
హైదరాబాద్: ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం కలిగినవారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప్పల్‌ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఆర్య వైశ్యులు పేదల ఆకలి తీరుస్తున్నారు. వారు ఆర్థిక క్రమశిక్షణతో ఉంటారు. గతంలో సీఎంలు ఎంత మంది మారినా కొణిజేటి రోశయ్యే ఆర్థిక మంత్రిగా ఉండేవారు. ఆయన దూరదృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్‌ వచ్చింది. హైదరాబాద్‌తోనే తన అనుబంధం ముడిపడి ఉందని రోశయ్య చెప్పేవారు. అందుకే ఆయన విగ్రహం హైదరాబాద్‌లో ఉండాలని నిర్ణయించాం’’ అని రేవంత్‌ అన్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు (Rains) తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు బస్టాండ్ జలమయమైంది.





