
వరంగల్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని కొండా మురళి(Konda Murali) అన్నారు. కొండా సురేఖ ( Konda Surekha )ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన తర్వాత తొలిసారిగా వరంగల్‌లో పార్టీ కార్యకర్తలతో కొండా దంపతులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ... కొండా సురేఖను గెలిపించడంలో రాహుల్‌గాంధీ పాత్ర ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. ‘‘పదవులు ఇవాళ వస్తాయి.. రేపు పోతాయి. కానీ, మాట కోసం నిలబడతాం. కృతజ్ఞత అనేది మా రక్తం, మా కుటుంబంలో ఉంది. కొండా సురేఖను సారీ అని ఒక్క మాట చెప్పమన్నారు. పదవి ఉంటే ఉండనీ .. పోతే పోనీ అని నా భార్య సారీ చెప్పలేదు. ఎన్ని రోజులు బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యం’’ అని కొండా మురళి అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





