
© 2026 nimisham.in

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ బాబీ కొల్లి (కే.ఎస్.రవీంద్ర) డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగా 158 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళం హీరోయిన్ అనస్వరరాజన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రియమణి, బండ్ల గణేష్ తదితరులు ఈ మూవీలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. తమన్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. జన నాయకుడు, టాక్సిక్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ సంస్థ మెగా 158 సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) సందర్భంగా ఈ మెగా మూవీ టీజర్ తో పాటు టైటిల్ ను కూడా అనౌన్స్ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే అంతకు ముందే ఈ సినిమా టైటిల్ ను దాదాపు రివీల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.
సాధారణంగా చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను స్వయంగా ఆయనే అభిమానులకు అందిస్తుంటారు. చిరు లీక్స్ పేరుతో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్లు ఇవ్వడం ఆయనకు బాగా సరదా. తాజాగా మెగా158 మూవీ టైటిల్ కూడా అలాగే లీక్ చేశారు మెగాస్టార్. కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ కు హాజరైన చిరంజీవిని మెగా158 అప్డేట్ ఇవ్వమని అడిగింది యాంకర్. దీంతో మైక్ అందుకున్న మెగాస్టార్ తమన్‌ను అడుగుతూ.. సేమ్ టైటిల్ కదిరిలాగా అంటూ సగంలోనే ఆపేశారు. దీంతో ఈ మూవీకి టైటిల్ కదిరి నరసింహుడు అనే పేరు పెట్టనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా గతంలో ఈ సినిమాకు కాకాజీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపించిన సంగతి తెలిసిందే.
‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్లో మెగా 158 సినిమా టైటిల్ రివీల్ చేసిన చిరంజీవి.. ‘కదిరి’ అంటూ సగం చెప్పి ఆపేసిన మెగాస్టార్.. ఆగస్ట్ 22న టీజర్ విడుదల.. #ChiruLeaks #Mega158 #BobbyKolli మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








