Latest Gold Silver Rates : భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఏదైనా పండగ వచ్చినా, ఇంట్లో పెళ్లి, ఇతర శుభకార్యం ఏది ఉన్నా కచ్చితంగా బంగారం కొనాల్సిందే. ధరించాల్సిందే. ఎక్కువగా మహిళలే బంగారు ఆభరణాల్ని కొని ధరించేందుకు ఇష్టపడుతుంటారు. ఇందుకోసం ఎప్పటినుంచో డబ్బులు పొదుపు చేసే వారు కూడా ఉంటారు. పైసాపైసా కూడబెట్టి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు లేదా ధర తగ్గినప్పుడు కొందామని చూస్తుంటారు. ఇంకా ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించే సమయంలో కూడా వారికి తల్లిదండ్రులు ఎంతో కొంత బంగారం చేయించి పంపిస్తుంటారు. ఇది భారత సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా వస్తోంది. అంతలా బంగారం అనేది భారతీయ సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఇంకా బంగారం అంటే కేవలం అలంకరణ సామగ్రి మాత్రమే కాదు పెట్టుబడికి కూడా మంచి సాధనం. దీంట్లో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది.బంగారంతో పాటు కొంత కాలంగా వెండికి కూడా విపరీతంగా డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది గతేడాది రికార్డు స్థాయిలో 150 శాతం పెరిగింది. అక్కడి నుంచి మళ్లీ తగ్గినప్పటికీ దీర్ఘకాలంలో పెట్టుబడికి మంచి సాధనంగా దీనిని భావిస్తుంటారు. ఇక గతేడాది ఏకంగా 70 శాతానికిపైగా పెరిగిన పసిడి ధర ఈ ఏడాది మాత్రం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్రూడాయిల్ ధరలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సాధారణంగా క్రూడాయిల్ ధరలు అధిక స్థాయిల్లో ఉంటే బంగారం ధర తగ్గుతుంది. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు దాదాపు అదే జరిగింది. కానీ ఇటీవల మాత్రం ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి పరిస్థితిని మారుస్తోంది.క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నా ఇదే సమయంలో బంగారం ధర గత కొద్ది సెషన్లుగా వరుసగా పెరుగుతూనే వచ్చింది. పండగ, పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఉండటం ప్రధాన కారణం. అయితే ఇప్పుడు ఎట్టకేలకు అంతర్జాతీయ మార్కెటలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్‌కు గిరాకీ పెరగడం, 2007 నాటి గరిష్ఠాలకు చేరడంతో బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఒక దశలో 4400 డాలర్లకుపైన ఉండగా, ఇప్పుడు అది 4350 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇక సిల్వర్ రేటు 66 డాలర్ల స్థాయి నుంచి 63 డాలర్లకు చేరింది.ఇదిలా ఉండగా దేశీయంగా ప్రస్తుతం ఆగస్ట్ 19న ఉదయం 7.30 గంటల సమయంలో చూస్తే స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 200 పెరిగి తులం రూ. 1,42,900 వద్ద ఉండగా, 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 230 ఎగబాకి ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 1,55,890 వద్ద ఉంది. ఇక సిల్వర్ రేటు రూ. 2.55 లక్షల వద్దే స్థిరంగా ఉంది.Read Also: రెండో రోజే ఫుల్ సబ్‌స్క్రైబ్ అయిన లలితా జువెల్లరీ ఐపీఓ.. జీఎంపీ ఇప్పుడు ఎంతుందంటే?గమనిక: ఈ ధరలు ఆగస్ట్ 19 ఉదయం 7.30 గంటల సమయంలోనివి. ఇంటర్నేషనల్ మార్కెట్లోని ధరలకు అనుగుణంగా ఉదయం 10 గంటలకు మళ్లీ రేట్లు మారతాయని గమనించగలరు.





