
Komaram Bheem Collector Advises Farmers On Paddy Cultivation 171821
Komaram Bheem: వరి సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి కలెక్టర్ హరిత కొమురం భీం: కొమురం భీం జిల్లాలో రైతులు వరి సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు.
Komaram Bheem: వరి సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి కలెక్టర్ హరిత
కొమురం భీం: కొమురం భీం జిల్లాలో రైతులు వరి సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది వరకు వర్షపాతం పరిస్థితుల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు వరి నాట్లు వేస్తున్నారని, అయితే రాబోయే రోజుల్లో వరి సాగుకు అవసరమైన నీటి లభ్యతపై ముందుగానే అంచనా వేసుకోవాలని కలెక్టర్ సూచించారు. బోరుబావులు ఉన్న రైతులు సైతం దీర్ఘకాలికంగా నీరు అందుబాటులో ఉంటుందా లేదా పరిశీలించిన తర్వాతే వరి సాగు చేపట్టాలని స్పష్టం చేశారు.
అధిక నీరు అవసరమయ్యే వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా సాగు నష్టాలను తగ్గించుకోవడంతో పాటు రైతులు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ముందస్తు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ కె. హరిత తెలిపారు.
11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.






