
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Venus Transit In Chitra Nakshatra Effect: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. ఈ గ్రహం సంపదతో పాటు ప్రేమ వైభవం విలాసం సౌందర్యానికి కారకుడిగా కూడా భావిస్తారు. ఇదిలా ఉంటే ఆగస్టు 25వ తేదీన 12 గంటల సమయంలో శుక్రుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఒకటే నక్షత్రంలో సంచార దశలో ఉండబోతోంది. ముఖ్యంగా చిత్రా నక్షత్రంలోకి శుద్రుడు ప్రవేశించడం కారణంగా మొత్తం నాలుగు రాశుల వారిపై ఊహించని ప్రభావం పడబోతోంది. ఈ సమయంలో విపరీతమైన ఆధార మార్గాలు పెరగడమే కాకుండా కొన్ని రాశుల వారికి ఉద్యోగాలపరంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో పురోగతి కూడా లభిస్తుంది. శుక్రుడి సంచారం కారణంగా ఏయే నాలుగు రాశుల వారికి సమయం అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మేషరాశి చిత్రా నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించిన వెంటనే మేషరాశి వారికి ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగస్తులు కార్యాలయాల్లో మంచి మంచి పనులు చేయగలుగుతారు. కొత్త ప్రాజెక్టుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వనరులు కూడా అంచలంచలుగా పెరుగుతాయి. అంతేకాకుండా డబ్బుకు ఎలాంటి కొరత ఉండదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృషభ రాశి వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. అంతేకాకుండా శుక్రుడు సంచార ప్రభావం కొత్త ప్రణాళికలను కూడా విజయవంతం చేస్తుంది. వృత్తిలో గొప్ప పురోగతి లభించడమే కాకుండా మంచి మంచి పదోన్నతులు లభించేలా చేస్తుంది. ముఖ్యంగా ఎప్పటినుంచో మానసిక ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరికీ పరిష్కారం కూడా లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులు సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు.
తులారాశి తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు చిత్రా నక్షత్రంలో శుక్రుడు ప్రవేశించడం కారణంగా ఈ సమయం గోల్డెన్ పీరియడ్‌గా మారుతుంది. అంతేకాకుండా కొత్త మార్గాల నుంచి ఆదాయం కూడా విపరీతంగా లభిస్తుంది.. ఈ సమయంలో సంతోషకరమైన రోజు కూడా రావడం ప్రారంభమౌతాయి. వ్యాపారాల్లో భారీ లాభాలు కలగడమే కాకుండా పాత పెట్టుబడిల నుంచి అనుకున్న ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా కుటుంబంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.
వృశ్చిక రాశి వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శుక్రుడి ప్రభావంతో జీవితంలో అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగాలు మారాలని అనుకుంటున్న వ్యక్తులందరికీ మంచి ఆఫర్స్ లభిస్తాయి. ముఖ్యంగా కోరుకుంటున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.. సమాజంలో గౌరవం విపరీతంగా పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు ఊహించని స్థాయిలో మెరుగుపడి.. అద్భుతమైన గౌరవంతో పాటు ఆనందం పొందగలుగుతారు. ముఖ్యంగా కుటుంబంలో మంచి రోజులు రావడం ప్రారంభమవుతాయి.
గమనిక.. ఇక్కడ అందించిన సమాచారం కేవలం అంచనాలతో పాటు జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించి రాసింది మాత్రమే. దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




