
GHMC Labourer | జీహెచ్ఎంసీ కార్మికులు కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పారని తెలిసిందే. చెత్త సేకరణ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీహెచ్ఎంసీ కార్మికులు అసెంబ్లీని ముట్టడించగా.. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి ఎల్బీ స్టేడియంలో బంధించారు. నిర్బంధించిన ఎల్బీ స్టేడియంలో తమకు తినేందుకు కూడా ఏర్పాటు చేయలేదని జీహెచ్ఎంసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ కార్మికుడు మీడియాతో మాట్లాడుతూ.. మమ్మల్ని 11 గంటలకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు.. మా సన్నబియ్యం అని చెప్తున్న అన్నం పెట్టిర్రు.. ఈ అన్నాన్ని పందులు కూడా ముట్టుకోవు సార్. ఇది పప్పు.. ఇందులో ఏముందని పప్పుచారు అంటారు. మేం కచరా పని చేస్తం కానీ మేము కూడా మనుషులమే కదా..మీ చెత్తను క్లీన్ చేసేదాన్ని కచరా పని అంటరు.. మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది.. ఈ అన్నం కూడా ఇప్పుడు పెట్టిర్రు. ఇవి పందులు కూడా ముట్టుకోవు.. మేం ఆకలికి తట్టుకోలేక తిన్నం.
రేవంత్ రెడ్డికి ఏమైందో.. ప్రైవేట్ సంస్థ రాంకీ సభ్యులతో ఏం మాట్లాడుకున్నారు తెల్వదు.. ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం.. మా బతుకుల మీదైతే కొట్టొద్దు. రాంకీ ఆయన వచ్చిడంట.. ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది. సొంత బండ్లు కొనిచ్చి కేసీఆర్ మమ్మల్ని ఓనర్లను చేస్తే.. ఈ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి మా బతుకులు రోడ్డుపాలు చేస్తుందని ఫైర్ అయ్యాడు.
జీహెచ్ఎంసీ కార్మికులను ఎల్బీ స్టేడియంలో బంధించిన ప్రభుత్వం
చెత్త సేకరణ కాంట్రాక్టు రాంకీ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్న చెత్త సేకరణ కార్మికులను అరెస్ట్ చేసి ఎల్బీ స్టేడియంలో బంధించిన పోలీసులు
పందులు కూడా ముట్టుకోని అన్నం, నీళ్ల లాంటి… https://t.co/dWfdeLMRh2 pic.twitter.com/zgE8oDk83W
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2026
Indonesia | 240 మందితో వెళ్తున్న పడవ ఇండోనేషియా తీరంలో గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Low-voltage | నిజాంపేటలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని రైతుల ఆందోళన
Grade-1 Fatty Liver | గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి, ఏం చేయాలి..?






