
ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరిధిలోని వివిధ విభాగాల్లో సబ్- ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) సీపీఓ–-2026 నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 10న ప్రారంభం కాగా సెప్టెంబర్ 30 వరకు అప్లై చేయవచ్చు.
మొత్తం ఖాళీలు: 1871.
విభాగాల వారీగా ఖాళీలు: ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) – పురుషులు 205.
ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) - మహిళలు 112, కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ (జనరల్ డ్యూటీ): బలగాల వారీగా సీఆర్పీఎఫ్ 279, బీఎస్ఎఫ్ 503, ఐటీబీపీ 206, సీఐఎస్ఎఫ్ 275, ఎస్ఎస్బీ 187, సీఐఎస్ఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్ (ఫైర్)– పురుషులు 252.
ఎలిజిబిలిటీ ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) విభాగాల్లో సబ్- ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ లేదా సమాన విద్యార్హతను కలిగి ఉండాలి.
సీఐఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌లో ఎస్సై (ఫైర్) పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ (పీసీఎం) సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ (సైన్స్) లేదా సమాన అర్హత ఉండాలి. లేదా
పదో తరగతి (మెట్రిక్యులేషన్)తోపాటు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, కెమికల్, మైనింగ్, ఏరోనాటికల్ లేదా టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌లో మూడేండ్ల డిప్లొమా లేదా సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. అలాగే, సంబంధిత రంగాల్లో బి.టెక్ లేదా ఎం.టెక్ వంటి ఉన్నత విద్యలను అభ్యసించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
►ALSO READ | IIT Hyderabadలో లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు: ఎలాంటి టెస్ట్ లేదు.. డైరెక్ట్ జాబ్..
ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ -ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ పోస్టులకు పోటీ పడే పురుష అభ్యర్థులు శారీరక దారుఢ్య పరీక్ష నిర్వహించే నాటికి చెల్లుబాటు అయ్యే ఎల్‌‌‌‌‌‌‌‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి.
వయసు (2026, ఆగస్టు 1 నాటికి): సబ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ (ఫైర్) పోస్టులు: అభ్యర్థుల వయసు18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే 1996, ఆగస్టు 2 కంటే ముందు 2008 ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండకూడదు.
ఇతర పోస్టులు: ఎస్ఐ (ఫైర్) మినహా మిగిలిన అన్ని పోస్టులకు అభ్యర్థుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. అభ్యర్థులు 2001, ఆగస్టు 2 కంటే ముందు, 2006 ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 10.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు. ఇతరులు రూ.100 చెల్లించాలి.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30.






