమైన నెట్వర్క్ ఆలోచన ఆయనదే" అని కొనియాడారు. 1970లలో ఆయన చూపిన స్ఫూర్తి, అభిరుచి ఇప్పటికీ తమ సంస్థ సంస్కృతిలో భాగమేనని తెలిపారు. ప్రముఖ యాంకర్ క్రిస్ బెర్మన్ స్పందిస్తూ.. "ఆయన మా జార్జ్ వాషింగ్టన్, ఒక మంచి స్నేహితుడు" అని అభివర్ణించారు.క్రీడా ప్రసార రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ 2025లో స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, ఏడుగురు మనవళ్లు, ఇద్దరు మునిమనవళ్లు ఉన్నారు

Fire Accident : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఫ్రీ స్కూల్ స్ట్రీట్ ప్రాంతంలోని ఓ హోటల్లో బుధవారం తెల్లవారుజామున భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. మిర్జా గాలిబ్ స్ట్రీట్‌లోని ఓ హోటల్లో అర్ధరాత్రి దాటిన తరువాత రాత్రి 2గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు వేగంగా విస్తరించడంతో హోటల్లో ఉన్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో పొగ పీల్చుకోవడంతో పలువురు స్పృహ కోల్పోయి పడిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల్లో బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అగ్నిప్రమాదం ఎలా జరిగింది? హోటల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు

Victoria 1107 Runs Record: ఆధునిక క్రికెట్లో టీ20ల రాకతో బ్యాటర్లు విరుచుకుపడుతున్నారు. పదుల సంఖ్యలో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. వన్డేల్లో 400 పరుగులు, టెస్టుల్లో 700 పరుగులు చేయడం ఇప్పుడు సాధారణ విషయంగా మారిపోయింది. సరిగ్గా 99 ఏళ్ల క్రితం ఎలాంటి ఆధునిక బ్యాట్లు, రక్షణ పరికరాలు లేని కాలంలోనే ఓ జట్టు బౌలర్లపై అత్యంత దారుణంగా దాడికి దిగింది. 1926 డిసెంబర్ 24న ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్ జట్ల మధ్య జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ దీనికి వేదికైంది. ఆ రోజు విక్టోరియా బ్యాటర్లు ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక మహా రికార్డుగా మిగిలిపోయింది. విల్ వుడ్‌ఫుల్ సారథ్యంలోని ఆ జట్టు ఏకంగా 1107 పరుగులు బోర్డుపై ఉంచి కనీవినీ ఎరుగని చరిత్ర సృష్టించింది. ఒకే ఇన్నింగ్స్‌లో వెయ్యికి పైగా పరుగులు చేయడం భవిష్యత్తులోనూ ఏ జట్టుకు సాధ్యపడకపోవచ్చు. ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన పోన్స్‌ఫోర్డ్.. న్యూ సౌత్ వేల్స్ బౌలర్లకు ఆ మ్యాచ్ ఒక పీడకల లాంటిది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన విక్టోరియా కెప్టెన్ బిల్ వుడ్‌ఫుల్ (133) పరుగుల వరదకు పునాది వేశాడు. అతనికి తోడుగా వచ్చిన మరో ఓపెనర్ బిల్ పోన్స్‌ఫోర్డ్ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా 36 ఫోర్లు బాది 352 పరుగులతో ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు కూడా ఏమాత్రం తగ్గలేదు. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..! మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్క్ హెండ్రీ 100 పరుగులు సాధించగా, నాలుగో నంబర్ బ్యాటర్ జాక్ రైడర్ అద్భుతమైన డబుల్ సెంచరీతో కదం తొక్కాడు
ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో సినీ ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన 'స్టార్ కిడ్స్' చాలామందే ఉన్నారు. ఇటీవల కాలంలో దర్శక నిర్మాతలకుటుంబాల నుంచి కూడా 'హీరోలు' వస్తున్నారు. 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తమ్ముడు శశి ఈ మధ్యనే 'KJQ' సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఇప్పుడు డైరెక్టర్ కార్తీక్ దండు సోదరుడు కూడా హీరోగా పరిచయం కాబోతున్నాడు.‘విరూపాక్ష’, ‘వృషకర్మ’ సినిమాల దర్శకుడు కార్తీక్ సోదరుడు వివేక్ దండు ' పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ ' అనే సినిమాతో ఆరంగేట్రం చేస్తున్నాడు. ఇందులో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సప్తగిరి కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలను పరిచయం చేశారు. ''సినిమానే మా ఎమోషన్'' అని పేర్కొన్నారు.'అయ్యగారే నెం.1'గా పాపులర్ అయిన అక్కినేని వీరాభిమాని నాగరాజుతో రూపొందించిన 'పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్' మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో ఆయన సైకిల్ తొక్కుకుంటూ వచ్చి, పనసపల్లి ఊర్లోని గోడపై ఈ సినిమా వాల్ పోస్టర్ ను అంటించడంతో టైటిల్ రివీల్ అవుతుంది. దీంట్లో పనసపల్లి మెగా కామ్రేడ్స్ ఫ్యాన్స్ సంఘానికి అధ్యక్షుడుగా వివేక్ దండు.. బాలయ్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ గా సంగీర్తన విపిన్ కనిపించారు. ఇద్దరూ తమ హీరోల సినిమాలు సాధించే బాక్సాఫీస్ రికార్డులపై పోటా పోటీలు పడటం మోషన్ పోస్టర్ లో ఆసక్తి కలిగిస్తోంది.''మా రికార్డ్ బద్దలు కొట్టాలంటే పదేళ్లు పట్టుద్ది.. వినపడుతుందా'' అని హీరో అంటే.. ''మా రికార్డ్ కొట్టాలంటే పదేళ్లు కాదు, పది తరాలు పడుతుందిరా'' అంటూ హీరోయిన్ కౌంటర్ ఇస్తోంది. టాలీవుడ్ సీరియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్ లో జరుగుతుంటాయో మనం చూస్తున్నాం. ఇప్పుడంటే సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు కానీ, ఒకప్పుడు ఇరువర్గాలు థియేటర్ల

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Revanth Reddy Seven Brothers: 'కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరికి ఒకలా సామాజిక న్యాయం ఉంటుంది. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి ఏడుగురు అన్నదమ్ములపైనే చర్చ జరుగుతుంది. వాళ్లు అందరూ భూములను దొంగతనం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కబ్జాలే' అని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాక్షస రాజ్యం నడుస్తోందని విమర్శించారు. సామాజిక న్యాయం అనేది ఎక్కడ ఉందని మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్‌ను ఓడగొట్టింది రేవంత్ రెడ్డి కదా? అని తెలిపారు. సామాజిక న్యాయం కూడా అనని రేవంత్ రెడ్డి సామాజిక న్యాయంపై మాట్లాడుతున్నారని.. ఆయనను ప్రజలు ఎవరూ నమ్మొద్దు అని విజ్ఞప్తి చేశారు. మంత్రివర్గంలో సామాజిక న్యాయం ఎక్కడ? ఇద్దరు బీసీలకు మంత్రి పదవులు ఇస్తే 33 శాతం అమలు జరిగినట్టా? అని నిలదీశారు. శివధర్ రెడ్డికి జీతం, వీహెచ్‌కు ఇచ్చిన ర్యాంక్ జీతం ఎంత? ఎందుకు వ్యత్యాసం? అని ప్రశ్నించారు. ఆర్టీఐలో అగ్రవర్ణాలు వాళ్లు ఉన్నారు. రేవంత రెడ్డి చెప్పేది సామాజిక న్యాయం.. పాటించేది ఆటవిక న్యాయం అని విమర్శించారు. 'రేవంత్ రెడ్డి రాక్షస రాజ్యం నడుస్తుంది. 30 వేల ఎకరాల అసైన్డ్ ల్యాండ్ లాక్కున్నారు. భూమి లేని పేద బిడ్డ కి భూమి దక్కాలి. తెలంగాణ సమాజంలో గుణాత్మక మార్పు రావాలంటే పేదలకు భూపంపిణీ జరగాల్సిందే. సామాజిక న్యాయం కోసం మే ప్రతిపాదిస్తున్న విప్లవాత్మక పథకం ‘భూలక్ష్మి’. భూమి లేని ప్రతి పేదింటి కుటుంబానికి

భారతీయులు ఎక్కువగా కొత్త ఫోన్ ఏ కారణంతో కొంటున్నారో తెలుసా? ఈ వార్తకు సంబంధించిన

కడప జిల్లాలో అత్యంత దిగ్భ్రాంతికరమైన, అమానుషమైన ఘటన వెలుగు చూసింది. సొంత రక్తసంబంధం, కలిసి పెరిగిన అనుబంధం క్షణికావేశం ముందు చిన్నబోయాయి. ఆత్మీయంగా పలకరించుకోవాల్సిన అన్నదమ్ముల మధ్య ఒక చిన్న కారణం చివరకు ప్రాణాలు తీసేంత ఘోరానికి దారితీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో చోటుచేసుకున్న ఈ దారుణం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బ్రహ్మంగారిమఠం ప్రాంతానికి చెందిన వెంకటసుబ్బయ్య, సురేష్ సొంత అన్నదమ్ములు. వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి జీవనం సాగిస్తున్నారు. రోజూలాగే పనుల్లో నిమగ్నమయ్యే ఈ సోదరుల మధ్య శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శనివారం నాడు అన్న వెంకటసుబ్బయ్య ఇంటికి చికెన్ తీసుకువచ్చాడు. శనివారం రోజున చికెన్ ఎందుకు తెచ్చావంటూ తమ్ముడు సురేష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వారంలో శనివారం చికెన్ తెచ్చి వండడం ఏంటని తీవ్ర కోపంతో రగిలిపోయాడు. మామూలు మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ గొడవ క్షణాల్లో తీవ్రరూపం దాల్చింది. కోపంతో ఊగిపోయిన తమ్ముడు సురేష్, విచక్షణ కోల్పోయి ఇంట్లోని గొడ్డలి తీసుకుని అన్న వెంకటసుబ్బయ్యపైకి దూసుకెళ్లాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే, గొడ్డలితో అన్నపై తీవ్రంగా దాడి చేసి దారుణంగా నరికి చంపేశాడు. రక్తపు మడుగులో పడిపోయిన వెంకటసుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఒకే ఒక్క చికెన్ విషయంలో వచ్చిన వివాదం చివరకు ప్రాణాలను బలితీసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ ఘోర ఘటనపై సమాచారం అందుకున్న బ్రహ్మంగారిమఠం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తం మడుగులో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షణికావేశంలో సొంత అన్నను అత్యంత దారుణంగా హత్య చేసిన తమ్ముడు సురేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. చికెన్ తెచ్చాడనే ఒక చిన్న విషయానికి సొంత సోదరుడి

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ టీవీ ఛానళ్ల యాడ్స్ ప్రసారంపై అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానళ్లు గంటకు 12 నిమిషాలకు మించి ప్రకటనలు ప్రసారం చేయకూడదన్న దాదాపు రెండు దశాబ్దాల నాటి పాత నిబంధనను పూర్తిగా ఎత్తివేసింది. ఈ కొత్త మార్పు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రూల్స్ 1994 సవరణల గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో టీవీ ఛానళ్లకు ప్రకటనల ప్రసారంలో పూర్తి స్వేచ్ఛ లభించనుంది. ఈ 12 నిమిషాల పరిమితి నిబంధన కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రూల్స్ కింద 2006 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. అప్పట్లో దేశంలో కేవలం 62 టీవీ ఛానళ్లు మాత్రమే అందుబాటులో ఉండగా కేబుల్ వ్యవస్థ అంతా అనలాగ్ పద్ధతిలోనే సాగేది. అయితే ప్రస్తుతం దేశంలో 900కు పైగా ఛానళ్లు ఉండటమే కాకుండా డీటీహెచ్, డిజిటల్ కేబుల్ ప్లాట్‌ఫామ్‌లు వందలాది ఛానళ్లను వీక్షకులకు అందిస్తున్నాయి. బ్రాడ్కాస్టర్లు ఈ నిబంధనను సవాలు చేస్తూ కోర్టులను ఆశ్రయించగా 2026 మే నెలలో ఢిల్లీ హైకోర్టు ట్రాయ్ నిబంధనలను సమర్థించింది. దీంతో టీవీ రంగంలో పెరిగిన తీవ్రమైన మార్కెట్ పోటీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పరిమితిని పూర్తిగా రద్దు చేసింది. ఇదిలా ఉండగా టీవీ రంగానికి చెందిన పే ఛానళ్లు మరియు ఫ్రీ-టు-ఎయిర్ ఛానళ్లు ప్రధానంగా ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడి నడుస్తున్నాయి. మరోవైపు డిజిటల్ మీడియా మరియు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటనల సమయంపై ఎలాంటి కాలపరిమితి లేకపోవడంతో టీవీ రంగానికి అసమాన పోటీ ఎదురైంది. ప్రకటనల ఆదాయాన్ని నమ్ముకున్న టీవీ ఛానళ్లకు డిజిటల్ మాధ్యమాలతో సమానమైన పోటీ వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సవరణల నిర్ణయం వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఫలితంగా టీవీ ఛానళ్లు తమ ప్రకటనల సమయాన్ని తమకు నచ్చినట్లు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. 80th Independence Day: స్వాతంత్య్ర వేడుకలకు తెలంగాణలో భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలు జరగనుండగా రాష్ట్రస్థాయిలో గోల్కొండలో సంబరాలు జరగనున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. 'పరాయి వలస పాలనను పారదోలి 1947 ఆగస్టు 15న భారతదేశం స్వయంపాలనను సాధించుకుంది. నిస్వార్థ పోరాట స్ఫూర్తి, దార్శనిక నాయకత్వం, త్యాగంతో కూడిన ప్రజల భాగస్వామ్యమే దేశానికి స్వాతంత్య్రాన్ని అందించాయి' అని మాజీ సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. '79 వసంతాలు పూర్తి చేసుకుని 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని చేసుకుంటున్న ఈ శుభసందర్భంలో దేశ సామాజిక న్యాయం, ఆర్థిక ప్రగతిని ప్రతి ఒక్కరూ పునశ్చరణ చేసుకోవాలి' అని గులాబీ బాస్ కేసీఆర్ తెలిపారు. ఫెడరల్ పాలనా విధానం, సెక్యులర్ స్ఫూర్తితో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం మరింత ముందుకు సాగేందుకు ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలను గుర్తించాల్సిన అవసరం ఉందని మాజీ సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. భవిష్యత్తులో దేశ పాలనలో భాగస్వామ్యం కానున్న నేటితరం మరింత జ్ఞానం, సహనం, దార్శనికతతో ముందడుగు వేసినప్పుడే స్వాతంత్య్ర ఉద్యమ త్యాగాల ఫలాలు ప్రతి గడపకు చేరుతాయని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంత్యక్రియలకు హాజరు తన కుటుంబంలో చోటుచేసుకున్న విషాద సంఘటనతో కేసీఆర్ స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా

టెలివిజన్ ఛానెళ్ల ప్రసారాల్లో ప్రకటనల సమయంపై ఉన్న కీలక నిబంధనను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. గంటకు 12 నిమిషాలు మాత్రమే ప్రకటనలు ప్రసారం చేయాలన్న పరిమితిని ఎత్తివేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. టీవీ, డిజిటల్ మీడియా మధ్య సమాన పోటీని ప్రోత్సహించడం, వ్యాపార సౌలభ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.1994 నాటి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నిబంధనల కింద 2006లో ఈ 12 నిమిషాల ప్రకటనల పరిమితిని ప్రవేశపెట్టారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు టీవీ ప్రసార రంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. 2006లో దేశంలో కేవలం 62 టీవీ ఛానెళ్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 900కు పైగా ఉందని గుర్తు చేసింది.ఆ రోజుల్లో అనలాగ్ పద్ధతిలో ఉన్న కేబుల్ టీవీ ప్రసారాల వల్ల ఛానెళ్ల సంఖ్య పరిమితంగా ఉండేది. కానీ, ఇప్పుడు కేబుల్ టీవీ రంగం పూర్తిగా డిజిటలైజ్ అయింది. డీటీహెచ్, కేబుల్ టీవీ, ఐపీటీవీ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు 300 నుంచి 500కు పైగా ఛానెళ్లను అందిస్తూ ప్రేక్షకులకు విస్తృత ఎంపికలు కల్పిస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో పోటీతత్వం గణనీయంగా పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది.భారత్‌లో టీవీ రంగం 'పే' లేదా 'ఫ్రీ-టు-ఎయిర్' ఛానెల్ అనే దానితో సంబంధం లేకుండా ప్రకటనల ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. మరోవైపు, డిజిటల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటనలపై ఎలాంటి కాలపరిమితి నిబంధన లేదు. ఈ అసమాన పోటీ

పారామౌంట్ స్కైడాన్స్ సంస్థ.. వార్నర్ బ్రోస్ డిస్కవరీని $110 బిలియన్ డాలర్లకు కొనుగోలు, విలీనం చేసే డీల్ లో భాగంగా వార్నర్ బ్రోస్ వద్ద ఉన్న సీఎన్ఎన్ న్యూస్ నెట్ వర్క్ సంస్థను విక్రయించే యోచనలో ఉన్నట్లు పారామౌంట్ స్కైడాన్స్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే పారామౌంట్ వద్ద సీబీఎస్, సీబీఎస్ న్యూస్ ఉండగా ఇప్పుడు సీఎన్ఎన్ కూడా తోడైతే ఇంటర్నేషన్ మీడియా మొత్తం దాదాపు ఒకే సంస్థ గొడుగు కిందకు వచ్చే అవకాశం ఉంది. దాంతో అమెరికాలోనే రెండు అతిపెద్ద వార్తా సంస్థలను కంట్రోల్ చేసే సంస్థగా పారామౌంట్ అవతరిస్తుందని ఇది పత్రికా స్వేచ్ఛకు ముప్పుగా పరిగణించాలని కోరుతూ కాలిఫోర్నియా అటార్నీ జనరల్ నేతృత్వంలో 12 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి.ఈ విలీనం కారణంగా మీడియా రంగంలో పోటీతత్వం తగ్గుతుందని.. ధరలు పెరుతాయని అమెరికాలోని 12 రాష్ట్రాల ప్రతినిధులు వాదిస్తున్నారు. ఈ మేరకు కోర్టులో లా సూట్ ను ఫైల్ చేశాయి. ఈ నేపథ్యంలో న్యాయ పరమైన అడ్డంకులను తొలగించుకునేందుకు సీఎన్ఎన్ వార్తా సంస్థను విక్రయించే యోచనలో ఉన్నట్లు పారామౌంట్ స్కై డాన్స్ సంస్థ లీగల్ అధికారి వెల్లడించారు. వార్నర్ బ్రోస్ సంస్థ విలీనంతో పారామౌంట్ సంస్థ మరింత విస్తరించనుంది. నెట్ ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్, యూట్యూబ్ లాంటి సంస్థలతో ఇది పోటీపడే అవకాశం ఉంది. ఇదే అంశంపై ఒరాకిల్ సంస్థ అధినేత లారీ ఎల్లిసన్ మాట్లాడుతూ.. సీఎన్ఎన్ సంస్థను విక్రయించడం ఓ ప్రత్యామ్నాయంగా పారామౌంట్ సంస్థ భావిస్తోందని అన్నారు. రెగ్యూలేటరీ, లీగల్ సవాళ్లను అధిగమించేందుకు పారామౌంట్ ముందున్న మార్గాల్లో ఇదీ ఒకటని అభిప్రాయపడ్డారు. మరోవైపు వార్నర్ బ్రోస్ ను కొనుగోలు, విలీనం చేయాలంటే పారామౌంట్ సంస్థకు ప్రధాన అడ్డంకిగా సీఎన్ఎన్ ఉన్నట్లు ఆ సంస్థ అభిప్రాయపడుతోంది. సీఎన్ఎన్ ను ఎలాగైనా త్యాగం చేసి వార్నర్ బ్రోస్ సంస్థను తమలో విలీనం చేసుకోవాలని పారామౌంట్ సంస్థ సిద్ధం అవుతోంది.ఇక ప్రపంచవ్యాప్తంగా ఎంటర్ టైన్ మెంట్

భారతదేశ స్వాతంత్య్ర పోరాట సమరంలో నిర్భయ విప్లవకారిణిగా నిలిచిన మేడమ్ బికాజీ కామా వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. అమరావతి, ఆగస్టు 13: భారతదేశ స్వాతంత్య్ర పోరాట సమరంలో నిర్భయ విప్లవకారిణిగా నిలిచిన మేడమ్ బికాజీ కామా వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. స్వదేశంలోనే కాకుండా సరిహద్దులు దాటించి, అంతర్జాతీయ వేదికలపై భారత స్వాతంత్య్ర కలను చాటిచెప్పిన గొప్ప దేశభక్తురాలు బికాజీ కామా అని ఆయన కొనియాడారు. బ్రిటిష్ వలసవాద పాలనలో మన దేశ గొంతుకను అణచివేస్తున్న తరుణంలో, ఆమె ప్రపంచం ముందు నిర్భయంగా నిలబడి భారతదేశపు స్వేచ్ఛ, గౌరవం, సార్వభౌమత్వం కోసం ధైర్యంగా గళమెత్తారని గుర్తుచేసుకున్నారు. 1907వ సంవత్సరంలో జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సదస్సులో మేడమ్ బికాజీ కామా చారిత్రాత్మకంగా తొలి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అణచివేతకు లొంగక, మౌనంగా ఉండటానికి నిరాకరించిన భారత జాతి ఆత్మగౌరవానికి ఆ పతాకావిష్కరణ ఒక శక్తివంతమైన చిహ్నంగా నిలిచిందని తెలిపారు. ఆమె చూపిన తెగువ, దార్శనికత.. నేటికీ మన దేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి తరానికీ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

ముంబై సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణ జిల్లా సీఐడీ కోర్టుకు కుక్కల విద్యాసాగర్ బుధవారం హాజరయ్యారు. విజయవాడ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ముంబై సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణ జిల్లా సీఐడీ కోర్టుకు కుక్కల విద్యాసాగర్ ఈరోజు(బుధవారం) హాజరయ్యారు. ఈ కేసులో జత్వానీ సోదరుడు, తల్లిదండ్రులు పేర్లు తొలగించటంపై లిఖిత పూర్వకంగా తన అభ్యంతరాలను సీఐడీ కోర్టుకు విద్యాసాగర్ అందజేశారు. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి సీఐడీ కోర్టు వాయిదా వేసింది. తనను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూల్ చేయటంతో జత్వానీ తల్లిదండ్రులు, తమ్ముడి పాత్ర ఉందని కుక్కల విద్యాసాగర్ వెల్లడించారు. కొంత డబ్బును జత్వానీ తల్లి ఆశా జత్వానీ అకౌంట్‌కు బదిలీ చేశానని తెలిపారు. కొన్నిసార్లు జత్వానీ తల్లి ఫోన్ చేసి తన కుమార్తె చెప్పినట్లుగా చేయాలని లేకపోతే ఇబ్బంది పడతావని బెదిరించిందని అన్నారు. దుబాయ్‌లో ఉన్న జత్వనీ సోదరుడు అంబరీష్ కి నేరగాళ్లతో సంబంధం ఉందని బెదిరించారని చెప్పుకొచ్చారు. ఈ ముగ్గురిని కేసు నుంచి తీయటానికి అనుమతించవద్దని కుక్కల విద్యాసాగర్ కోరారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి: సీఎం చంద్రబాబు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్, ఆగస్టు 12: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాలని ఎద్దేవా చేశారు. నిజమైన స్టార్టప్‌లు ఎదగాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలని తాము కష్టపడి ‘T-Hub’ను నిర్మిస్తే... సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన కుటుంబ ప్రయోజనాల కోసం ‘అనుముల హబ్స్’ ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఇది ఫ్యామిలీ-రన్.. ఫ్యామిలీ-డ్రైవ్.. జీరో ఇన్నోవేషన్.. జీరో ఎంప్లాయీస్ స్కామ్ అంటూ ఆరోపించారు. అనుముల సోదరుల్లో ఒకరైతే చాలు.. ఎటువంటి ప్రశ్నలు లేకుండా వందల కోట్లు విలువైన భూములు దక్కించుకోవచ్చంటూ సెటైర్ విసిరారు. ‘సున్నా పెట్టుబడితో ‘Tesseract Advanced Systems Pvt Ltd’ అనే డిఫెన్స్ కంపెనీ పెట్టి, రాత్రికి రాత్రే కనీసం రూ.200 కోట్ల లాభం ఆర్జించినందుకు ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాల్సిందే. శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి.. తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు కూడా ఈ అద్భుతమైన ‘బిజినెస్ మోడల్’ ఏంటో నేర్పించండి. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఇంత చౌకగా ఎలా పొందాలో శిక్షణ ఇవ్వండి. ఈ మ్యాజిక్ ట్రిక్ కేవలం అనుముల కుటుంబానికే ఎందుకు పరిమితం కావాలి? తెలంగాణ యువత మొత్తానికి ఈ ‘అనుముల హబ్’ అవకాశాన్ని కల్పించండి’ అంటూ ఎక్స్‌లో కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. దోమల నివారణకు పురుగుమందు పిచికారీ.. కాసేపటికే ఇద్దరి మృతి విశాఖలో నీటి కొరతపై ముందస్తు చర్యలు: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్

న్యూఢిల్లీ: మమతా బెనర్జీ మేనల్లుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కంటి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పదహారు కేసులున్న కారణంగా అతడు తిరిగి రాడేమో అన్న కలకత్తా హైకోర్టు అభ్యంతరాలను తోసిపుచ్చింది. విదేశీ టూర్‌కు అనుమతి నిరాకరిస్తూ ఆగస్టు 5న ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తనకు నచ్చిన వైద్యం చేయించుకునే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని వ్యాఖ్యానించిన బెంచ్ పర్యటన వివరాలతోపాటు ఎక్కడెక్కడ బస చేసేదీ వివరంగా దర్యాప్తు సంస్థలకు తెలపాలని ఆదేశించింది. ఈ వివరాలను గోప్యంగా ఉంచాలని స్పష్టం చేసింది. అభిషేక్ బెనర్జీ విదేశాలకు వెళ్లిన తరువాత తిరిగి రాకపోవచ్చు అని బెంగాల్ ప్రభుత్వం తరఫున అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనను బెనర్జీ తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ఖండించారు. చదవండి: 'మొయిత్రాకు ఏమైనా జరిగితే ఆ జడ్జిదే బాధ్యత' మమత వర్గం నిరసనలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో అంతర్గత విభేదాలు మరో ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. మమతా బెనర్జీకి చెందిన వర్గం అసెంబ్లీ ఆవరణలో సోమవారం చేపట్టిన నిరసనలో తిరుగుబాటు రితబ్రత వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పాలుపంచుకున్నారు. ఆదివారం మమత కంచ్రాపారలో పోలీస్ కస్టడీలో చనిపోయిన టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లగా రాళ్లు, కర్రలతో కొందరు ఆమెపైకి దాడికి యత్నించడం తెల్సిందే. ఈ ఘటనను నిరసిస్తూ మమత వర్గం ఎమ్మెల్యేలు చేపట్టిన ఆందోళనలో రితబ్రత వర్గంలోని ఎమ్మెల్యేలు అబ్దుల్ ఖలేక్ మొల్లా, తౌసిఫుర్ రహ్మాన్, బిభాస్ సర్దార్ పాల్గొన్నారు. తాము రితబ్రత వర్గంలో కొనసాగుతున్నామంటూనే, మమతపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. మమత సారథ్యంలోని టీఎంసీ గెలుచుకున్న 80 సీట్లకు గాను 65 మంది అనంతరం
చూస్తుండగానే కూలిపోయిన వంతెన ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా నీతి వ్యాలీలో ఘోర ప్రమాదం జరిగింది. తమక్ నాళా (Tamak Drain) వద్ద ఒక్కసారిగా వచ్చిన ఆకస్మిక వరద (Flash Flood) ధాటికి నీతి-మలారీ రోడ్డుపై ఉన్న కీలకమైన బెయిలీ వంతెన కొట్టుకుపోయింది. ఈ ఘటనలో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) డోజర్, మరో వాహనం వరద నీటిలో కొట్టుకుపోగా, ఒక డ్రైవర్ గల్లంతయ్యాడు. వంతెన ధ్వంసమవ్వడంతో సుమారు 15-16 గ్రామాలకి కీలకమైన మార్గం మూసుకుపోయినట్లు అయింది. స్థానిక యంత్రాంగంతో పాటు SDRF, NDRF, ITBP బలగాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు, రహదారి పునరుద్ధరణ పనులు వేగవంతం చేశాయి. ఈ వార్తకు సంబంధించిన

దేశీయ ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రైవేట్ టెలికాం సంస్థలకు సవాలు విసురుతూ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో వ్యూహాత్మక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకు అతితక్కువ ధరకే వేగవంతమైన ఇంటర్నెట్తో పాటు అపరిమిత వినోదాన్ని అందించేందుకు రూ.999 ప్లాన్‌ను అధికారికంగా ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ఎక్స్ వేదికగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ ఫైబర్ (ఎఫ్టీటీహెచ్) బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో నెలకు 200 Mbps గరిష్ట వేగంతో ఏకంగా 5000GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీనికి తోడు దేశవ్యాప్తంగా ఉచితంగా అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. డిజిటల్ కంటెంట్ ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ఈ ప్లాన్‌తో ఉచితంగా JioHotstar, Sony LIV, ZEE5, Hungama OTT, Shemaroo OTT వంటి ప్రముఖ వినోద ప్లాట్‌ఫారమ్‌ల మెంబర్‌షిప్‌లను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఓటీటీ ప్రియుల కోసం బీఎస్ఎన్ఎల్ మరొక ప్రత్యేక ‘ఫ్రీడమ్ ఆఫర్’ను కూడా ప్రవేశపెట్టింది. దీనికింద కొత్త, పాత ఎఫ్టీటీహెచ్ కస్టమర్లు కేవలం రూ.150లకే (సాధారణ ధర రూ.199) Sony LIV, JioHotstar, ZEE5 సభ్యత్వాలను 30 రోజుల పాటు పొందే వెసులుబాటు ఉంది. అంతేకాకుండా, మొబైల్ వినియోగదారుల కోసం కేవలం రూ.51కే కొత్త సిమ్ కార్డ్‌తో పాటు నెలకు రోజుకు 2GB డేటా, రోమింగ్‌తో సహా ఉచిత కాలింగ్, రోజుకు 100 SMSలు అందించే ఆఫర్ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. 'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు) హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) ప్రియాంక ఘటనపై జూపల్లి కృష్ణ రావు సంచలన వ్యాఖ్యలు నీకు దమ్ముంటే నీ కొడుకుని రాజీనామా చేయమని చెప్పు మా జగనన్న సీఎం అయ్యాక.. ఫస్ట్ ఓపెన్ చేసేది DSCఫైలే.. పేర్ని కిట్టు వార్నింగ్

భారత్ తన 80వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న వేళ నింగి నుంచి ఒక అరుదైన, అద్భుతమైన శుభాకాంక్షల సందేశం అందింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న రష్యా వ్యోమగాములు మన జాతీయ జెండాను చేతిలో పట్టుకుని భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న బలమైన స్నేహ బంధానికి, అంతరిక్ష పరిశోధనల్లో భాగస్వామ్యానికి ఈ ప్రత్యేక సందేశం నిదర్శనంగా నిలిచింది.గగనతలంలో మువ్వన్నెల మెరుపులుఅంతరిక్ష కేంద్రంలో ఉన్న రష్యన్ కాస్మోనాట్ ప్యోటర్ ద్యూబ్రోవ్, తోటి వ్యోమగాములతో కలిసి ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భారత త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ప్రదర్శిస్తూ, ప్రియమైన భారతీయ మిత్రులారా.. మీకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మన దేశ ప్రజలు ఎల్లప్పుడూ శాంతి, సౌభాగ్యాలతో వికసించాలని ఆకాంక్షించారు. ఇంతటి ఘనమైన పిలుపా! ఆగస్టు 15 ఎట్ హోమ్ కార్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే..యూరీ గగారిన్ జ్ఞాపకాలు.. ఆర్యభట్ట నుండి రాకేష్ శర్మ వరకుమానవుడు తొలిసారి అంతరిక్షంలోకి అడుగుపెట్టి 65 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 1961లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడు యూరీ గగారిన్, ఆ తర్వాత భారత్‌లో పర్యటించినప్పుడు అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఎంత అందంగా ఉందో, భూమిపై ఇక్కడి ప్రజల మైత్రి అంతకంటే అద్భుతంగా ఉంది అని కొనియాడిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 1975లో భారత్ పంపిన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగానికి సోవియట్ యూనియన్ అందించిన సహకారం, 1984లో రష్యన్ నౌక ద్వారా రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన చారిత్రక ఘట్టాలను వ్యోమగాములు గుర్తుచేసుకున్నారు.మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు రోజు 1947 ఆగస్టు 14న ఏం జరిగింది?గగన్‌యాన్ దిశగా కొత్త అధ్యాయంభారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా ఇరు దేశాల బంధం మరో కొత్త మైలురాయిని చేరుకుందని వ్యోమగామి

ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్న ఎలాన్ మస్క్ సంపద గత ఏడాది కాలంలో అసాధారణంగా పెరిగింది. 2025 జులై నుంచి 2026 జులై మధ్య ఆయన సంపద ఏకంగా 319.5 బిలియన్ డాలర్లు పెరిగిందని ఒక నివేదిక వెల్లడించింది. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్న ఎలాన్ మస్క్ సంపద గత ఏడాది కాలంలో అసాధారణంగా పెరిగింది. 2025 జులై నుంచి 2026 జులై మధ్య ఆయన సంపద ఏకంగా 319.5 బిలియన్ డాలర్లు పెరిగిందని ఒక నివేదిక వెల్లడించింది. అంటే సగటున రోజుకు సుమారు 875 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8300 కోట్లు) చొప్పున సంపద పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి (Elon Musk net worth). ఎలాన్ మస్క్ సంపద ప్రధానంగా టెస్లా, స్పేస్ఎక్స్ వంటి సంస్థల్లో ఆయనకు ఉన్న వాటాల విలువతో ముడిపడి ఉంటుంది. గతేడాది కాలంలో ఈ కంపెనీల మార్కెట్ విలువల్లో భారీ పెరుగుదల చోటుచేసుకోవడంతో మస్క్ నికర సంపద కూడా వేగంగా పెరిగింది. ముఖ్యంగా స్పేస్ఎక్స్ ఐపీవో మస్క్ సంపదను సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది (Elon Musk $875 million per day). స్పేస్ ఎక్స్ ఓపీవోకు అంచనాలకు మించిన డిమాండ్ రావడంతో మస్క్ సంపద ట్రిలియన్ డాలర్లను దాటింది (Elon Musk fortune). అయితే ఆ తర్వాత ఆ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కారణంగా మస్క్ సంపద కూడా భారీగా తగ్గింది. మస్క్ తర్వాత, డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్ అతి ఎక్కువ సంపదను పోగేసిన వ్యక్తిగా నిలిచారు. 2025 జులై నుంచి 2026 జులై మధ్య డెల్ తన సంపదకు 107.6 బిలియన్ డాలర్లను జోడించారు. తమిళ్ తాయ్ వాజ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం.. సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ

భారత్‌లో పెద్దగా పరిచయం లేని సెపక్ టక్రా గేమ్స్‌లో మన జట్టు మరోసారి సత్తా చాటింది. ఆసియాగ్నేసియా ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన సెపక్ టక్రా గేమ్‌లో భారత్ తాజాగా కాంస్య పతకం సాధించింది. థాయ్‌లాండ్ వేదికగా జరిగిన కింగ్స్ కప్ సెపక్ టక్రా చాంపియన్‌షిప్‌లో పురుషుల క్వాడ్రాంట్ (నలుగురు ఆటగాళ్లు కలిసి) ఈవెంట్లో భారత్ ఈ పతకాన్ని గెలుచుకుంది. టోర్నీలో భాగంగా సెమీఫైనల్లో భారత్ 15-9, 9-15, 9-15తో ఆతిథ్య థాయ్‌లాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగిన పోరులో భారత ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించడం విశేషం. ఈ విజయంతో భారత్ ఆసియా గేమ్స్‌లో పతకం ఆశలు రేపుతోంది. ఎందుకంటే సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడల్లో సెపక్ టక్రా గేమ్ ఉండడమే దీనికి కారణం. ప్రతిష్టాత్మ ఆసియా క్రీడల్లో సెపక్ టక్రాలో భారత్ పతకం సాధించాలని ఆశిద్దాం. ఏమిటీ సెపక్ టక్రా? సెపక్ టక్రా లేదా సెపక్ట క్రా అనేది ఆగ్నేయాసియాకు చెందిన ప్రసిద్ధ క్రీడ. దీనిని బ్యాడ్మింటన్ కోర్టును పోలిన కోర్టులో ఇరు జట్ల నుంచి రెండు నుంచి నలుగురు ఆటగాళ్లు ఆడడం జరుగుతుంది. ఇక మ్యాచ్‌లో బెత్తన్ లేదా ప్లాస్టిక్‌తో చేసిన బంతిని ఉపయోగిస్తారు. ఈ ఆటలో బంతిని తాకడానికి ప్లేయర్లు తమ పాదాలు, మోకాలు, భుజాలు, ఛాతీ, తలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే సెపక్ టక్రా గేమ్ వాలీబాల్, ఫుట్‌బాల్‌ను పోలి ఉంటుంది. సెపక్ టక్రాను మలేషియా జాతీయ క్రీడగా పరిగణిస్తారు. అయితే ఇదే క్రీడను పలు దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. మలేషియాలో సెపక్ టక్రా, ఇండోనేషియాలో సెపక్ రాగా, థాయ్‌లాండ్‌లో టక్రా, మయన్మార్‌లో చిన్లోన్, ఫిలిప్పీన్స్‌లో సిపా, లావోస్‌లో లతావ్, కంబోడియాలో సెక్ డై, వియత్నాంలో కౌ మే వంటి పేర్లతో పిలుస్తుంటారు. పేర్లు ఏదైనా ఆట మాత్రం అన్నింటిలో అదే విధంగా ఉంటుంది. ఇక 1965లో కౌలలంపూర్‌లో జరిగిన

ఎలుగుబంటిని రక్షించిన సైన్యం... వీడియో వైరల్! ఈ వార్తకు సంబంధించిన
బ్రకోలీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. బ్రకోలీ తినడం వల్ల చిన్న, చిన్న రోగాలతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుందని హెల్త్‌లైన్ తెలిపింది. బ్రకోలీలో ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బ్రకోలీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్రకోలీ తింటే మలబద్దకం, అజీర్తి తగ్గుతుంది. బ్రకోలీలో కాల్షియం, విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకల సాంద్రతను పెంచుతాయి. బ్రకోలీ తింటే బలహీన ఎముకల సమస్య తగ్గుతుంది. బ్రకోలీలో ల్యుటిన్, జియాంక్సితిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. బ్రకోలీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్రకోలీ తింటే అందం రెట్టింపు అవుతుంది. బ్రకోలీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన ఫీల్ అందిస్తుంది. బ్రకోలీలో కేలరీలు కూడా తక్కువే. ఫలితంగా వేగంగా బరువు తగ్గొచ్చు. బ్రకోలీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. బ్రకోలీ తింటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. బ్రకోలీలో ఉండే సల్పోరాఫేన్ అనే సమ్మేళనం బాడీలో టాక్సిన్లను తొలగిస్తుంది. బ్రకోలీ తింటే శరీరంలో మలినాలు తొలగి శరీరం శుద్ది అవుతుంది

టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వరుస గాయాలపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) హెడ్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఆల్‌రౌండర్‌గా నితీశ్‌పై అధికంగా ఉండే వర్క్‌లోడ్‌ను ఎలా సమర్థంగా నిర్వహించాలో అతడితో చర్చిస్తున్నామని చెప్పాడు. ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వరుస గాయాలపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) హెడ్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఆల్‌రౌండర్‌గా నితీశ్‌పై అధికంగా ఉండే వర్క్‌లోడ్‌ను ఎలా సమర్థంగా నిర్వహించాలో అతడితో చర్చిస్తున్నామని చెప్పాడు. గాయాలు ఆటలో భాగమేనని, అయితే వాటి నుంచి త్వరగా కోలుకునేందుకు ఆటగాళ్లు తమ ఫిట్నెస్ను మెరుగ్గా నిర్వహించుకోవాలని సూచించాడు. ఇటీవల పలువురు భారత ఆటగాళ్లు గాయాలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సీఓఈని సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న రిహాబిలిటేషన్, ఇంజూరీ మేనేజ్మెంట్ను సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ నితీశ్ విషయంలో సీఓఈ అనుసరిస్తున్న విధానాన్ని వివరించాడు. నితీశ్ ఇటీవల తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వే సిరీస్‌లకు అతడు దూరమైన సంగతి తెలిసిందే. ‘ఆల్‌రౌండర్‌గా నితీశ్‌పై ఎక్కువ వర్క్‌లోడ్ ఉంటుంది. మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలోనే కాకుండా, జట్టులో లేని విరామ సమయాల్లోనూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి. గాయాలు ఆటలో భాగమే. అయితే ఆల్‌రౌండర్‌గా తనపై ఉన్న భారాన్ని ఎలా సమర్థంగా నిర్వహించుకోవాలో అతడు తెలుసుకోవాలి. ప్రస్తుతం క్రికెట్లో ప్లేయర్లకు పెద్దగా ఆఫ్-సీజన్ ఉండటం లేదు. ఐపీఎల్, రాష్ట్ర జట్టు తరఫున క్రికెట్ ఆడటం, దేశవాళీ టోర్నీలు, అంతర్జాతీయ మ్యాచ్‌లతో ఆటగాళ్లు బిజీగా ఉంటున్నారు. అందువల్ల మ్యాచ్‌ల మధ్య లభించే స్వల్ప విరామాలను ఫిట్నెస్ మెరుగుపర్చుకునేందుకు సమర్థంగా వినియోగించుకోవాలి’ అని లక్ష్మణ్ సూచించాడు. సీజన్‌కు ముందు ప్రత్యేక ఫిట్నెస్ పరీక్షలు.. సీజన్ ప్రారంభానికి ముందు కాంట్రాక్ట్ ఆటగాళ్లతో పాటు భవిష్యత్తులో జట్టుకు ఎంపికయ్యే క్రికెటర్లకు పలు ఫిట్నెస్

VVS Laxman: బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE) గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిపోయింది. భారత జట్టుకు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు గాయాల పాలై రిహాబిలిటేషన్ కోసం ఈ సెంటర్లో చేరుతుండటం, అక్కడ కోలుకుని వెళ్లిన కొంతకాలానికే మళ్లీ గాయపడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో భారత మాజీ దిగ్గజం, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ CoEకి మద్దతుగా నిలిచారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. CoE పాత్ర కేవలం గాయపడిన ఆటగాళ్లకు చికిత్స అందించడం లేదా రిహాబిలిటేషన్‌కే పరిమితం కాదని, ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరిచేందుకు సహాయపడటంలో దీని పాత్ర మరింత పెద్దదని స్పష్టం చేశారు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన సమయంలో యంగ్ పేసర్ హర్షిత్ రాణా బరువు దాదాపు 97 కిలోగ్రాములు ఉందనే వార్తలు ఇటీవల సంచలనం సృష్టించాయి. సరైన ఫిట్నెస్ లేకుండానే అతనిని ఆడేందుకు అనుమతించడం వల్ల మైదానంలో దిగిన తర్వాత మళ్లీ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడి తిరిగి CoE బాట పట్టాల్సి వచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, వరుణ్ చక్రవర్తి సహా దాదాపు 13 నుంచి 14 మంది కీలక ఆటగాళ్లు ఈ సెంటర్లో రిహాబ్ ప్రక్రియలో ఉన్నారు. బుమ్రా, సాయి సుదర్శన్ శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్‌కు కూడా గాయాల కారణంగా దూరమయ్యారు. ఆటగాళ్ల ఫిట్నెస్ నిబంధనలపై లక్ష్మణ్ వివరాలు వెల్లడించారు. సుదీర్ఘమైన సిరీస్‌లు లేదా సిరీస్ మధ్యలో ఆటగాళ్లకు యో-యో టెస్ట్ నిర్వహించడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని ఆయన తెలిపారు. అందుకే ఆటగాళ్ల మ్యాచ్ ఫిట్నెస్ను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి అడ్రియన్ రూపొందించిన బ్రోంకో టెస్ట్‌ను తీసుకువచ్చినట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ఒక ఆటగాడు మైదానంలో ఆడేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాడో మేనేజ్మెంట్కు స్పష్టమైన సమాచారం లభిస్తుందని తెలిపారు. జస్ప్రీత్

Tirumala: తిరుమలలో నకిలీ ఆధార్లతో రూమ్స్ దళారీల అరెస్ట్ తిరుమల: తిరుమలలో భక్తులకు కేటాయించే గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అక్రమంగా పొందుతూ అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠాను తిరుమల II టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సంయుక్తంగా అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, ఐపీఎస్ ఆదేశాల మేరకు తిరుమలలో రూమ్ దళారీల అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తిరుమల CRO కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురిని పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి, వాటిలో ఫొటోలను మార్ఫింగ్ చేసి టీటీడీ CROలో గదులు పొందుతున్నట్లు గుర్తించారు. అనంతరం ఆ గదులను గదులు లభించని భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తానికి విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అలాగే తిరుమల PAC-5 వద్ద ఛార్జింగ్‌కు ఉంచిన భక్తుల సెల్ఫోన్లను దొంగతనం చేసినట్లు కూడా నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో *బి. శ్రీనివాస్ (46), ఇరప్ప కాలప్ప (43), విష్ణు వర్ధన్ (33), అమూల్ కుమార్ సింగ్ (27), ఎస్. ప్రకాష్ (39), పి. సందీప్ (20)*లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గది బుకింగ్‌లు, నకిలీ గుర్తింపు పత్రాల తయారీకి ఉపయోగించిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 6న PAC-5 వద్ద చోరీకి గురైన రెండు సెల్ఫోన్లను కూడా పోలీసులు రికవరీ చేశారు. నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తిరుమలలో గదులను టీటీడీ అధికారిక కౌంటర్లు, అధికారిక ఆన్లైన్ విధానాల ద్వారా మాత్రమే పొందాలని పోలీసులు

Veldanda: ఘనంగా తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కోడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న అభివృద్ధి ప్రధాత పెద్దలు తిరుపతి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తిరుపతి రెడ్డి అమ్మమ్మ గారు ఊరు లింగారెడ్డి పల్లి గ్రామంలో సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా ఆధ్వర్యంలో తాను చిన్నప్పుడు తప్పటడుగులు వేసినా అమ్మమ్మ స్వగ్రామం గ్రామంలో అభిమానులు నాయకులు కార్యకర్తలు ప్రజలు సమక్షంలో కేకు కట్ చేసి సంబరం చేసుకున్నారు ఈ సందర్భంగా టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో , పెద్దలు కుపిరెడ్డి రాఘవరెడ్డి మైల సుధాకర్ రెడ్డి గ్రామ ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య వార్డు సభ్యులు వట్టెపు అల్లాజి, మల్లేపాకుల పుష్పమ్మ, అకినమోని మల్లేష్, మహ్మద్ జావీద్, నేతలు మల్లేపాకుల శేఖర్, ముడి లక్ష్మయ్య, ఐనాల దేవదానం, పబ్బు నిరంజన్, కొప్పు దానయ్య, మహ్మద్ రహీం, పబ్బు కాశన్న, పబ్బు శ్రీకాంత్, జోగు ఆదాము, మల్లేపాకుల లాజర్, జోగు ప్రశాంత్, జోగు లింగమయ్య, జోగు దేవయ్య మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు