
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Mla Naveen kumar Yadav reacts konda Sushmita row: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ, కొండా సుష్మిత అంశం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇప్పటికే పీసీసీ డిసిప్లీనరీ కమిటీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. దీనిపై వెంటనే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక మంత్రి కొండా సురేఖ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చాక అన్ని విషయాల్ని కలిసి చెప్తానని కూల్ గా చెప్పారు. ఈ వివాదంపై అనేక ఊహగానాలు రాజకీయా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ వివాదంపై తాజాగా.. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ స్పందించారు.
కొంత మంది నేతలు కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంను బలహీనపర్చేవిధంగా కుట్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ గా, ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్ ను అధికారంలోకి తెవడానికి ఎంతో శ్రమించారన్నారు. ప్రజలకు ఇచ్చిన పథకాల హమీలను నెరవెర్చే విధంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. అనేకమంది యువకులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు.
కాంగ్రెస్ పార్టీకోసం అందుబాటులో శ్రమించినవారిని గుర్తిస్తు.., ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా, పలు బాధ్యతలు అప్పగించిందని చెప్పారు. బీసీ నాయకుడిగా తనను కూడా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందని చెప్పారు. కష్ట పడితే పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని అన్నారు. రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచి సీటు తనకే నంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏంటని సుష్మితపై సెటైర్లు వేశారు. పార్టీ పెద్దలను, సీఎం ను గౌరవంలేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.
అదే విధంగా.. గౌరవ సీఎం లకు సలహాలు, సూచనల్ని ప్రజల్లో తీసుకెళ్లి గ్రౌండ్ లెవల్ లో పార్టీ బలోపేతంకు పాటు పడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పట్ల తప్పుడు మాటలు, అగౌరవ వ్యాఖ్యల్నిసహంచమన్నారు. వెంటనే దీనిపై కొండా సుష్మిత సారీ చెప్పాలని, పార్టీపెద్దలు ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలుతీసుకొవాలని కోరారు. అంతే కాకుండా.. అందరు ఐక్యంగా ఉండాలని, కాంగ్రెస్ ఇస్తున్న పథకాలు ప్రజల్లో తీసుకెళ్లాలన్నారు.
Read more: Konda Surekha Row: చిక్కుల్లో మంత్రి కొండా సురేఖ.. పీసీసీ క్రమశిక్షణ కమిటీకి మరో ఫిర్యాదు.!.
గౌరవించుకొవడం, మర్యాదగా నడుచుకొవడం చాలా ముఖ్యమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం .. మీకు,మీ భవిష్యత్తుకు మంచిదికాదని జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే కుట్రలో కొండా ఫ్యామిలీ భాగం అవుతోందన్నారు. మేము ఉన్నంత వరకు మా ప్రభుత్వాన్ని ఎవ్వరూ ఏమి చేయలేరని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





