

Thrigun : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా ఆరంభమయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. ఇక రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్ ఎంట్రీ ఇచ్చాడు.
హీరో త్రిగుణ్ అసలు పేరు ఆదిత్ అరుణ్. దాదాపు 15 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో ఉన్నాడు. 2009 లో కథ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా యావరేజ్ గా నిలిచినా ఆ తర్వాత హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ్ లో హీరోగా, కీలక పాత్రల్లో దాదాపు 30 సినిమాలు చేసాడు. కథ, తుంగభద్ర, గరుడవేగా, 24 కిసెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు, డియర్ మేఘ, లైన్ మ్యాన్, ఈషా, చెన్నై లవ్ స్టోరీ.. లాంటి అనేక సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు.