
భామిని: పార్వతీపురం జిల్లా తువ్వకొండల్లో ఉన్న నల్లరాయిగూడ గిరిజన గ్రామ సమీపంలోని జలపాతం వద్ద ఆదివారం సందడి నెలకొంది. పలువురు పర్యటకులు తరలివచ్చి జలపాతం వద్ద సేదతీరారు. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ ఎత్తైన కొండవాగుల నుంచి నీరు జాలువారుతూ కనువిందు చేస్తుంది. దీన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేస్తామని గతేడాది అధికారులు చెప్పారని, అయితే ఇంతవరకు ఎలాంటి అడుగులు పడగలేదని స్థానికులు పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






