
Anand Deverakonda: అందుకే ఎంతో నమ్మి ఈ సినిమా చేశా.. ఇప్పుడు ఆడియన్స్‌కు కూడా నచ్చుతుంది
Anand Deverakonda: అందుకే ఎంతో నమ్మి ఈ సినిమా చేశా.. ఇప్పుడు ఆడియన్స్‌కు కూడా నచ్చుతుంది
© 2026 nimisham.in

Anand Deverakonda: అందుకే ఎంతో నమ్మి ఈ సినిమా చేశా.. ఇప్పుడు ఆడియన్స్‌కు కూడా నచ్చుతుంది

Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి నాలుగో పాట ‘సబ్కో’ నేడు విడుదలైంది. ఇప్పటికే సినిమాపై, ఆల్బమ్‌లోని పాటలపై మంచి ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో విడుదలైన ఈ పాట మరింత ఉత్సాహభరితమైన మ్యూజికల్ ఫ్లేవర్‌ను అందిస్తోంది. అత్యంత ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ‘సబ్కో’ పాటను సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ ఆలపించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన ఆకట్టుకునే స్వరకల్పన పాటకు ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వైబ్‌ను తీసుకొచ్చింది. ఈ పాటకు శ్రీ హర్ష ఇమాని సాహిత్యం అందించారు. గుంటూరులోని VVIT కాలేజీలో విద్యార్థుల ఉత్సాహభరిత సమక్షంలో ‘సబ్కో’ పాటను విడుదల చేశారు. విద్యార్థుల సందడి, ఉత్సాహంతో పాట లాంచ్ కార్యక్రమం ఎంతో జోష్‌గా, ప్రత్యేకంగా జరిగింది. ఇప్పటికే ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’కు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తుండగా, తాజాగా విడుదలైన ‘సబ్కో’ పాట ఆ క్రేజ్‌ను మరింత పెంచుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం విస్తృత స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు కాలేజీలు, నగరాలను సందర్శిస్తూ విద్యార్థులతో ప్రత్యేకంగా మమేకమవుతున్నారు. మరోవైపు వరుసగా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నారు. చిత్ర బృందం చేస్తున్న ఈ విస్తృత ప్రచారం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై మరింత ఆసక్తిని పెంచుతోంది. డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ (EPIC – First Semester). యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ (EPIC – First Semester). బేబి వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ ఒకటవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సబ్కో అనే యూత్‌ఫుల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ హెషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన ఈ మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీ హర్ష ఈమాని రాసిన సాహిత్యం, సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ల పవర్ ఫుల్ వాయిస్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కాలేజ్ లైఫ్, పార్ట్-టైమ్ జాబ్స్, ఫ్రెండ్షిప్, ఫన్ ఎలిమెంట్స్‌ను ఆవిష్కరిస్తూ ఈ పాటను ఎంతో కలర్ఫుల్గా చిత్రీకరించారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ఎంటర్టైనర్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించబోతోంది. 90's వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా ఎపిక్ రాబోతుంది. అసలు చదువు రాని కుర్రాడు.. విదేశాలకు ఎలా వెళ్ళాడు..? అక్కడ అమ్మాయితో ప్రేమ, కెరీర్ ని ఎలా సక్సెస్ గా మార్చాడు అనేది ఎపిక్ కథగా తెలుస్తోంది. ఇకపోతే ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమాతో బేబీ జంట మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటుందో లేదో

అందరూ ఫౌజీ, విశ్వంభర, టాక్సిక్ అంటూ బడా సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు కానీ రాబోయే రెండు నెలల్లో చాలా క్యూట్ క్యూట్ లవ్ స్టోరీస్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. అందులో కొన్ని సినిమాల్లో మిడ్ రేంజ్ హీరోలుంటే.. మరికొన్నింట్లో చిన్న హీరోలే ఉన్నారు. కానీ ఆ సినిమాలన్ని పెద్ద బ్యానర్స్ నుంచే రాబోతున్నాయి. మరి ఆ ప్రేమకథలపై ఓ లుక్కేద్దామా..? ఎపిక్: ది ఫస్ట్ సెమిస్టర్.. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాబోయే ఈ క్యూట్ లవ్ స్టోరీలో బేబీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్నారు. ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఎపిక్పై మంచి ఆసక్తే ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న రానుంది. అలాగే ఇదే బ్యానర్ నుంచి వస్తున్న మరో క్యూట్ ప్రేమకథ వీసా. గల్లా అశోక్, గౌరీ ప్రియా నటిస్తున్న ఈ సినిమాను ఉద్భవ్ తెరకెక్కిస్తున్నారు. వీసా అంటే వింటారా సరదాగా అని అర్థం.. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 17న విడుదల కానుంది వీసా. అలాగే ఇదే సీజన్లో రానున్న మరో క్యూట్ లవ్ స్టోరీ రోమాంచకం. సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. వేణు గోపాల్ రెడ్డి తెరకెక్కిస్తున్న రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న విడుదల కానుంది. కథ నచ్చి ఈ సినిమాను నిర్మిస్తున్నారు సందీప్ వంగా. కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే కాదు.. అల్లరి నరేష్ కామెడీ ఎంటర్టైనర్ రంభ ఊర్వశి మేనక సెప్టెంబర్ 4న విడుదల కానుంది. దాంతో పాటే మహేంద్రగిరి వారాహి, సిగ్మా, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ ఇదే సీజన్లో వస్తున్నాయి. పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా

ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య (vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' చిత్రం నుంచి మూడో పాటను విడుదల చేశారు. ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య (vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'(Epic). ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరకర్త. ఈ చిత్రం నుంచి ‘మనసా వాచా’ అంటూ సాగే లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. మెలోడీకి ప్రాధాన్యమిస్తూ ఆయన రూపొందించిన బాణీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాయని కె.ఎస్. చిత్ర, ఎస్.పీ. చరణ్ తమ విలక్షణమైన గాత్రంతో ఈ పాటకు మరింత ప్రాణం పోశారు. శ్రీ హర్ష ఈమని అందించిన సాహిత్యం కూడా పాటకు ప్రధాన బలంగా నిలిచింది. యూత్‌ఫుల్ కంటెంట్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది

మలయాళంలో వచ్చిన 'సూడానీ ఫ్రమ్ నైజీరియా' సినిమా ఇది. కేరళలోని ఓ లోకల్ ఫుట్‌బాల్ టీమ్‌లో ఆడే నైజీరియా ప్లేయర్ గాయపడతాడు. అతడిని ఓ కుటుంబం తమ ఇంట్లో ఉంచి చూసుకుంటుంది. అన్ని వయసుల వారు చూసేలా 'U' సర్టిఫికెట్ కూడా పొందింది. ఆహాలో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఓ చిన్న ఊరిలో టిఫిన్ సెంటర్ నడిపే రాఘవ, నగరంలో సొంతంగా హోటల్ ప్రారంభించాలని కలలు కంటాడు. ప్రేమ, కుటుంబం, వ్యాపారం, ఆర్థిక ఇబ్బందులు వంటి మధ్యతరగతి జీవితాన్ని కామెడీతో చూపించే ఈ తెలుగు సినిమా ఇది. ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. 1980ల నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ ఊరిలో దాచిపెట్టిన పురాతన నిధి కోసం ఓ విచిత్రమైన పోలీస్ అధికారి వెతుకుతుంటాడు. ఈ క్రమంలో దొంగల ముఠాతో తలపడతాడు. ఫాంటసీ, అడ్వెన్చర్, కామెడీ, మిస్టరీ కలగలిపిన ఈ కన్నడ సినిమా ప్రైమ్ వీడియో, ఆహా లలో అందుబాటులో ఉంది. కన్నడలో వచ్చిన 'కవలుదారి' ఒక డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. బెంగళూరులో రోడ్డు విస్తరణ పనుల్లో కొన్ని పాత అస్థిపంజరాలు బయటపడతాయి. దీంతో చాలా ఏళ్ల క్రితం జరిగిన ఓ మిస్టరీ కేసు మళ్లీ తెరపైకి వస్తుంది. ఆ తర్వాత ఓ పోలీస్ అధికారి చేసే దర్యాప్తే ఈ కథ. తమిళ డబ్బింగ్ వెర్షన్లో కూడా అందుబాటులో ఉన్న ఈ సినిమా, థ్రిల్లర్ ప్రియులతో కలిసి చూడటానికి మంచి ఛాయిస్. ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఓ అమ్మాయి పెళ్లి నిశ్చితార్థం కోసం కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరతారు. కానీ, ఆ ఒక్క ఈవెంట్ చుట్టూ కుటుంబంలో వచ్చే అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న గొడవలు, సరదా సంఘటనలతో కథ మొత్తం సందడిగా సాగుతుంది. సోనీ లివ్ లో అందుబాటులో ఉంది

బోనాల పండుగ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. పండుగ వేళ అమ్మవారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆలయాలకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), ఆయన సోదరుడు, హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) లాల్‌దర్వాజా మహంకాళి (Lal Darwaza Mahankali Temple) అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించారు. విజయ్ దేవరకొండ ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దర్శనం పూర్తి చేసుకుని ఆలయం నుంచి బయటకు వచ్చిన విజయ్ను చూసేందుకు యువత, అభిమానులు ఆసక్తి చూపించారు. ఆయనను తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. విజయ్ కూడా అభిమానుల వైపు చేతులు ఊపుతూ వారిని పలకరించారు. దీంతో కొద్దిసేపు ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. విజయ్ దేవరకొండతో పాటు ఆనంద్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కనిపించడంతో అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది. వారిని చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆలయం చుట్టుపక్కల సందడిగా మారింది