
Aug 16 2026 9:18 PM | Updated on Aug 16 2026 9:20 PM
గాలే వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. రెండో రోజు ఆటలో ధనుంజయ అద్భుతమైన క్యాచ్‌తో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌ను పెవిలియన్‌కు పంపాడు.
భారత ఇన్నింగ్స్ 110వ ఓవర్లో స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య తొలి బంతిని.. జురెల్‌కు ఫ్లైటెడ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని జురెల్ ఆన్-సైడ్ వైపు ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ సమయంలో ఫస్ట్ స్లిప్‌లో ఉన్న డిసిల్వా కుడివైపునకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అసాధరణ క్యాచ్‌ను అందుకున్నాడు.
ఇది చూసిన ప్రతీ ఒక్కరు బిత్తర పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సూపర్ మేన్‌లా అందుకున్నాడని నెటిజన్లు అతడిని ప్రశంసిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో ప్రసిద్ద్ కృష్ణ(1), కుల్దీప్ యాదవ్(12) ఉన్నారు.
భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్ పడిక్కల్(167) భారీ సెంచరీతో కదం తొక్కగా.. ధ్రువ్ జురెల్(51), కేఎల్ రాహుల్(82) అర్ధ శతకాలతో రాణించారు. లంక బౌలర్లలో ప్రభాత్ జైసూర్య నాలుగు, నువాంత మూడు వికెట్లు సాధించారు. చదవండి: ఏంటి బ్రో.. కాస్త వెనక ముందు చూసుకోవాలి కాదా?
భర్త బర్త్‌డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు)
నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు)
'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)
అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ (ఫొటోలు)
ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది! రూపా రెడ్డి భర్తపై పోలీసుల అనుమానాలు
100 షేర్లకు 1000 షేర్లు! లిస్టయిన 10 రోజుల్లోనే బంపరాఫర్..
ఎవరిది గొడ్డలి పార్టీ? ఇదిగో సాక్ష్యం.. ఈ వీడియో చూసే దమ్ముందా బాబు..
పెళ్లైన 7 రోజులకే.. నా భర్త అరాచకం అంతా ఇంతా కాదు
సిగ్గుందా..! ఫస్ట్ మహిళలకు క్షమాపణ చెప్పు.. బాబు,లోకేష్ కు ఇచ్చిపడేసిన రోజా




