
Home » Miscellaneous » ‘Dhee’ Fame Choreographer Raju Arrested in Sexual Harassment Case‘ avm
బుల్లితెరపై పాపులర్ డ్యాన్స్ షో ‘ఢీ’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యువ కొరియోగ్రాఫర్ రాజు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు.
బుల్లితెరపై పాపులర్ డ్యాన్స్ షో ‘ఢీ’ (Dhee Fame Raju) ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యువ కొరియోగ్రాఫర్ రాజు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ (Police case) అయ్యాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి రాజును అదుపులోకి తీసుకున్నారు. ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని రాజు నమ్మించాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. అంతేకాకుండా తన నుంచి కొంత మొత్తంలో డబ్బు కూడా తీసుకున్నాడని ఆమె ఫిర్యాదులో వెల్లడించింది. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని చెప్పడంతో పాటు పెళ్లి చేసుకుంటానని కూడా హామీ ఇచ్చి తనను మోసం చేశాడని యువతి ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం రాజుపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 9న కేసు నమోదు చేయడంతో అదే రోజు పోలీసులు
రాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించినట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులో రావడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఢీ’ వంటి ప్రముఖ డ్యాన్స్ షో ద్వారా గుర్తింపు పొందిన రాజుపై ఇలాంటి కేసు నమోదవడం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.
Samantha: అమ్మ కాబోతున్న క్షణాలు.. సామ్ ఏం చెప్పారంటే
Keerthy Suresh: దశాబ్దం తర్వాత టిఫ్లో తమిళ సినిమా.. ‘డోరతి’కి స్టాండింగ్ ఒవేషన్! Vijay-Trisha: త్రిష రాగానే విజయ్ ఎందుకు ముఖం తిప్పుకున్నారు? నెటిజన్ల చర్చ!






