
© 2026 nimisham.in

Budha Astama 2026 Effect: ఆగస్టు 18వ తేదీన బుధుడు సింహరాశిలో అస్తమించడంతోపాటు.. సూర్యుడుతో కలిసి ఉండబోతున్నారు. దీంతో కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఊహించని ధన లాభాలతో పాటు ఆర్థికంగా చాలా వరకు కలిసి రాబోతోంది.
Budha Astama 2026 Effect On Zodiac: బుధ గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ఈ గ్రహాన్ని తెలివితేటలు, వ్యాపారం, ఆనందానికి సూచికగా భావిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే.. ఆగస్టు 18వ తేదీన బుధుడు సింహరాశిలో అస్తమించాడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు చాలా దగ్గరగా వచ్చినప్పుడు.. ప్రతి గ్రహం అస్తమిస్తుంది.. అలాంటిది బుధుడు కూడా సింహరాశిలో అస్తమించడం విశేషం.. అయితే, 30 రోజులపాటు ఈ స్థితిలోనే కొనసాగుతూ ఉంటాడని జ్యోతిష్యులు చెబుతున్నారు..
గ్రహస్తమయం సాధారణంగా శక్తి క్షీణతగా చెప్పుకుంటూ ఉంటారు.. కానీ సింహరాశిలో బుధుడు అస్తమించడం.. రాశికి అధిపతిగా భావించే సూర్యునితో కలిసి ఉండడం చాలా శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో 30 రోజుల పాటు నాలుగు రాశుల వారికి వృత్తి, వ్యాపారాలపరంగా దిమ్మ తిరిగే ధన లాభాలు కలుగుతాయి..
బుధ గ్రహం అస్తమించడం కారణంగా వృషభరాశి వారికి విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు లభించడమే కాకుండా పనిలో మాట తీరు, ప్రశంసలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పై అధికారుల నుంచి మీకు మంచి పూర్తి సపోర్టు లభిస్తుంది. దీంతోపాటు వ్యాపారవేత్తలకు కొత్త ఆదాయ వనరులు కూడా లభించబోతున్నాయి..
ఈ సమయంలో మిధున రాశి వారికి ధైర్య సాహసాలు విపరీతంగా పెరుగుతాయి. దీంతోపాటు చాలా కాలంగా.. ఉద్యోగ మార్పుల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులందరికీ విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. అలాగే నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పటినుంచో అనుకుంటున్నా పనులు ఇప్పుడు సులభంగా చేయగలుగుతారు..
బుధుడు సింహరాశిలో అస్తమించడం కారణంగా ఈ సొంత రాశి వారికి ఆలోచనలతో పాటు నిర్ణీత సామర్థ్యం కూడా అవిపరితంగా పెరుగుతుంది. అంతేకాకుండా పని పట్ల అంకిత భావం పెరిగి.. అధికారులను ఆకట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు కోరుకున్న చోటికి కూడా బదిలీలు జరుగుతాయి. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు బుధ గ్రహం అస్తమించడం కారణంగా అద్భుతమైన లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపార ఒప్పందాలు కూడా విదేశీ కంపెనీలతో ఖరారు అవుతాయి. సహ ఉద్యోగులతో కష్టమైన పనులు కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత ఎంతో మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Senior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.





