© 2026 nimisham.in
మెగాస్టార్ చిరంజీవి.. ఇదొక పేరు కాదు బ్రాండ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరుకున్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవాళ మెగాస్టార్ పుట్టినరోజు. దీంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు హంగామా చేస్తున్నారు. ఇక, ఎన్నో ఏళ్లుగా ఆయన తన సినీ ప్రయాణం గురించి, కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి, చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడానికి దోహదపడిన లక్షణాల గురించి పంచుకుంటూ వస్తున్నారు.ఇవాళ చిరు పుట్టినరోజు సందర్భంగా.. లక్ష్యంపై దృష్టి పెట్టడం, కష్టపడి పనిచేయడం, సవాళ్లను ఎదుర్కొంటూ పట్టుదలతో ముందుకు సాగడం వంటి విషయాలపై ఆయన ఇచ్చిన స్ఫూర్తిదాయక సందేశాన్ని గుర్తుచేసుకుందాం.2025 జనవరి 5న హైదరాబాద్‌లో జరిగిన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 'కాటలిస్ట్' (Katalyst) కార్యక్రమంలో చిరంజీవి ప్రసంగిస్తూ, యువ పారిశ్రామికవేత్తలకు తన జీవిత అనుభవాల నుంచి ముఖ్యమైన పాఠాలను పంచుకున్నారు. 71వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అందించిన మోటివేషన్ ఏంటో ఓ లుక్కేద్దాం.చిరంజీవి చెప్పిన మోటివేషనల్ కోట్చిరంజీవి కొటేషన్ అంతరార్థం ఏంటి?చిరంజీవి సందేశం ప్రధానంగా మూడు సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. స్థిరమైన నిరంతర శ్రమను కొనసాగించడం ఆటంకాలు, ఎదురుదెబ్బలు తగిలినా వెనకడుగు వేయకుండా పట్టుదలతో ఉండటం.ఆయన తన ప్రయాణాన్ని వివరిస్తూ, నటనను కెరీర్‌గా ఎంచుకోవడానికి ముందు NCC ద్వారా క్రమశిక్షణను ఎలా అలవర్చుకున్నారో గుర్తుచేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఎదురైన తిరస్కరణలు, ప్రతికూలతల్ని చూసి ఆగిపోకుండా, వాటినే తన విజయ ప్రయాణంలో భాగంగా మార్చుకుని కొత్త అవకాశాల్ని ఎలా సృష్టించుకున్నారో వివరించారు.ఈ మాటలు నేటి తరానికి ఎందుకు ఎంతో అవసరం?తక్షణ ఫలితాలు, వేగవంతమైన విజయాల్ని కోరుకునే ప్రస్తుత కాలంలో.. ఏదైనా సాధించాలంటే సహనం, నిరంతర శ్రమ ఎంతో అవసరమనే విషయాన్ని ఆయన మాటలు గుర్తుచేస్తున్నాయి. ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల అనేవి కేవలం నటనారంగానికే కాకుండా స్టార్టప్‌లు, ఉద్యోగాలు, సృజనాత్మక రంగాలు, వ్యక్తిగత ఎదుగుదలకు సమానంగా వర్తిస్తాయి.చిరంజీవి సామాజిక సేవ, వినూత్న కార్యక్రమాలు రక్తదాన ఉద్యమం: తెలుగు రాష్ట్రాల్లో రక్తదానంపై సరైన అవగాహన లేని రోజుల్లో (1998) 'చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్' ద్వారా రక్తదానాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చారు. ప్రస్తుతం దాదాపు 9 లక్షలకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన పేదలకు ఉచితంగా అందించారు. కరోనా సంక్షోభం - ఆక్సిజన్ బ్యాంకులు: కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ప్రాణవాయువు కొరతతో ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో సొంత ఖర్చుతో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి వేలాది ప్రాణాలను కాపాడారు. సినీ కార్మికుల అండ (CCC): లాక్డౌన్ సమయంలో పనులు లేక ఇబ్బంది పడిన వేలాది మంది సినీ దినసరి వేతన కార్మికుల కోసం ఇండస్ట్రీ పెద్దలను కలుపుకుని 'కరోనా క్రైసిస్ ఛారిటీ' ఏర్పాటు చేసి నెలల తరబడి నిత్యావసరాలు అందించారు.చిరు గురించి ముఖ్యమైన విషయాలు1978లో 'ప్రాణం ఖరీదు' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. 'ఖైదీ' (1983) సినిమాతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని 'మెగాస్టార్'గా ఎదిగారు. 150కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు సినిమాల్లో డ్యాన్స్, ఫైట్స్ ట్రెండ్‌ను పూర్తిగా మార్చివేసి, నూతన ఒరవడిని సృష్టించారు. 2006లో పద్మభూషణ్, 2024లో భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








