
© 2026 nimisham.in

మెగా ఫ్యామిలీలో చిరంజీవి(chiranjeevi) స్థానం గురించి నాగబాబు(naga babu) చేసిన వ్యాఖ్యలు మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాయి. కొరియన్ కనకరాజు(Korean Kanakaraju) సక్సెస్ మీట్ లో మాట్లాడిన ఆయన, తమ ఫ్యామిలీ ఇంత ఆనందంగా, ఐక్యంగా ఉండటానికి ప్రధాన కారణం చిరంజీవేనని ఎమోషనల్ గా చెప్పారు. ఇవాళ తామంతా ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం అన్నయ్య కృషి, ఆశీర్వాదం, ఆయన వెన్నుదన్నేనని నాగబాబు పేర్కొన్నారు. తాను, పవన్ కళ్యాణ్(pawan kalyan), రామ్ చరణ్(ram charan), వరుణ్ తేజ్(Varun tej), సాయిధరమ్ తేజ్(Sai dharam tej), వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), నిహారిక(Niharika), హనీ(Honey)… ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరి వెనుక అన్నయ్య చిరంజీవి నిలిచారని చెప్పారు. ఆయన చేసిన త్యాగాలు, చూపిన ప్రేమకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని వెల్లడించారు.
అన్నయ్య కేవలం కుటుంబ పెద్ద మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి లైఫ్ లో బలంగా నిలిచే వ్యక్తి అని నాగబాబు వివరించారు. ఫ్యామిలీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కారం చూపించేది ఆయనేనని చెప్పారు. ఆ సమస్యను తాము మర్చిపోయినా కూడా చిరంజీవి మాత్రం గుర్తుంచుకుని అడిగి తెలుసుకుని సెట్ చేస్తారని తెలిపారు. కుటుంబ బంధాలను కాపాడుతూ, అందరినీ ఒకేలా చూసుకునే ఆయన స్వభావాన్ని ఈ సందర్భంగా నాగబాబు కొనియాడారు.
వరుణ్ తేజ్‌తో చిరంజీవికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ నాగబాబు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి వరుణ్‌ను ఎంతో ప్రేమగా చూసుకున్నారని, ఆయన సినిమాల ప్రివ్యూలకు కూడా వెంట తీసుకెళ్లేవారని చెప్పారు. ఇప్పటికీ స్టోరీలు, కెమెరా, ఫిల్మ్ మేకింగ్ వంటి విషయాలపై వరుణ్‌తో అన్నయ్య తరచూ చర్చిస్తారని వెల్లడించారు. రామ్ చరణ్ మాత్రమే కాదు, కుటుంబంలోని ప్రతి ఒక్కరిపైనా అన్నయ్య చూపించే ప్రేమ ఒకేలా ఉంటుందని నాగబాబు చెప్పడం విశేషం.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








