
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Pawan kalyan fan dies due to electric shock in amalapuram: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసైనికులు తమ అభిమాన హీరో, డిప్యూటీ సీఎం పేరు మీదుగా పలు ఆలయాల్లో అర్చనలు, పూజలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా పలు చోట్ల ఆస్పత్రులలో పండ్లను కూడా పంపిణి చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తన కుడి భూజానికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే.. పవన్ కళ్యాణ్ బర్త్ డే నేపథ్యంలో అమలాపురంలో ఫ్లెక్సీలు కడుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అమలాపురంలో పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఒక యువకుడు స్పాట్ లోనే మృతిచెందాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ కు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అతను హైదరాబాద్ లో ఉంటూ అక్కడ ప్రైవేటు జాబ్ చేసుకుంటున్నాడు.
ఇటీవల సెలవులపై స్వగ్రామానికి వచ్చిన ప్రేమ్ కుమార్..తన స్నేహితులతో కలిసి తమ అభిమాన నేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్నాడు. స్థానికంగా ఉన్న ఒక కాలేజీ గోడ మీద ఎక్కి పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా అతనికి విద్యుత్ తీగ తగలడంతో కరెంట్ షాక్ కు గురయ్యాడు. దీంతో అతను స్పాట్ లోనే మృతిచెందాడు.
Read more: ప్రధాని మోడీ, చంద్రబాబు సహా పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలిసిన ప్రముఖులు..
వెంటనే అక్కడున్న వారు విద్యుత్ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు దీంతో రంగంలోకి దిగిన అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పవన్ బర్త్ డే వేళ అతని అభిమాని ఇంట మాత్రం తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




