
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Shravana Masam Chicken Egg Price: హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్ర మాసంలో చాలామంది నాన్-వెజ్ వంటకాలకు దూరంగా ఉంటూ పూర్తిగా శాకాహారాన్ని ఆచరిస్తారు. ప్రతి ఏటా ఈ సమయంలో మాంసాహారానికి డిమాండ్ ఒక్కసారిగా పడిపోతుండటం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పాతాళానికి పడిపోయాయి. గత నెలలో చుక్కలు చూపించిన ధరలు ఇప్పుడు అమాంతం తగ్గిపోవడంతో సామాన్యులకు ఊరట లభిస్తోంది.
భారీగా తగ్గిన చికెన్ ధరలు గతంలో కిలో చికెన్ ధర ఏకంగా రూ.340 వరకు చేరుకుని సామాన్యులను షాక్‌కు గురిచేసింది. అయితే శ్రావణ మాసం ఎఫెక్ట్‌తో కేవలం రెండు వారాల వ్యవధిలోనే ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రాంతాలను బట్టి, రవాణా ఖర్చులను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ జోన్ పరిధిలో కిలో డ్రస్డ్ చికెన్ రూ.197లకు విక్రయిస్తుండగా.. స్కిన్ లెస్ చికెన్ ధర రూ.222గా ఉంది. రిటైల్ లైవ్ బర్డ్ రూ.127గా ఉండగా.. ఎక్స్ ఫామ్ లైవ్ బర్డ్ రూ.100లకు అమ్మకాలు జరుగుతుంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పరిధిలో ఎక్స్ ఫామ్ లైవ్ బర్డ్ రూ.110, రిటైల్ లైవ్ బర్డ్ రూ.137 ధరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా డ్రస్డ్ చికెన్ రూ.212, కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.240గా అమ్మకాలు జరుపుతున్నారు.
తగ్గుముఖం పట్టిన కోడిగుడ్ల ధరలు చికెన్‌తో పాటు కోడిగుడ్ల ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. గతంలో ఒక్కో గుడ్డు ధర రూ.8 వరకు పలకగా, ప్రస్తుతం ఆ ధరలు తగ్గావు. విజయవాడ జోన్లో 12 గుడ్ల రిటైల్ ధర రూ.75 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, కరీంనగర్ జోన్ 12 గుడ్ల రిటైల్ ధర రూ.74గా ఉంది.
వ్యాపారుల ఆందోళన.. మరికొంత తగ్గే ఛాన్స్ శ్రావణ మాసం పూర్తయ్యే వరకు మార్కెట్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని, కోళ్లకు డిమాండ్ లేకపోవడం వల్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. గత నెలతో పోలిస్తే చికెన్ ధర దాదాపు రూ.100 వరకు తగ్గిపోవడంతో తమకు ఆదాయం గణనీయంగా పడిపోయిందని ఫామ్‌ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





