
© 2026 nimisham.in

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Pawan Kalyan Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్న హృదయపూర్వక భావాలు పంచుకున్నారు. ఈ క్రమంలో పాత జ్ఞాపకాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమా రంగంలో అడుగుపెట్టి హీరో కాకముందు నుంచే అన్నయ్యే తన జీవితానికి ఏకైక హీరో అని పవన్ కల్యాణ్ ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ తన స్కూలు రోజుల్లో అన్నయ్య పక్కన నడవడం కూడా ఎంతో గర్వకారణంగా భావించేవారని, అప్పట్లో ఆయన ఇంకా కాలేజీ విద్యార్థి అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప వ్యక్తితో నడుస్తున్నట్లు అనుభూతి చెందేవారని పేర్కొన్నారు. చిన్నతనంలో చిరంజీవి కాలేజీ చదువు కోసం నర్సాపూర్ వెళ్లేవారని, వేసవి సెలవులకు ఆయన ఇంటికి రావడం ఒక పెద్ద పండుగలా ఉండేదని గుర్తుచేసుకున్నారు. కానీ, తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం చాలా బాధగా ఉండేదని, ఆయన తిరిగి వచ్చేంతవరకు ఇల్లంతా కళావిహీనంగా మారిపోయేదని పేర్కొన్నారు.
చిరంజీవి తన పొడవైన ఉంగరాల జుట్టుతో, దృఢమైన ఎన్సీసీ క్యాడెట్ శరీరాకృతితో, నాన్నగారి బుల్లెట్ బైక్ నడుపుతుంటే ఒక అభిమానిగా చూస్తూ ఆరాధించిన క్షణాలను పవన్ గుర్తుచేసుకున్నారు. కెరీర్ ప్రారంభ రోజుల్లో మొదటిసారి సింగపూర్ పర్యటన నుండి తిరిగి వచ్చినప్పుడు పెద్ద నీలం రంగు బ్యాగులో లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, రేసింగ్ ట్రాక్, కామిక్ పుస్తకాలు, మ్యూజిక్ టేపులు, టేప్ రికార్డర్, సువాసనల యార్డ్లీ పౌడర్లు తేవడం ద్వారా చిన్న ఇల్లాంటి తమ నివాసంలో సంతోషాన్ని, చిరునవ్వులను నింపిన సంఘటనను గుర్తుచేసుకున్నారు.
"అన్నయ్యకు పెళ్లయినప్పుడు తమకు దూరమవుతారేమోనని ఒక గదిలో కూర్చుని నిశ్శబ్దంగా ఏడుస్తుంటే, అన్నయ్య తన భార్యను తీసుకువచ్చి "రా, ఈ రోజు నిన్ను ఒక పెద్ద మనిషికి పరిచయం చేస్తాను" అని నవ్వించిన మధుర క్షణాలను నెమరువేసుకున్నారు. ఆ తర్వాత తనను చెన్నై తీసుకువెళ్లి సొంత బిడ్డలా చూసుకున్నార"ని పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు.
చెన్నై ఉక్కపోతలో రోజుకు 18 గంటల పాటు కఠోరంగా శ్రమించి, నిలబడటానికి కూడా బలం లేక, చెమటతో తడిసిన దుస్తులు, బూట్లతో అర్ధరాత్రి ఇళ్లకు చేరుకునే అన్నయ్య కష్టాన్ని చూసి పవన్ కల్యాణ్ ఎంతో అపరాధభావంతో బాధపడేవారట. అయినప్పటికీ, పవన్ చదువులో వైఫల్యాల గురించి చిరంజీవి ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదట.
"తన ఉదారతతో కుటుంబాన్ని, బంధువులను సంతోషపెట్టిన చిరంజీవి.. దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక వారధిగా నిలిచారు. హిందీలో 'ప్రతిబంధ్', 'ఆజ్ కా గూండా రాజ్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు నిర్మించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా, పద్మవిభూషణ్ గ్రహీతగా అత్యున్నత స్థాయికి చేరినప్పటికీ చిరంజీవి ఏనాడూ విశ్రమించలేదు. ఇటీవల వెన్నెముకకు పెద్ద ఆపరేషన్ జరిగినప్పటికీ, ఏమాత్రం ఆలస్యం లేకుండా తిరిగి కోలుకుని మళ్లీ పనిలోకి వెళ్లడం ఆయన అసాధారణ పట్టుదలకు నిదర్శనం" అని పవన్ కల్యాణ్ కొనియాడారు.
"నగరం ఎప్పుడూ నిద్రపోనట్లే చిరంజీవి కూడా ఎప్పటికీ విశ్రమించరని, అందుకే ఆయన లక్షలాది మందికి స్ఫూర్తిప్రదాత, తన ఏకైక హీరో" అని పవన్ కల్యాణ్ ఎంతో సగర్వంగా ముగించారు. "అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం కేవలం లాంఛనం కాదు, నాలాంటి ఎంతో మందికి ఒక సున్నితమైన జ్ఞాపిక అని, మనమందరం ఆరాధించే భరతభూమికి ఒక మంచి భవిష్యత్తును నిర్మించడానికి, బలమైన పునాదులు వేయడానికి, అతని జీవితం నాలాంటి లక్షలాది మందిని ఎలా ప్రభావితం చేసిందో గుర్తుచేయడమే ఈ సందర్భం" అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలియజేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








