
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Eshwar Sai Madhuri Rathod Controversy: ప్రముఖ ఫోక్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి వివాహేతర సంబంధానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ల అక్రమ సంబంధం వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఈ వివాదం కాస్తా పోలీస్ స్టేషన్లకు చేరి, ఇరు వర్గాల మధ్య పరస్పర ఫిర్యాదులు, తీవ్ర ఆరోపణలతో సంచలనం సృష్టిస్తోంది.
అయితే ఈ వివాదం వేములవాడలోని రెడ్డి భవన్లో మొదలైంది. ఈశ్వర్ సాయి కోసం అతని భార్య శరణ్య, ఆమె సోదరి కలిసి అక్కడికి వెళ్లగా, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరూ ఒకే ఇంట్లో పట్టుబడ్డారు. ఆ సమయంలో అక్కడ ఒక చిన్నారి కూడా ఉంది. దీనికి సంబంధించిన దృశ్యాలను శరణ్య సోదరి తన మొబైల్లో వీడియో రికార్డ్ చేసింది.
ఇదే విషయమై తాము ప్రశ్నించినందుకు ఈశ్వర్ సాయి, అతని అసిస్టెంట్ తమపై దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా మొబైల్ ఫోన్లు లాక్కున్నారని శరణ్య సోదరి ఆరోపించింది. ఈ వ్యవహారంపై హైదరాబాద్‌లోని రాయిదుర్గం పోలీస్ స్టేషన్లో శరణ్య సోదరి ఫిర్యాదు చేసింది.
అయితే, ఇల్లీగల్ అఫైర్ వ్యవహారం తమ పరిధిలోకి రాదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పరస్పర ఇష్టంతో ఉండే సంబంధాలు నేరం కిందకు రావని పోలీసులు స్పష్టం చేశారు. దాడులు లేదా ఫోన్ లాక్కున్న ఘటన వేములవాడలో జరిగింది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేసుకోవాలని రాయిదుర్గం పోలీసులు వారికి సూచించారు.
మరోవైపు ఈ వ్యవహారంలో సదరు మాధురి రాథోడ్ కమ్యూనిటీకి చెందిన వారు ఎదురుదాడికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తను తన స్నేహితుడైన ఈశ్వర్ సాయితో ఉన్న సమయంలో శరణ్య, ఆమె సోదరి అకారణంగా లోపలికి వచ్చి, తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని మాధురి పేర్కొంది.
అంతేకాకుండా తనను కులం పేరుతో దూషిస్తూ అవమానించారని.. వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసి పరువు తీశారని ఆమె ఆరోపిస్తోంది. దీనిపై శరణ్య, ఆమె సోదరిపై వేములవాడ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేందుకు మాధురి చట్టపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే, మాధురి రాథోడ్ పక్కనే ఉంటూ నటిస్తూ, తన భర్తను వలలో వేసుకుని, లొంగతీసుకుని ఇల్లు చేరకుండా చేస్తోందని ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఇరువర్గాలు చట్టపరమైన చర్యల కోసం సిద్ధమవుతుండటంతో వేములవాడ పోలీసులు వీటిపై దృష్టి సారించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




