
ఫ్రిజ్‌లోపల నీరు లీక్ అవ్వడాన్ని సరిచేసేందుకు ఫ్రీజర్, ఫ్రిజ్ కంపార్ట్మెంట్ వెనుక భాగంలో డీఫ్రాస్ట్ డ్రెయిన్ రంధ్రాన్ని క్లీన్ చేయాలి. ఫ్రిజ్ లోపలి వెనుక గోడపై, ఫ్రీజర్ ఇంటీరియర్ ప్యానెల్ వెనుక ఉన్న చిన్న డ్రెయిన్‌కి అంటుకున్న ఫుడ్ పార్టికల్స్ లేదా మురికిని క్లీన్ చేసేందుకు పైప్ క్లీనర్, స్ట్రా క్లీనర్ వంటి వాటి సాయంతో క్లీన్ చేయండి . లేదా చుట్టూ మంచు గడ్డకడితే లో సెట్టింగ్‌లో హెయిర్ డ్రైయర్‌ని వాడి కొద్దిగా గోరువెచ్చని నీరు పోసి కరిగించొచ్చు. అయితే, ఇవన్నీ క్లీన్ చేయడం వంటివన్నీ చేసేముందు కచ్చితంగా ఫ్రిజ్ పవర్ ఆఫ్ చేసి ఉందా లేదా చెక్ చేయండి.
రిఫ్రిజిరేటర్ తలుపు సరిగా మూయకపోతే బయటి నుండి వెచ్చని గాలి లోపలికి వెళ్తుంది. దీంతో లోపల తేమ పెరిగి, అది తర్వాత నీటి బిందువులుగా కనిపిస్తాయి. కాబట్టి, ముందుగా డోర్ చుట్టూ ఉన్న రబ్బర్ సీల్‌ని జాగ్రత్తగా పరిశీలించి లోపల ఇరుక్కుపోయిన దుమ్ము, ధూళి, చిన్న ఆహారపు ముక్కల్ని క్లీన్ చేయండి. దీనికోసం ఈజీ టెస్ట్ కూడా చేయొచ్చు. డోర్, రబ్బర్ సీల్ మధ్య ఓ కాగితాన్ని ఉంచండి. డోర్‌ని మూసి మళ్లీ బయటికి లాగండి. పేపర్ ఎలాంటి అడ్డంకి లేకుండా బయటికి వస్తే సీల్ వదులుగా ఉండొచ్చు.
ఫ్రిజ్‌లోని టెంపరేచర్ని సరైన విధంగా అడ్జెస్ట్ చేయడం చాలా ముఖ్యం. ఫ్రిజ్ సాధారణంగా 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ని అడ్జస్ట్ చేయాలి. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా నీరు కారడం లేదా ఐస్ పెరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి సరైన టెంపరేచర్లో పెట్టండి. అంతేకానీ, అతి తక్కువగా పెట్టొద్దు.
కొంతమంది ఫుడ్ వేడిగా ఉన్నప్పుడే ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. దీంతో లోపల తేమ పెరుగుతుంది. వేడిగా ఉన్న ఫుడ్ నుంచి వచ్చే ఆవిరి చల్లని గాలిని తాకినపుడు నీటి బిందువులుగా ఘనీభవిస్తుంది. కాబట్టి, ముందుగా ఫుడ్ రూమ్ టెంపరేచర్‌కి చల్లారనివ్వండి. ఆ తర్వాత మూతపెట్టి ఫ్రిజ్‌లో పెట్టండి. ముఖ్యంగా వేడి వేడి అన్నం, కూరలు, ఫ్రిజ్‌లో పెట్టకపోవడమే మంచిది.
రిఫ్రిజరేటర్లో మూతలేని గిన్నెలు పెట్టొద్దు. కూరగాయలు, పండ్లు, వండిన ఫుడ్ అన్నీ కూడా తేమని విడుదల చేస్తాయి. కాబట్టి, మూత పెట్టకుండా వదిలేస్తే ఈ తేమ మొత్తం వ్యాపించి నీటి బిందువులు ఏర్పడతాయి. మిగిలిన ఆహారాన్ని ఎప్పుడు కూడా మూత ఉన్న పాత్రలో స్టోర్ చేయండి. కూరగాయల్ని కడిగి ఫ్రిజ్‌లో పెట్టాలనుకుంటే ముందుగా నీరంతా పోయాక అప్పుడే పెట్టండి.
ఫ్రిజ్‌ని స్టోర్ రూమ్‌లో మార్చొద్దు. ఎక్కువ వస్తువులు పెట్టడం వల్ల చల్లగాలి ప్రసరించదు. గాలి ప్రసరణ రంధ్రాల ముందు డబ్బాలను ఉంచితే లోపలి టెంపరేచర్ దెబ్బతీస్తుంది. కాబట్టి, డబ్బాల మధ్య కొంత ఖాళీని ఉంచండి. గాలి ప్రసరణ రంధ్రాలను అడ్డుకోవద్దు. ఫుడ్ కంటైనర్స్‌ని వెనుకాల మరీ దగ్గరగా ఉంచొద్దు. ఇవన్నీ చేశాక కూడా సమస్య ఇంకా కంటిన్యూ అయితే మెకానిక్‌ని పిలిపించడం మంచిది.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
