
© 2026 nimisham.in

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్పిరిట్’. ఈ మూవీ షూటింగ్ అప్డేట్ని దర్శకుడు తెలిపారు.
రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్పిరిట్’ (Spirit). ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన విజయాల తర్వాత సందీప్ తెరకెక్కిస్తోన్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్లోనే కాక పాన్ ఇండియా రేంజ్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ విశేషాలు, ప్లానింగ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘స్పిరిట్’ సినిమా అవుట్‌పుట్ అత్యంత అద్భుతంగా వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ శైలి కాస్త భిన్నంగా ఉండబోతోందని వెల్లడించారు. సుమారు 5 రోజుల పాటు నిరంతర షూటింగ్ నిర్వహించిన తర్వాత, దాదాపు ఒక నెల రోజుల పాటు బ్రేక్ తీసుకునే ప్రత్యేకమైన ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ గ్యాప్‌లో సీన్ల క్వాలిటీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, తదుపరి షెడ్యూల్ పక్కాగా ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో అసలు సందీప్ వంగా ఏం చెక్కుతున్నాడో అంటూ ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం ఇప్పటికే ఫిలింనగర్లో హల్చల్ చేస్తోంది. సందీప్ రెడ్డి వంగా మార్క్ ఇంటెన్స్ డ్రామా, ప్రభాస్ మాస్ ఇమేజ్ కలగలిపి రాబోతున్న ఈ ‘స్పిరిట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. సందీప్ పంచుకున్న ఈ షూటింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే..
స్వాతంత్య్ర దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ ఇచ్చే ట్రీట్ ఇదే!
బర్త్‌డే స్పెషల్.. నటవారసుల్లో మహేష్ బాబు స్థాయే వేరు!
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.





