
కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ సమరశంఖం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం కేసీఆర్ ప్రత్యక్ష ప్రజా పోరాటం Harish Rao: ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) తెలిపారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, హామీల అమలు తీరును గట్టిగా ఎండగడతామని స్పష్టం చేశారు. సమావేశాలను కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC)లో డిమాండ్ చేస్తామని, ప్రతిపక్షానికి సభలో మాట్లాడేందుకు తగిన సమయం కల్పించాలని స్పీకర్‌ను కోరనున్నట్లు వెల్లడించారు. EV Charging Stations: ఈవీ వాహనదారులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 369 ఈవీ ఛార్జింగ్ పాయింట్లు.. హైదరాబాద్ సహా జిల్లాల్లో నెట్వర్క్ సభకు కేసీఆర్ రాకపై వివరణ.. స్పీకర్‌పై అవిశ్వాస హెచ్చరిక: సభలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు తగిన గౌరవం ఇవ్వడం లేదని, ముఖ్యమంత్రి స్థాయిలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నందున ఆయన అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేలంతా భావించినట్లు హరీశ్ రావు స్పష్టం చేశారు. గతంలో జయలలిత, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు వంటి నేతలు కూడా గౌరవం లభించని సందర్భాల్లో సభకు దూరంగా ఉన్నారని గుర్తుచేశారు. ఒకవేళ అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వకపోతే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కూడా వెనకాడబోమని తీవ్రంగా హెచ్చరించారు. లక్షలాది మందితో కేసీఆర్ ప్రత్యక్ష పోరాటం.. ప్రాజెక్టుల రక్షణే లక్ష్యం: కేవలం సభలోనే కాకుండా క్షేత్రస్థాయిలోనూ కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పరిరక్షణ కోసం త్వరలోనే లక్షలాది మంది ప్రజలతో కలిసి కేసీఆర్ స్వయంగా ప్రత్యక్ష పోరాట రంగంలోకి దిగుతారని ప్రకటించారు. అలాగే పదవిలో లేని సీఎం కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పించడంపై కూడా సభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని తేల్చిచెప్పారు. ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని హరీశ్ రావు(Harish Rao) తెలిపారు.





