
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Deputy cm Pawan kalyan key directions to officials: తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని ప్రాంతంలో ఇటీవల ఏనుగుల గుంపు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై తాజాగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏనుగుల కదలికలపై ఎప్పటికప్పుడు డ్రోన్లతో నిఘా ఉంచాలన్నారు.
అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ గస్తీ పెంచాలన్నారు. రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రజలకు సమాచారం అందించా లన్నారు. హనుమాన్ బృందాలను మోహరించాలని ఉప ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, డ్రోన్ల సహాయంతో వాటి సంచార మార్గాలను గుర్తించి సమీప గ్రామాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలోని ఏనుగులు రెండు గుంపులుగా సంచరిస్తూ రాత్రివేళ అటవీ సరిహద్దుల్లోని పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయన్నారు.
దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని పవన్ కళ్యాణ్ గారు అటవీశాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
అంతే కాకుండా.. అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ ప్రత్యేక గస్తీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలు రాత్రివేళ పొలాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలన్నారు. అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏనుగుల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
గ్రామాల్లో మైకులు, మొబైల్ సందేశాలు, స్థానిక సమాచార వ్యవస్థల ద్వారా హెచ్చరికలు జారీ చేయాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చోట హనుమాన్ (H.A.N.U.M.A.N.) బృందాలను మోహరించాలన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Read more: Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. నవంబర్ నెల ఆర్జీతా సేవా కోటా విడుదల ఎప్పుడంటే..?
అంతే కాకుండా.. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అటవీశాఖ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఏనుగులు పంట పొలాలపై దాడి చేసి పంటలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో, పంట నష్టంపై అధికారులు నివేదికలు రూపొందించాలన్నారు. దీనిపై అటవీశాఖ ద్వారా తక్షణ పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




