
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Three Youths Dies In River: స్వాతంత్య్ర దినోత్సవం సెలవు కావడంతో సరదాగా ఆడుకుందామని కృష్ణా నదికి కొందరు యువకులు వచ్చారు. నది నీటిలో ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు. అయితే ప్రమాదవశాత్తు నీటి లోపలికి మునిగిపోయారు. అలా ముగ్గురు మునిగిపోయి నీటిలో గల్లంతయ్యారు. లోతు ప్రాంతంలోకి వెళ్లడంతో వారంతా విగతజీవులుగా మారారు. ఈ సంఘటన ఏపీలోని తాడేపల్లిలో ఉన్న కృష్ణా నది వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన ముగ్గురు యువకులు వీసం గౌతమ్ (18), గడ్డం జాషువా (17), తీగుళ్ల తేజ (18) తాడేపల్లి సమీపంలోని కృష్ణలంక మెట్లబజారు పద్మావతి ఘాట్ వద్ద కృష్ణా నదిలోకి దిగారు. స్వాతంత్య్ర దినోత్సవం సెలవు కావడంతో మిత్రులంతా కలిసి నదిలో ఈత కొట్టారు. సరదాగా ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. స్నానానికి నదిలోకి దిగిన సమయంలో ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో ముగ్గురూ గల్లంతయ్యారు. ఈ విషయం తెలిసిన గత ఈతగాళ్లు, స్థానికులు గాలించగా ముగ్గురి మృతదేహాలు లభించాయి. ముగ్గురు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నదిలోకి స్నానానికి వెళ్లే సమయంలో ప్రజలు, ముఖ్యంగా యువకులు సాహసాలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం అనకాపల్లి జిల్లా చోడవరం అంబేడ్కర్ కాలనీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తన భర్తను భార్య హత్య చేసింది. కొండ్ల వెంకటరావు (58), ఇందిర (54) భార్యాభర్తలు. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. స్థానికంగా అంగన్వాడీ టీచర్‌గా ఇందిర తన భర్త ప్రవర్తనతో విసిగిపోయి హత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న చోడవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాకరాపేట ఘాట్‌లో భారీ రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లా బాకరాపేట ఘాట్‌లో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 20 చక్రాల భారీ లారీ అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఘాట్ రోడ్డులో వెళ్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి లారీ పడిపోగా.. టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని స్థానికులు, పోలీసులు ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిపోయిన లారీని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లారీలో ఎంతమంది ఉన్నారనే దానిపై ఇంకా వివరాలు తెలియలేదు.




